జగన్ : ఎక్కడికిరా
సుబ్బు : శరణ్య వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తా
జగన్ : ఇంట్లో ఇంకా చానా మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్లు చూసుకుంటారు..
అదే మొదటిసారి ఆయన మొహంలో నేను కోపం చూడటం, నాకు ఇక ఉండబుద్ధికాలేదు.. వెంటనే ఫోను తీసాను..
సుబ్బు : హలో.. ఆ చెప్పన్నా.. వస్తున్నా.. లేదు ఇప్పుడు బైలుదేరతా అని ఫోన్ పెట్టేసి మావయ్యని చూసాను.. మావయ్య నేను వెళ్ళాలి పని అయిపోయాక మళ్ళీ వస్తాను కొంచెం అర్జెంటు..
ఆయనేం మాట్లాడలేదు ఇక వెనక్కి తిరిగాను, అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం నా కళ్ళు చూసేసాయి.. వేగంగా బైటికి నడిచాను..
సుబ్బు వెనుకే అరవింద్ కూడా మౌనంగా బైటికి నడిచాడు.. సుబ్బు వెళ్ళిపోయాక జగన్ కోపంగా తన భార్య సుధని చూసాడు.
జగన్ : దానికి ఇష్టం లేనప్పుడు రాత్రి అడిగినప్పుడే చెప్పాలి కదా ఇలా అందరి ముందు నా పరువు తీయాల్సిన పనేముంది.. ఇంకా వాడికి తెలియదు కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు లేకపోయ్యుంటే…
అప్పుడే లోపలికి వచ్చిన హారిక మొత్తం విని చిన్నగా తన నాన్న దెగ్గరికి వెళ్ళింది.. “నాన్నా.. బావకి ఇందాక నేను సంతోషం ఆపుకోలేక చెప్పేసాను నువ్వు బావకి అక్క పెళ్లి నిర్ణయించావని”.. జగన్ లేచి నిల్చున్నాడు.
జగన్ : అంటే వాడికి తెలుసా.. అని వేగంగా సుబ్బు కోసం బైటికొచ్చి బండి తీసాడు.
±
±
±
అరవింద్ పరిగెత్తి సుబ్బు చెయ్యి పట్టుకుని ఆపి గట్టిగా కౌగిలించుకున్నాడు..
సుబ్బు : ఏంట్రా ఇది సినిమాలో హీరోయిన్ లాగ, ఛస్ వదులెహే…
అరవింద్ : సారీరా..
సుబ్బు : ఇట్స్ ఓకే రా.. అయిపోయిందా.. ఇక పదా
అరవింద్ : ఏడుస్తున్నావా?
సుబ్బు : దేనికిరా నాదేమైనా కాల భైరవ లాగ నాలుగోందల ఏళ్ల ప్రేమా.. లవ్వులో తొలి అడుగులు కూడా పడలేదు, ఇంకా మొదలే పెట్టలేదు అప్పుడే ముగిసిందనుకోకు.. ఇంకో అమ్మాయి ఉండదా నాకోసం మళ్ళీ రాదా అవకాశం.. ప్రాస బాగుంది.. సరే పదా..
అరవింద్ : ఉండు కార్ తీసుకొస్తా
సుబ్బు : (రెండు చేతులు నడుము మీద పెట్టుకున్నాను) లేదురా నువ్వెళ్ళిపో.. నేను బస్సులో వస్తా
అరవింద్ : బంగారం లాగా కారు ఉంటే..
సుబ్బు : వదిలేయిరా.. ప్లీస్.. బస్సులో వస్తా నువ్వెళ్లు.. అని వాడికోసం చూడకుండా ముందుకు నడిచి ముందున్న బస్సు ఎక్కి కూర్చున్నాను.. బస్సు ముందుకు కదిలింది.. ఫోన్ వస్తే చూసాను మావయ్య..
జగన్ : రేయి బస్సు దిగు..
సుబ్బు : దేనికి?
జగన్ : దిగు ముందు మాట్లాడాలి..
సుబ్బు : నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేసి కూర్చున్నాను.. సీట్ కింద ఒత్తుకుపోతుంటే బ్యాక్ పాకెట్ లో ఉన్న పర్సు తీసాను.. అమ్మ నవ్వుతున్న ఫోటో చూడగానే నవ్వేసాను కానీ నా ఎడమ కన్ను మాత్రం నన్ను మోసం చేసింది.. నా పర్మిషన్ లేకుండా ఒక చుక్క నీరు కార్చేసింది..
సడన్ బ్రేక్ వేసాను.. హలో మానస.. బెంగుళూరు వచ్చింది.. లెఫ్ట్ కి వెళ్లాలా రైట్ కి వెళ్ళాలా నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చెయ్యి.. అని పక్కకి చూస్తే మానస ఏడుస్తూ కూర్చుంది.
సుబ్బు : ఓయి నువ్వెందుకు ఏడుస్తున్నావ్.. హహ.. నేను కామెడీగానే చెప్పానే.. సాడ్ పార్ట్ చాలా వరకు తీసేసి.. ఇదిగో కర్చిఫ్.. మరీ ఇంత సెన్సిటివా
మానస మొహం తుడుచుకుని మంచినీళ్లు తాగి ఫోన్ చెయ్యబోతే సుబ్బు లాక్కుని.. నేను చేస్తాలె.. ఉండు..
సుబ్బు : హలో బాస్.. బెంగుళూరు వచ్చాము, లొకేషన్ పంపిస్తే పావుగంటలో నీ ముందుంటా.
విక్రమ్ : పంపిస్తున్నా..
ఫోన్లొ లోకేషన్ చూసుకుని మళ్ళీ గేర్ మార్చాను..