దీన్ని కవ్వించడం అంటారో, అభిమానించడం అంటారో తెలీదు రా సంజూ,నిజానికి ఇలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ నా జీవితంలో కలగలేదు..ఎందుకో చాలా పద్దతిగా ఉంది నీ బిహేవియర్..నీ మాటలూ,నడవడిక మనసుకు ఉల్లాసాన్ని ఇస్తూ తెగ సంతోషాన్ని కలుగజేస్తున్నాయి.ఇప్పుడు అర్థం అయ్యింది నాకు నిప్పులాంటి మంజూ నిన్నెందుకు అభిమానిస్తుందో అని..పొరపాటున కూడా నన్ను అలా చేయకు రా ప్లీజ్ అంటూ ముద్దుగా బ్రతిమలాడింది..
హ హ్హా ప్రవీణ మేడం,నువ్వు ఇంకా చిన్న పిల్లవే నిజానికి…నన్ను అలా చేయొద్దు చేయొద్దు అంటూనే నీ సమ్మతాన్ని తెలియజేస్తున్నావ్..ఇంత మొద్దు వి ఏంటి నువ్వు అంటూ అప్పటికే ఎరుపెక్కిన ఆమె బుగ్గ పైన నా చూపుడు వేలుతో రాసాను స్మూత్ గా..
హబ్బా ఆపు రా నీ చేష్టలు,ప్లీజ్ రా నన్ను నీ మాయ మాటలతో లొంగిపోయేలా మాత్రం చేయకు నీకు పుణ్యం ఉంటుంది.
పిచ్చి మేడం,ఇదిగో ఆడది పరిపూర్ణంగా నన్ను ఇష్టపడి వస్తేనే మరొక్కసారి ఆలోచించు అనే మనస్తత్వం నాది..అలాంటప్పుడు ఇష్టం లేని ఆడదాన్ని ఎలా ఇబ్బంది పెడతాను అనుకున్నావ్?నిశ్చింతగా ఉండు నేనేమీ నీకు ఇబ్బంది కలిగించను. ఏమంటే కాస్తా టీజ్ మాత్రం చేస్తాను బాగా నచ్చావ్ కాబట్టి అన్నాను నిజాయితీగా..
నువ్వు నిజంగా నిఖార్సయిన మగాడివి రా సంజూ,నీలాంటి మగాడి చేతిలో నలిగే ఏ ఆడదైనా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి.. మా మంజూ కి ఆ అదృష్టం కలిగింది..నాకూ ఆ అదృష్టం ఉంటుందో లేదో అంటూ ప్రేమగా నా ఛాతీ పైన తన తల పెట్టి సేదతీరింది..
తన తలని నిమురుతూ, ప్రవీణ మేడం మనసుకి ఎల్లప్పుడూ కళ్లెం వేసి బ్రతకకూడదు ఏ మనిషైనా,తప్పొప్పులు సహజం మానవ జీవితంలో కానీ ప్రతి దానికీ ఒక పరిమితి అనేది ఉంటుంది, ఆ పరిమితి దాటి మనం ఎప్పుడూ వెళ్లకూడదు..పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మనసుకి నచ్చినట్లు ఉండు అదే సంతోషం అన్నాను..
వయసులో చిన్నవాడివైనా ఎంత పరిణితి ఉంది రా నీ దగ్గర,నిజానికి నీలాంటి మనిషిని ఏ ఆడదైనా కోరుకోకుండా ఉంటుందా???ఇన్నాళ్ళకి నా జీవితంలో ఒక్క నిఖార్సయిన మగాడు తారసపడ్డాడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది రా నీ కౌగిలిలో.. నీ కౌగిలి అమ్మ కౌగిలిలా ప్రేమగానూ,నాన్న కౌగిలిలా ధైర్యంగానూ ఉంది అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో నన్ను హత్తుకుపోయింది..
పక్క సీట్ లో ఉన్న జనాలు చూసినా పెద్దగా పట్టించుకోకపోవడంతో,ఇక లెగు మేడం జనాలు మనల్నే చూస్తున్నారు అంటూ తనని పైకి లేపాను..
