మెమోరీస్ 6 171

వెంటనే రాజు తన తలను పక్కకు తిప్పాడు. “ఇది సమయం కాదు. ముందు మీ అక్కను వెతకాలి. సమయం వృధా
అయ్యేకొద్ది ఆమె మరింత ప్రమాదంలో చిక్కుకుంటుంది” అని ముందుకి కదిలిపోయాడు. ఆమె నిరాశ చెందింది.

వారా సొరంగంలో చానాసేపు వెతికారు. ఆ గదిలో తప్ప ఇంకే గదిలోనూ మానవ సంచారం లేదు. సమయం గడిచే కొద్ది
రాజులో అసహనం పెరిగిపోతొంది. చివరగా చిన్న గదిలో మాటలు విని ఆగిపోయారు.

“రేయ్ జాగ్రత్త. ఏమన్నా తిక్క తిక్క వేషాలు వేస్తే తలలెగిరిపొతాయి. వీరందరూ గురువు గారి సొత్తు. నేనలా పోయి వస్తాను” అనే మాటలు వినిపించాయి. రాజు ఆ గదిలోకి తొంగిచూశాడు. ఆ గదిలో ముగ్గురు కన్యలు కూర్చుని వున్నారు. వారు దేవ కన్యల్లా తెల్లటి వస్త్రాలు దరించి, వొంటి నిండుగా బంగారు ఆభరణాలు దరించి దగ దగా మెరిసిపోతున్నారు. వారు ముగ్గురు మూడు సుఖాసనాలపై ఆసీనులై వున్నారు. వారిని ఇద్దరు వ్యక్తులు కాపలా కాస్తున్నారు. వారికి కొంచెం దూరంగా ఒక పెద్ద పానుపు వుంది. దానిని మల్లేపూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాల సువాసనలను జల్లారు. ఆ వాసనకు ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఆ వాసనే మనసులోని కోరికల తేనె తుట్టెను కదిపేలా వుంది.

ఆ ఇద్దరి వ్యక్తుల పరిస్తితి కూడా అలాగే వుంది. తట్ట నిండుకు పరమాన్నం పెట్టి తినద్దంటే ఎలా. వారు ఆ కన్యలను చూస్తూ పెదాలు తడుముకుంటున్నారు. ఆ కన్యలు మాత్రం ప్రాణం లేని గాజు బొమ్మల్లా కొయ్యబారిపోయి వున్నారు.

రాజు అప్సానాని పిలిచి రుక్సానా వుందో లేదో చూడమన్నాడు. అప్సానా తన సోదరిని గుర్తు పట్టింది.
“ఆ చివరనున్నది మా అక్కే” అనింది. “చూడు ఎలా చలనం లేకుండా వుందో, ఇంటి నుండి వచ్చేటప్పుడు కూడా ఇలాగే వుంది.
మాట్లాడించపోతే కొట్టింది” గద్గద స్వరంతో చెప్పింది. కళ్లనిండా నీళ్లు పెట్టుకుంది రుక్సానాని చూసి.

“పద పోయి పిలుచుకొని ఇంటికి పోదాం” ముందుకి కదలబోయింది. చేయి పట్టుకుని ఆపేశాడు రాజు. కాపలా వాళ్లని
చూపించాడు. చెవిలో ఎదో చెప్పి ముందుకి కదిలిపోయాడు. మెల్లిగా శబ్దం చేయకుండా కాపలా వారి వెనకకు చేరుకుని చేతిలోని
వస్తువుతో మెడమిద బలంగా కొట్టాడు. వాళ్లు విరుచుకు పడిపోయారు. అప్సానా తన అక్క దగ్గరికి పరిగెత్తింది.

“రుక్కు . . .రుక్కు ” అని పలకరించింది. ఆమెలో ఎటువంటి చలనమూ లేదు. నాడి ఆడుతొంది కానీ ఆమె పలకడం లేదు. రాజు పడిపోయిన ఒకన్ని వాళ్లొచ్చిన ఇరుకు సొరంగం లోకి లాగేశాడు. ఇంకొకన్ని ఆ ఆసనాల వెనక దాచేశాడు.

“తొందరగా” అప్సానాని తొందరపెట్టాడు.
“తను కదలడం లేదు ” అనింది అప్సానా.

సొరంగంలో అలికిడి వినపడింది. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని, తానూ అప్సానా కూడా వాళ్లకి దొరికి
పోతామనిపించింది. వెంటనే ఆమెను భుజాన ఎత్తుకుని వచ్చిన దారి కాకుండా వేరే దారిన వేగంగా నడవడం మొదలెట్టారు.

