అమ్మమ్మ : వాడు నీకు చెప్పలేదా?
శరణ్య లేచి అమ్మమ్మ వెనకాలే వెళుతూ ఏంటే అని అడిగింది. అమ్మమ్మ గోడకి తగిలించిన తన కూతురు ఫోటో చూసి ఆగిపోయింది. శరణ్య ఆ ఫోటో వంక చూసింది కానీ ఏమి అర్ధం కాలేదు.
అమ్మమ్మ : అర్ధం కాలేదా, నీ కళ్ళు అచ్చం నా కూతురి పోలిక.. ఇప్పుడు అర్థమైందా వాడు నీతో ఎందుకు గొడవ పడడో.. అదిగో మావా అల్లుళ్ళు వచ్చేసారు ముందు కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చోండి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆ రోజంతా అక్కడ ఊళ్ళో గడిపేసి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకున్నాం, శరణ్య నాతో అంత ఎక్కువగా ఏం మాట్లాడలేదు పండుబోతుది పడుకునే ఉంది.. రూం వచ్చాక లేపితే లేచి మళ్ళీ లోపలికి వెళ్లి పడుకుంది.
అంతే ఇక రోజు ఇన్స్టిట్యూట్ దెగ్గర డ్రాప్పింగ్ పికప్, పొద్దున్నే లేపితే చదువుకునేది ఒక కాఫీ పెట్టి ఇచ్చేవాడిని, ఇద్దరి మధ్యా గొడవలు లేవు అలా అని నేను తనకి అంత దెగ్గరగా వెళ్లలేకపోయేవాడిని శరణ్య నాకు అంత చనువు ఇవ్వలేదు.
మానస : తరువాత ఏమైంది?
సుబ్బు : ఏముంది సివిల్స్ కొట్టింది ఆ రోజు మాత్రం అన్ని మర్చిపోయి వచ్చి వాటేసుకుంది, ఇద్దరం ఊరికి వెళ్ళిపోయి అందరికీ చెపితే మావయ్య ఊళ్ళో భోజనాలు పెట్టించాడు, ఆ తరువాత ఊళ్ళోనే ఉండిపోయింది వచ్చేటప్పుడు ఒక్కన్నే వచ్చాను కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను తను కూడా నాకు పెద్దగా ఫోన్ చేసిందేం లేదు ఎప్పుడైనా నేను చేస్తే బాగా మాట్లాడేది.. ఇంటర్వ్యూ అని ట్రైనింగ్ అని వెళ్ళిపోయింది ఆ తరువాత మళ్ళీ నాకు తను కనిపించింది యూనిఫామ్ లోనే..
ఫోన్ చేసి రూంకి రమ్మంది, వెళితే బైటే సెక్యూరిటీ ఆఫీసర్ కార్ లో కూర్చుని ఉంది శరణ్య ips.. నన్ను పలకరించి తన కార్ లోనే ఇద్దరం ఊరికి వెళ్ళాము.. మావయ్య ఆనందానికి అయితే హద్దే లేదు.. చుట్టూలందరినీ పిలిచాడు అందరికీ భోజనాలు వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి, శరణ్యతొ కేక్ కట్ చేయించి మరి అందరినీ సాగనంపాడు.. నేను అరవింద్ ఒక పక్కన కూర్చుని చూస్తున్నాం..
హారిక : బావా కంగ్రాట్స్
సుబ్బు : నాకెందుకే వెళ్లి మీ అక్కకి చెప్పు.
హారిక : రాత్రి అమ్మా నాన్నా మాట్లాడుకోగా విన్నాను, అక్కని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు.
సుబ్బు : మావయ్య అన్నాడా?
హారిక : హా.. అవును నాన్నే అన్నాడు, అమ్మ కొంచెం ముందు బెట్టు చేసినా ఒప్పుకుంది.. ఆమ్మో వినేసింది అక్కా
సుబ్బు : ఎక్కడా?
హారిక : నీ వెనక..
వెనక్కి తిరిగి చూసాను నాకు అరవింద్ కి కేక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది..
అరవింద్ : పోనీలేరా కష్టపడకుండానే నీ మరదలు నీకు సొంతం అయ్యింది.
సుబ్బు : ఇక నువ్వేరా మిగిలింది.. నీది కూడా అయిపోతే సూపర్..
అరవింద్ : నువ్వు పైకి మాములుగా ఉన్నట్టు నటించినా లోపల ఎగిరి గంతేస్తున్నావ్ కదరా..
సుబ్బు : హహ..
అరవింద్ : ఎందుకు రా అన్ని లోపలే దాచుకుంటావ్?