సిగ్గుగా చెమ్మగిల్లిన కళ్ళతో ఇక లెగు మనం దిగే చోటు కూడా వచ్చేసింది అంటూ బ్యాగ్ తీసుకుంది…తన బ్యాగ్ ని తీసుకొని చొరవగా నువ్వు ముందు వెళ్ళు అంటూ ఆమెను ఫాలో అయ్యాను..
నిజానికి ప్రవీణ మనస్తత్వం చాలా బాగా నచ్చింది..ఏ మాత్రం భేషజాలు లేని ఆమె చిన్నపిల్లలాంటి మనస్తత్వం నాకు ఆమె పైన అభిమానం కలిగేలా చేసింది..
బస్ దిగాక ఆటోని పిలిచి అందులోకి ఎక్కి మంజులా దేవి ఊరు వైపు పయనం కొనసాగించాము.. ఆటో లో వెళ్తున్న సమయంలో నన్ను మాత్రం తదేకంగా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది.అప్పుడప్పుడు నేను నవ్వుతూ ఆమె చూపులని పసిగట్టి మొటిక్కాయలు వేస్తూ వచ్చాను..
మొత్తానికి ఒక 20 నిమిషాల ప్రయాణం తర్వాత ప్రవీణ మాట్లాడుతూ ఇదే రా మా ఊరు,నెక్స్ట్ వచ్చే ఊరే మంజూ ది అనేసరికి మీ ఇంటికి వెళ్లి వెళ్దాం పద అన్నాను..
అదిగో అక్కడ కనిపించే మాడీ నే మాది,ముందు మంజూ దగ్గరకు వెళ్దాం పద అక్కడ చాలా విషయాలు తెలుసుకోవాలి అంది.సరేలే అని బయలుదేరిన ఒక 10 నిమిషాలకి ఒక ఇంటి ముందు ఆటో నిలబెట్టు అని ప్రవీణ అనడంతో ఇద్దరమూ ఆటో కి మీటర్ ఇచ్చి గేట్ తీసుకుంటూ లోపలికి వెళ్ళాము..
ఒరేయ్ సంజూ నువ్వు కాస్తా అటువైపు ఉండు రా మంజూ కి కాస్తా సర్ప్రైజ్ ఇద్దాం అంటూ అనేసరికి కాస్తా చెట్టు చాటుకి వెళ్ళాను..కాలింగ్ బెల్ కొట్టిన నిమిషానికి తలుపు తెరిచిన మంజులా ని చూడగానే నాకు మహదానందంగా అనిపించింది..అప్పుడే ఫ్రెష్ గా తలస్నానం చేసింది అనుకుంటా తన మోకాళ్ళ వరకూ ఉన్న వెంట్రుకలని ముందు వైపు వేసుకొని తడి ఆరబెట్టుకుంటూ ఒసేయ్ ప్రవీ రావే లోపలికి అంది..
హబ్బా వస్తాలే వే నీకో విషయం చెప్పాలి,నీ సంజయ్ గాడిని వలలో వేసుకున్నానే తెలుసా అంది నాకు ఆశ్చర్యం ని కలిగిస్తూ..
నీ బొంద లేవే దొంగదానా,వాడిని నువ్వు వలలో వేసుకోవడం ఏంటి మతి ఉండే మాట్లాడుతున్నావా??నీ వల్ల అయినా నువ్వు చేయగలవా అన్న మంజులా మాటకి సైలెంట్ అయిపోయింది ప్రవీణ ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా..
కాస్తా నిరాశ నిండిన మొహంతో నిజమే కదే,ఇంతకీ నీకో గిఫ్ట్ తెచ్చాను చూస్తావా అంది.
హబ్బా లోపలికి రావే తర్వాత చూపిద్దువు గానీ నీ గిఫ్ట్ ఏంటో అంటూ విసుక్కుంది మంజులా..
ఒసేయ్ మెంటల్ దానా నేను తెచ్చిన గిఫ్ట్ ని చూపిస్తే ఆనందంతో ఎగిరి గంతేసి నాకు ముద్దు పెడతావ్ తెలుసా అంది ప్రవీణ మహా గొప్పగా.
