రొమాంటిక్ చర్చ్నింగ్ 31 47

వాడు లిఫ్ట్ చేయగానే,ఒరేయ్ మన సర్ప కోనకి అర్జెంట్ గా వెళ్ళు, ఎవడో ప్రసాద్ మామ ని ఎత్తుకొస్తున్నాడు అని చెప్పగా వాడు సరే మామా అంటూ కాల్ కట్ చేసాడు..

“సర్పకోన” మా సొంతూరికి ఒక 3kms దూరంలో ఉంటుంది… వాడు వెళ్ళేలోపు నేనూ వెళ్ళాలి అని నిశ్చయించుకొని ,మంజూ ఏదైనా వెహికల్ ఉందా అని అడిగాను..

మన కార్ ఉంది రా అని చెప్పేసరికి, నువ్వూ కొన్ని బట్టలు పెట్టుకో ముగ్గురమూ బయల్దేరి వెళ్దాం అని చెప్పగా హడావుడి గా తన లగేజ్ తో సిద్ధం అయ్యి వచ్చింది…

కార్ ని ఉరికించాను 120 స్పీడ్ తో…బయలుదేరిన ఒక ముప్పావు గంటకి సర్పకోన లో తేలాము…అప్పటికే సర్పకోన మొదలయ్యే దారిలో నాని గాడు వెయిట్ చేస్తూ కనిపించాడు…

కార్ దిగి ఏరా మామా ఎవరైనా ఇటువైపు వచ్చారా అని అడిగాను…

ఎవరూ రాలేదు రా ఇంకా అని వాడు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను…

సర్పకోనలోకి ఎంటర్ అవ్వాలంటే ఇదొక్కటే మార్గం అన్న ధైర్యం నాకు ఆనందాన్ని ఇచ్చింది..

ఒరేయ్ మామా సిద్ధంగా ఉండు, వాడు ఎవడో ఖచ్చితంగా ఇటువైపే రావాలి అంటూ కార్ ని పొదల లోకి పార్క్ చేసి కాస్తా గుబురు పొదల్లో గుండా గమనిస్తూ ఉన్నాము..

సమయం సాయంత్రం 6 అయ్యింది,మెల్లగా సూర్యుడు అస్తమిస్తున్నాడు మబ్బుల చాటుకి వెళ్లిపోతూ…

అప్పుడే మా వైపు ఒక కార్ రావడం మా కళ్ళకి కనిపించింది… ఇద్దరమూ సిద్ధం అయ్యాము మంచి వాడి గల “ఎర్రచందనం” కొమ్మలతో…

కరెక్ట్ పాయింట్ నుండి కొంచెం ముందు ఉండటంతో వాడు ఖచ్చితంగా మా వైపే రావాలి..కార్ ఆగడంతో ఒక ఆజానుభాహుడు దిగాడు నల్లగా తుమ్మమొద్దు లాంటి రూపుతో…వాడిని చూస్తుంటేనే వొళ్ళు గగుర్పాటు కి గురయ్యింది.దాదాపూ ఆరున్నర అడుగులు ఎత్తుతో,మొనతేలిన కండలతో భయానకంగా ఉన్నాడు..

దిగిన వాడు డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ ని తీసి ప్రసాద్ మామ ని అవలీలగా బయటికి లాగాడు..అప్పటికే మొహం అంతా ఎర్రగా వాచిపోయేలా కొట్టినట్లున్నాడేమో నీరసంగా దెబ్బలతో కాస్తా ప్రతిఘటించాడు ప్రసాద్.

మర్యాదగా నడుస్తావా లేకా మళ్లీ మూతి వాచిపోయేలా కొత్తమంటావా అని గద్దించగా ప్రసాద్ మామ మళ్లీ ప్రతిఘటించేసరికి, ఒరేయ్ “సుదర్శనా” నీ శక్తులు లేకపోయినా నీ బలుపు మాత్రం తగ్గలేదు రా అంటూ కొట్టడానికి చేయి పైకి ఎత్తేసరికి, ఇంకో దెబ్బ ఆయన మీద పడిందో నీ తలకాయ ఉండదు గుర్తుపెట్టుకో అంటూ మంజులా పొదలమాటు నుండి బయటికి వచ్చింది..

వాడు ఆశ్చర్యం గా మంజులా ని చూస్తూ,ఎవరే నువ్వు అంటూ చులకనగా మాట్లాడేసరికి నేను కూడా బయటికి వచ్చాను.. ఎవరైతే నీకేంటి రా మర్యాదగా ఆయన్ని వదలకపోతే నీ చావు తప్పదు అంటూ హెచ్చరించాను..

