“మనదేశంలో ఇది వాళ్ళకి మొదటి వెంచర్ కాదు… ఇప్పటికే నార్త్ ఇండియాలో ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది… ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా చేద్దామనుకుంటున్నారు… నార్త్ ఇండియా ప్రాజెక్ట్ ని మన ప్రత్యర్థి సంస్థ XYZ వాళ్ళు చేశారు… ఇప్పుడు దీని కోసం మన పేరునూ పరిశీలించెలా చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది… ఇప్పడు మనకు ఒక అవకాశం లభించింది… మన ప్రత్యర్థి సంస్థతో పోటీలో నెగ్గేలా ఇప్పుడు మనం ప్రపోసల్ తయారు చేయాలి… ”
“నాకు అర్థమయ్యింది సర్…” అంది సంజన..
“ఇది ఒక BOT ప్రాజెక్ట్ సంజనా… అంటే BUILT-OPERATE-TRANSFER… దీని విదేశీ మాతృ సంస్థ ప్రతి పనినీ దగ్గరుండి చేసుకోలేదు… అందుకే అనుభవమున్న మనలాంటి వాళ్ల హెల్ప్ తీసుకుంటుంది..”
“ఓకే సర్”
“దీనికోసం MAS లోని చాలా విభాగాలని మనం సమన్వయం చేసుకోవలసి ఉంటుంది… కాంట్రాక్టు లోని రెండు భాగాలు ఐటీ తో ముడిపడి ఉన్నవే… మనకు వాటి గురించి బెంగలేదు… మరోభాగం పూర్తిగా construction కి సంబంధించినది… దీనికోసం మనం మరో సంస్థను కలుపుకోవాలి…”
సంజన మౌనంగా వింటుంది….
“సంజనా… ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో నీకేమైనా అర్థమయ్యిందా…” సీరియస్ గా చూస్తూ అడిగాడు ఆనంద్…
“యెస్ సర్” అంది సంజన
“గుడ్… నీ లోని కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది… ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా చేస్తే…. మరో మెట్టు పైకి ఎక్కగలవు నువ్వు… కాబట్టి శ్రద్ధగా పని చెయ్..”.
“ఓకే సర్”
“మనం ఇందులో మూడు భాగాలకి మూడు కోర్ టీమ్స్ తయారు చేసుకుందాం..”.
ఆనంద్ వైట్ బోర్డ్ దగ్గరకు వెళ్ళాడు… మార్కర్ తో రాస్తూ బిడ్ కి సంబంధించిన విషయాలు వివరిస్తున్నాడు..
దాదాపు రెండు గంటల సేపు వాళ్ళ చర్చలు జరిగాయి… సంజన బిడ్ కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంది… కానీ ఆనంద్ కి ఆ అంశాలమీద ఎంత లోతైన అవగాహన ఉందొ తెలుసుకొని ఆమె చాలా ఆశ్చర్యపోయింది..
రెండు గంటల తర్వాత….
“ఓకే సంజనా… ఇప్పుడు నాకు కాస్త బ్రేక్ కావాలి… నేను చేయాల్సిన ఇంకో పని కూడా ఉంది… సో.. మనం మళ్లీ లంచ్ తర్వాత మాట్లాడుకుందాం…” అన్నాడు ఆనంద్…
“ఓకే సర్…” అంటూ సంజన అక్కడ్నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యింది…
ఆనంద్ తాను ఇబ్బంది పడే విషయలేవీ ప్రస్తావించనందుకు ఆమెకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది… ఆమె బయల్దేరుతుంటే…
“సంజనా… నువ్ ఇంకొంచెం స్మార్ట్ గా డ్రస్ చేసుకోవాలి… మనం మన MAS కంపనీ VP లతో, కస్టమర్లతో చాలా మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది… చీరలైనా సరే.. లేదా. వెస్టర్న్ ఫార్మల్స్ అయినా సరే… కానీ నువ్ కొంచెం పోష్ గా కనబడాలి… నువ్ ఈ రోజు చేసుకున్న డ్రెస్సింగ్ అంత బాలేదు.. అన్నాడు సూటిగా …
“నేను కావాలనే ఇలా డ్రెస్ చేసుకున్నానని కనిపెట్టాడన్న మాట ముసలోడు… అంటే ఇప్పుడు నేను వాడికి అందంగా కనబడేలా రమ్మని చెబుతున్నాడా…” మనసులోనే అనుకుంది సంజన..
“ఓకే సర్… నేను ట్రై చేస్తాను..” గొణిగి నట్టుగా అంది సంజన..
“ఓకే మరి… లంచ్ అయ్యాక కలుద్దాం..” అన్నాడు ఆనంద్..
ఆ రోజు మధ్యాహ్నం సంజనా, ఆనంద్ .. బిడ్ మీద ఇంకా సీరియస్ గా డిస్కస్ చేశారు… సాయంత్రం వరకు వాళ్ళ డిస్కషన్ సాగింది…
దాదాపు 7pm అవుతుండగా ..
“సంజనా… నీకు ఆలస్యమౌతుంది… ఇంటికి వేళ్ళు… రేపు మనం మళ్లీ కొనసాగిద్దాం.. రేపు మనకు ఓ ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది… ఓకే నా.. బాయ్.. ఫర్ నౌ..” అన్నాడు ఆనంద్
“ఓకే సర్” అని చెప్పి ఆఫీస్ నుండి బయట పడింది సంజన…
ఆ రోజు ఆఫీసులో జరిగింది అంతా కలిసి సంజనలో ఆనంద్ పట్ల ఉన్న భావాన్ని మార్చేసింది… ఇప్పుడు ఆమెకు ఆనంద్ లో ఒక పెర్వేర్టెడ్ ముసలోడు కాకుండా విశేషమైన అనుభవం తో నిండిన మేధావి కనిపిస్తున్నాడు…
ఆమె ఆనంద్ అనుభవం గురించీ, ప్రాజెక్టు గురించీ ఆలోచిస్తూ ఇంటికి చేరింది…
“హే.. సంజూ.. ఎలా గడిచిందీ రోజు…” ఆతృతగా అడిగాడు వివేక్…
“బాగానే గడిచింది… పిల్లలేరి…” ఇల్లంతా నిశ్శబ్దం గా ఉండడం తో అడిగింది సంజన
“వాళ్ళు పైన రమేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు… ఏదో కిడ్స్ పార్టీ ఉందట… ఇందాకే వెళ్లారు… 9 వరకు వచ్చేసారు..”