ఐశ్వర్య-దీపా ల సంభాషణలు…
తేడానా దీని మొహం దీనికేమి తెలుస్తుంది ఆయన పోటు గురించి అని మనసులో అనుకొని నానీ తో ఏమీ చేయకుండా తేడా అని ఎలా అంటావక్కా అన్నాను మెలేస్తూ.
మరెలా అనుకోవాలే??ఆడది సిగ్గు విడిచి మరీ అడిగితే వద్దు అని వెళ్ళేవాడి గురించి??
ఇష్టం లేదు అని అనుకోవచ్చుగా అక్కా??
ఇష్టం లేదు అనడానికి నేనేమీ బాగాలేనా??నాకన్నా అందగత్తెలు ఎవరున్నారే??అంది గర్వంగా.
అందం ఒక్కటే కాదుగా అక్కా,నానీ కి ఎలాంటి వాళ్ళు ఇష్టమో తెలియదు పైగా నువ్వు ఆయన కన్నా పెద్దదానివి అందుకే ఆలోచిస్తున్నాడేమో అనుకోవచ్చుగా..
ఏమోనే ఐశ్వర్యా నాకు అవేవీ తెలియదు,నా దృష్టిలో ఆడది సిగ్గు విడిచి అడిగితే వద్దు అనేవాడు ఖచ్చితంగా మగాడు కాదు అనే అర్థం.ఈ విషయాన్ని వదిలేయ్.
అది కాదు అక్కా, అలా అంటే నానీ భవిష్యత్తు దెబ్బ తింటుందిగా అదే బాధపడ్డాడు నానీ.
అబ్బా వాడికి బాధ కూడా ఉందా??నువ్వు అంతగా బాధపడకే ఐశ్వర్యా. వాడి అందం చూసైనా సరే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారులే..
అది పక్కనపెట్టు అక్కా,నువ్వు అలా అందరితో అలా చెప్పడం మానేస్తే మంచిదేమో..
ఏంటే వాడు నిన్ను పంపించాడా నాతో మాట్లాడటానికి ధైర్యం లేక??
లేదక్కా నానీ కి తెలియదు నేను వచ్చినట్లు,నానీ మంచితనం నీకు తెలిసిందే గా అందుకే నేనే నీతో మాట్లాడదాం అని వచ్చాను.
హ్మ్మ్ వాడు మంచోడేనే ఐశ్వర్యా ఆ మాట నేను కాదనను, కానీ వాడు ఎందుకు నన్ను వద్దు అంటున్నాడో అర్థం అవ్వలేదు,అది ఆలోచిస్తోంటే నాకు వాడి పైన కసి పెరుగుతోందే తప్ప వాడి మంచితనం గుర్తు రావట్లేదు.
అయినా నీకు ఎందుకు అక్కా అంత ఇష్టం??
ఏమోనే ఐశ్వర్యా నాకు తెలీదు,నాకు తెలిసీ వాడి అందం అంటే నాకు పిచ్చి..చిన్నప్పటి నుండీ వాడితో ఉన్నాను కాబట్టి నాకు ఆ కోరిక పుట్టింది..వాడు నన్ను వద్దు అనేసరికి నాకు అహం దెబ్బతినిందేమో బహుశా వాడంటే కోపం,చికాకు అన్నీ వస్తున్నాయి..నేను ఎంతగా ప్రయత్నించానో తెలుసా నీకు??నా అందాలన్నీ వాడి ముందు ప్రదర్శించినా వాడు నా వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి నాకు కోపం ఇంకా ఎక్కువై వీడు మగాడు కాదు అని నిశ్చయించుకున్నాను..
అదేంటక్కా అలా అంటావ్??నీ పైన అభిమానం ఉండొచ్చుగా, నీతో ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తించాడా నానీ?
లేదే ఐశ్వర్యా, ఎప్పుడూ నా పైన కోపం చూపించలేదు వాడు.
అలాంటప్పుడు ఎందుకు మగాడు కాదు అనుకున్నావ్ అక్కా??అభిమానం ఉండబట్టే నిన్ను వద్దు అన్నాడేమో ఆలోచించు ఒక్కసారి..
ఒసేయ్ ఐశ్వర్యా నీకు ఇవన్నీ తెలియవే,ఆడదాని కోరికని పట్టించుకోకుండా ఉండే మగాడిని ఏమనాలి??రేపు నీకూ ఈ అనుభవం కలిగితే అప్పుడు తెలుస్తుంది నా బాధ…
దీపా మాట నన్ను ఆలోచనలో పడేసింది,దాని మాటలో ఒక రకంగా నిజాయితీ కనిపించింది నాకు..నిజమే ఆడదాని కోరికని పట్టించుకోకుండా ఉండటం మగాడికి మంచిది కాదు,ఒకవేళ రేపు నా కోరికనీ కాదంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఊహ నన్ను కొంచెం ఆందోళనకి గురిచేసింది.నానీ మంచితనం ముందు దీపా ది చెడ్డ పని అని తోచినా దీపా ఎంత సిన్సియర్ గా నానీ ని కోరుకుంటుందో అర్థం అయింది నాకు.నానీ నిగ్రహం నాకు సంతోషాన్ని ఇచ్చినా ఎందుకో కాసింత పాపం ఏమో అనిపించింది దీపా ఆలోచన విన్నాక..
నేను మెల్లగా అక్కా నువ్వు ఇలా కోపంగా కాకుండా ఒకసారి నీ మనసులో ఉండే ఆలోచనలు అన్నీ నిదానంగా నానీ కి చెప్పొచ్చు గా??
ఎక్కడ వింటాడే వాడు??ఏమి మాట్లాడినా ఆడదాని కంటే భయంగా నన్ను తప్పించుకొని వెళ్తాడు..
హ్మ్మ్ సరే అక్కా నేను మాట్లాడనా పోనీ???
నీకెందుకే ఐశ్వర్యా, చిన్నపిల్లవి ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ఉండటం నీ జీవితానికి మంచిది వదిలేయ్..రాత ఉంటే జరగకుండా మానదు ఏదైనా అంది కాసింత నిర్వేదంగా.
ఆ క్షణం దీపా లో ఒక మంచి మనిషి కనిపించింది నాకు..ఎందుకంటే ఇన్నాళ్లూ దీపా ని చెడుగా అనుకున్నానే తప్ప మంచిగా ఎప్పుడూ ఆలోచించలేదు నేను,దీపాకి కోరిక తీర్చుకోవడం ఒక్కటే తన ఉద్దేశ్యం అయితే తప్పకుండా మాట్లాడవే వాడితో అనేది,కానీ ఆ మాట అనకుండా నా మంచి కోసం ఆలోచించింది అంటే తప్పకుండా దీపా కూడా నాలాగే ఇష్టం పెంచుకుంది అని గట్టిగా అనిపించింది.. ఒక రకంగా సానుభూతి తో పాటూ దీపా అంటే కాసింత ఇష్టం ఏర్పడింది నాకు ఆ క్షణం..
అబ్బా ఏమీకాదు అక్కా,నానీ గురించి నీకు తెలిసిందే గా,నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు..నేను ఏమి చెప్పినా చేస్తాడు నువ్వు ఓకే అంటే నేను మాట్లాడతాను అన్నాను.
ఏంటే నీకు ఇంత ఆత్రం అంది అనుమానం గా.
Next part లని తొందరగా రిలీజ్ చేయండి