మెమోరీస్ 6 171

ఆ సమయంలో రాజు ఆయనను అక్కడ వుంటాడని రాజు వూహించలేదు. ఆయన ఇళ్లు వూళ్లో కదా వుండేది ఈ టైంలో . . . . పైగా గుడి వూరికి దూరంగా వుంటాది. కొంపదీసి దొంగ నాకొడుకు గుడి దొంగతనానికి వచ్చాడని వూళ్లో చెప్పడు కదా. తనతో పాటు ఇద్దరమ్మాయిలు వున్నారు. అమ్మాయిలను ఎత్తుకు పోయే వాడని చెబితే వూళ్లో వాళ్లు ఇరగొట్టేత్తారు. ఇవన్నీ వాని కళ్లల్లో కనిపించాయి.

రాజు వూహలకు విరుద్దంగా ఆయన “ఎమైందా పాపకి ” అని అడిగాడు.

“ఎమో తెలీదు సామీ, ఎందుకో తెలివి తప్పి పడిపోయింది” చెప్పాడు. భుజాల మీదున్న రుక్సానాని కిందకి దింపబోయాడు.

“ఈడొద్దు, ఆ పక్కన పాకుంది ఆడికి తీసుకపదా” దారి తీశాడు పాక లోకి. ఆ పాకలో ఒక మంచం వుంది. చిన్న కిరసనాయలు బుడ్డీ వెలుగుతావుంది. మంచం మీద రుక్సానాని పడుకోబెట్టాడు. పూజారి రుక్సానా నాడి పట్టుకున్నాడు. కొద్ది క్షణాల పాటు నాడి పరిశీలించగానే ఆయన కళ్లు మెరిశాయి. తరవాత చేయాల్సిన పనులతో ఆయన బిజీ అయిపోయాడు.

రెండు నిమిషాల తరవాత ఒక గ్లాసు నీళ్లు రుక్సానా గొంతులో పోశాడు. ఒక గిన్నేలో నిప్పులు పోసి సామ్రాని పొగవేశాడు. ఆమ్మవారి కుంకుమని నుదుటన పెట్టాడు.

“ఎవురీ పాప” అని అడిగాడు.

“మా అక్క” అనింది అప్సానా.

“చూడ్డానికి మన మతం వాళ్లలా లేరే ” అన్నాడు రాజుతో. అవునన్నట్టు తలూపాడు రాజు.

“ఎవురైనా కానీయండి రేపు మూడుపూటలా ఈ నిమ్మకాయలని రసం చేసి ఆ పాపకి ఇవ్వాలి. జాగ్రత్త అమ్మవారి దగ్గరుంచి మంత్రించిన నిమ్మకాయలు అంటు ముట్టు తగల కూడదు” అన్నాడు అప్సానా చేతికి ఇస్తూ.

“ఎమైంది మా యక్కకు” అడింది బయంగా ఆయన చెప్పిన మాటలు విని.

“ఏమి లేదమ్మా చిన్న మంత్రకట్టు మామూలుగా ఒక్క రోజు పాటు వుంటాది. మంత్రించిన కుంకమ,నిమ్మకాయ నీళ్లు తాపానుగా గంటలో కట్టు విడిపోతుంది ” చెప్పాడు సమాదానంగా. అయినా అప్సానా భయమింకా పోలేదు. రాజు వైపు చూసింది భయం నిండిన కళ్లతో.

“ఏమి కాదులే, ఎందుకు భయపడతావు. ధైర్యంగా వుండు ” అని చెప్పాడు.

“ఇదిగో తల్లీ, ఆ పాప కట్టుకున్న బట్టలు విప్పి ఇవి కట్టు ” ఒక జత బట్టలు అప్సానా చేతిలో పెట్టాడు.

“అవును ఈ బట్టలతో ఇంటికి పోతే అంతే” అన్నాడు. రాజు పూజారి బయటికి పోతూ “తెల్లారడానికి ఇంకా గంటకు పైగా సమయముంది కాసేపు కునుకు తీయమ్మా ” అని చెప్పి బయటకి పోయారు.

