మీరు మా సేవకులా?అయ్యో ఎంత మాట మహాప్రభో, మేమే మీ సేవకులం జన్మ జన్మకీ ,ఉమా రుద్రా మీరిద్దరూ ఈ మహాప్రభువుని ఆశీస్సులు తీసుకోండి అంటూ వాళ్ళని ఆదేశించడంతో వాళ్లిద్దరూ మారుమాట్లాడకుండా నా ఆశీస్సులు కోసం మోకరిల్లారు..
కాస్తా ఇబ్బందిగానే వాళ్ళని ఆశీర్వదించి,.మహాపతి గారు మీరేమి అంటున్నారో నాకేమీ అర్థం అవ్వట్లేదు అన్నాను(నిజంగానే ఆయన అంతరంగం అర్థం అవ్వడంలేదు నాకు,నన్ను మహాప్రభో అని సంభోదించడం ఆశ్చర్యం గా ఉంది).
మహాప్రభో ఈ విషయాలు ముందు ముందు మీకే తెలుస్తాయి తొందర పడకండి ,ముందుగా మనం ఆ నివాసానికి వెళ్ళాలి..ఉమా మన చరిత్ర పుస్తకం ఎక్కడ ఉంది??ఆ పుస్తకాన్ని సంజయ్ కి స్వాధీన పరుచు .అది అతడి దగ్గర ఉంటేనే మనందరికీ మంచిది అంటూ మమ్మల్ని వేగిరపరిచాడు..
ఉమా ఆశ్చర్యం గా నన్ను చూస్తూ పుస్తకాన్ని నా చేతికి ఇచ్చి,సాధ్విల నివాసం వైపు బయలుదేరాము..
సాధ్విల నివాసంలోకి ఆ ముగ్గురికీ ప్రవేశం లభించలేదు,ఇది ఆ మహత్తే అని భావించిన నేను నన్ను పట్టుకోమని చెప్పి నా ఇత్తడి బిళ్ళ సహాయంతో వాళ్ళని లోపలికి తీసుకెళ్ళాను..
లోపల శ్రీదేవి గారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుంది,శ్రీదేవి గారూ అని పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని చూసి మా వైపు ఠీవిగా వచ్చింది..
మాతా అంటూ ఆ ముగ్గురూ ఆలస్యం చేయకుండా ఆమె కాళ్ళ పైన పడిపోయారు..వాళ్ళని ప్రేమగా లేపి అంతా కుశలమేగా మహాపతి అంటూ ఆప్యాయంగా పలకరించింది.(ఆమెకి ఎలా తెలిసిందో ఆయన పేరు అని ఆశ్చర్యపోయాను)
కన్నీళ్ళతో ఇదంతా నా కృషే అని గ్రహించిన శ్రీదేవి వినయపూర్వకంగా నాకు నమస్కరించింది.ప్రతిగా నేనూ నమస్కరించాను..
ఇక్కడ ఉమా కి ఏమీ అర్థం అవ్వడంలేదు ఏమి జరుగుతోంది అన్న విషయం బోధపడక..ఆశ్చర్యం గా నన్నే చూస్తూ ఒక ట్రాన్స్ లో పడిపోయింది…
ఇంతలో శ్రీదేవి గారు, మధనా మీ కృషి అసమాన్యమైనది అంటూ కితాబిచ్చేసరికి అప్పటికి వెలిగింది ఉమా మొహంలో ఒక వెలుగు..నేనే ఆ మధనుడిని అన్న విషయం తెలిసిన వెంటనే ఉమా మొహం సప్తవర్ణ శోభితం అయిపోయింది మునుపెప్పుడూ కనిపించని సంతోషపు మోము తో..
నేనూ చిన్నగా నవ్వి కళ్ళతోనే ఇప్పుడు అర్థం అయ్యిందా అన్న పలుకు ని వెలువరిచాను..
తానూ సంతోషంగా కళ్ళతోనే బాగా అర్థం అయ్యింది ధన్యవాదాలు అంటూ తలని కిందకి వంచింది..
కాసేపు వాళ్ళ సంతోషానికి అవధులే లేవు,ఆప్యానురాగాలతో గడిపేసారు.. ఎన్నేళ్ల ప్రయత్నమో ఇది..ఆ ఆనందం వాళ్ళ మోములో స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళ ఆనందానికి నేనూ ఒక కారణం అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను..
ముందుగా శ్రీదేవి తేరుకొని,మధనా మమ్మల్ని అందరినీ తిరిగి ఒక గూటికి చేర్చావ్ నీ ప్రయత్నం విజయవంతం అవ్వడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది..ఆ మాయావి శక్తులు అన్నీ కోల్పోతున్న సమయంలో మనము శక్తి ని పుంజుకుంటున్నాము ఇది శుభ సూచికం..అమ్మా ఉమా నీవూ ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నావ్ చాలా సంతోషం అంది..
