తోబుట్టువు 412

ఇదంతా కరెక్టుగా రెండు వారాల ముందర మొదలయ్యింది!

సమయం : తెల్లవారు ఝామున 05:17 నిముషాలు!
ప్రదేశం: ఢిల్లీ ఏర్పోర్ట్ టెర్మినల్ T3 Entrance

తమ విమానాలు ఎక్కడ మిస్సవ్వుతాయేమో అని నిద్రమత్తులో జే వాకింగ్ చేస్తూ పక్కన వాళ్లని పట్టించుకోకుండా తమదే చాలా ఇంపార్టెంట్ వర్క్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ, ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ చెక్-ఇన్ కౌంటర్స్ దగ్గరకి పరుగులు పెడుతున్న జనం! వాళ్లని కంట్రోల్ చెయ్యడానికీ, వాళ్లు చూపించే ఐడీలు చెక్ చెయ్యడానికీ నానా తంటాలూ పడుతున్న సెక్యూరిటీ ఆఫీసర్లూ! నేనెక్కాల్సిన ప్లేన్ ఏయిర్ ఇండియాది రెండు గంటలుంది ఇంకా టేకాఫ్ కి! పైగా బిజినెస్ క్లాస్ టికెట్ నాది! చాలా సార్లే ట్రావెల్ చేశా ఈ ప్లేన్లో! సో 06:50కి కానీ బోర్డింగ్ మొదలవ్వదూ అని నాకు తెలుసు! అందరూ ఒకళ్లనొకళ్లు తోసుకుంటూ ఉంటే, నేను మాత్రం నిదానంగా లైనులో నుంచున్నా! ఇంతలో నా నుంచి ఓ పదిమంది ముందర లైనులో నుంచున్న పెద్ద మనిషి మీద నా చూపు పడింది! పాయింటెడ్ హీల్స్, బ్లాక్ జీన్స్, నడుం పైదాకా మాత్రమే ఉన్న వైట్ సిల్క్ షర్ట్! దాన్లోంచి కనిపిస్తున్న తెల్లని స్పోర్ట్స్ ఫిట్ కామిసోల్, అందులోంచి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న బ్రా హుక్, విరబోసుకున్న సిల్కీ హెయిర్, బ్రాడ్ షోల్డర్స్, ఓ అయిదూ ఎనిమిది కాదు కాదు హీల్స్ ఓ మూడంగుళాలు ఉంటాయి! సో, ఓ అయిదూ అయిదు సూపర్ ఫిగర్ ఊగిపోతూ, సెక్యూరిటీ ఆఫీసర్తో వాగ్వివాదం చేస్తోంది! పైన ఊగిపోతూ ఉంటే, కింద లయబద్ధంగా కదుల్తున్న డిక్కీ చూసి, “ఇదేదో నాకు బాగా తెలిసిన డిక్కీలానే ఉందే? కెలికితే పోలే!” అనుకుంటూ, “Excuse Me! I am with her” అని నా ముందరున్న వాళ్లని రిక్వెస్ట్ చేస్తూ వాళ్లని దాటుకుంటూ తన దగ్గరకి వెళ్తుంటే, తన గొంతు వినపడి నాలో ప్రకంపనలు మొదలయ్యాయి! “ఛ! ఛా! అదయ్యుండదు! మొన్ననేగా ఫేస్ టైం చేశా! అది కాన్ఫరెన్స్ కోసం టొరంటో వెళ్తా అంది! అదయ్యే ఛాన్సే లేదు!” అని సర్ది చెప్పుకుంటూ వెళ్లి చూద్దును కదా! అదే! విజ్జీ! నా పంచ ప్రాణాలూ!