స్కూల్ డేస్:

భుజం మీదున్న రుక్సానా ఎంత బరువుగా వున్నా లెక్కచేయకుండా పరుగెత్తుతున్నాడు. ఆ సొరంగ మార్గం పూర్తీగా తెలిసిన వాడిలా తిరుగుతున్నాడు. అప్సానా మారు మాట్లాడకుండా అనుసరించింది. పది నిమిషాల తరవాత రుక్సానాని మోయడం కష్టమనిపించింది. ఆమెని కిందకి దింపి “చూస్తూవుండు ఇప్పుడే వస్తాను” అని చెప్పిముందుకు కదిలాడు.
“ఎక్కడికి? ” అడిగింది. “దాహం వేస్తొంది నీళ్లు దొరుకుతాయేమో చూస్తాను” అన్నాడు.
“ఈ సొరంగంలో నీళ్లెక్కడ దొరుకుతాయి”
“వస్తున్నప్పుడు చూడలేదా ఒక రూమ్లో మనుషులున్నారు. వాళ్ల కాడ నీళ్లున్నాయోమో అడిగి తీసుకొస్తాను ” అన్నాడు.
“”ఎంది అడుగుతావా? . . ”
“వొరికే ఇస్తారా . . . ఎలాగోలా తీసుకొస్తాను ” ముందుకు వెళ్లబోయాడు.
“ఎవరైనా వస్తే నేనేమ్ చేయాలి ”
“ఇదిగో దీన్ని నీకాడుంచు ఎవరైనా వస్తే ” అని దాని పిడి పట్టుకుని లాగాడు. పెద్ద కత్తొకటి బయటికి వచ్చింది. “దీనిని చూపించి బెదిరించు వినకపోతే ఏసెయ్. పది నిమిషాలలో వస్తాను ” అని వెళ్లాడు.

అప్సానా ఆ కత్తిని తిప్పి తిప్పి చూసింది. చానా పదునుగా వుందా కత్తి. అరచేయంత వెడల్పుతో పొడవుగా వేటకత్తిలా వుంది. ఆ కత్తి నది దగ్గరే చిక్కి వుండాలి రాజుకి అని అనుకుంది. రాజు వచ్చేదాక రుక్సానా చూస్తూ కూర్చుంది.

సరిగ్గా పది నిమిషాల తరవాత రాజు చేతిలోని టార్చ్ వెల్లుగు గజిబిజిగా వెలుగుతూ వచ్చింది. పరుగెత్తుకుని ఆయాసంతో రొప్పుతూ వచ్చాడు. వచ్చీ రాగానే చేతిలో నీళ్ల బాటిల్, టార్చ్ ని అప్సానా చేతికిచ్చి రుక్సానాని భుజం మిదకేసుకుని వేగంగా నడవడం మొదలెట్టాడు. కళ్లు మూసి తెరిచేలోగా ఆ సందు నిండి ఇంకో సందులోకి జారుకున్నారు.
నిమిషం తరవాత వాళ్లున్న ప్రదేశానికి నలుగురు మనుషులు వచ్చారు. వాళ్లలో ఇద్దరికి తలలకి దెబ్బలు తగులున్నాయి. “ఎక్కడ్రా వా నాకొడుకు ” అని బొప్పి కట్టిన తల మీద చేయి పట్టుకుని అరిచాడు.
“యా పక్కకి పోయింటాడు” అక్కడున్న రెండు సొరంగ మార్గాలలో ఏదాని వైపు పోవాలో తెలీక అడిగాడు రెండో వాడు.
“రేయ్ మీరిద్దురూ అట్ల పోయి యెతకండి, మేమిట్ల పోతాం ” రెండు జట్లుగా చీలిపోయారు.

ఎంత వేగంగా పరిగెత్తుదామనుకున్నా భుజం మీదున్న బరువు కారణంగా వేగాన్ని అందుకోలేక పోయాడు రాజు. వారు వెళ్తున్న ఇరుకైన మార్గం అంతమైపోయి వెడెల్పయిన మార్గం లోకి అడుగు పెట్టారు. ఆ మార్గంలో కొద్ది దూరం నడిచాక ఒక రాళ్ల కుప్పలాంటిది కనిపించింది. దాని వెనక రుక్సానాని దింపి వాళ్లిద్దరు కూడా అనుక్కున్నారు.

