ఇలా ప్రతి శిష్యుడూ ఒక్కో కన్నే పిల్లని తెచ్చి బలిచ్చేవారు. ఈ కన్నెపిల్లల బలి కార్యక్రమానికి ముఖ్య కారకుడు మూర్ఖుల్లో ప్రథముడైన కాలప్ప. వీడి చంద్రుడి మొదటి తరం శిష్యుల్లో ఒకడు. చాలా మంది యుద్దంలో చనిపోతే మిగిలిన ముగ్గురిలో వీడొక్కడు. చంద్రుడు ప్రతి అమావస్యకి ఎంతో ఇష్టంతో కన్య పిల్లతో రతిలో పాల్గొనే వాడు. ఆ పిల్ల వాడికి నచ్చినట్లయితే దాన్నే అంటి పెట్టుకుని వుండేవాడు. దాని మీద ప్రీతి పోయాక వేరొకదాన్ని ఎంపిక చేసుకునే వాడు.
ఈ ఒక్క కారణం చెప్పి తన శిష్యులను పిలిచి “మన గురువు గారు ప్రతి అమావస్యకి క్రమం తప్పకుండా వాడుకునే వాడు. పర లోకంలో ఆయనకి కన్నె పిల్లలెక్కడ దొరుకుతారు. కాబట్టి ప్రతి అమావస్యకి ఒక కన్నె పిల్లని గురువు గారి కోసమని బలివ్వాలి.” అని తీర్మానించాడు. ఒక్కో శిష్యున్ని ముగ్గురేసి కన్నెపిల్లలని తెచ్చి ఇమ్మని ఆదేశించాడు. ఆ తీర్మానం నచ్చని వాళ్లు ఆ భవనాన్ని వదిలి వెళ్లిపోయారు.
అలా వెళ్లిన వాళ్లలో చానా మంది మంచిగానే మారారు. మంచి పెంపొందించడానికి వారికి తెలిసిన విద్యలను మంచికి వాడేవాళ్లు. చేతబడికి విరుగుడు మంత్రాలను నేర్పేవారు. మూలికా వైద్యాన్ని రోగాలను మాపడానికి వాడటం నేర్పి శిష్యులను చేరదీసేవారు.
కాలప్ప శిష్యులలో అత్యుత్సాహ వంతుడైన వాడొకడు రంగనాథపురపు రామస్వామి గుడి అర్చక పూజారి కూతురుని బలవంతంగా చంద్ర భవనానికి చేర్చాడు. పాపమా పూజారికి ఇల్లు గుడి తప్పితే వేరే లోకం తెలీదు. తెలిసినా ఎవరితోనూ అంతగా మాట్లాడడు. ఇంట్లో పెళ్లాం, ఒక్కగానొక్క కూతురు అతని పెన్నిది, గుల్లో వున్న రాముడు అతని స్నేహితుడు. అందరూ అతన్ని రామస్వామి అని పిలిచేవారు.
రామ స్వామి కూతురు పుష్పవల్లి. 13 యేళ్ల పసిపాప. పుష్పవతి అయి ఏడాది దాటింది. ఇంటి ముందర స్నేహాలతో ఆడుకుంటున్న ఆ పసిదాన్ని బలవంతంగా చేతుల్లో ఇరికించుకుని ఎత్తుకుపోయాడు. అడ్డం వచ్చిన ఆ ఇంటావిడన కాలు పెట్టి తన్నాడు. ఆవిడ కాల్ల వేల్లా పడింది. మద్యం మత్తులో వున్న వానికి కన్నూ మిన్నూ కనపడలేదు. అధికారగర్వం.
గుల్లో వున్న పూజారికి ఆ విషయం తెలిసి వుగ్రుడైపోయాడు. ఎప్పుడు సౌమ్యంగా, శాంతంగా వుండే ఆయన ముఖం కోపంతో ఎరుపెక్కింది.గర్బగుడిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కొన్ని క్షణాల తరవాత వనవాసానికి వెళ్తున్న రామునిలా జడలను ముడివేసి చేతిలో కత్తితో బయటికి వచ్చాడు. ఆయనలా కత్తి పట్టుకుని చంద్రభవనం వైపు నడిచివెళ్తుంటే, దండకారణ్యంలో రాక్షసుల మీదకి ఒంటరిగా నందకం అనే కత్తిని చేతబట్టుకుని యుద్దానికి వెళ్తున్న రామున్ని చూసినట్టనిపించింది ఆ వూరి జనాలకి. ఒక్కొక్కరూ ఆయన వెనక నడవడం మొదలు పెట్టారు. ఆయన వూరు దాటేలోపు వూరిలోని జనం మొత్తం ఆయన వెనక వురకారు.
కోపంతో ఆయన సుడిగాలిలా వెళ్లి భవనం మీద పడ్డారు. రామస్వామి కత్తి దాటికి కాలుని శిష్యులు చల్లా చదురై పోయారు. కోపంతో జనాలు చంద్ర భవనం పునాదులతో సహా పెకలించేయసాగారు. రామ స్వామి కత్తికి కాలప్ప తల తెగి పడటం, భవనం పేక మేడలా కుప్పకూలిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి.
తండ్రి తన కోసం ఇంత చేస్తాడని వూహించని పుష్పవల్లి చంద్ర భవనానికి తెచ్చిన మరుక్షణం బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కూతురు శవాన్ని చూసిన చూడగానే అంత వరకూ వున్న కోపం పోయి ధుఃఖం ముంచుకు వచ్చింది. గుండెలు బాదుకుని ఏడ్చాడు. కూతురి శరీరానికి అక్కడే అంత్యక్రియలు చేశాడు.
