రొమాంటిక్ చర్చ్నింగ్ 31 57

ఒక్క రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ముక్కుపుటాలకి సాంబ్రాణి వాసన తీయగా కలిగిస్తూ..అప్పుడే తలస్నానం చేసిందేమో వెంట్రుకలకి సాంబ్రాణి పొగ పట్టించుకుంటూ రావయ్యా సంజయ్ అంటూ ఇంట్లోకి నవ్వుతూ ఆహ్వానించింది..

అత్తయ్యా, రాజు గారు పంపించారు అని కాస్తా బెరుకుగానే అన్నాను..

హో అవునా,ఇంతకీ ఏంటట పని అంటూ నవ్వుతూ అడిగింది..

ఏదో మీకు కంపెనీ ఇవ్వమని,కాస్తా తోడుగా ఉండమని చెప్పారు…

హ హ్హా అవునా??ఆయనకి ఎప్పుడూ నా గురించే ధ్యాస,పోనీలే ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా???

తిన్నాను అత్తయ్యా..

అయ్యో సంజయ్,నువ్వు నన్ను పొద్దస్తమానమూ అత్తయ్యా అని పిలుస్తూ నన్ను పెద్దదాన్ని చేయకయ్యా అంటూ మనోహరంగా నవ్వింది..

రాజు గారు నాకు మామయ్య గా ఇక మిమ్మల్ని అత్తయ్య అని కాకుండా ఎలా పిలవాలి???

హ్మ్మ్ నీ వయసెంత సంజయ్??

20 సంవత్సరాలు అత్తయ్యా.

నాకు 22 సంవత్సరాలు సంజయ్,ఒక్క రెండు సంవత్సరాలు పెద్ద అయినంత మాత్రాన నన్ను అత్తా అని పిలవడం ఏమీ బాగోలేదు…

అయ్యో అలాకాదు, ఇంకెలా పిలవాలో తెలియక…అంటూ నసిగాను.

దానిదేముంది ఎంచక్కా రాధికా అని పిలువు అంది..

పెద్దవాళ్ళు గా నా వల్ల కాదు,అత్తా అనే పిలుస్తాను మీరు ఏమి అనుకున్నా సరే..

నీ ఇష్టం అయ్యా బాబూ,నువ్వు మాట వినేలా మాత్రం లేవు అంటూ నవ్వింది..

అలా ఏమీలేదు,పెద్దవాళ్ళు గా పేరు పెట్టి పిలవడం అంత బాగోదు అని నా ఉద్దేశ్యం..

ఆహా అలాగని వయసుకి తగ్గ పిలుపుతో కాకుండా పెద్ద పెద్ద పదాలతో పిలుస్తూ నా వయస్సుని పెద్దగా చేసేస్తున్నావ్ సంజయ్..

అయ్యో అవునా,సరేలే అలాగైతే రాధికా అనే పిలుస్తాను అన్నా.

సంతోషం సంజయ్,ఒక్క పది నిమిషాలు ఆగవా టిఫిన్ అవుతోంది,ఇద్దరమూ కలిసి తిందాము అంది.

నాకేమీ వద్దు రాధికా గారు,మీరు కానివ్వండి నేను వెయిట్ చేస్తాను అన్నాను..

ఓకే ఓకే సరే అంటూ లోపలికి వెళ్ళి ఒక 15 నిమిషాల తర్వాత వచ్చింది హాల్ లోకి.ఆమెని చూస్తుంటే మనసంతా ఆనందంతో పులకించిపోతోంది…

ఆమె ముఖవర్ఛస్సు మాత్రం దేవతలా అనిపిస్తూ,ఆమె పైన ఎలాంటి చెడు భావనా కలగకుండా మనసుకి కళ్లెం వేస్తోంది…పాలరాతి లాంటి ఆమె శరీర వర్ణం,దేవతమూర్తి లాంటి ఆమె ముఖారవిందం, నిలువెత్తు విగ్రహం లాంటి ఆమె రూపం ఇవన్నీ మనసుని పావనం చేస్తున్నాయే తప్ప ఎలాంటి చెడు కోరిక కలగనివ్వడం లేదు..ఇప్పటి వరకూ ఎందరినో చూసినా ఏ మూలో ఒకచోట కామ కోరిక కలగడం జరిగింది…సువర్ణ ని తొలిసారి చూడటానికి వచ్చినప్పుడు కనిపించిన రాధికని చూసినప్పుడు కోరిక మాత్రం కలిగింది కానీ ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే మాత్రం ఆమె పైన అభిమానం తప్ప మరే భావనా కలగడం లేదు..

