పెద్దమ్మ Part 12

అపార్ట్మెంట్ చేరుకుని నేరుగా చివరి బిల్డింగ్ దగ్గర దిగాము . లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ చేరుకున్నాము .
బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ………. వెళ్లి మీ అమ్మమ్మలను సర్ప్రైజ్ చెయ్యండి .
బుజ్జితల్లులు : మా డాడీ always బెస్ట్ – లవ్ యు soooooo మచ్ డాడీ డాడీ అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగి , అన్నయ్యలూ …….. ష్ ష్ అంటూ ఇంటివైపు అడుగులువేస్తున్నారు .
అంతలోనే చెల్లెమ్మలు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి సర్ప్రైజ్ బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……… , మీకెలా ఉందో తెలియదుకానీ వారం నుండీ అమ్మలు మీకోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు – మీ బుజ్జి బుజ్జి అడుగుల చప్పుడుకే మీరని పసిగట్టి పులకించిపోతున్నారు లోపల వెళ్ళండి వెళ్ళండి …….. అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి మావైపుకు పరుగునవచ్చారు .
దేవత : చెల్లెమ్మలూ ……… అంటూ బుజ్జాయిలు కిందకుదిగగానే చుట్టేసినా నా చేతిని వదిలి కౌగిలించుకోబోయింది .
దేవత కౌగిలిని తప్పించుకునివచ్చి అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ నా గుండెలపైకి చేరారు .
గాడెస్ …….. దెబ్బ అదుర్స్ కదూ …….. పిల్లలందరినీ మీవైపు టర్న్ చేసుకున్నారు కదా అని కవ్విముగా కన్నుకొట్టాను .
చెల్లెమ్మలు : అన్నయ్యా అన్నయ్యా ……… మీ కొత్త దేవత మా ప్రియమైన అక్కయ్యను పరిచయం చేయరా ………
ప్రక్కనే ఉంది కదా ఏమిచేసుకుంటారో మీ ఇష్టం – మీ అక్కయ్యను పట్టించుకోకుండా నా కౌగిలిలోకి వచ్చినందుకు లవ్ యు చెల్లెమ్మలూ ………. , గాడెస్ ……… ప్రియమైన దెబ్బ అదుర్స్ కదూ …………
చెల్లెమ్మలు : నిజమే కదా , మా అక్కయ్యలకు కూడా తెలిసిందే ………. , మాకు మా అక్కయ్యల కంటే మా అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టం – మా అన్నయ్య కంటే మా బుజ్జాయిలు ఎక్కువ ఇష్టం . Hi మెహ్రీన్ అక్కయ్యా ………. అని తమను తాము పరిచయం చేసుకున్నారు .
మెహ్రీన్ : ఇంతమంది చెల్లెమ్మల ప్రేమ ఇచ్చారా మై గాడ్ లవ్ యు అంటూ ఆరాధనతో నాకళ్ళల్లోకే చూస్తోంది .

దేవత : తియ్యనికోపంతో వచ్చి , ఒసేయ్ ……… చెల్లెమ్మలకు వాళ్ళ అన్నయ్య అంటేనే ఇష్టమట – మనం మన అమ్మల దగ్గరికి వెళదాము రావే అని లాక్కుని వెళుతోందో వయ్యారంగా నడుమును ఊపుతూ ……….
( ఆఅహ్హ్హ్ ……… ఇందుకు కాదూ మా మగవాళ్ళు మీ కొంగువెనుక కుక్కల్లా ఫాలో అయ్యేది అని నవ్వుకున్నాను ) చెల్లెమ్మలూ చెల్లెమ్మలూ ………. మీ అక్కయ్యల దగ్గరకే వెళ్ళండి – మీకోసం ప్రేమతో స్వయంగా తమ చేతులతో గిఫ్ట్స్ తయారుచేసి తీసుకొచ్చారు – మీ అక్కయ్యలు అలిగితే నాకే ముద్దులు ఇవ్వరు వెళ్లి మీ ప్రేమతో ఆ విలువైన గిఫ్ట్స్ చేజిక్కించుకునేంతవరకూ మీ అక్కయ్యలే ఎక్కువ ఇష్టం అని నమ్మించండి .
చెల్లెమ్మలు : ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు అన్నయ్యా , మా అన్నయ్య బంగారం అని బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మలు ……… మీకోసం కూడా ఎదురుచూస్తున్నారు రండి – అక్కయ్యలూ అక్కయ్యలూ ……… అంటూ లోపలికివెళ్లి తమ అమ్మల గుండెలపై చేరిన దేవతలను చుట్టేసి లవ్ యు లవ్ యు అక్కయ్యలూ ………. , అన్నయ్యతో ఊరికే తమాషాకు చెప్పాము మాకు మీరంటేనే ఇష్టం ఇష్టం అని బుగ్గలపై ముద్దులు కురిపించారు .

