రొమాంటిక్ చర్చ్నింగ్ 31 57

హ హ్హా నీ తెలివితేటలు నీ ప్రశ్నల్లోనే తెలుస్తున్నాయి మధనా,అందులకే దైవాలకి నువ్వే ఒక మంచి ఎంపిక అయ్యావు…ఇది విశ్వ జననం,విశ్వ అంతాలకి సంబంధించిన అంశం…నీ సందేహానికి సరిగ్గా అర్థం అయ్యేలా చెప్తాను శ్రద్ధగా విను అంటూ మొదలెట్టారు పండితులు…

ఈ విశ్వం ఎలా మొదలయ్యిందో నీకు తెలుసా మధనా???

లేదు పండితా…

ఓమ్ శబ్దంతో మొదలయిన ఈ విశ్వ వ్యాప్తి తొలుత మధనంతోనే పరిపూర్ణంగా వ్యాప్తి చెందింది దేవతల సృష్టి జరిగి…ఇందులో నీకు బోధపడవలసిన అంశం ఏంటంటే మధనం ఒక్కటే ఈ సకల లోకాలని వ్యాప్తి చెందేలా చేసిన అంశం..

అర్థం అయ్యింది పండితా,అది నిజమే మధనం వల్లనే ఈ భూలోకం కూడా కొనసాగుతోంది కొత్త జననాలు, పాత మరణాలతో. కానీ ఇప్పుడు నేను కొత్తగా మధనం చేయాల్సిన అవసరం ఏంటన్నదే నా సందేహం..

అక్కడికే వస్తున్నా మధనా అంటూ కాసేపు దైవారాధనలో మునిగిపోయి,మధనా ఇప్పుడు సకల లోకాలలో మధనం అన్నదే జరగకుండా చేసే దుష్ట ప్రయత్నం ఒక్కటి జరుగుతోంది దాన్ని ఆపడానికే నీ మధనం కొనసాగాలి..

ఆశ్చర్యం గా ఉంది పండితా,ముక్కోటి దేవతల వల్ల జరగని పని ఏమైనా ఉంటుందా???ఆశ్చర్యం గా ఈ పని నాతో చేయించడం ఏంటి???

దేవతలు సకల లోకాలకు రక్షకులు,కానీ దేవతలు కూడా నిస్సహాయులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని నీకు తెలియనిది కాదు…

నిజమే పండితా,కానీ అంత ఉపద్రవం ఏంటన్నదో అర్థం కాకుండా ఉన్నది…

రాక్షసులు ఎల్లప్పుడూ దేవతల పైన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు అన్నది నీకు తెలిసిన విషయమే,అందులో భాగంగానే ఈ సకల చరాచర జీవులని తన గుప్పెట పెట్టుకొని శాసించే శక్తి గల ఒక రాక్షసుడు పుట్టుకొచ్చి ఈ ఉపద్రవం ని తెచ్చాడు…ఈ ఉపద్రవం లో నుండి బయట పడే మార్గం బోధపడక అన్ని లోకాల్లో అతి సుందరమైన భూలోకం లో ఈ ఉపద్రవంకి సంబంధించిన పరిష్కార మార్గం కనుగొనబడింది నీ రూపంలో అందులకే ఈ మధనం..

బహు ఆశ్చర్యం గా ఉంది పండితా,దేవతల లోకాల్లో లేని పరిష్కారం మన భూలోకం లో ఉందా??

అవును మధనా,నువ్వు విన్నది అక్షర సత్యం..ఈ లోకంలోనే ఉపద్రవం మొదలైంది అందుకు గానూ ఈ లోకంలోనే పరిష్కారం జరగాలి లేకుంటే విశ్వ అంతం జరగక మానదు ప్రత్యుత్పత్తి జరగకుండా ఆగిపోయి..

ఈ లోకంలో మొదలైందా ఉపద్రవం??? ఈ లోకంలో దేవతల శక్తిని ఎదిరించి నిలబడే శక్తిమంతుడు ఎవ్వరు పండితా????

“గుహుడు”, మహా శక్తిమంతుడు,జిత్తులమారి.. వాడి అంతం జరిగింది అని మురిసిపోయిన దేవతలకే మాయ చేసి మళ్లీ భూమి పైన ప్రత్యక్షం అయ్యాడు సకల దేవతలను తన కనుసైగతో శాసించే శక్తితో…

ఎవరూ గుహుడా??