ఏంటయ్యా సంజయ్,నీ గురించి మీ మావయ్య మాత్రం భలే చెప్తుంటాడు,ఏమి చేసావ్ అంతగా???

అబ్బే ఏమీలేదండీ రాధిక గారు,ఏదో ఆయన అభిమానం అంతేనూ..

అద్దో అలా గారు,అండీ అని పిలవకు దేవుడూ,నేనూ నీ జతే అనుకొని నాతో కాస్తా ఫ్రీ గా ఉండు సరేనా.

సరేలే రాధికా,ఇంతకీ ఏమి చెప్పాడు మావయ్య నీకు??.

వామ్మో అదో పెద్ద కథలే బాబూ,ఇప్పుడు చెప్పలేను.. ఏదో నీ వల్లే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని మాత్రం అర్థమైంది ఆయన మాటల వల్ల..

హ్మ్మ్ అంతలేదులే గానీ,ఇంతకీ మీ ఊరు ఎక్కడ రాధికా??

పక్కనే “పగడాల కోట”,పేరు వినే వుంటావ్ మా ఊరి కోట గురించి..

హా విన్నాను,చాలా బాగుంటుంది అంటగా ఆ కోట…

అవును,ఆ అందాన్ని వర్ణించడానికి మాటలు మాత్రం చాలవు సంజయ్.ఈసారి మా ఊరికి వెళ్తే మాత్రం నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను..

అలాగే థాంక్యూ మేడం అని నవ్వాను..

ఏమయ్యా సంజయ్,కంపెనీ అని వచ్చావ్ కానీ ఏమీ మాట్లాడకుండా అలా రాయిలాగా కూర్చున్నావ్ ఏంటి??

అబ్బే ఏమీలేదు,కాస్తా కొత్తగా మేడం అందుకే.

హ హ్హా బాగుందయ్యా నీ వరస,సరేలే గానీ ఎందుకు చదువు ఆపేసావ్??మంచి తెలివైన వాడివి అంట గా ఆపడం ఎందుకు

ఎందుకులే రాధీ,ఉన్నది ఒక్కడినే..ఇదిగో ఈ ఆస్తులన్నీ కాపాడుకోవడానికి నన్ను మాత్రం చదువు ఆపేయమని చెప్పారు ఇంట్లో,అందులోనూ అమ్మానాన్న లని చూసుకోవడానికి నేనే గా ఉండేది అందుకే ఆపేసాను..

ఆహా మంచి మనసే రా నీది,రాధీ అని మా అమ్మ పిలిచేది,నువ్వలా పిలుస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది సంజయ్..

అవునా అయితే ఇక నుండి అలాగే పిలుస్తానులే రాధీ అన్నాను నవ్వుతూ.

హ్మ్మ్ అలాగే పిలువు మనసుకి సంతోషంగా అనిపిస్తుంది, ఇంతకీ ఈ చుట్టుపక్కల నీకు పెద్ద ఫాలోయింగ్ అంట నిజమేనా?

హ హ్హా రాధీ ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ??

హబ్బా ఆడ మనిషిని ఆ మాత్రం తెలుసుకోలేనా??చుట్టుపక్కల అమ్మలక్కలు ఏదో ఒక టైం లో నీ ప్రస్తావన తెస్తారు,అలా అన్న వెంటనే మీ మావయ్య ని అడిగా నీ గురించి.. అప్పుడు ఆ అమ్మలక్కలు చెప్పినదాని కన్నా ఎక్కువ చెప్పారు నీ గురించి.. అప్పుడు అర్థం అయింది నీ గురించి..