నేలకొరిగిన ఆ భవనం రాళ్ల గుట్టలా మారిపోయింది. అక్కడ చెట్లు పుట్టలూ పెరిగి గుట్టలా మారిపోయింది.
చెడుకు చావే లేదు. అదో మర్రి చెట్టులా పెరిగిన క్షుద్ర వృక్షం. ఎన్నో వూడలు భూమిలోకి దిగిపోయి మొదలేదో వూడేదో తెలుసుకోలేనంత పెద్దదిగా ఎదిగిపోయింది. కాలప్ప పోతే కారప్ప. వాడో కామోద్రోకుడు. చచ్చిన ఆడదాని శవం మీద కూడా పడి సుఖాన్నిఅనుభవించేవాడు.
వాడు శవాల మీద పరిశోధనలు సాగించేవాడు. చచ్చిన తరవాత ఎంతసేపటి వరకు మనిషి మెదడికి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుట్టుందనే విషయం పై పరిశోధన చేసేవాడు. ఆ పని పదిమందికి తెలిసేలాగా చేయలేమ్ కాబట్టి భవనం లోని రహస్య ప్రదేశంలో పరిశోధన చేసేవాడు. వాళ్లు బలిచ్చిన, వాళ్ల పైశాచికానికి బలైపోయిన ఆడవాళ్ల శవాలన్నీ వాడికే ఇచ్చేవాళ్లు. వాడు వాటిపైన పడి కోరిక తీర్చుకుని ఆ తరవాత పరిశోధించే వాడు. ప్రాణం పోయిన నాలుగు ఘడియల పాటు మనిషి శరీరంలోని కణాలు జ్ఞాపకాలను దాచుకుంటాయని, ప్రత్యేక సాదనం ద్వారా వాటిని వెలికితీసి దాచేవాడు.
అందరూ భవనాన్ని నేలమట్టం చేసి, పుష్పవల్లి శవానికి అంత్యక్రియలు చేసి వెళ్లిన తరవాత ఆమె సమాధిని తోడి శవాన్ని బయటికి తీశాడు. అందమైన ఆ శరీరాన్నిచూడగానే అనుభవించాలనిపించింది. కానీ వాడికి భయం వేసింది. తలని మాత్రం తెగనరుక్కొని ఆ రహస్య మార్గం లోపలికి వెళ్లిపోయాడు. ఆమె జ్ఞాపకాలను కూడా వెలికి తీసి ఒక గాజు ఝాడీలో భద్రపరిచి వుంచాడు.
వాడు చచ్చేన్త వరకు అదే సొరంగంలో బతికాడు. ఆ సొరంగం నుండి కోనాపురం కోనల్లోకి దారుండేది. ఆ దారి ద్వారా అడవిలోకి వెళ్లి మూలికలు,ఆకలి తీర్చుకోవడానికి జంతువుల వేటసాగించేవాడు. తన పరిశోధన అక్కడే ఆగిపోకూడదని ఒక శిష్యున్ని చేరదీశాడు. వాడికి మూలికా వైద్యం, కొన్ని క్షుద్ర విద్యలు నేర్పి, అడవిలోని మంత్ర మందిర రహస్యాన్ని వివరించి ప్రాణాలు విడిచాడు.
మంత్ర మందిరంలోని రహస్య తాల పత్రాలను, గొప్ప గొప్ప మాంత్రికుల జ్ఞాపకాలను చదివి, విని తెలుసుకునే వాడు. చంద్రుడు హయాంలో జ్ఞాపకాలను చదివే ఓపికలేని చంద్రుడు వాటిని విడమరిచి చెప్పెందుకని ఒక పిశాచాన్ని నియమించాడు. దానికి ఒక అడవి జంతువు రక్తాన్ని సమర్పించి మంత్రం చదివితే చాలు ఆ మంత్ర మందిరంలోని కోరిన విషయాన్ని విడమరిచి చెబుతుంది.
ఒకసారి మధువు తాగి ఆ పిశాచిని దుర్బాష లాడాడా శిష్యుడు. ఆ పిశాచికి ఆధీనంలో లేని కోరికలను తోర్చమని కోరాడు. దానికి ఆగ్రహించిన పిశాచి వాన్ని మిస్ లీడ్ చేసింది. సిద్దుని మరణం లేని మూలికా వైద్యం గురించి చెప్పి అతని ఆశ కల్పించింది.
తలాతోక లేని సాధన. ఆ మూలికా మందుని ఎలా వాడాలో తెలీదు. అయినా మందుని తయారు చేసి మొత్తం ఒకేసారి తాగేశాడు. పలితం మందు వికటించింది. యుక్త వయస్సులోనే ముసలితనం ఏర్పడింది. అలా ఏర్పడిన వృద్ధాప్యం కొన్ని వందల ఏళ్లుగా మరణం లేక వృధ్ధాప్యాన్ని భరించలేక కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఇద్దరు యువకుల తోడు లభించింది.
వాళ్ల ద్వారా తన గురువుల కోరికలు దీర్చి వారిని మెప్పించి విముక్తి వేడుకుందామని ప్రయత్నించాడు. కానీ మంచి వాడైన రామ చంద్రుడు సహకరించలేదు. సరే నాగ చంద్రుడితో నైనా ప్రయత్నిద్దామని అనుకుంటుంటే వీడో వట్టి మూర్ఖుడు. నాగ చంద్రునిది కూడా గమ్యం లేని సాధనే. మనస్సుని సాధన మీద లగ్నం చేయలేక, సాధన మూలకంగా వచ్చే పలితం మీదే ద్యాస.
* * * * * * * * * * * * * * * *
