సహస్ర ఫణి
కోనాపురం అడవులు అంచులలో వుందా పెద్ద తోట. అదొక నర్సరీ లాంటింది.అందులో ఎన్నో రకాలైన మొక్కలను పెంచుతుంటారు. అక్కడి నుండే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ కింద వుండే పల్ల తోట రైతులకు పల్ల మొక్కలను సరఫరా చేస్తుంటారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు రామలింగా రెడ్డి అరవై ఎకరాల భూమిని ప్రభుత్వం నుండి పొందాడు. దాని కోసమని ఎంతో ధనం ఖర్చుచేశాడు. టీనాని ఎంతో మంది దగ్గర పడుకోబెట్టాడు. కొంత మంది పెద్ద వాళ్లకు ఏకంగా బెంగుళూరు
లోని తన రియలెస్టేట్ వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నాడు. ఇన్ని చేస్తేగానీ ఆ అరవై ఎకరాలు అతని పరం కాలేదు. చివరికి చేతికి రాగానే ఆ భూమిని పోగొట్టుకోవడానికి రైతులు వప్పుకోలేదు. కారణం ఆ నలవై ఎకరాల భూమి చెరువు కింద వుండే ఆయ
కట్టు. వానలు సరిగ్గా పడి చెరువు నిండితే సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.
సంవత్సరం పొడువునా ఆకలితీర్చే అన్నపూర్ణ లాంటి భూమిని పోగొట్టుకోవడం రైతులకి ఇష్టం లేకపోయింది. రామలింగారెడ్డికి ఎదురు తిరిగారు. శాంతి సంధిలో భాగంగా కొంతమంది డబ్బుకి అమ్ముడు పోయారు. కొంత మంది ప్రాణాలకి బయపడి వొప్పుకున్నారు. వొప్పుకోని వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతా జేసి రామలింగా రెడ్డి దండుకున్నది ఏమిరా అంటే ఆ చెరువు గట్టు మీదున్న మారెమ్మ గుడి. ఆ అరవై ఎకరాలలో భాగంగా ఆ గుడి కూడా అతని సొత్తయింది. ఆ గుడిని ఎక్స్ ప్లాయిట్ చేయడమే ఆ అరవై ఎకరాలు కొనడానికి ముఖ్య వుద్దేశం. దీని వెనకాల వున్నది పెద రామరాజు గారు.
“నాకా గుడి కావల్ల రెడ్డీ” అన్నప్పుడు “ఎమంత పెద్ద పని రాజన్నా అడ్డొచ్చిన నాకొడుకుని నరికైనా దాన్ని సొంతం జేసుకుందాం” అన్నాడు మూర్ఖంగా. “వద్దు రెడ్డి న్యాయంగా చేజిక్కించుకోవాలి” అన్నాడు రామరాజు. కానీ దానికి కొంతమందిని చంపాల్సి వచ్చింది. ఆ పని రామరాజుకి సుతరాము ఇష్టం లేకపోయింది. చేసిన పాప కార్యానికి ప్రాయచ్చిత్తంగా ఏదైనా పుణ్యకార్యం చేద్దామని అనిపించి మొక్కలు పెంచే నర్సరీని ఏర్పాటు చేయించాడు. అక్కడి నుండి చుట్టు పక్కల పల్లెలలోని రైతులకు పల్ల, పూల తోటలు పెంచుకోవడానికి మొక్కలు సరఫరా చేసేవారు. రైతులకు ధన సాయం కూడా చేసేవారు. ఆ తోటల మీద వచ్చే లాభలో పావలా వాటాను మాత్రం తీసుకునేవారు. ఆ ధనం అంతా ట్రస్ట్ ఖాతాలోకి జమా అయ్యేది. పైకి నర్సరీలా కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం గుడిని పూర్తీగా తవ్వేశారు. దానికింద నిధిని పూర్తీగా వెలికి తీసేలోపే రామరాజుకి మృత్యువు ముంచుకు వచ్చింది. రామలింగా రెడ్డిని అంగవికలాంగుని చేసింది. ఆ గ్యాంగులోని వారంగా అది ఆ మారెమ్మ తల్లి మహిమనే నమ్ముతున్నారు.
ఇప్పుడా అరవై ఎకరాలు పెద్ద తోటలా మారిపోయింది. ఆ తోటలోనే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీకి ఎంతో మంది పెద్దలను ఆహ్వానించారు. రామలింగా రెడ్డి బిజినెస్ పార్టనర్స్, శ్రేయోభిలాసులు, తన వ్యాపారాభివృద్దికి సహకరించిన ప్రభుత్వ పైవేటు వ్యక్తులను అహ్వానించారు. వారిలో కొందరు రిటైర్ అయిన వారు వున్నారు.