ఓహో ఏంటే ఆ గిఫ్ట్ ఏదీ చూపించు అనేసరికి ఒరేయ్ సంజూ అని నన్ను పిలవడం నేను మంజులా ముందు నిలబడటం జరిగాయి..
మంజులా ఒక్కసారిగా ఆనందంతో ఎగిరి గంతేసి నన్ను హత్తుకొని నా చెంపకి ముద్దు పెట్టింది ఒరేయ్ సంజయ్ గా ఎలా ఉన్నావ్ అంటూ.
నేను బాగానే ఉన్నాలే గానీ,ముందు నీ ఫ్రెండ్ ని పట్టించుకో పాపం తనకి ముద్దు పెట్టలేదని తెగ ఫీల్ అవుతోంది అన్నాను నవ్వుతూ.
నిజంగానే ప్రవీణ బుంగమూతి పెట్టుకొని కోపంగా మంజులా ని చూస్తోంది…
హ హ్హా సంజయ్ గా భలే చెప్పావ్ అంటూ ఒసేయ్ ప్రవీ నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వి అంటూ గట్టిగా వాటేసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టింది ప్రవీణ కి..
ప్రవీణ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై ఇక చాలు లేవే ఆపు అంటూ ఇంట్లోకి వెళ్ళాము..ఇంట్లో ఎవరూ లేక నిర్మానుష్యంగా ఉండటంతో ఏంటి మంజులా మేడం ఎవరూ లేరు ఇంట్లో అన్నాను.
ఒరేయ్ సంజూ ఎవరూ ఉండరు ఈ ఇంట్లో తనొక్కతే ఉంటుంది అంది ప్రవీణ.
నేను మంజులా దగ్గరకు వెళ్లి,ఏంటి ఇది ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉంటున్నావ్?నాతో పాటు అక్కడే ఉండకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అని ప్రేమగా అడిగేసరికి ఒక్కసారిగా ఏడుపు అందుకొని నన్ను హత్తుకుపోయి,నిన్ను మాత్రం వదిలి నేను ఎలా ఉంటాను అనుకున్నావ్ రా??తప్పలేదు నాకు అందుకే ఇలా ఒంటరిగా బ్రతుకుతూ కాలం వెళ్లదీస్తున్నా అంటూ గద్గద స్వరంతో మాట్లాడింది.
హబ్బా వదులు ఏంటే చిన్నపిల్లలా నువ్వు?ఇక నేనొచ్చాను గా నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అంటూ ధైర్యం చెప్పి ఏదో ఒకటి వండు త్వరగా కాస్తా ఆకలిగా ఉంది అంటూ బాత్రూమ్ వెళ్లి ఫ్రెషప్ అయ్యి వచ్చి అప్పటికే ఇద్దరూ కిచెన్ లో దూరడం వల్ల కిచెన్ లోకి వెళ్ళాను.
వెళ్లిన వెంటనే ఒరేయ్ సంజయ్ ఈ ప్రవీణ ఎక్కడ తగిలింది రా నీకూ అని అడగడంతో జరిగిందంతా చెప్పాను.
హ్మ్మ్ ఇప్పటికైనా అర్థం అయిందటే వాడి గురించి నీకు??
బాగా అర్థం ఐందిలేవే ,నువ్వు చెప్తే ఏమో అనుకున్నా గానీ సంజయ్ గాడు నిజంగా వజ్రమే మంజూ, నీకు వీడితో సాన్నిహిత్యం లభించింది అంటే నిజంగా నాకు అసూయగా ఉంది అంది.
దానిదేముంది లే ప్రవీణ మేడం మీకూ వచ్చేసినట్లే గా నాతో సాన్నిహిత్యం అంటూ నవ్వాను…
నా మాటకి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కాస్తంత బాధతో..వాళ్ళ వాలకం నాకు అనుమానంని రేకెత్తించింది..
ఉండబట్టలేక మంజులా మేడం ఒకటి అడుగుతాను అబద్ధం చెప్పకుండా నాకు చెప్తావా అన్నాను..
నీకేంటి రా అడ్డం అడుగు ఏంటో??
