రొమాంటిక్ చర్చ్నింగ్ 30 64

తన పెళ్ళాం యొక్క నిజాయితీ కి ఒకవైపు చాలా ఆనందంగా ఉన్నా, ఇంకోవైపు తన జీవితాన్ని నాశనం చేశానన్న పశ్చాత్తాపం మనసులో స్థిరపడిపోయింది రఘురామరాజు మనసులో….

ఒరేయ్ మామా ఇదే రా తన ఇల్లు అంటూ నాని గాడు అనేసరికి,ఎక్కడ రా తను అంటూ అడిగాను…

కాసేపు వెయిట్ చేద్దాం రా,కనిపిస్తే సరి లేకుంటే సాయంత్రం మన చెరువు గట్టు పైకి వస్తుంది అని విన్నాను..అప్పుడు చూద్దాం ఏమంటావ్???

అంతేలే రా నానీ,ఇంతకీ ఏ ఊరంట తనది???

ఏమో రా మామా,రెండు రోజుల ముందు ఈ ఊర్లో దిగారంట, వాళ్ళ నాన్న హై కాలేజ్ టీచర్ అని తెలిసింది..ఎవరిని అడిగినా ఆ “సువర్ణ” గురించే చెప్తున్నారు…ఆ అందం,ఆ రూపం హబ్బా వినలేక చచ్చాను అనుకో.అందుకే నీ చెవిలో వేసాను..

సరేలే చూస్తే సరిపోద్ది గా తన ఎంత అందగత్తె అనేది అంటూ కాసేపు పచార్లు కొట్టాము నేనూ,నాని గాడు…

ఒక్క అర్ధ గంట తర్వాత బయటికి వచ్చింది వాళ్ళ నాన్నతో కలిసి ఆ “సువర్ణ”…

ఒక్కసారిగా కళ్ళు జిగేల్మన్నాయి తనని చూసేసరికి,నిజమే నాని గాడు చెప్పిన మాటలు…మాటల్లో మాత్రం ఆమె అందాన్ని పొరపాటున కూడా వర్ణించలేము… ఆహా ఏమి నడుము,ఏమి మోము..ఒక్కసారిగా మనసంతా ఆనందంతో పులకించిపోయింది…ఆమె ని కన్న అమ్మ కి చేతులెత్తి మొక్కాలి అనిపించింది ఆ క్షణం..

అంతలో ఆమె అమ్మ నే ఏమో,ఒసేయ్ సువర్ణా సాయంత్రం వచ్చేటప్పుడు జీడిపప్పు తీసుకురావడం మాత్రం మరిచిపోకు అంటూ…ఆమె అందమూ సువర్ణా కి ఏ మాత్రమూ తీసిపోదు…ఒక్క రెండు నిమిషాల్లో నా మనసు ఆ ఇద్దరి ఊహలతో నిండిపోయింది…

చూస్తుండగానే మమ్మల్ని దాటుకుంటూ వెళ్లిపోయారు సువర్ణా, వాళ్ళ నాన్న…ఒక్క నిమిషం తదేకంగా ఆమెనే చూస్తున్న నన్ను ఓరగా ఒక్క చూపు చూసి వెళ్ళింది తన మొహానికి మరింత అందాన్ని ఇస్తున్న ముక్కుపుడక తో..

ఆమె వెనకాలే మెల్లగా నడుస్తున్న మాకు ఒక్కసారిగా వాళ్ళ నాన్న వెనుదిరిగి మా వైపు వస్తుండటంతో కాస్తా టెన్షన్ మొదలయ్యింది…ఆయన దగ్గరకు వచ్చి,బాబూ నువ్వు సంజయ్ వి కదా అంటూ అడిగాడు..

అవునండి,మరి మీరు??

నేను రామకృష్ణ బాబూ,మీ కాలేజ్ లోకి కొత్తగా వచ్చిన సైన్స్ టీచర్ ని…నిన్ను నోటీస్ బోర్డ్ లో చూసాను.. మన కాలేజ్ నుండి స్టేట్ ర్యాంక్ తెచ్చిన స్టూడెంట్ వి అని..అందుకే పలకరించాను..