కార్లన్నీ ఒక్కొక్కటిగా తోటలోకి ప్రవేశిస్తున్నాయి. సూరిగాడు మరియు మేకప్ మేన్ల కారు గేటు దగ్గరకు రాగానే “టికెట్ ప్లీజ్ సర్” అన్నాడో సెక్యురిటీ గార్డ్. మేకప్ మేన్ ఇన్విటేషన్ కార్డ్ చూపించాడు. “వీడు నా అసిస్టెంట్” అన్నాడు సూరిగాడిని చూపించి. సెక్యురిటీ గార్డ్ సూరిగాడిని చూడగానే ఒక చిన్న నవ్వు నవ్వాడు. “మీరు వెళ్లచ్చు” అని గేట్ ఒపెన్ చేశాడు.
“చూడ్డానికి హిందీ వానిలా కనిపిస్తున్నాడు. మరి తెలుగు బానే మాట్లాడుతున్నాడు” అడిగాడు సూరి.
“ఇక్కడి సెక్యిరిటీ వాళ్లంతా నాగాల్యాండ్, అస్సాం నుంచి వచ్చిన వాళ్లు. ఓనర్ ఏది చెబితే అది చేయడం వాళ్ల పని చావమంటే చస్తారు, చంపమంటే చంపేస్తారు. ప్రాణాలైనా వదిలేస్తారు గానీ వృత్తికి ద్రోహం చేయడమనే మాటే వుండదు. జాగ్రత్త!. . . ఏదైనా చేసే ముందు ఈ రాక్షసులను మనసులో పెట్టుకుని చెయ్యి ” అని హెచ్చరిక చేశాడు.
కారు పార్కింగ్ ప్లేసుకి వెళ్లేవరకు దారిలో సుమారు పది మంది సెక్యురిటీ వాళ్లు ఎదురుపడ్డారు. అందరూ మామూలు మనషుల కంటే ఆకారంలో భిన్నంగా వున్నారు. సుమారు ఆరున్నర అడుగులకు పైన ఎత్తున్నారు. వాళ్ల ముఖం నవ్వనేది ఏమాత్రం కనిపించడం లేదు. వారి కన్నులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఈ నాగాల్యాండ్ సెక్యురిటీ గార్డులు ఇంత దూరం రావడానికి ముఖ్య కారకుడు పెద రామరాజు. వాళ్లని ఇంత దూరం తీసుకుని వచ్చింది మంచి పని కోసమే. కానీ వాళ్లిప్పుడు చెడుని రక్షించడానికి వుపయోగపడుతున్నారు. వాళ్లకి తెలిసిందల్లా నమ్మకంగా వుండటం. అప్పుడు రామ చంద్రునికి,ఇప్పుడు నాగ చంద్రునికి.
తోటలోని ఒక పెద్ద విల్లా ముందు కారాగింది. మేకప్ మేన్ సూరీలు ఆ విల్లాలోకి వెళ్లే పాటికి టీనా వాళ్లకి ఎదురొచ్చింది.
“హాయ్ శ్యామ్” అని మేకప్ మ్యాన్ని పలకరించింది. మేకప్ మేన్ “హాయ్” అని బదులు చెప్పాడు. ఒకరికి ఒకరు హగ్ చేసుకుని పలకరించుకున్నారు.
“ఎవరీ యంగ్ మ్యాన్” అని సూరిని గురించి ఆరా తీసింది.
“నా అసిస్టెంట్, మేకప్ నేర్చుకుంటానని పట్టు పడుతుంటే జాయిన్ చేసుకున్నాను. ఆ. . . . అలాగే మంచి ఆర్టిస్ట్ కూడా . . . బొమ్మలు చాలా అందంగా గీస్తాడు. నువ్వొక సారి ట్రై చెయ్యొచ్చు.” అని కన్ను గీటాడు.
టీనా చిరు నవ్వు నవ్వింది సూరిని చూసి” ష్యూర్ . . . ఆఫ్టర్ ద పార్టీ” అనింది. సూరి మొదటి సారి ఆమె పెదాల వంక పరీక్షగా చూశాడు. అందమైన పెదాలు చూడగానే ముద్దొచ్చాయవి. అందంగా వుండి మత్తెక్కించే ఆమె కళ్లతో ఒక చూపు చూసి ఆ పెదాలతో ఒక నవ్వు నవ్విందంటే చాలు ప్యాంట్ తడిసిపోవాలసిందే. టీనా క్యాజువల్ డ్రస్లోనే వుంది. టీ షర్ట్, టైట్ లెగ్గిన్. ఆ స్కిన్ టైట్ లెగ్గిన్లో ఆమె తొడల షేప్ స్పష్టంగా తెలుస్తొంది.