వొక రాక్షసుడి పేరు – Part 2 102

అద్దం లో ఆవిరి పైన ఉన్న “శేఖర్” అని పేరు చూడగానే మళ్లీ తల నొప్పి తో కింద పడ్డాడు తరువాత లేచి అద్దం పైన శేఖర్ పేరు అద్దం పైన చూడగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అంతే వెంటనే బయటికి వచ్చి రెడీ అయ్యి తన కార్ తీసుకొని ఒక హాస్పిటల్ కి వెళ్ళాడు అక్కడ psychiatrist డాక్టర్ రాకేష్ రూమ్ కి వెళ్ళాడు, కంగారు గా వచ్చిన విక్రమ్ నీ చూసి ఏమాత్రం కంగారు పడ్డని రాకేష్ లేచి తన ఫ్రిడ్జ్ నుంచి రెండు injection లు తీసుకొని వచ్చి విజిల్ వేస్తూ విక్రమ్ కీ injection వేశాడు దాంతో విక్రమ్ పడుకున్నాడు ఒక గంట సేపు అలాగే పడుకున్నాడు రాకేష్ ఈ లోగా తన టేబుల్ కింద ఉన్న వోడ్కా బాటిల్ తీసి తాగుతూ ఉన్నాడు ఆ తర్వాత విక్రమ్ లేచ్చాడు అప్పుడు రాకేష్ ఇంకో గ్లాస్ లో వోడ్కా పోసి ఆ గ్లాస్ నీ విక్రమ్ వైపు తోసి తాగు అన్నాడు.

కానీ విక్రమ్ తాగలేదు ఇందాకటి తో పోలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు

రాకేష్ : ఏంటి మళ్లీ అద్దం పైన శేఖర్ అని రాసి ఉందా

విక్రమ్ : అవును

రాకేష్ : నాకూ మీ ఇద్దరూ నిక్కర్ వేసుకున్నే రోజుల నుంచి నాకూ తెలుసు

విక్రమ్ : వాడికంటే నేను ఎక్కువ గా తెలుసు కదా

రాకేష్ : అవును సార్ వాడికంటే మీతోనే ఎక్కువ రోజులు ఉన్న

విక్రమ్ : ఇంకా ఎన్ని రోజులు ఇలాగ నా పరిస్థితి

రాకేష్ : బాబు నీకు ఉన్నది మామూలు రోగం కాదు ఇలాంటి psychological situation ఏదో ఒకటీ మాత్రమే ఉంటుంది కానీ నీ నా దరిద్రం ఏంటి అంటే నీకు రెండు ఉన్నాయి

విక్రమ్ : నాకూ తెలుసు

రాకేష్ ఆవేశం గా “ఏమీ తెలుసు రా నీకు split personality disorder నీ కారణం తెలుసుకొని తగ్గించోచు కానీ దానికి తోడు నీకు schizophrenia కూడా ఒకటి ఉండి సచ్చింది” అని చెప్పాడు.

విక్రమ్ : అయితే ఇప్పుడు ఏమంటావ్

రాకేష్ : శేఖర్ చచ్చిపోయాడు వాడు చచ్చి 8 సంవత్సరాలు అయ్యింది ఇది గుర్తు ఉంచుకో

విక్రమ్ : దాంతో పాటు నీకు ఇంకో విషయం తెలియదు

రాకేష్ : ఏంటి శేఖర్ గాడు కూడా వర్షా నీ లవ్ చేశాడు అంతే కదా

(Schizophrenia అంటే అదీ లేని దాని ఉన్నట్లు లేకపోతే ఎవరో మనతో మాట్లాడుతూ ఉన్నట్లు మన మెదడు నీ కంట్రోల్ చేస్తూ ఉండటం ఇది యాంటీ సోషల్ పీపుల్స్ కీ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండనీ వాళ్లకు ఒంటరిగా ఉండటం ఇష్టపడే వాళ్లకు ఇలా చాలా కారణాలు ఉన్నాయి)

(25 ఫిబ్రవరి 2012)

10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి శేఖర్ స్కూల్ లో అందరి కంటే ఎక్కువ తెలివైనవాడు ఎగ్జామ్స్ లో 1st ర్యాంక్ స్టూడెంట్ విక్రమ్ కూడా 2nd ర్యాంక్ స్టూడెంట్ ఆ రోజే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి దాంట్లో శేఖర్ నాలుగు సబ్జక్ట్స లో ఫెయిల్ అయ్యాడు దానికి కారణం వర్షా కీ ఆక్సిడేంట్ అయ్యి తన కాలు పోయింది అని తెలిసి ఆ బాధ లో ఎగ్జామ్స్ సరిగా రాయలేదు దాంతో ఫెయిల్ అయ్యాను అనే బాధ కంటే వర్షా బాధ లో పాలు పంచుకొలేక పోతున్నా అనే బాధ లో రోడ్డు మీద వెళ్లుతుంటే లారీ గుద్దడం తో చనిపోయాడు శేఖర్.

(ప్రస్తుతం)

రాకేష్ తో మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లాడు అప్పటికే వర్షా విక్రమ్ కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ పైనే పడుకుని ఉన్న వర్షా నీ చూస్తూ ఉన్నాడు అందమైన చందమామ లాంటి మొఖం తనది చిన్నప్పటి నుంచి ఒక్కరంటే ఒక్కరికి చాలా ఇష్టం బావ మరదలు కదా ఒకరి పై ఒకరు ఎంతో ప్రేమ పెంచుకున్నారు, విక్రమ్ తో పాటు శేఖర్ కూడా వర్షా పైన ఆశలు పెంచుకున్నాడు కానీ తన అన్న విక్రమ్ వర్షా ఇద్దరు ఒకరి పై ఒకరు ఇష్టం పెంచుకోవడం తో శేఖర్ తన ప్రేమ త్యాగం చేశాడు అది తలుచుకొంటే ఉంటే గోడ పైన ఉన్న ఫోటో లో శేఖర్ ఫోటో “హలో బ్రదర్” అని బ్రమ పడ్డాడు విక్రమ్ దాంతో విక్రమ్ కీ మొహం నిండా చెమటలు పట్టాయి.