అవును మధనా,వాడే ఇప్పుడు ఈ పద్నాలుగు లోకాలను అంతం చేయగల శక్తిశాలి…వాడికి అపార శక్తులు లభించాయి ఒక చిన్న పొరపాటు వల్ల..ఈ ఉపద్రవం ని ఆపాలంటే నీ ఒక్కడి వల్లే అవుతుంది అందుకే నీకు ఈ బాధ్యత అప్పజెప్పబడింది…

ఆశ్చర్యం గా ఉంది పండితా,వాడు సామాన్య మానవుడు అయిన భేతాళుడు చేతిలో చావుదెబ్బలు తిన్నవాడు,అలాంటోడు లోకాలని జయించే శక్తి సామర్థ్యాలను ఎలా సంపాదించాడో అర్థం కాకుండా ఉంది…

అదంతా ఒక మాయ మధనా,వాడు ఈ భూలోకంలోకి రాకముందే సకల లోకాలని గడగడలాడించిన శక్తిశాలి…

అలాంటప్పుడు వాడికి ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఏంటో అర్థం కావడంలేదు పండితా..

నీ సందేహానికి తిరుగులేని సమాధానం ఉంది మధనా,అసలు ఈ మానవ జాతిని దేవతలు ఎందుకు సృష్టించారో తెలుసా నీకు???

తెలియదు పండితా సెలవివ్వండి..

విశ్వరహస్యాల నియమావళి ప్రకారం ఇది చెప్పకూడని విషయం,కానీ చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది అందుకే చెప్తున్నాను…దేవతలు అమరులు అనగా మరణం లేని వాళ్ళు కానీ ఇందులో ఒక సహేతుక మినహాయింపు ఉంది..అదేంటంటే రాక్షసులకీ లోకాల పైన ఈ గుత్తాధిపత్యం అన్నది,రాక్షసులు ఎల్లప్పుడూ విశ్వఅంతం కోసం ప్రయత్నిస్తూ ఉండటంతో దేవతలు ఒక అద్భుతమైన సృష్టిని మానవ రూపంలో సృష్టించి వాళ్ళ ఆరాధనా బలంతో మరింత అమరులు అవుతున్నారు…ఇది తెలుసుకున్న గుహుడు దేవతలకు అపార బలాన్ని ఇస్తున్న భూలోకాన్ని అంతం చేయడానికి బయల్దేరి వచ్చాడు సాధారణ శక్తులతో.

ఈ భూలోకంలో వాడి శక్తులు ఏమీ పనిచేయకపోవడంతో దుష్ట శక్తులని మొత్తం ఏకం చేసి శక్తిని కేంద్రీకరించుకునే సమయంలో మన భేతాళుడు వాడి ప్రయత్నం ని వమ్ము చేసాడు… ఆ దెబ్బతో మరింత రెచ్చిపోయిన గుహుడు విశ్వ రహస్యాలని మొత్తం సుధాముడు దగ్గర ఉన్న పుస్తకం ద్వారా తెలుసుకొని తన వారసుడిగా ఆ జ్యోతిరాదిత్యుడు ని ఎంపిక చేసి తన శక్తులని మరింత వృద్ధి చేసుకోవడానికి మాయమై పోయి సరిగ్గా పౌర్ణమి రోజున రాజసింహుడు యొక్క శరీరంలోకి చేరి సామాన్య మానవ రూపుని సంతరించుకుని తన మాయలతో స్వర్గంలో అందరినీ బోల్తా కొట్టించి అశేష శక్తులతో ఈ భూలోకానికి తిరిగొచ్చాడు…

పండితా,వాడు మానవ రూపంలో వెళ్లి తిరిగి భూలోకానికి వచ్చినంత మాత్రాన శక్తులు ఎలా వస్తాయి???

నిజమే మధనా,వాడి శక్తులని మొత్తం భూలోకంలోనే వాడి శరీరంలో భద్రపరిచి అమరత్వం కోసం స్వర్గానికి వెళ్ళాడు…ఇప్పుడు దేవతలందరితో పాటూ అమరత్వం సిద్దించిన ఒకే ఒక రాక్షసుడు వాడు .