మాతా,ఇది మా బాధ్యత.. మీ అందరూ కష్టాల్లో ఉంటే మేమెలా నిశ్శబ్దంగా ఉంటాము??ఇన్నేళ్ళకి మా ప్రయత్నం కి ఒక రూపు వచ్చింది ఈ మధనుడి సహాయంతో ఇదే చాలా సంతోషంగా ఉంది..
అంతా శుభం,ఇంతకీ మన కోటలోని వజ్రం సంగతి ఏంటి ఉమా??
అది తస్కరించాడు మాతా ఆ మాయావి..
అవునా??దాన్ని మనం సంపాదించుకోవాలి ఎలాగైనా…ఇందులకి ఏమైనా మంచి మార్గం ఉందేమో ఆలోచించండి మహాపతి..
మేమూ ఆ ప్రయత్నంలోనే ఉన్నాము మాతా, త్వరలో శుభ వార్త వింటారు మీరు ఖచ్చితంగా..
అలాగైతే సంతోషం మహాపతి మన రుద్రపతి సహాయంతో మీ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి అంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేసింది..
శ్రీదేవి గారూ,ఇది మీ కోటలో దొరికిన మీ చరిత్ర పుస్తకం అంటూ ఆమెకి ఇచ్చాను..
ఆమె చాలా సంతోషంగా దాన్ని ఓపెన్ చేసి చూస్తూ,మధనా ఇది మీతో పాటే ఉండాలి..మా అందరికీ ఈ చరిత్ర సంపూర్ణంగా తెలుసు..ఇప్పుడు మీరు తెలుసుకోవడం ఉత్తమం..మీకు ఈ చరిత్రే దిశానిర్దేశం చేస్తుంది సకలం. మీ దగ్గరే ఉంచండి అంటూ నాకు ఇచ్చింది..
సరే శ్రీదేవి గారు,ఇక నేను సెలవు తీసుకుంటాను అని బయలుదేరగా,మధనా మా బిడ్డ ఉమా కి కాసేపు తోడుగా ఉండండి మేము కొన్ని విషయాలు చర్చించుకోవాలి అంటూ వాళ్ళిద్దరితో లోపలికి వెళ్ళిపోయింది.
నేనూ ఉమా మాత్రం మిగిలాము హాల్ లో..
నన్ను చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి,ఆహా ఏమి నాటకం ఆడారు మధనా మీరు అంటూ కళ్ళెగరేసింది..
మరి ఊరికే అన్నీ చెప్పేస్తారా యువరాణీ??అసలే శత్రువులతో ఏ క్షణమైనా ఆపద ఉన్నప్పుడు నా జాగ్రతలో నేనుండటం ఉత్తమం గా.
నిజమే నిజమే,మధనుడు ఏమో అనుకున్నా గానీ దేహబలంతో పాటూ బుద్ధి బలం కూడా నిండుగా ఉంది శభాష్ అంది నవ్వేస్తూ..
హ హ్హా థాంక్యూ ప్రిన్సెస్ అన్నా..
ఎందుకులే సంజయ్ ఆ మర్యాదలు నాకు,హ్మ్మ్మ్ నువ్వే ఆ మధనుడు వి అని తెలిసిన నుండీ నాకు నమ్మబుద్దే కావడం లేదు ఇప్పటికి నమ్మకం వచ్చింది..
సంతోషం ఉమా..
ఇంతకీ మధనుడిని కొన్ని ప్రశ్నలు వేయొచ్చా??
నిస్సందేహంగా అడగొచ్చు ఉమా.
నీకు ఈ మధనంలో బాగా నచ్చిన మనిషి ఎవరు??
అస్సలు ఊహించలేదు ఆమె ఆ ప్రశ్న వేస్తుందని..
బాగా నచ్చిన మనిషి అని ఎవరూ లేరు ఉమా,అందరూ ఇష్టమే అన్నా.
అలా ఏమీ ఉండదు సంజయ్,మనసుకి నచ్చిన మనిషి ప్రతి ఒక్కరికీ ఉంటారు నీకిష్టం లేకుంటే చెప్పకు అంతే..
హ హ్హా అదేమీలేదు,నాకు మొదటగా ఈ మధనం కి సహాయం చేసిన మా వదిన,అత్త లు అంటే చాలా ప్రాణం నాకు,ఇక అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి మనిషికీ నా దగ్గర అంతులేని గౌరవ స్థానాలు ఉన్నాయి..ఇంతమంది ఉన్నా రవ్వంత అధిక ఆసక్తి సువర్ణా పైన మాత్రం ఉన్నది అన్న మాట వాస్తవం..
ఓహో మధనుడికి సువర్ణా పైన అభిమానమా??అయితే పదండి ఒక్కసారి వాళ్ళని దర్శించి వద్దాం అంది..
Send full story