మెమోరీస్ 9 209

రాత్రి మూడు గంటలు దాటింది. అప్పటి వరకు సంగీత ద్వనులతో మోత మోగిన పార్టీ హాల్లన్నీ మూగ బోయినాయి. అంతకు ముందు గొంతు చించుకొని అరిచినా ఒక్కరికీ వినపడేది కాదు. అంత ఎక్కువ మోతాదులో ద్వని ప్రసరించేది. మరిప్పుడు టీనా ఆ గదుల గుండా తూలుతూ నడుస్తుంటే ఆమె కాళ్ల కున్న పట్టీలు గళ్లు గళ్లు మని శబ్దం చేస్తున్నాయి. ఆ ద్వని ఆ హాలు గోడల తగిలి ప్రతి ద్వనించింది. అదేమి ఆమెకు వినపడటం లేదు. మద్యం మత్తులో సాగించిన రతి మూలకంగా ఆమె శరీరం సోలిపోయింది. ఒంట్లో మిగిలిన ఏకాస్త శక్తిని కూడ గట్టుకుని తన భవనాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తొంది. అది అయ్యే పనిలా కనిపించడం లేదు. పార్టీ హాలున్న భవనాన్ని దాటి రహదారి మీద అడుగు పెట్టగానే ఒడలులోనున్న శక్తి హరించుకు పోయింది. సోలి కిందకు పడబోయింది. ఆమె శరీరం నేలకు తాకకుండా రెండు బాహులు ఆమెను అందుకున్నాయి. అతనెవరా అని చూడబోతే కన్నులు తెరవడానికి కూడా శక్తి చాలడం లేదు. అయినా బలవంతంగా తెరిచి చూసింది. విద్యుత్ కాంతి వెలుగులో అతని ముఖం కనిపించింది. కృతజ్ఞతగా చిరునవ్వుని పెదవుల మీద కురిపించింది. మరుక్షణం సోలిపోయింది. అతను ఆమెను పడక గది వరకు తన బాహులమీదే మోసుకుని వెళ్లి పడుకోబెట్టాడు.
అతను ఆమె సెక్యురిటీ గార్డులలో ఒకడైన హేమంత్. అతనిది కర్ణాటక. టీనా బెంగళూరులో వున్నప్పుడు అతన్ని సెక్యురిటీ గార్డుగా నియమించుకుంది. అతను ఆమెను ఎళ్లప్పుడు అంటి పెట్టుకునే వుంటాడు. అతని కన్ను దాటి ఆమె ఎవరిని కలవలేదు. ఆమెకు సంబందించి ఆమె రహస్యం అనుకునే ప్రతి విషయం అతనికి తెలిసే వుంటుంది. మొన్న తన కారులో తీసుకుని వచ్చిన ఇద్దరు ఆడపిల్లలను తనకు డాక్టరుకు తప్ప మూడో మనిషికి తెలియదనే అనుకుంది. కానీ ఆ విషయం హేమంతుకి తెలుసు. పార్టీ లోనుండి డాక్టరు అర్దాంతరంగా వెళ్లిపోతుంటే అతన్ని రహస్యంగా అనుసరించానని అనుకుంటా వుందామే, కానీ ఆమెకు తెలీకుండానే హేమంత్ ఆమెను అనుసరించాడు.
మిగిలిన సెక్యూరిటి గార్డులు ఆమె నివాసాన్నో, వర్కింగ్ ప్రదేశానికో కాపలాగా వుంటారు. కానీ ఇతను మాత్రం ఆమె నీడలాగా కాపలా వుంటున్నాడు. అసలు ఆమె మీద ఎందుకంత బాద్యత అంటే ఆమె తనకు జీతమిస్తొంది కాబట్టి వృత్తి పరంగా ఆమెను సంరక్షిస్తున్నాడా?, ఈ రోజుల్లో ఎంతమంది తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు. అటువంటిది తీసుకునే జీతం కంటే ఎందుకంత ఎక్కువ పనిచేస్తున్నాడితను. కొంపదీసి ఆమెను రహస్యంగా ఆరాదిస్తున్నాడా? లేకపోతే గూఢంగా ఆమెను కోరుకుంటున్నాడా?. సాదారణంగా వేశ్యల మీద ప్రతి వొక్కరికి కోరిక వుండి వుంటుంది. వయస్సులతో సంబందం లేకుండా
సమాజంలోని మగవారందరితో పాటు ఆమె ఇచ్చే జీతం మీద బతికే వారికి కూడా. వారు బయటికి చెప్పక పోయినా అవకాశం వచ్చినప్పుడు వుపయోగించుకుంటారు. ఆ అవకాశం హేమంతుకి ఆరోజు వచ్చేదే కాకపోతే ఆమె శరీరంలో శక్తి లేకపోవడం మూలకంగా అతనికి అవకాశం చేజరిందనే చెప్పుకోవాలి.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

1 Comment

  1. Next story post chey

Comments are closed.