తోబుట్టువు 412

మొత్తానికి చెప్పినట్టుగా రెండున్నర గంటలు కాదు కానీ, ఇంకో ఇరవై నిముషాలు లేటుగా గోవాలో ఫ్లైట్ లాండయ్యింది! ల్యాండింగ్ ఎనౌన్స్మెంట్ ఇవ్వగానే, నేను లెపక్కర్లేకుండానే, విజ్జీనే కళ్లు నులుముకుంటూ లేచి “అప్పుడే వచ్చేశామా?” అంటూ కిటికీలోంచి బయటకు చూస్తూ ల్యాండింగ్ వ్యూ ఎంజాయ్ చెయ్యసాగింది! ఫ్లైట్ లాండవ్వగానే, అది ఓ క్యాబ్ కౌంటర్ దగ్గరకి వెళ్లి, ఓ క్యాబ్ బూక్ చేసింది! ఈలోపు నేను లగేజ్ కలెక్ట్ చేసుకుని దాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే, నాకు మా ఆఫీస్ కొలీగ్ ఒకడు కనిపించి హెల్లో చెప్పాడు! విజ్జీ చూడకుండా వాడిని పక్కకి లాక్కెళ్లి “నా కజిన్ సీరియస్ ప్రాబ్లెంస్ లో ఉంది! ఎప్పుడు అవి తీరుతాయో తెలియదు! నాకున్న ఏకైక బంధువూ, దానికున్న ఏకైక బంధువూ నేనే! తన ప్రాబ్లెంస్ సాల్వ్ అయ్యాకే నేను ఏదైనా ఆలోచించేది! అందుకే నేను రిజైన్ చేసాను” అని వాడికి చెప్పగానే, వాడి మొహంలో ఓ విధమైన శాడిస్టిక్ ఆనందం నాకు కొట్టొచ్చినట్టు కనిపించింది! అది నా దృష్టి నుంచి దాటిపోలేదు! నేను వేలు పెట్టి కెలికిన గుద్దల్లో వీడిదీ ఒకటి! వీడి ప్రాజెక్ట్ మీద వెరీ నెగిటివ్ రివ్యూ ఇచ్చా నేను! నా పీడా విరగడయ్యిందీ అన్న ఆనందాన్ని వాడు దాచుకోలేకపోయాడు పాపం! ఈలోపు దూరం నుంచి విజ్జీ చెయ్యి ఊపుతూ వాచ్ చూపించేసరికి, “సరే! తర్వాత కలుద్దాం!” అంటూ వాడిని వదిలించుకుని విజ్జీ దగ్గరకి పోయేసరికి, అదేదో ప్లాన్ వేసినట్టుంది! నా చేతిలో ఉన్న ట్రాలీని అది తీసుకుంటూ, వీ.ఐ.పీ పార్కింగ్లో ఉంది ఇన్నోవా! దాన్ని పట్టుకో! అంటూ నన్ను ముందర తోలి నా వెనకాలే అదీ రాసాగింది! గోవా ఎయిర్పోర్ట్ చాలా బుడ్డది! కొత్తది కడుతున్నారు కానీ టైం పడుతుంది! ఎక్కువ సేపు పట్టలేదు ఇన్నోవా వెదకడానికి! ఫార్ సైడ్ పార్క్ చేసి ఉందది! నేనూ విజ్జీ కారు ఎక్కాక, నేను స్టార్ట్ చెయ్యగానే, అది దాని ఫోన్ నుంచి నా ఫోన్ కి ఒక లొకేషన్ వాట్సాప్లో పంపి, దాన్నోపెన్ చేసి నావిగేషన్ స్టార్ట్ చేస్తూ, “ఇక్కడకి వెళ్లాలి మనం! బట్ ముందర ఈ లోకేషన్ కి వెళ్లాలి!” అంటూ ఇంకో లొకేషన్ మ్యాప్ మీద పాయింట్ చేసింది!