దాన్నక్కడ అనెక్స్పెక్టెడ్గా చూసిన షాక్లోంచి తేరుకుంటూ, “సేయ్! పొద్దున్నే ఏంటే నీ సోది పంచాయితీ! లైన్ మొత్తాన్ని ఆపేశావ్?” అనంటూ దాని భుజమ్మీద చెయ్యి వేసి అనేసరికి, నా గొంతు గుర్తు పట్టి, గిర్రున తిరిగి సాచిపెట్టి నా గూబ మీదొక్కటి పీకింది! సాహో సినిమాలో ప్రభాస్ లాగి గూబ మీద కొడితే మ్యాటర్ మొత్తం అర్థమైపోయిన వెన్నెల కిషోర్ లా నేల మీద కూర్చుని దాని సూట్ కేస్ ఓపెన్ చేసి దాని పాస్పోర్ట్ వెతకసాగాను! ఎందుకంటారా? విజ్జీ తింగరి బుచ్చి పాస్పోర్టుని బ్యాగేజ్లో పెట్టేసింది! టికెట్ మీద కోడ్ ఫారినర్ అని ఉండేసరికి, సెక్యూరిటీ ఆఫీసర్ పాస్పోర్ట్ అడుగుతున్నాడు! ఇదేమో ఫోన్లో ఈ-పాస్పొర్ట్ చూపిస్తుంటే ఒప్పుకోవట్లేదు! నేను దాని భుజమ్మీద చెయ్యి వే వెయ్యగానే నన్ను గుర్తుపట్టి, అదసలే తిక్కలో ఉందేమో లాగి నా గూబమీదొక్కటి పీకి పీకింది! దాని ఫేస్లో కళ్లల్లోంచి కారడానికి రెడీగా ఉన్న కన్నీళ్లని చూస్తూనే నాకు విషయం మొత్తం అర్థమైపోయింది! మళ్లీ ఎట్లా అంటారా? కలిసి పెరిగాం కదండీ! నా తింగరబుచ్చి ఏవేం తింగరి పనులు చేస్తుందో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయి చెప్పండీ? దాని పాస్పోర్ట్ వెతికి నేను సెక్యూరిటీ ఆఫీసర్ కి ఇవ్వగానే, అది నన్ను గట్టిగా వాటేసుకుని పిడికిళ్లతో నా భుజమ్మీద కోడుతూ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో, “లంజాకొడకా! నిన్ను పట్టుకోవడానికే ఈ తిప్పలన్నీ!” అంటూ పిచ్చ కోపంలో నన్ను తిడుతూ, ఆఫీసర్ పర్మిషన్ కోసం ఆగకుండా అతని చేతిలోంచి తన పాస్పోర్ట్ లాక్కుంటూ, “సారీ ఫర్ ద మెస్ ఆఫీసర్! ఐ కేం ఆల్ ద వే ఫ్రం డెట్రాయిట్ టూ క్యాచ్ దిస్ బగ్గర్! ఐ వస్ ఇన్ లాట్ ఆఫ్ టెన్షన్ అండ్ క్రియేటెడ్ ఎ సీన్ హియర్!!” అనంటూ అతనికీ, మా వెనకాల లైనులో నుంచుని అదేం చేస్తోందో అర్థం కాక జుట్లు పీక్కుంటూ మా మీద అరుస్తున్న వాళ్లందరికీ నమస్కరిస్తూ సారీ చెప్పింది! దాని ఫేసులో టెన్షన్ పోయి నవ్వు రావడం చూసిన సెక్యూరిటీ ఆఫీసర్ ఏ కళనున్నాడో మమ్మల్ని వదిలేశాడు!