సుబ్బు : ఏమోరా అమ్మ నా దెగ్గర నుంచి వెళ్లిపోయాక నాకు నేను ఒక్కన్నే అయిపోయాను, ఫీలింగ్స్ అన్ని లోపలే తప్ప బైటకి చూపించేవాడిని కాదు, చూపించినా నా మొహంలో సంతోషాలు చూడ్డానికి ఎవరు లేరు.. అలా అలవాటు అయిపోయింది.. కానీ శరణ్యలో అటు భార్యని తన కళ్ళలో అమ్మని చూస్తూ బతికేయ్యొచ్చు.. నాది వదిలేయి అన్ని సెట్ అవుతాయి మరి నువ్వో..
అరవింద్ : నాకు ఎవ్వరు వద్దురా బాబు, నా ఆస్తిని నేనొక్కన్నే అనుభవిస్తా ఇంకొకళ్ళతో పంచుకునే ఉద్దేశాలు నాకు లేవు.
సుబ్బు : ఎప్పుడు మారతావో ఏంటో, డబ్బు ఒక్కటే కాదురా జీవితానికి.
అరవింద్ : నాకు తెలుసు, డబ్బే అన్నిటికి మూలం.. అయినా నేనేమి చేసుకోను అనట్లేదు నా దెగ్గరున్న డబ్బు కోసం కాకుండా నన్ను నన్నుగా ఇష్టపడే అమ్మాయి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను.
సుబ్బు : ఇలా కూర్చుంటే దొరకరు, వెతకాలి వెతుకు.. వెతికితే దొరకనిదంటూ ఏది లేదు..
అరవింద్ : నీ అంత ఓపిక నాకు లేదురా ప్రకాష్ రాజ్.. అయినా ఏంటి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడే ఏదో జీవితాన్ని గెలిచేసినట్టు తెగ లెక్చర్లు ఇస్తున్నావ్..
సుబ్బు : సరే సరే.. పదా ఆకలేస్తుంది అందరూ అయిపోయారు అదే ఆఖరు బంతి వెళ్లి కూర్చుని తినేద్దాము.. పదా అని ఇద్దరం లేచాము.
జగన్ : రేయి సుబ్బు ఇలారా నీతో మాట్లాడాలి, బాబు అరవింద్ లోపలికి రండి ముఖ్యమైన విషయం మొదటి నుంచి వాడికి తోడుగా ఉన్నావ్ నువ్వు కూడా రా.. అని నవ్వుతూ పిలిచాడు.
అరవింద్ : రేయి మీ మామ ఆనందం ఎక్కువై పోయేలా ఉన్నాడు.
సుబ్బు : మెలకుండా రా బె.
లోపలికి వెళ్లి చూస్తే అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు.. అమ్మమ్మ నన్ను చూసి నవ్వుతూ లేచి వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంది.
జగన్ : రేయి హారిక ఇలా రా, అక్కని పిలువు.. మాట్లాడాలి..
సుధా : అది కడుపు నిండా మెక్కి బాత్రూంకి పోయింది, నేను పిలుచుకొస్తా ఉండు అని లోపలికి వెళ్ళింది..
మావయ్య వచ్చి నా పక్కన నిల్చున్నాడు, నేను నిల్చున్నాను నా భుజం మీద చెయ్యి వేసి సంతోషంగా చూస్తున్నాడు శరణ్య కోసం ఏంటి ఇంకా రావట్లేదన్నట్టు.
శరణ్య నవ్వుతూ వస్తూనే నన్ను చూసి నవ్వి మావయ్య మాట్లాడేలోపే సుబ్బు ముందుకు వెళ్లి కార్ కీస్ చేతికి ఇచ్చింది..
శరణ్య : సుబ్బు నా ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం తీసుకురావా
జగన్ : నీ డ్రైవర్ ఉన్నాడు కదరా
శరణ్య : నేను బైటికి వెళుతున్నా నాన్న ఒకసారి మన ఊరి mla గారి దెగ్గర నుండి ఫోన్ వచ్చింది కలిసి వస్తా, అయినా సుబ్బు కూడా డ్రైవరేగా…
వెనక్కి తిరిగి డ్రైవర్.. అని పిలిచింది.. మేడం అంటూ వచ్చాడు..
ఎక్కడికి వెళ్ళావ్ నీ పనేంటి నీ స్థాయి ఏంటి ఎంతలో ఉండాలో అంతలో ఉండటం నేర్చుకో.. డ్రైవర్ వి డ్రైవర్ లాగే ఉండు… ఎక్కడికి వెళ్ళావ్ ఇప్పటిదాకా.
“సారీ మేడం అదీ..”
శరణ్య : పదా వెళదాం, అవును నాన్నా ఇందాక పిలిచారట వచ్చాక మాట్లాడదాం.. అని విసవిసా వెళ్ళిపోయింది.
నా చేతిలోనుంచి కింద పడ్డ కార్ కీస్ తీసాను, పైకి లేచేటప్పుడు అందరి మొహాలు చూసాను అందరి మొహాల్లో నెత్తుటి చుక్క లేనట్టు అలానే నిలబడ్డారు.. మావయ్య అలానే సోఫాలో కూర్చుండిపోయాడు. చిన్నగా నవ్వొచ్చింది నాకు.
