“సంజనా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నవేమో… ఆరోజు మనం అతని ప్రపోసల్ రిజెక్ట్ చేసేసరికి నువ్వు ఇక ఒప్పుకోవని గ్రహించి ఉంటాడేమో…. నిజంగానే అతను మనకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాడేమో… ”
“నిజంగానా… అతను మారాడని నిజంగా నువ్ నమ్ముతున్నవా…” వ్యంగ్యంగా అంది సంజనా…
“ఒక్కటి చెప్పు సంజూ… అతడు నిన్నేమైన చేస్తాడని భయపడుతున్నవా…” అడిగాడు వివేక్…
“లేదు .. నాకలాంటి భయమేం లేదు…” వెంటనే అంది సంజన…
“అంటే .. నీకున్న భయమల్లా… అతను మళ్ళీ నీ దగ్గర అప్పటి ప్రపోసల్ తెస్తాడాని… అంతేనా…”
“అవును..” సంశయిస్తూ అంది సంజన… వివేక్ సంభాషణ ఎటువైపు తీసుకెళ్తున్నాడో ఆమెకి తెలియట్లేదు…
“ఒకవేళ వాడు నీ దగ్గర ఆ ప్రస్తావన మళ్లీ తెస్తే నువేం చేస్తావ్…” అడిగాడు వివేక్… తాను వాడుతున్న పదాల్లో “పడుకోవడం” లాంటివి లేకుండా జాగ్రత్తగా అడిగాడు వివేక్…
“ఏం చేస్తానా… ముందు చెప్పు తీసుకొని రెండు చెంపలూ వాయించి, రాజీనామా వాడి మొహాన కొడ్తాను…” ఆవేశంగా అంది సంజన…
“గుడ్… వాడు మిస్ బిహేవ్ చేస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో నీకు బాగ తెలుసు… అలాంటప్పుడు ఎందుకు భయపడి ముందే రాజీనామా చేయడం… వాడు అసభ్యంగా ప్రవర్తించి ఏదైనా ఇబ్బంది పెడితే అప్పుడే రాజీనామా చెయ్యొచ్చు… అప్పటివరకు పని చెయ్యొచ్చుగా…”
సంజన మౌనంగా ఉంది…
“నిజంగా సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కొందాం… సమస్య వస్తుందేమో అని ఇప్పటినుండే భయపడ్డం ఎందుకు… ఆల్రెడీ మనకు చాలా సమస్యలు ఉన్నాయి… ఇప్పుడు భయంతో కొత్తదాన్ని తెచ్చుకోవడం ఎందుకు… ” అన్నాడు వివేక్
వివేక్ తనను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది సంజనకు… “ఎందుకు వివేక్ నన్ను ఒప్పించాలనుకుంటున్నాడు… స్పష్టంగా నన్ను తన పక్కలోకి రమ్మని పిలిచిన వాడి దగ్గర పని చేయడానికి వెళ్ళమని వివేక్ ఎలా చెప్పగలుగుతున్నాడు….” తనలో తానే అనుకుంది సంజన…
“వివేక్ చాలా దెబ్బతిని ఉన్నాడు… అతనిలో ఇసుమంతైనా ఆత్మవిశ్వాసం లేదిప్పుడు… పరిస్థితులు అతన్ని పూర్తిగా కిందికి లాక్కొచ్చాయి… అందుకే తన పెళ్ళాన్ని రెండు రాత్రులకి అడిగినా… వాడి దగ్గర పని చేయడానికి వెళ్లమంటున్నాడు… అందుకే ఇవన్నీ చెబుతున్నాడు… ఒకవేళ వివేక్ చెప్పేది కూడా నిజమేనేమో….” తర్కించుకుంది సంజన…
“సరే వివేక్… నువ్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది… . నేనేంటో , నా శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు బాగా తెలుసు.. దేని విషయంలోనూ నన్ను ఎవరూ బలవంతం చేయలేరు… అలాంటప్పుడు వాడితో పని చేయడానికి నాకెందుకు భయం…”
అంది సంజన…
మళ్లీ తనే… “ఏదో వంకతో మీద చేతులు వేసే చీడపురుగులు ఉంటారని తెలిసీ బస్సుల్లో, రైళ్లలో వెళ్తుంటాం… కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా వెళ్లడం మానుకోము కదా… ఈ ఆనంద్ కూడా అలాంటి పురుగే అనుకుంటాను…” అంది..
“సరిగ్గా చెప్పావ్ … ఎక్కువగా ఆలోచించి బాధపడకు సంజూ… ఇదంతా ఒక నెల వరకే కదా… వీలైనంతగా వాడికి దూరంగా, జాగ్రత్తగా ఉండు… తరువాత నువ్ ఎలాగు ముఖేష్ దగ్గరే పని చేయాలి… అప్పుడు అంతా సర్దుకుంటుంది…” అన్నాడు..
“ఓకే వివేక్… ప్రయత్నిస్తాను…” అంటూ వివేక్ ని హత్తుకుంది సంజన…