దేవతలు : అమ్మలూ ……… చెల్లెమ్మలు ఎలా చూసుకున్నారు ? .
నా తల్లులు చిన్నప్పటి రోజులు గుర్తుచేశారు – అంత ప్రేమతో చూసుకున్నారు .
చెల్లెమ్మలు : పో అమ్మా …….. అంతకంటే ఎక్కువగా చూసుకున్నాము అని చెప్పారుకదా ……..
అవునవును , లవ్ యు బుజ్జితల్లులూ ……….. అని దిష్టి తీసి మురిసిపోయారు .
దేవతలు : లవ్ యు soooooo మచ్ చెల్లెమ్మలూ అని హ్యాండ్ బ్యాగ్స్ నుండి డైమండ్ డాలర్ గల అద్భుతమైన ముత్యాలహారాలను బహుకరించారు .
చెల్లెమ్మలు : wow ……. ముత్యాలు – డైమండ్ , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ……. మా ఆక్కయ్యలు మాకోసం స్వయంగా చేతులతో ………., ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అక్కయ్యలూ అని ప్రాణంలా కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
దేవతలు : లవ్ యు చెల్లెమ్మలూ …….. మీకోసం హారం తయారుచెయ్యడంలో ఆనందం ఉంది .
బుజ్జితల్లులు : ఒసేయ్ అమ్మలూ ……… మిమ్మల్నీ …….. మొత్తం క్రెడిట్ మీరే దొబ్బేస్తున్నారు కదూ ……… అని తియ్యనికోపాలతో చూస్తున్నారు .
చెల్లెమ్మలు : అక్కయ్యలూ ……….
దేవతలు : అంటే ముత్యాలు సెలెక్ట్ చేసి అందించారు అంతే , మిగతాది మేము పూర్తిచేసాము అని తలలుధించుకుని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
చెల్లెమ్మలు : ఈ అందమైన ముత్యాల సెలక్షన్ మా బుజ్జితల్లులది అన్నమాట అంటే ఫస్ట్ క్రెడిట్ మా బుజ్జితల్లులదే అని దేవతల బుగ్గలపై ప్రేమతో కొరికేసి బుజ్జితల్లులను ముద్దులతో ముంచెత్తారు .
బుజ్జితల్లులు : లేదులే అక్కయ్యలూ ……… , కొద్దిగా మాకు ఎక్కువగా అమ్మలదే క్రెడిట్ ………. , డాడీ డాడీ …….. చూసారా అమ్మమ్మలు ఎన్ని గిఫ్ట్స్ తెచ్చారో మాకోసం .
Wow ………
బుజ్జాయిల అమ్మమ్మలిద్దరూ వచ్చి నా పాదాలను తాకాబోయారు .
అమ్మలూ ……… నాకు కూడా మీరు అమ్మలతో సమానం , మీరు ఆశీర్వదించాలి – మేము ఆశీర్వాదం పొందాలి అని పాదాలను స్పృశించాను .
మా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండు బాబూ ……….
అమ్మలూ ……… నిండు నూరేళ్లూ మీ తల్లులూ – మన బుజ్జాయిల ఆనందాలను చూస్తూ ఇలానే మురిసిపోతూ మమ్మల్ని ఇలానే ప్రేమతో చూసుకోవాలి .
అంతకంటే అదృష్టం అని బుజ్జాయిలను ఎత్తుకుని ఆనందిస్తున్నారు .
లవ్ యు శ్రీవారూ – మై గాడ్ ……… అంటూ దేవతలిద్దరూ నా చేతులను చుట్టేసి పట్టరాని సంతోషంతో నా బుగ్గలను కాస్త గట్టిగానే కొరికేశారు .
స్స్స్ స్స్స్ …….. బుజ్జాయిలూ ………
చెల్లెమ్మలు – అమ్మలు ……… నవ్వుకున్నారు .
చెల్లెమ్మలు : అక్కయ్యలూ ……… మీ బహుమతులను మీచేతులతోనే అలంకరిస్తే మాకు మరింత ఆనందం .
దేవతలు : లవ్ యు చెల్లెమ్మలూ …….. నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టి అలంకరించారు .
నా వెలిగిపోతున్న ముఖాన్ని చూసి , మా అన్నయ్య కళ్ళే చెబుతున్నాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నామో …….. లవ్ యు అక్కయ్యలూ అని ప్రేమతో కౌగిలించుకుని పరవశిస్తున్నారు .
చెల్లెమ్మలూ ……….. ఒక్క హారంతో మీ ఆక్కయ్యలు మిమ్మల్ని ఏంజెల్స్ ను చేసేసారు ……… మా డిస్టినే తగిలేలా ఉంది .
బుజ్జితల్లులు : అవును డాడీ ………. ఆక్కయ్యలు బ్యూటిఫుల్ ……..
చెల్లెమ్మలు : లవ్ యు బుజ్జితల్లులూ ……… అని పులకించిపోయారు .