ఇంతకీ ప్రవీణ మేడం సంగతి ఏంటి??వచ్చినప్పుడు నుంచీ చూస్తున్నా నువ్వు అనే ప్రతి మాటకీ సమాధానమే తన దగ్గర లేదు..ఏమైంది తను అస్సలు నన్ను ఏమీ చేయొద్దు అని బ్రతిమాలడటం ఏంటి విచిత్రంగా??అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాను..
నా ప్రశ్నలకి సమాధానమే లేకపోయింది మంజులా దగ్గర,అదీ అదీ అంటూ నసుగుతుంటే ప్రవీణ మాత్రం ఆగు అంటూ సైగలు చేస్తోంది మంజూ కి..
మాటిచ్చావ్ చెప్పకుండా అలా ఉన్నావేంటి అని గద్దించాను…
ఒరేయ్ సంజయ్ ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నావ్? దాని సమస్య ఏమనుకున్నావ్? అంది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.
వాళ్ళిద్దరి వైపు అనుమానంగా చూస్తూ ఎవరు ఈ ప్రవీణ అన్నాను..
ఒరేయ్ ఇప్పుడు అవన్నీ నీకు అవసరమా చెప్పు??
మంజులా నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను..ప్రవీణ మంచితనంని చూసిన వాడిని,తనకి సమస్య అంటే ఎలా ఊరుకోవాలి??ఏంటో చెప్పు..
నువ్వొచ్చిన పని ఏంటో నాకు తెలుసు రా అంది సింపుల్ గా..
నీకెలా తెలుసే మంజూ??
ఏ రోజైనా నువ్వు వస్తావు అన్న ఆశ నాకు ఉంది, ఇదిగో ఇప్పుడు కుదిరింది ముహూర్తం… అయినా ప్రవీణ సమస్య ని తీర్చే అంత శక్తులు ఇప్పుడు నీ దగ్గర లేవు అన్నది గుర్తుపెట్టుకో..
ముందు సమస్య ఏంటి?ఇంతకీ తనెవరో చెప్పు.ఆ తర్వాత ఆలోచిద్దాం..
తను జ్యోతిరాదిత్యుడి శాపానికి గురైన మీ సరోజ స్వయానా అక్క…
ఏంటీ సరోజా కి అక్క నా ప్రవీణ???అయినా ఆ మాయావి అంతం అయ్యాడు గా..మళ్లీ శాపం ఏంటి విచిత్రంగా?(నాకు ఆశ్చర్యం అవధులు దాటింది).
నువ్వు విన్నది నిజమేరా తను స్వయానా మీ మామ ప్రసాద్ కూతురు,చిన్నప్పుడే ప్రసాద్ తమ్ముడు సంరక్షణలో పెరిగింది..ఈ విషయం ఎవ్వరికీ తెలియదు..
అదేంటే ప్రసాద్ మామ కి సంతానమే లేనప్పుడు ప్రవీణ ఎలా తన కూతురు అవుతుంది???
నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి రా సంజూ,ప్రసాద్ జాడ తెలిసేవరకూ మన సమస్యలకి పరిష్కారమే కనిపించడం లేదు..దీని వెనకాల ఏదో పెద్ద తతంగమే జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది.. ఆ మాయావి అంతం అయినా వాడి శాపానికి గురైన వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది..
అదేంటే ప్రవీణ శాపానికి గురవడం ఏంటే అస్సలు అర్థం అవ్వలేదు,చాలా టెన్షన్ గా ఉంది ఏమైందో చెప్పు అంటూ దగ్గరకు వెళ్లి గద్దించి అడిగాను..
నువ్వు టెన్షన్ పడకురా నేను చెప్తాను అంటూ, మీ ప్రసాద్ మామ సామాన్యుడు అని ఎలా అనుకుంటున్నావ్??ఆయన ఈ మట్లి రాజ్యపు సకల సంరక్షకుడు అంటూ బాంబ్ పేల్చింది ఒక్కసారిగా నా మైండ్ గిర్రున తిరిగేలా..
మంజూ అంతా కొత్తగా వుందే, ఏమంటున్నావ్ నువ్వు??ఆయన సంరక్షకుడు అయితే సాధ్విల చరిత్ర పుస్తకంలో అస్సలు కనిపించనే లేదు కదే,ఇదెలా నమ్మాలి???