మేమున్న చోటుకి అది ఓ 40 కిలోమీటర్లుంది! నేను దానికి సీట్ బెల్ట్ బిగించి, అది కూర్చున్న సీట్ వెనక్కి రెస్ట్ చేస్తూ, “పడుకో! గోవా ట్రాఫిక్ లో మనం వెళ్లేసరికి గంట పడుతుంది!” అనంటూ దాన్ని పడుకొమ్మని నేను మ్యాప్ డైరెక్షన్స్ ఫాలో అవుతూ డ్రైవ్ చేస్తూ పోయా! ఏసీ ఆన్ చేసిన అయిదో నిముషంలో నా స్లీపీ బేబీ మళ్లీ బజ్జుండిపోయింది! నేను నా హైటెక్ సిటీ డ్రైవింగ్ స్కిల్స్ అన్నీ వాడుతూ డ్రైవ్ చేసేసరికి, 55మినిట్స్లో అది చెప్పిన ఫస్ట్ లొకేషన్ కి వెళ్లాము! అది ఆల్మోస్ట్ మిరామిర్ బీచ్ దగ్గరుంది! దిగి ఒళ్లు విరుచుకుంటూ చూద్దును కదా, ఎదురుగుండా ఓ రియల్ ఎస్టేట్ ఆఫీసూ, ఒక టాట్టూ షాప్ తప్పితే ఇంక అన్నీ జీడి పప్పు అమ్మే డ్రై ఫ్రూట్స్ షాప్స్ యే అక్కడ! “దీనెమ్మ జీడిపప్పులు కొనడానికి గోవా పట్టుకొచ్చిందా? ఏంటీ?” అన్న డౌట్ మెదులుతుండగా, దాన్ని లెగ్గొట్టా! అది “అప్పుడే వచ్చేశామా?” అంటూ కళ్లు నులుముంటూ కార్ దిగి అటూ ఇటూ చూస్తూ, ఇక్కడే ఉండు అని నాకో ఆర్డర్ వేసి, స్ట్రెయిట్ గా రియల్ ఎస్టేట్ అఫీసులోకి పోయి, ఓ పావు గంట తర్వాత వచ్చి, “పద! ఈ లొకేషన్ కి వెళ్లాలి!” అంటూ ఓ కొత్త లోకేషన్ షేర్ చేసింది! అది చూద్దును కదా అది కలింగ్యూట్ బీచ్ దగ్గరుంది! “సేయ్! ఇది గోవా కి రెండో పక్కన ఉందే! ఇప్పుడు వెళ్తే లంచ్ టైమవ్వుతుంది!” అనంటూ చెప్పేసరికి, “హ్మ్! అంత సేపా?” అంటూ మ్యాప్ వైపు చూసేసరికి, 18 కిలోమీటర్స్ చూపించింది! టైం మాత్రం గంటన్నర చూపిస్తోంది! “విజ్జూ! ఏంట్రా ఇది?” అనంటూ అది విసుగ్గా నావైపు చూసేసరికి నేను భుజాలు ష్రగ్ చేస్తూ, “Welcome to Goa baby! ఇవాళ రేపు Weekend! ఫుల్ల్ పీక్స్లో ఉంటారు టూరిస్ట్స్!” అనంటూ దానికి చెప్పేసరికి, “తప్పదు మనకి! వెళ్లి తీరాల్సిందే!” అని అది మొండిగా చెప్పేసరికి, కార్ స్టార్ట్ చేసి పోనిచ్చా! రెండో లోకేషన్ కి వెళ్లి చూస్తే అదో కార్ల షోరూం! విజ్జీ చుట్టూ చూస్తూ ఉంది!