హ హ్హా అలా ఏమీలేదులే రాధీ,ఏదో చిన్న పని చేయడం వల్ల ఇలా మంచి పేరు అంతే తప్ప ఏమీలేదు..

ఇంత సింపుల్ గా ఉంటావని మాత్రం తెలియదు,అయినా నువ్వు చాలా పద్దతిగా ఉన్నావ్ సంజయ్ ఇదే ఎక్కువ నచ్చేది నీలో అందరికీ..

హ్మ్మ్ ఏదో మీ అభిమానం అని అన్నానో లేదో,రాధికా అక్కా అంటూ ఎవరో ఆడ మనిషి డోర్ కొట్టడం మొదలెట్టింది..ఎక్కడో ఆ వాయిస్ విన్నట్లు గుర్తు..

ఇప్పుడే వస్తాను అంటూ డోర్ తీసిన నాకు ఎదురుగా సువర్ణ కనిపించింది ఆశ్చర్యం కి లోనయ్యేలా..ఇద్దరూ హాల్ లోకి వచ్చి కూర్చున్నాక సువర్ణ ఏంటీ ఇక్కడ అన్నట్లుగా సైగ చేసింది.

నేను సమాధానం చెప్పేలోగా,ఒసేయ్ సువర్ణా ఇతను సంజయ్ నే పక్కూరిలో ఉంటాడు మాకు కాస్తా కావాల్సినవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అంటూ ఉపోద్ఘాతం మొదలెట్టగా, హబ్బా అక్కా నాకు తెలుసులే సంజయ్ గురించి,వాళ్ళ ఫ్రెండ్ నాని పెళ్లి చేసుకుంది మా ఫ్రెండ్ రచనని, అందుకే కాస్తా ముఖ పరిచయం అంటూ నవ్వింది.

హబ్బో చూసావట రా,నీ గురించి ముందే తెలుసంట అంటూ రాధికా అనడంతో, నాకు కూడా బాగా తెలుసు తను, మా నాని గాడి పెళ్లి అయ్యేలా సహకరించింది సువర్ణా నే గా అన్నాను.

హ్మ్మ్ బాగుంది లే మీ వరస,ఇంతకీ ఏంటే కాలేజ్ కి డుమ్మా కొట్టేసావ్??

హబ్బా ఒక పది రోజులు ఏదో టూర్ వెళ్తున్నారే అక్కా,మనకు ఇష్టం ఉండవు అవన్నీ అందుకే ఎంచక్కా ఇంట్లో ఉండిపోయాను.

హ్మ్మ్ అయితే ఒక పది రోజులు నాకు మంచి కంపెనీ అన్నమాట నువ్వూ సంజయ్ ఇద్దరూ..

అదేంటీ సంజయ్ కూడా నీకు కంపెనీ నా అంటూ ఆశ్చర్యం గా చూసింది..

అవునే మీ అంకుల్ పనిగట్టుకుని మరీ సంజయ్ ని పురమాయించాడు నాకు కంపెనీ ఇవ్వమని,పాపం తనకి ఇష్టం ఉందో లేదో ఇలా ఆడాళ్లతో మాటలు ఏంటి అని అంటూ నా వైపు చూసింది నవ్వేస్తూ.

హ హ్హా అలా ఏమీలేదులే రాధీ,నువ్వేమీ ఫీల్ అవకు అన్నాను..

హమ్మయ్యా చాలు లే ఆ మాట,అయినా ఈ వయసు కుర్రాళ్ళు ఏదో అమ్మాయిలకు సైట్ వేస్తూ ఉంటారు గా అందుకే ఫీల్ అవుతున్నాను నా వల్ల నీ పనికి ఇబ్బంది కలుగుతుందో ఏమో అని..

అక్కా భలేదానివే నువ్వూ,సంజయ్ ఆ టైప్ కాదు నాకు బాగా తెలుసు…

నీకెలా తెలుసే???

ఎలా అంటే,మా ఫ్రెండ్స్ లో ఒక నలుగురు అయిదుగురు మనోడికి ఫుల్లుగా లైన్ వేస్తున్నా అస్సలు పట్టించుకోకుండా ఉన్నాడని తెగ వాపోయారు అందుకే చెప్తున్నా..