రెండు జట్లుగా వీడిపోయిన వాళ్లు రెండు ఇరుకైన మార్గాల గుండా పయనించి ఆ రాళ్ల కుప్పదగ్గరే కలుసుకున్నారు.
“ఏరా కనిపించినా రా వాడు” అని అరిచారు తల బొప్పికట్టిన వాడు.
“లేదన్నా” అన్నారు ఇద్దురూ ఒకేసారి.
“యాడికి పాయరా నాకొడుకు” అని అసహనంగా అడిగాడు.
“అన్నా వాడాటికి పోయినా బయటకు పోయేకి ఒకే దావ కదన్నా. మన రవన్నకి చెప్పి పట్టుకుందాం లే అన్నా ” అన్నాడు ఒకడు.”వాడు నాకిప్పుడే కావల్ల రా” అని ఇంకోసారి తల నిమురుకున్నాడు. “ఎన్ని గుండెకాయలుంటే నన్నే కొడతాడ్రా వాడు” కోపంగా అన్నాడు. పైకి కోపం నటించినా అవమానంతో గుండె రగిలిపోతాంది వాడికి. తన దగ్గర పని చేసే వాళ్ల ముందర దెబ్బ తిన్నడం వల్ల అహం దెబ్బతినింది వానికి.
“అన్నా మన వాళ్లలోనే ఎవరో ఒకరు చేసుంటారన్నా. నీకు తెలీనిదేముంది మన పనితనం చూసి కుళ్లుకునే నాకొడుకులు ఎంత మంది లేరు ” అన్నాడొకడు.
“అవునన్నా, నాకిప్పుడనిపిస్తాంది మనందరం ఈడకొచ్చేసినాం ఇప్పుడానా కొడుకుని తప్పించేస్తే కొంప మునుగుతుంది” అని వచ్చిన దారినే పరిగెత్తాడు ఇంకోడు. వాడు చెప్పింది నిజమే అనిపించి వాళ్ల నాయకునికి. వాడు కూడా వాళ్లెనకే పరిగెత్తాడు.

వాళ్లు వెళ్లిపోయారా లేదా అని తల పైకెత్తి చూశాడు రాజు. వెళ్లిపోయారని నిర్దారించుకున్నాక అప్సానా వైపు చూసి “దీనితోనే కొట్నా” టార్చ్ ని చూపించి చెప్పాడు.
“దోనికో కొట్నారనుకుంటున్నాడు నీళ్ల కోసమని తెలిస్తే గుండు పగిలి చస్తాడు నా కొడుకు “అని వెనకాలున్న ఒక రాతిని బలవంతంగా పక్కకి జరిపాలని ప్రయత్నించాడు.
“అదెందుకు ఇప్పుడు జరపడం” అడిగింది అప్సానా.
“ఒక చేయి పట్టు . . . హుమ్మ్” అని మూలిగాడు. అప్సానా కూడా సాయం చేసింది.
ఇద్దరూ పది నిమిషాల పాటు కష్టపడగానే ఆ బండ కొంచెం కదిలింది. మరికొంత సేపటికి దాన్ని పూర్తీగా పెకలించి పారేశారు. ఒక పెద్ద బొక్క బయట పడింది.లోనకి తల పెట్టి టార్చ్ లైటుని వేశాడు.

అది మరో సొరంగం.అప్సానాకి మతి పోయింది.ఎన్ని సొరంగాలున్నా యిక్కడ అవి రాజుకెలా తెలుసని అనుకుంది. ఆ విషయం రాజుని అడగాలనుకుంది. “ముందు నేను దిగుతా తరవాత మీయక్క చివరగా నువ్వు” రాజు ఆ బొక్కలోకి జారుకున్నాడు.

మరో పావుగంట ఆ సొరంగంలో ప్రయాణం చేశాక వాళ్ల ముందు మెట్లు ప్రత్యక్షమయ్యాయి. చివరి మెట్టు ఎక్కి రుక్సానాని కిందికి దించాడు.ఎదురుగా నున్న రాతి తలుపును బలవంతంగా లాగాడు. కిర్రుమని శబ్దం చేస్తూ పక్కకి జరిగి తోవనిచ్చింది.

వేణు గోపాల స్వామి గుడది. రాజు తెరిచిన తలుపు ఆ గుడిలోని నేలమాళిగలోకి దారి. పూర్వకాలం గుడిలోనించి తప్పించుకుని బయటికి పారిపోవడానికి తవ్వించిన సొరంగపు దారి. నేలమాళిగ దాటుకుని బయటకు రాగానే ఎదురుగా ఆ గుడి పూజారి.ఆయనని చూడగానే రాజు ఒక్క క్షణకాలం వూపిరాగినంత పనయ్యింది.

1 Comment

  1. Bossu, ikkada amavasya ani cheppavu. Kaaani bavilo moon reflection paduthondi ani cheppav. Elaa possible idhi.. Bro

Comments are closed.