అర్థం అయ్యింది పండితా,అయితే అమరత్వం కోసం మాత్రం వాడు స్వర్గానికి వెళ్లి వచ్చాడు అంతే కదా??

అవును మధనా నువ్వన్నది నిజం.

మరి అమరత్వం కలిగిన వాడు అంటున్నారు,వాడికి అంతం ఎలా ఉంటుంది???

దానికీ ఒక మార్గం ఉంది మధనా,చెప్తాను విను….

దానికీ ఒక మార్గం ఉంది మధనా,చెప్తాను విను….

ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికీ అనుకూల,ప్రతికూల సమయాలు ఉంటాయన్నది నీకు తెలియని విషయం కాదు,ఇందులోనే ఒక జీవిత సత్యం ఉంది..ప్రతికూల సమయాల్లో నిలదొక్కుకున్న వాడు విజయుడు అవుతాడు.. అలాగే ఆ గుహుడికి ప్రతికూల సమయాలు రానున్న సంవత్సరం లో రెండు సార్లు ఉన్నాయి..ఆ సమయంలో నువ్వు గనక అప్రమత్తంగా ఉండి వాడిని ఎదిరిస్తే విజయం తప్పక వరిస్తుంది..

నిజమే పండితా కానీ సామాన్య మానవుడిని అయిన నేను అంత శక్తిమంతుడు తో ఎలా పోరాడగలను???

విజేత ఎల్లప్పుడూ బలాలని నమ్ముకొని విజయం సాధించడు మధనా,నువ్వు శక్తుల గురించి మదనపడవలసిన అవసరమే లేదు..నీకు విడతలవారీ గా శక్తులు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు తప్పకుండా ఉంటాయన్నది మరిచిపోకు..

అలాగే పండితా అంటూ రాత్రి వచ్చిన కల తాలూకు అనుభవాన్ని చెప్పాను..

నీకు వచ్చిన కల నిజం అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు మధనా,ధైర్యంగా ఉండు..

ఏంటి పండితా మీరు అంటున్నది???కల నిజమై మునుపటి మనుషులు అందరూ తిరిగొస్తారా???

అక్షరాలా తిరిగొస్తారు మధనా,కానీ ఈసారి వాళ్ళు వచ్చేది సామాన్య మానవుల రూపంలో,అది కూడా నీతో ముందు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉంటారు..

అంటే మట్లి సామ్రాజ్యం మిగతా సామ్రాజ్యాల తాలూకు గుర్తులు అన్నీ చెరిగిపోతాయా??

నిస్సందేహంగా ఆ తాలూకు జ్ఞాపకాలు నీకు తప్ప మరే మానవుడికి గుర్తు ఉండవు,ఈసారి వాళ్ళు అతి సాధారణ మనుషుల్లా ఈ భూమి పైకి వచ్చి మనలాగే ఒక సాధారణ మనిషిలా జీవితాన్ని గడుపుతారు.. ఇదంతా ఎందుకంటే ఆ 1100 సంవత్సరాల సమయంలో వాళ్ళు కోల్పోయిన జీవితాల్ని మళ్లీ అనుభవించేలా వరం పొందడం మూలాన వాళ్ళకి ఈ అవకాశం..

నాకు చాలా ఆనందం వేసింది వాళ్ళందరూ తిరిగొస్తారు అన్న మాటకి,అలాగే ఒక ఇబ్బంది కూడా కలిగింది వాళ్ళకి మధనం తాలూకు ఏ విషయాలూ గుర్తుండవు అన్న నియమంతో..

పండితా ఇంకనూ నేను ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా???

ఒక ముఖ్యమైన విషయం ఉంది మధనా,ఆ గుహుడు, జ్యోతిరాదిత్యుడు లకి అనుకూల సమయాలు ఉన్నప్పుడు నీకు ప్రతికూల సమయం నడుస్తుంది అలాగే వాళ్ళిద్దరికీ ప్రతికూల సమయం ఉన్నప్పుడు నీకు అనుకూల సమయం ఉంటుంది… విజేత కి ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే అనుకూల,ప్రతికూల సమయాలని నేర్పుగా ఎదుర్కోవడం…

అలాగే పండితా,వాళ్ళ ప్రతికూల సమయాలని అలాగే నా అనుకూల సమయాలని తెలుసుకునే మార్గం ఉంటుందా???