ఓహో నువ్వూ ఉన్నావా??భలే దొరికారు రా నాకు శ్రమ పెద్దగా పెట్టనివ్వకుండా..నీకోసం కూడా వెళ్ళాను మీ ఊరికి,నీ అదృష్టం కొద్దీ ఊర్లో లేవు..ఇక తప్పించుకోలేవ్ లే అంటూ ప్రసాద్ ని బలంగా విసిరేసాడు అల్లంత దూరంలో పడిపోయేలా.
వాడు నా వైపు కదిలాడు ఉగ్రరూపుతో…నేను రెడీ గా కర్ర పట్టుకొని ఉండగా ఎప్పుడొచ్చాడో ఏమో నాని గాడు ఆ ఆగంతకుడి వెనక నుండి తల పగిలేలా బలమైన దెబ్బ కొట్టాడు…

హబ్బా అంటూ గావుకేక పెట్టి తలని పట్టుకొని కిందకి వాలగా ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా నాని గాడు వెనక నుండి ఆ ఆగంతకుడి మెడ పైన కర్ర పెట్టి వెనక్కి లాగుతూ,ఎవరు రా నువ్వు చెప్పు అంటూ గద్దించాడు…

వాడు అల్లాడిపోయాడు మెడ చుట్టూ బలంగా కర్ర బిగుసుకుపోవడంతో,ఒరేయ్ నిన్ను చంపేదాకా వదలను రా అంటూ నాని గాడి పట్టుని విడిపించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు.

మంజులా దేవి ముందుకు కదిలి మరింత బలంగా వాడి దవడ పండ్లు బయటికి వచ్చేలా కొట్టింది ఊ చెప్పు అంటూ..

అయినా వాడు నోరు మెదపకపోయేసరికి మంజులా మళ్లీ రెండు దెబ్బలు బలంగా వేసింది..

అప్పటికే ప్రసాద్ మామ తేరుకొని వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పడు, వాడిని ఏదో ఒక చెట్టుకి కట్టేయ్యండి. జరిగిందంతా నేను చెప్తాను అనేసరికి నేనూ వెళ్లి వాడిని పొదల్లోకి తీసుకెళ్లి కట్టేసి ప్రసాద్ మామ దగ్గరికి వచ్చాము..

ఏమైంది మామా అని అడగ్గా, ఒరేయ్ సంజయ్ ఈ “శృంగార మధనం” లో ఒక పొరపాటు జరిగింది రా అన్నాడు నాకు మైండ్ తిరిగిపోయేలా..

ఏంది మామా నువ్వనేది??పొరపాటు జరగడమా??అస్సలు ఛాన్సే లేదు గా.అందరూ హ్యాపీ గా పైకెళ్లిపోయారు.. ఇక ఎక్కడ పొరపాటు జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాను..

నిజమే రా నువ్వన్నది,కానీ మాతో పాటూ పైకొచ్చింది “రాజసింహుడు” కాదు రా అన్నాడు మరింత ఆశ్చర్యం కి లోనయ్యేలా..

రాజసింహుడు కాదా???మరెవరు మామా??(ఆందోళనతో అడిగాను).

“గుహుడు”..

గుహుడా???ఏదీ ఆ రాక్షసుడు..జ్యోతిరాదిత్యుడు యొక్క దుష్ట గురువు నా??

అవును సంజయ్,వాళ్ళిద్దరి మాయలతో మన రాజసింహుడిని బోల్తా కొట్టించారు…

అర్థం అవ్వలేదు మామా,అయినా ఆ మాయావి అంతం అవుతున్నప్పుడు నా ముందే గా రాజసింహుడు విజయగర్వంతో కనిపించాడు, అలాంటప్పుడు గుహుడు ఎలా వెళ్లగలిగాడు??

నిజమే కానీ అసలు విషయం వేరేలా ఉంది సంజయ్,ఆ జ్యోతిరాదిత్యుడు మన రాజసింహుడిని అంతం చేయలేక నిస్సహాయుడిగా ఉన్న తరుణంలో ఈ గుహుడు అతనికి ఒక దుష్ట తంత్రాన్ని ఉపదేశించి ఇలా చేసాడు..

మామా అంతా అగమ్యగోచరంగా అనిపిస్తోంది, ఆ గుహుడు ని మన భేతాళుడు(రాజన్న) అంతమొందించాడు అని చెప్పారు,మరి వాడెలా జ్యోతిరాదిత్యుడు కి సహాయం చేయగలడు??

అక్కడే పొరపాటు జరిగింది సంజయ్,అంతం అయ్యాడు అని భావించి భేతాళుడు తిరిగొచ్చేసాడు..కానీ కొన ఊపిరితో ఉన్న వాడు ఎలాగో బయటపడి ఇంత దారుణానికి ఒడిగట్టాడు..