షో రూం కనపడగానే, “పద పద!” అనంటూ కార్ దిగి షో రూంలోకి వెళ్లి అక్కడున్న మ్యానేజర్ తో తనెవరో చెప్పేసరికి, అతను అగ్గగ్గలాడుతూ మా ఇద్దరికీ రాచమర్యాదలు చెయ్యసాగాడు! అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు విజ్జీ డెట్రాయిట్లో పనిచేసేది బీ.యం.డబ్ల్యూలోనే అనీ, ఆపైన విజ్జీ ఇచ్చిన షాకుల దెబ్బకి నేను పొద్దున్నే హోటల్లో బయలుదేరేముందర తాగిన కాఫీ తప్ప, ఇంతవరకూ కాఫీ కూడా తాగలేదూ అని! అతనికి కాఫీ తెప్పించమని చెబుతూంటే, విజ్జీ “15 మినిట్స్ ఉంది! కాఫీ తాగుతావో టీ తాగుతావో నీ ఇష్టం! నో సాలిడ్స్!” అంటూ నాకు వార్నింగ్ ఇచ్చి, దాని పని పూర్తి చేసుకుని, నా ఫోన్లోంచి ఎవడికో ఫోన్ కొట్టి మాట్లాడగా, అయిదు నిముషాల తర్వాత, ఒకడు ఓ డకోటా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు! విజ్జీ వాడితో ఏదో మాట్లాడేసరికి, వాడు నా దగ్గర కీస్ తీసుకుని, కార్లోంచి లగేజ్ దింపి, డిస్ప్లే లో ఉన్న బీ.యం.డబ్ల్యూ లో సర్ది, విజ్జీకీ నాకూ వంగి వంగి సలాం కోడుతూ బండి అక్కడే వదిలేసి, ఇన్నోవా తోలుకుని వెళ్లిపోయాడు! “విజ్జూ! ఇంకో కాఫీ కావాలంటే తాగు!” అనంటూ నాకు ఛాయిస్ ఇచ్చేసరికి, రెండో కాఫీ కూడా గబ గబా తాగి కార్లో కూర్చుంటే, మేనేజర్ స్వయంగా తనే టైర్స్ కింద నిమ్మకాయలు పెట్టి, నన్ను స్టార్ట్ చెయ్యమన్నాడు! కార్ డిస్ప్లే ప్లాట్ఫాం దిగి రోడ్డెక్కగానే, విజ్జీ నా ఫోన్లో మళ్లీ ఫస్ట్ పంపిన లోకేషన్ ఓపెన్ చేసి, అక్కడికి పోనిమ్మంది! నేను బ్లైండ్గా నావిగేషన్ ఫాలో అవుతూ పోయా! ఓ పాతిక కిలోమీటర్లు పోయాక, బీచ్ ఫేసింగ్ ప్రాపర్టీ దగ్గర ఆగింది నావిగేషన్! అక్కడ ఆల్రెడీ ఓ పూజారీ, సన్నాయి మేళం రెడీగా ఉన్నారు! అది కార్ దిగి, వెళ్లి పంతులు గారితో మాట్లాడుతూ ఆయన చేతుల్లోంచి రెండు ప్యాకెట్స్ తీసుకుని, ఆ సెటప్ మొత్తాన్ని నోరెళ్లబెట్టి చూస్తూ నుంచున్న ఒక ప్యాకెట్ నాకిచ్చి, నన్ను ఓ పక్కగా ఉన్న సర్వెంట్ రూంస్లో ఒకదాన్లోకి పోయి రెడీ అవ్వమని చెబుతూ, అది రెండో దాన్లో దూరి రెడీ అవ్వసాగింది! బ్యాగ్ ఓపెన్ చేసిన నాకు బల్బులు పగిలేలా, పట్టుపంచా కండువా ఉన్నాయి!

నాకు కొంచెం కొంచెం మ్యాటర్ అర్థమవ్వసాగింది! “విజ్జీ ఆన్లైన్లోనే ఏదో ప్రాపర్టీ చూసి దాన్ని కొనేసింది! ఇప్పుడు అదీ-నేనూ కలిసి గృహాప్రవేశం చెయ్యాలి!” అనుకుంటూ రెడీ అయ్యా! లక్కీతో మాట్లాడి దానికి చెప్పడానికి నా ఫోన్ కూడా నా దగ్గర లేదు! అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లాగేసుకున్న దగ్గర నుంచీ దాని దగ్గరే ఉంది! కేవలం నావిగేషన్ కోసం డాష్బోర్డ్ మీద పెట్టింది అంతే! నేను చేసేది లేక రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి, అది నా కన్నా సూపర్ ఫాస్టుగా రెడీ అయ్యిపోయింది! చిలకాకుపచ్చ పట్టు చీరలో అచ్చం చిలక లానే ముద్దొచ్చేలా ఉంది విజ్జీ! ఇద్దరమూ వెళ్లి పంతులు గారు వేసిన పీటల మీద కూర్చోగానే ఆయన సంకల్పం చెబుతూ విజ్జీ గోత్రం చదువుతూ ( నాకు గోత్రం లేదు మర్చిపోయారా? మా నాన్న ఆర్ఫన్! మావయ్య ఇంటి పేరే నాదీ! మావయ్య వాళ్ల గోత్రమే నాదీ!) “*** గోత్రోధ్బవశ్యః విజయ్ నామధేయశ్యః