సంపద Part 2 193

లేదురా,నాన్నకి టౌన్ లో ఉన్న ఇండ్లని రిపేర్ చేసే పని ఉండటం వల్ల ఒక వారం వరకూ కుదరదు అంట, ఈరోజు వెళ్లి మాట్లాడి వచ్చాను..

అవునా అన్నయ్యా,నాన్న కి ఎప్పుడూ టౌన్ లో పనులే అని విసుక్కోగా ఏవో పనులు లేరా వచ్చేస్తాడు అని సర్దిచెప్పాడు నానీ.

అన్నయ్యా నిన్నో మాట అడగనా అన్నాను ధైర్యం చేసుకొని..

ఏంటిరా ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఏదైనా అడుగు ఏ ఇబ్బందీ లేకుండా అని..

అలా కాదు అన్నయ్యా నాకు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి,అవన్నీ అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ముందే ఒక మాట అడుగుతాను అన్నాను నవ్వుతూ.

సరేలే ఏంటో అడుగు అన్నాడు నవ్వుతూ..

అన్నయ్యా ఇంతకీ నాన్న మంచోడా??అన్నాను నాని ని సూటిగా చూస్తూ.

నా మాటకి నాని అన్నయ్య మొహంలో ఏదో అలజడి అలా కనిపించి మాయమవ్వడం నేను స్పష్టంగా గమనించాను.అలజడిని ఏ మాత్రమూ కనిపించకుండా ఏరా ఎందుకు అలా అడిగావ్??నాన్న మంచోడు కాబట్టేగా ఇన్ని సౌకర్యాలు మీకు ఉన్నాయి అన్నాడు కాసింత తడబడుతూ..అప్పుడు కనిపించింది నానీ అన్నయ్య మొహంలో ఎప్పుడూ లేనంత తడబాటు,బహుశా అబద్ధం చెప్పేటప్పుడు ఆయన మొహం అలా ఉంటుందేమో అనిపించింది..

లేదు అన్నయ్యా నాకెందుకో అనుమానంగా ఉంది,అప్పుడప్పుడు వాళ్ళూ వీళ్ళూ మాట్లాడుకోవటం నేను విన్నాను నాన్న గురించి, నిజం చెప్పు అన్నయ్యా నాకు అని అడిగాను ప్రార్ధనగా..

ఐషూ వాళ్ళ మాటలు వినడం మంచిది కాదురా,ఆ పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేయ్.. ఏ అనుమానాలూ పెట్టుకోకు అని మృదువుగా చెప్పాడు..

లేదు అన్నయ్యా నాన్న ఎప్పుడూ బయటే ఉంటాడు,ఇంటి దగ్గరున్న అమ్మని ఎప్పుడూ ప్రేమగా చూసుకోడు.. నాకెందుకో అనుమానంగా ఉంది అన్నాను సూటిగా చూస్తూ..

అయ్యో అలా ఏమీలేదురా,ఊర్లో వాళ్ళ మాటలు విని నీకు అలా అనిపిస్తోంది అంతే..మీ నాన్న మంచోడు సరేనా అన్నాడు అందంగా నాకు బుజ్జగిస్తూ..

ఏమో అన్నయ్యా నిన్ను చూస్తోంటే ఏదో దాస్తున్నట్లు అనిపిస్తోంది నాకు,ఎప్పుడూ నీ మొహంలో తడబాటు నేను చూడలేదు..ఇప్పుడు నేను అడుగుతుంటే మాత్రం తడబడుతున్నావ్ ఏదో ఉంది అన్నాను బాధగా..

అబ్బా ఐషూ నువ్వు చిన్నపిల్లవి రా,ఇలాంటి విషయాలు నీకు అవసరం లేదు అన్నాడు అనునయంగా..

లేదు అన్నయ్యా నేనేమీ చిన్నపిల్లని కాను, నా కళ్ళలోకి సూటిగా చూసి జవాబివ్వు అమ్మ నిజంగా సంతోషంగా ఉందా అని అన్నాను..

ఆ మాటకి నానీ అన్నయ్య మొహంలో నెత్తురు చుక్క లేదు,ఏమి జవాబివ్వాలో కూడా తెలీక నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు..

అన్నయ్యా నువ్వు అబద్ధాలు ఆడవు అని నాకు తెలుసు,నీ మనసులో ఉన్న నిజాలు కూడా నాకు అన్నీ తెలుసు..రాత్రి మీ మాటలు నేను విన్నాను అంటూ ధైర్యంగా చెప్పేసాను..

నా మాటకి ఆశ్చర్యం గా ఒరేయ్ ఐషూ నువ్వు విన్నవి అన్నీ నిజాలు అనుకుంటే పొరపాటు రా,నీ వయసు చిన్నది ఇలాంటివి ఆలోచించి నీ మనసుని గాయపరుచుకోకు అన్నాడు ప్రేమగా.

1 Comment

  1. Baga raasthunnaru story fast ga update ivvandi amma Inka satya la srungram kosam waiting

Comments are closed.