“నాయనా నీ కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడాలి” అని పాక బయటికి వచ్చిన తరవాత రాజుతో అన్నాడు పూజారి.
“నేను కూడా మీతో వొంటరిగా మాట్లాడాలను కుంటున్నాను. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు కాదు.” అన్నాడు.
“ఆ పిల్లోల్లు జాగ్రత్త” అని చెప్పి నేలమాళిగకు దారి తీసే రహస్య సొరంగంలోకి వెళ్లిపోయాడు.

నాలుగు గంటలు అవుతుండగా రాజు ఈ సారి భుజం మీద ఒక మగ మనిషిని ఎత్తుకుని సొరంగం లోనుంచి బయటకొచ్చాడు.

“ఈ యప్ప ఎవురప్పా” ఆశ్యర్యంతో నోరెల్ల బెడుతూ అన్నాడు పూజారి.

“తెలిసి నోడే సామీ, సంపెత్తారేమోనని బయపడి ఎత్తుకొచ్చినా”

“ఎందుకు సంపాలను కున్నరో, వాళ్లలో ఒకడేమో” అన్నాడు పూజారి. నాడి చూసి నుదురు రుద్దుకున్నాడు పూజారి.

“బతికుతాడా సామీ” అని అడిగాడు రాజు.

“అన్నీ మూగి దెబ్బలు రా అప్పయ్యా, నాకు పసురు వైద్యం కూడా తెలుసు పసురేసి కట్టు కడితే ఎట్లాంటి దెబ్బలయినా మాయమై పోతాయి”అని ఆన్నాడు. “కాకపోతే ఆ పసురుకు కావల్సిన ఆకులు ఇప్పుడు నా కాడ లేవు నువ్వో పని చెయ్యి ఆ పిల్లోల్లని ఇంటికాడ ఇడిసి మాఇంటి కాడికిపో మాయాడదాన్ని లేపి పసురాకులు తీసుకురా ” ఆ పసురుకు కావలసిన ఆకు పేర్లు చెప్పాడు.

నాలుగున్నర అవుతుండగా అప్సానా రుక్సానాలను ఇంటికాడ దిగబెట్టాడు. అక్కకు జరిగిందంతా దారిలో వివరిస్తా వచ్చింది అప్సానా.అందుకనే రాజు వాళ్లకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోతావుంటే గట్టిగా వాటేసుకుంది రుక్సానా. థ్యాంక్స్ అని బుగ్గ మీద ముద్దుపెట్టింది. అప్సానా పెదాల మీద ముద్దు పెట్టింది.

అరగంటలో పూజారికి కావల్సిన పసురాకులు ఆయనకిచ్చి “ఈ మనిషి జాగ్రత్త” అని చెప్పి బంగళాకి వచ్చాడు.

బంగళా అడుగు పెట్టగానే సంద్య ఆనందంతో గంతులేసింది. “బావిలోనించి ఎటువంటి అరుపు ఇనపడక పోతే చచ్చిపోయినావే అనుకున్నా”అనింది. “అవును నీతో పాటు వున్న ఆ పిల్లెక్కడ” అని అడింది సంద్య.

“ఇంటికాడ ఇడిసేసి వచ్చినా” అన్నాడు.

“అవును బావిలోనించి ఎలా బయట పడ్డావ్ ” అని అడిగింది ఆశ్చ్యర్యంగా.

“అవన్నీ మళ్లా మాట్లాడుకుందాం రెయ్యంతా నిద్ర లేదు ” అని గదిలోకి వెళ్లి గడి పెట్టుకున్నాడు.

పోయే ముందు మాత్రం రుక్సానా వంటి మీది నగలు వున్న మూటను ఆమె చేతి కందించాడు. వాటిని చూసిన సంద్య కళ్లు పెద్దవి చేసింది. వాటిని చూసినప్పుడే ఏమి జరిగిందో కొంతవరకు వూహించింది. ఎందుకంటే కేశి రెడ్డి కూడా అప్పుడప్పుడు ఇలాంటి నగలే తీసుకొచ్చే వాడు. అంటే వీడు కేశి రెడ్డి కోటలోనించి బయట పడ్డాడు. మొదటి సారి తన నిర్ణయం సరైనదే ననిపించింది.

1 Comment

  1. Bossu, ikkada amavasya ani cheppavu. Kaaani bavilo moon reflection paduthondi ani cheppav. Elaa possible idhi.. Bro

Comments are closed.