ధర్మపత్నీ సమేతశ్యః” అంటూ మంత్రం చదువుతూ ఉంటే నేను ఆయనకి అడ్డం పడబోతూ ఉంటే, విజ్జీ నా తొడ మీద గిల్లి “ష్!” అంటూ నన్ను వారించి, కళ్లతోనే సీన్ క్రియేట్ చెయ్యద్దు అన్నట్టు ఓ వార్నింగ్ ఇచ్చేసరికి అన్ని బొక్కలూ మూసుకుని పూజారి గారు చెప్పినట్టే గృహాప్రవేశ పూజ మొత్తం కంప్లీట్ చేశా! అంతా అయ్యాక చివరకి విజ్జీ వంటింట్లోకి వెళ్లి, అక్కడున్న పొయ్యి వెలిగించి పాలు పొంగించి, పాలతో పరవాన్నం వండాక, విజ్జీ అందరికీ పేమెంట్స్ సెటిల్ చేస్తుండగా, ఒక ట్రక్ వచ్చి ఆగింది! అందులోంచి క్యాటరర్స్ దిగి గబ గబా లంచ్ సర్వింగ్ చెయ్యసాగారు! స్వఛ్చమైన తెలుగు భోజనం! వారం రోజుల నుంచీ నార్త్ ఇండియన్ ఫూడ్ తింటున్న నేను, లొట్టలేసుకుంటూ తినడం మొదలెట్టేశాను! విజ్జీ అందరూ తింటున్నారా లేదా? అని చెక్ చేసుకుని వచ్చి అదీ నా పక్కనే కూర్చుని తింది! భోజనాలయ్యిపోయాక, క్యాటరర్స్ వాళ్ల తట్టా బుట్టా ఇంక్లూడింగ్ ఎంగిలి ప్లేట్లు మొత్తం సర్దేసుకుని తుర్రుమన్నారు!

టైం చూస్తే సాయంత్రం నాలుగయ్యింది! “దీనెమ్మ! విజ్జీ పక్కనుంటే టైమే తెలియదురా నీకు!” అని నన్ను నేను తిట్టుకుంటూ అప్పుడు పరిశీలించాను మేము గృహాప్రవేశం చేసిన ప్రాపర్టీ! ప్రైవేట్ బీచ్ సహా, ఆ ప్రాపర్టీ ఓ ఆరెకరాలు ఉంటది! చుట్టూ పదడుగుల కాంపౌండ్ వాల్! దాని మీద ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్! మెయిన్ గేట్ పక్కనే ఓ నాలుగు రూములు విత్ అటాచ్డ్ బాత్రూంస్ ఉన్నాయి! సర్వెంట్ క్వార్టర్స్ అవి! అక్కడినుంచి ఓ 50 గజాలు రాగానే ఓ మూడంతస్థుల మేడ! కాదు ట్రిప్లెక్స్ ఇల్లు! పోర్టికో దాటి మెయిన్ డోర్లోంచి ఎంటర్ కాగానే పీ.ఓ.పీతో చేసిన కుండ పట్టుకుని వయ్యారంగా నుంచుని ఉన్న ఓ అమ్మాయి 20 అడుగుల బొమ్మ! కుండలోంచి ఓ ఫౌంటెయిన్ ధారగా పైనుంచి కింద దాకా కారుతోంది! కింద ఓ పాండ్ లా ఉంది! దానికి కొంచెం దూరం లో రెండు పెద్ద సోఫాలూ, ఓ వాల్ మౌంట్ టీవీ! కొంచెం పక్కగా రివాల్వింగ్ స్టెయిర్ కేస్, ఓ బుడ్డ లిఫ్ట్! అమ్మాయి బొమ్మకి రెండో సైడ్ ఓ బార్ కౌంటర్! దాని వెనకాలే కిచన్! సిటౌట్ ఏరియా లోంచి బ్యాక్ సైడ్ కి వెళ్లి చూస్తే ఓ స్విమ్మింగ్ పూల్! లిఫ్టులో పైకి వెళ్తే అక్కడ మళ్లీ చిన్న హాల్ విత్ సోఫా సెట్! ఆ హాల్లోంచి మూడు బెడ్రూములు ఓపెన్ అవుతున్నాయి! నాలుగో సైడ్ రైలింగూ, దాన్ని ఆనుకుని అమ్మాయి బొమ్మా! మూడు బెడ్రూములకీ బాల్కనీలు ఉన్నాయి! నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ మాస్టర్ బెడ్రూం విత్ జకూజీ, పెద్ద బాల్కనీ విత్ సీ వ్యూ, చిన్న రూఫ్ గార్డెన్, అందులో మినీ బార్ ఉన్నాయి! రూఫ్ గార్డెన్ లోంచి పూల్ లోకి ట్యూబ్ స్లైడర్ ఉంది! పూల్ చాల పెద్దదే! పూల్ దాటితే ఒక ముప్పై నలభై కొబ్బరి చెట్లూ వాటి మధ్యలో పెంచిన గార్డెనూ! కొబ్బరి చెట్లు దాటిటే బీచ్! ఎవరూ సీ సైడ్ నుంచి ఎంటర్ కాకుండా ఓ ఇరవై అడుగుల రెమూవబుల్ జాలీ వాల్ ఉంది! మెకానికల్గా వీల్ తిప్పితే ఆ వాల్ రిట్రాక్ట్ అవుతుంది అనుకుంటా! ఓ పక్కన కాంపౌండ్ వాల్ దగ్గర ఓ మోటరుంది! బహుశా ఆటొమాటిక్ రిట్రాక్షన్ అనుకుంటా! అది ఫెయిల్ అయితే మెకానికల్ అనుకుంటా!