నన్ను వదిలితే నేనెక్కడ మాయం అయిపోతానో అన్నట్టు, చంటి పిల్లాడిలా నా చేతిని తన చంకలో ఇరికించుకుని చెక్-ఇన్ కౌంటర్స్ వైపు కాకుండా, టికెట్ కౌంటర్స్ వైపు లాకెళ్లుతూ, నా చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని మా ఇంటికో ఫోన్ కొట్టి, మా ఆవిడ ఫోన్ ఎత్తగానే, పొడిగా, “ఆ! వాడు దొరికాడు! మళ్లీ ఆదివారం కాల్ చేస్తా! అప్పటిదాకా కాల్ చెయ్యొద్దు!” అంటూ క్రిప్టిక్గా లక్కీకి ఏదో మెసేజ్ పాస్ చేసి, ఫోన్ తన ప్యాంట్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటూ, నా వైపో సీరియస్ లుక్ ఇస్తూ, “నీ ప్లాన్స్ ఛేంజ్! ఆఫీసుకి రెజిగ్నేషన్ ఈ-మెయిల్ పెట్టెయ్యి! I need you badly from now on! ఏవైనా హ్యాండ్ ఓవర్స్ ఇవ్వాలంటే, టూ వీక్స్ తర్వాత వచ్చి ఇస్తా అని చెప్పు!” అనంటూ నాకో ఆర్డర్ వేస్తూ, చొరవగా నా భుజాన ఉన్న బ్యాగ్ లాక్కుని, అక్కడో కౌంటర్ ముందర నుంచుని దాన్ని ఓపెన్ చేసి, నా మ్యాక్ ని పవరాన్ చేసి, పాస్వర్డ్ కోసం నా ఎడమ చేతి బొటన వేలును దాని మీద పెట్టి హోం స్క్రీన్ రాగానే, “నే చెప్పినట్టు మెయిల్ పెట్టు!” అంటూ ఆర్డర్ వేసి, నడుమ్మీద చేతులు పెట్టుకుని నా వైపు కోరగా చూడసాగింది! దానికి బాగా తెలుసు! అది నిప్పుల్లో దూకమన్నా ఎందుకూ? ఏమిటీ? అని ఆలోచించకుండా దూకేస్తానని! అదే దాని ధైర్యం! నేను భుజాలు ష్రజ్ చేస్తూ, “విజ్జీ ఈజ్ ఆల్వేస్ రైట్!” అంటూ మెయిల్ ఓపెన్ చేసి, అది చెప్పినట్టే కంపోజ్ చేసి సెండ్ బటన్ కొట్టాక కానీ అది రిలాక్స్ అవ్వలేదు! మెయిల్ సెంట్ అన్న నోటిఫికేషన్ రాగానే, అది లాప్టాప్ ఢక్కన్ మూసేసి, బ్యాగ్ తన భుజాన తగిలించుకుని, “ఫాలో మీ!” అంటూ చిటికె వేస్తూ నాకో ఆర్డర్ వేసి, నా ఫోన్లో ఉన్న టికెట్ ని కౌంటర్లో చూపిస్తూ, “Can you please change the destination to Goa from Hyderabad! His plans got changed at the last moment! Also book another ticket for me too!” అనంటూ కౌంటర్లో వాళ్లకి తన పాస్పోర్ట్ ఇచ్చి మాట్లాడసాగింది!

అదెప్పుడైతే గోవా అందో, వెంటనే నా కళ్లు బ్లర్ అయ్యి నా కళ్ల ముందర ఇరవై ఏళ్ల నాటి సీన్ ప్లే అవ్వసాగింది! నా చెవుల్లో “నీ పెళ్లెప్పుడే?” అని అడిగిన నాకు అది ఇచ్చిన మాట మార్మోగసాగింది! “రేయ్! జీవితంలో అన్నీ సాధించేశాం అనుకున్న రోజున ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, అన్నీ వదిలేసి ఈ ప్రపంచంలో నువ్వే మూలనున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వే పరిస్తితులలో ఉన్నా కానీ, నిన్ను గోవా లేపుకుపోతా! ఎవరూ ఉండరు! నువ్వూ నేనూ మాత్రమే! అప్పుడు చెబుతా నేను పెళ్లెందుకు వద్దంటున్నానో!” అనంటూ అది నాకు చేసిన ప్రామిస్ ఠింగున గుర్తుకు వచ్చింది! అది టికెట్స్ కొంటూ ఉంటే నేనేమీ మాట్లాడకుండా, గోళ్లు గిల్లుకుంటూ పక్కనే నుంచుని దాని ఫేస్ వైపే చూస్తూ నుంచున్నా! ఫేస్లో కొంచెం గ్లో తగ్గింది కానీ అదింకా అట్లానే బుట్టబొమ్మలా ఉంది! కోల మొహం మీద చారెడేసి ఉన్న కళ్లతో చాలా