వొక రాక్షసుడి పేరు – Part 2 102

శేఖర్ చంద్ర, మహేంద్ర విక్రమ్ చంద్ర ఇద్దరు కవల పిల్లలు విక్రమ్ పెద్దోడు అన్న తమ్ములు ఇద్దరు రామ లక్ష్మణులకు ఏమాత్రం తగ్గరు విక్రమ్ కొంచెం ఒంటరితనం ఇష్ట పడే వ్యక్తి తనకు స్నేహితులు ఎవరూ పెద్దగ లేరు శేఖర్ మాత్రం చాలా అల్లరి మరియు ఎవరితో అయినా ఇలాగే కలిసి పోయే రకం ఇద్దరు చిన్నప్పుడే వాళ్ల నాన్నకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అవ్వడం తో అక్కడే చదువుకుంటు పెరిగారు వాళ్ల పక్కింట్లో ఉండే తెలుగు ఫ్యామిలీ లో అబ్బాయి రాకేేష్ వాళ్ల నాన్న పెద్ద psychiatrist తన తండ్రి లాగే తను కూడా ఒక పెద్ద psychiatrist అవ్వాలి అనేది రాకేేష్ ఆశ,విక్రమ్ వాళ్ల నాన్న కీ ఒక అక్క ఉంది ఆమె కీ పెళ్లి అయిన 3 సంవత్సరాలకే భర్త చనిపోయారు అప్పటికే ఆమెకీ ఒక పాప పుట్టింది ఆ పాప నే శ్రావ్య, విక్రమ్ వాళ్ల అమ్మ అన్నయ్య కీ అదే పరిస్థితి కాకపోతే ఆయనకు పిల్లలు లేరు దాంతో వాళ్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు శ్రావ్య నీ కన్న కూతురు లాగే చూసుకున్నాడు ఆయన ఆ తర్వాత పెళ్లి అయిన రెండు సంవత్సరాలకు వాళ్లకు వర్షా పుట్టింది.

ఇద్దరు ఆడపిల్లలు కావడంతో విక్రమ్ కీ శేఖర్ కీ వాళ్ల తోనే పెళ్లి అనుకున్నారు శేఖర్ కీ శ్రావ్య అంటే ఇష్టం అలాగే శ్రావ్య కీ కూడా శేఖర్ ఇష్టం, వర్షా విక్రమ్ కూడా చిన్నప్పటి నుంచి ఒకరి పై ఒకరు ఇష్టం పెంచుకున్నారు అప్పుడప్పుడు రాకేేష్ నీ కూడా వాళ్ల తో పాటు హలీడేస్ కీ కర్నూలు కీ తీసుకొని వెళ్లే వారు అప్పుడే రాకేేష్ వర్షా నీ చూశాడు చూడగానే వర్షా అందం పై మొహం లాంటి ప్రేమ పెంచుకున్నాడు, ఎలాగైనా వర్షా నీ తన సొంతం చేసుకోవాలి అని ఆశ పడ్డాడు ఒక సారి విక్రమ్ వర్షా నీ ముద్దు పెట్టుకున్నాడు అని కోపం తో విక్రమ్ ఫోటో పైన యాసిడ్ పోసి కాల్చేసాడు.

ఇది ఇలా ఉంటే శ్రావ్య కీ తన సవతి చెల్లి వర్షా అంటే కడుపు మంట ప్రతి విషయం లో తనకంటే గొప్పగా ఉండటం ఆ మంట కీ పెట్రోల్ లా అంటుకుంది అలా తన ఫ్రెండ్స్ అయిన రాగిణి, సుప్రజా, మమత, సంధ్య, సోనీ, శ్రద్ధా అంతా కలిసి స్కూల్ లో జరిగే డాన్స్ పోటీలో ఎలాగైనా వర్షా రాకుండా ఉండాలి అని ప్లాన్ చేసి వర్షా స్కూల్ కీ స్కూటీ లో వెళ్లేదీ అలా అందరూ కలిసి వర్షా స్కూల్ కీ వచ్చే దారిలో వర్షా స్కూటీ కీ అడ్డం గా రాగిణి పెంచుకునే కుక్క పిల్లను వేశారు దాంతో వర్షా కుక్క పిల్లను తప్పించబోయి అదుపు తప్పి కింద పడింది అప్పుడే అటుగా వచ్చిన లారీ వర్షా కాలి పై నుంచి వెళ్లింది, ఆ తర్వాత ఈ విషయం తెలిసి రాకేష్ కర్నూల్ కీ ఎవరికి తెలియకుండా వచ్చాడు వర్షా నీ ఏ హాస్పిటల్ లో ఉంచారో తెలుసుకోవడానికి వాళ్ల ఇంటికి వెళ్లాడు అప్పుడు శ్రావ్య మళ్లీ తన ఫ్రెండ్స్ అంతా వర్షా కీ చేసిన పని గురించి నవ్వకుంటు మాట్లాడటం విన్నాడు దాంతో అప్పుడే వాళ్ళని చంపాలి అని డిసైడ్ అయ్యాడు.

విక్రమ్ వాళ్ల నాన్న కీ మళ్లీ ఆంధ్ర ట్రాన్స్ఫర్ అవ్వడం తో పిల్లలు చదువు డిస్టర్బ్ కాకుండా అలాగే బెంగళూరు లో వదిలి వెళ్లారు ఒక రోజు విక్రమ్, శేఖర్, రాకేేష్ ముగ్గురు కలిసి రోడ్డు పై వస్తుంటే విక్రమ్ చేతిలో బాల్ తో ఆడుకుంటు ఉండగా బాల్ జారీ రోడ్డు పై దొరలుతు వెళ్లింది దాని వెనక విక్రమ్ వెళ్లాడు అప్పుడే ఒక లారీ వచ్చింది దాని నుంచి విక్రమ్ నీ కాపాడాలని వెళ్లిన శేఖర్ చనిపోయాడు ఈ విషయం ఇంట్లో చెప్పలేదు, అసలే ఒంటరిగా ఉండే విక్రమ్ తమ్ముడు మరణం తో ఇంకా ఒంటరిగా ఉన్నాడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాకేేష్ తన తండ్రి దెగ్గర నేర్చుకున్న hypnotism విద్య నీ విక్రమ్ పై ప్రయోగించి తనకు అవసరం వచ్చినప్పుడు అలా తనకు కావాల్సిన మృగం లా మార్చుకుంటు శ్రావ్య తో మొదలు పెట్టి అందరినీ విక్రమ్ చేత చంపిస్తూ వచ్చాడు రాకేేష్ విక్రమ్ కీ psychological disorder ఉన్నట్టు నమ్మించి అతని మెదడు నీ తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఒక injection ఇస్తూ విక్రమ్ నీ తన చేతి సైగ లో ఉంచుకుంటు వచ్చాడు రాకేేష్ అంతే కాకుండా రాగిణి పై షూటింగ్ లో హోర్డింగ్ బోర్డ్ పడేలా చేసింది కూడా రాకేష్ ఆ తర్వాత రాగిణి నీ తనతో ప్రేమ లో పడేలా చేసి మెల్లగా విక్రమ్ నీ కథ లో విలన్ నీ చేసి రాగిణి చేత్తో విక్రమ్ నీ చంపి తరువాత రాగిణి నీ చంపాలి అని పధకం వేశాడు అది కూడా వర్షా పుట్టిన రోజు అయిన 7 మార్చి రోజే