సర్వెంట్ క్వార్టర్స్ కి కొంచెం దూరంలోనే జెనరేటర్ రూం ఉంది! రెండు సైలెంట్ జనరేటర్లు చాలా పెద్దవి ఉన్నాయక్కడ! ఒక దానికి ఒకటి ఫాల్ బ్యాక్ అనుకుంటా! ఇవ్వన్నీ చెక్ చేసి వచ్చేసరికి, విజ్జీ మళ్లీ స్నానం చేసేసింది! ఓ ట్యాంక్ టాప్, ఓ షార్ట్ వేసుకుని నా కోసం రెడీగా మాస్టర్ బెడ్రూంలో కూర్చుని ఉంది! నేను ఇంటి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆరవ్వసాగింది! ఇంతలో ఒక ఆడామె, ఓ పాతికేళ్లు ఉంటాయేమో, ట్రే లో మూడు రకాల బిస్కట్లూ కాఫీ పాట్, మిల్క్ పాట్ పెట్టుకుని వచ్చి డోర్ నాక్ చేసి ఓ టీపాయి మీద పెట్టి వెళ్లి పోతూ ఉంటే, విజ్జీ “శాంతమ్మా! రాత్రికి మేము భోజనం చెయ్యము! వీలుంటే ఇడ్లీలు వండెయ్యి! మీరేం తింటారో మీ ఇష్టం!” అని చెప్పగానే, ఆ శాంతమ్మ అనబడే అమ్మాయి, “అమ్మగారూ, క్యాటరింగ్ వాళ్లు వదిలేసి వెళ్లినవే చాలా ఉన్నాయమ్మా! మాకు ఈ పూటకి అవి చాలు! ఎన్ని ఇడ్లీ వండమంటారమ్మా?” అని అడిగేసరికి విజ్జీ నా వైపు సంశయంగా చూసేసరికి, నేను 5 చూపించా! తను “మూడు ప్లేట్లు పెట్టు శాంతమ్మా! ఇందాక కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా! అవి పారెయ్యకూడదు! వాటితో కొబ్బరి పచ్చడి చేసెయ్యి!” అంటూ పురమాయించి పంపించేసింది! ఆ అమ్మాయి వెళ్లాక విజ్జీ నావైపు చూస్తూ, “నువ్వేంటీ కొత్త పెళ్లికొడుకులా ఇట్లానే ఈ పట్టుబట్టల్లో ఉండిపోతావా? మార్చుకుంటావా?” అని అడిగేసరికి, నేను తల ఊపుతూ కాఫీ కలుపుని తాగేసి, నా సూట్కేస్ ఓపెన్ చేస్తూ ఉంటే, “అందులో కాదు అక్కడ!” అంటూ వార్డ్ రోబ్ వైపు చూపించింది విజ్జీ! దాన్ని ఓపెన్ చెయ్యగానే, నాకు ఇష్టమైన డ్రెసెస్ అన్నీ నీటుగా సర్ది ఉన్నాయి! దాన్ని ఏం కెలికినా ఇప్పుడు సివంగిలా నా మీద పడిపోతుందని నోరు మూసుకుని, ఓ షార్టూ టీ-షర్టూ వెతుక్కుని బాత్రూంలో దూరి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి, చీకట్లు పడుతున్నాయి!