కళగా ఉండే అట్రాక్టివ్ ఫేస్ దానిది! ఆ ఫేసులో ఉన్న కళ వల్లే అందరూ దానికి దాసోహమంటారు! నేనూ ఎక్సెప్షన్ కాదు! మా ఇంట్లో మా అమ్మమ్మ ఫోటోలు చాలానే ఉన్నాయి! అచ్చు మా అమ్మమ్మ పోలికలే దీనివీ! నాన్న అంటుండేవాడు “దీనివన్నీ మీ అమ్మమ్మ పోలికలే అంట!” అని! అందుకే అది పుట్టగానే అమ్మ మరో పేరు ఆలోచించకుండా దానికి వాళ్లమ్మ, అదే దాని మామ్మా పేరు విజయ అని పెట్టేసింది అంట! వాళ్లమ్మీద ప్రేమతోనే, మా అమ్మ, నాకూ విజయ్ అని పేరు పెట్టింది! పాస్ట్ ఇప్పుడొద్దులే! ఇంతకీ దాని ఫేస్ చూస్తున్న నాకు అర్థమయ్యింది ఏంటీ అంటే అది చాలా ఆనందంగా ఉందీ అని! దాని ఆనందాన్ని ఇప్పుడు నేను భరించి తీరాలీ అని! అదేంటీ ఆనందం అంటున్నాడూ, భరించాలీ అంటున్నాడూ అనుకుంటున్నారా? దానికి ఆనందం వస్తే అది ఫుల్లుగా మందు కొట్టి నానా రచ్చా చేస్తుంది! అది మందు కొట్టినప్పుడు ఏం చేస్తుందో దానికస్సలు గుర్తు ఉండదు! ఆ టైములో దాని బాడిగార్డుని నేనే!

మా చిన్నప్పుడు అన్నగారు ఆంధ్రాలో (అప్పుడు ఒకటే స్టేట్ లెండి) మద్యపాన నిషేధం పెడితే, అది నన్ను బైకులో బీదర్ లాక్కెళ్లి అక్కడ ఫుల్లుగా మందు కొట్టి చేసిన పెంట నేనింకా మర్చిపోలేదు! “దీనెమ్మా!” అనుకుంటూనే చిన్నగా, “విజ్జీ! ఇంత అర్జంటుగా గోవా అవసరమా?” అని గొణిగా! మరంతకన్నా గట్టిగా అడిగితే ఇందాక పీకినట్టు నన్నింకోసారి లెంపకాయ పీకుతుందేమో అన్న భయం ఉంది నాకు! అది నావైపు అదోలా చూస్తూ, టికెట్స్ తీసుకుని, “పద పదా!” అంటూ ఎయిర్ ఇండియా చెకిన్ కౌంటర్స్ వైపు పరిగెత్తింది! చేసేది లేక, నా సూట్కేసూ, దాని సూట్కేసూ రెండూ తీసుకుని దాని వెనకాలే నేనూ పోయా! ఈలోపు అది ఇద్దరికీ బోర్డింగ్ పాసులు తీసుకుంటూ, సూట్కేసెస్ చెక్-ఇన్ చేసెయ్యమని చెప్పింది! టైం చూసుకుంటే 05:45! ఈ ఇరవై ఎనిమిది నిముషాలూ 28 సెకన్లలా గడిచాయి అని అనిపించింది నాకు! దాని సంగతి పూర్తిగా తెలిసిన వాడిని కనుక దానికి పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా దాని వెనకాలే తోకలా సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకుని, తాయితీగా వెళ్లి మేమెక్కవలసిన ఫ్లైట్ గేట్ ముందర కూర్చున్నాం! ఇంతకీ హైద్రాబాద్ ఫ్లైటూ, గోవా ఫ్లైటూ ఒకే టైముకి! రెండూ 07:10 కే డిపార్చర్! రెండిటి గేటులూ పక్క పక్కనే! ఖాళీగా ఉన్న రెండు కుర్చీలు వెతికి వాటిల్లో కూర్చోగానే, అది నా కుడిచేతిని రెండు చేతులతోనూ వాటేసుకుని, నా భుజమ్మీద తలపెట్టుకుని పడుకుంటూ, “బోర్డింగ్ స్టార్ట్ అయ్యేదాకా కదలకు! మూడు రోజులనుంచీ నిద్రపోలేదు! ఇమ్మిగ్రేషన్ అంతా అయ్యి హోటల్ కి వెళ్లి పడుకునేసరికి, రాత్రి 01:00 అయ్యింది! మళ్లీ నాలుగున్నరకే లేచి నిన్ను వెతుక్కుంటూ వచ్చా!” అనంటూ ఆర్డర్ వేసి, నన్ను గట్టిగా పట్టుకుని పడుకుంది! ఇంకోటి అర్థమయ్యింది నాకు! ఆనందంతో పాటు విజ్జీ మనసులో ఖంగారు కూడా ఉందీ అని! దానికి ఖంగారు పుట్టినప్పుడల్లా దానికున్న ఏకైక తోడుని నన్ను గట్టిగా వాటేసుకుని ధైర్యం తెచ్చుకోవడం దానికలవాటు!