థాంక్యూ సర్ మీరు గుర్తుపెట్టుకొని నన్ను పలకరించడం చాలా సంతోషంగా ఉంది..

అందులో థాంక్స్ ఎందుకు లే సంజయ్ అని నడుచుకుంటూ వెళ్తూ,ఇంతకీ ఇప్పుడు ఏమి చేస్తున్నావ్ బాబూ అని అడగడంతో, ఏముంది సర్ డిగ్రీ అయిపోయింది యూనివర్సిటీ మెడల్ తో..ఇక అమ్మా నాన్న లకి నేను ఒక్కడినే గా అందుకే చదువు మానేసి హ్యాపీగా ఇంటిదగ్గర ఉండిపో పెళ్లి చేసేస్తాం అంటున్నారు అన్నాను..

హ హ్హా ఏంటయ్యా ఇంత చిన్న వయసులో పెళ్లి,ఇదిగో తను మా అమ్మాయి సువర్ణ.. తను చూడు డిగ్రీ మామూలుగా పాస్ అయినా PG చేస్తోంది..నీకు ఇంత చదువు ఉండి కూడా ఆగిపోవడం బాలేదు..నెక్స్ట్ స్టెప్ వెయ్ తప్పకుండా అంటూ సలహా ఇచ్చాడు..

నిజమే సర్ మీరు అంటున్నది,కానీ మా పొలాలు చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు అందులోనూ కాస్తా స్థితిమంతులం కాబట్టి చదువు అవసరం లేదు అని ఒకటే పోరు ఇంట్లో,అందుకే ఆపేయాల్సి వచ్చింది.

భలేవాడివయ్యా,ఇదిగో ఈ కాలంలో వ్యవసాయం చేసేవాళ్ళకి పిల్లని కూడా ఇవ్వడం లేదయ్యా కాస్తా ఆలోచించి చూడు నేనెందుకు చెప్తున్నానో అర్థం అవుతుంది..

హ హ్హా నిజమే సర్ మీరన్నది,కానీ నాకు మీ అమ్మాయిలా పెద్ద పెద్ద చదువులు చదివే అమ్మాయి రావాలని ఏమీ లేదు ,ఏదో కొంచెం చదువుకున్న అమ్మాయి మాత్రం వస్తే చాలు అన్నాను సువర్ణ ని ఓరగా చూస్తూ..

హ్మ్మ్ నీ ఇష్టం అయ్యా సంజయ్,ఏదో నీ మెరిట్ చూసి చెప్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశ్యం లేదు అంటూ ముగించాడు..

సర్ అలా ఏమీలేదు,ఇదిగో మీరు చదువు పట్ల చూపించే ప్రేమ నిజానికి చాలా ఆనందంగా ఉంది నాకు..కానీ నా పరిస్థితి వేరే అందుకే తప్పలేదు అన్నాను..

పర్లేదులే సంజయ్ అమ్మానాన్న లని చూసుకోవాలి అన్నావు చూడు అది నచ్చింది నీలో చాలా బాగా నాకు..ఎనీవే గుడ్ లక్ అంటూ ముందుకు కదిలాడు రామకృష్ణ సర్ తన కూతురిని బస్ స్టాండ్ లో వదిలిపెట్టి…

బస్ ఎక్కుతున్న సువర్ణ నన్ను కాస్తా పరిశీలనగా చూస్తూ నగుమోముతో వెళ్ళిపోయింది…

ఒరేయ్ నానీ నువ్వన్నది నిజమే రా బాబూ,పిట్ట యమా రంజుగా ఉంది..

హ్మ్మ్ అవును మామా, మొత్తానికి పిట్టకి కూడా నువ్వంటే కాస్తా ఏదో ఫీల్ కలిగినట్లుంది చివర్లో నవ్వుతూ వెళ్ళింది గమనించావా??

హా హా చూసా మామా,నిజమే ఫీల్ అయితే కలిగినట్లుంది..మనకూ అదే కావాలి గా..

హ్మ్మ్ సరే పద సాయంత్రం గట్టు పైకి వెళ్తే ఇంకా కొంచెం తెగ్గొట్టొచ్చు అంటూ ఇంటి వైపు బయలుదేరాము ఇద్దరమూ…