నేను నా కుడి చేతిని అస్సలు కదిలించకుండా, ఎడమ చేత్తో దాని నుదిటమీద పడుతున్న వెంట్రుకలని దాని చెవి వెనక్కి తోస్తూ, అట్లాగే కదలకుండా బోర్డింగ్ ఎనౌన్స్మెంట్ ఇచ్చేవరకూ బొమ్మలా కూర్చున్నా! నన్ను పట్టుకున్నందుకు దానికి దొరికిన ధైర్యం వల్లో, లేక మూడు రాత్రులనుంచీ సరిగ్గా పడుకోకపోవడం వల్లో, అది నన్ను పట్టుకున్న రెండో నిముషంలోనే గుర్రు పెట్టేసింది! ఎనౌన్స్మెంట్ ఇచ్చాక దాన్ని లేపి, ఫ్లైటెక్కాం ఇద్దరమూ! ఇవాళ బిజినెస్ క్లాస్లో మేమిద్దరమే! గోవా ఫ్లైట్ కదా! అందరూ చీప్ టికెట్స్ లోనే ట్రావెల్ చేస్తారు! ఆ పైసలు గోవాలో వేరే వాటికి వాడొచ్చూ అని కాబోలు! బిజినెస్ క్లాస్ కనుక, హోస్టెస్ వెల్కం డ్రింక్ తో పాటు వెట్ వైప్స్ కూడా ఇచ్చింది! అది హాట్ వైప్స్ రెండు తీసుకుని మొహాన్ని శుభ్రంగా తుడుచుకుంటూ, “విజ్జూ! మనం గోవా వెళ్తున్నాం రా!” అనంటూ చిన్న పిల్లలా ఎగ్జైట్ అయ్యిపోతూ నన్ను కౌగలించుకునేసరికి, హోస్టెస్ నవ్వుకుంటూ “బ్యూటిఫుల్ కపుల్!” అని గొణుక్కుంటూ పోవడం నా చెవినుంచి తప్పించుకోలేదు! “నీ అమ్మమ్మ! మేం కపులే కానీ నువ్వనుకునే కపుల్ కాదే! ఒకళ్ల కోసం ఇంకొకళ్లు బ్రతుకుతున్నాం! అదీ మా ఇద్దరి రిలేషన్!” అని మనసులో అనుకుంటూండగా, ఫ్లైట్ టేకాఫ్ అనౌన్స్మెంట్ అయ్యింది! నేను విజ్జీతో, “సేయ్! బెల్ట్ పెట్టుకో!” అని బలవంతాన దానికి బెల్ట్ బిగించి, నేనూ పెట్టుకుని, అదింకా ఎగ్జైట్ అవుతూ ఉంటే, దాని చేతిని నా చేతుల్లోకి తీసుకుని నిమురుతూ, “సేయ్! మ్యాచ్ ఆన్! గోవా ఆన్! ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు! గుండె పట్టుకోగలదు!” అని దానికో మొట్టికాయ వేసి, “పడుకో! రెండు గంటల్లో లేపుతా!” అంటూ దాన్ని పడుకోమనగానే, అది రెండే రెండు నిముషాల్లో డీప్ స్లీప్ వేసేసింది! నేను దాని చెయ్యి విడిపించుకుందామూ అంటే, ఉడుం పట్టు పట్టేసింది అది! చేసేది లేక, నేను ఎయిర్ హోస్టెస్ ని అడిగి మ్యాగ్జైన్ ఒకటి తీసుకుని దాన్ని బట్టీ కొట్టడం మొదలెట్టా! హోస్టెస్ మధ్యలో స్నాక్స్ అంటూ వస్తే, “ష్!” అంటూ తనని తోలేశా!