కాలింగ్ బెల్ మ్రోగడంతో వెనక్కుతిరిగిచూస్తే సెక్యూరిటీ ……. , అన్నయ్యా ……. ఎలా ఉన్నారు అంటూ బయటకువెళ్లాను .
ఆ పిలుపుకే మురిసిపోయి సూపర్ సర్ ……… , డిస్టర్బ్ చేసినందుకు sorry సర్ , ఎందుకొచ్చానంటే మీరు గోవా వెళ్లిన మారుసటిరోజు నుండి మిమ్మల్ని కలవాలని రోజూ చాలామంది కింద గేట్ దగ్గరకు వచ్చి మీరు ఇంకా రాలేదని నిరాశ చెందినా మీరు గోవాలో సంతోషంగా గడపాలని మనసారా చెప్పి వెళ్లిపోతున్నారు సర్ – ఈరోజు కూడా ఉదయం వచ్చి కొద్దిసేపటివరకూ ఉండి వెళ్లారు సర్ – వారి కట్టూ బొట్టు కాస్త వింతగా ఉన్నాయి సర్ అడవిలో ఉండేవాళ్ళల్లా …… కానీ చాలా చాలా మంచివారిలా కనిపించారు .
ఎవరు అన్నా ……….
సెక్యురిటి : ప్చ్ ……… కొత్తలో నాకూ కాస్త భయం వేసి 100 కు కాల్ చేసాను సర్ …….. , సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి అందరినీ స్టేషన్ కు తీసుకెళ్లారు . ఆ వెంటనే మీరంటే ఇష్టమైన సెక్యూరిటీ అధికారి కమీషనర్ విశ్వ సర్ …….. వాళ్ళతోపాటు వచ్చి సెక్యూరిటీ మహేష్ కోసం రోజూ వస్తారు – వీరి ఇష్టప్రకారం ఎంతసేపు ఉంటే అంతసేపూ ఏలోటూ లేకుండా చూసుకోవాలి . మీరు చెబితే ok సర్ అని బదులిచ్చాను – విశ్వ సర్ వెళ్ళాక అందరికీ sorry చెప్పి లోపలికి రమ్మని పిలిచాను సర్ ………
దానికి వారు మా దేవుడు ఉంటున్న దేవాలయం ఇక్కడే ఉంది వేచిచూస్తాము అని సాయంత్రం వరకూ బయటే ఎండలోనే ఉండి చీకటి పడేముందు నడుచుకుంటూ వెళ్లిపోయేవారు సర్ ……..
ఎవరై ఉంటారు అన్నా ………..
సెక్యురిటి : విశ్వ సర్ ను కలిస్తే ఎవరని తెలుస్తుంది సర్ ……….
కదా …….. ఇప్పుడే వెళతాను .
సెక్యురిటి : ok సర్ అని సెల్యూట్ చేసి కిందకు వెళ్ళాడు .

లోపలికివచ్చి దేవతలూ ……… చిన్నపని రోజూ మనకోసం ఎవరో కొంతమంది అపార్ట్మెంట్ కు వస్తున్నారట , వారెవరో స్టేషన్ కు వెళ్లి తెలుసుకునివస్తాను .
చెల్లెమ్మలు : అవునన్నయ్యా …….. కొంతమంది కాదు చాలామంది , అడవులలో నివసించే గూడెం వాళ్ళు అనుకుంటాను .
బుజ్జితల్లి – బిస్వాస్ : వారేనా అని థింక్ చేస్తున్నట్లు నావైపు సైగలు చేస్తున్నారు . డాడీ డాడీ …….. మేమూ వస్తాము .
బుజ్జితల్లులూ ………. మీ అమ్మమ్మల నుండి మిమ్మల్ని అంతలోనే వేరుచెయ్యడం అతిపెద్దతప్పు ……….
బుజ్జితల్లులు : అమ్మమ్మలు వచ్చినది వాళ్ళ కూతుర్లకోసం – ఇద్దరికోసం వస్తే ఇక్కడ బోలెడంతమంది కూతుర్ల ప్రేమలో మిమ్మల్ని పట్టించుకోకపోతే లవ్ యు బుజ్జాయిలూ ……… అని అన్నారోలేదో అడగండి .
అమ్మలిద్దరూ ………. తియ్యదనంతో నవ్వుకున్నారు . బాబూ …….. తీసుకెళ్లండి లేకపోతే భీభత్సం సృష్టించేలా ఉన్నారు మా బుజ్జిదేవతలు అని నాకు అందించారు.
బుజ్జితల్లులు : లవ్ యు అమ్మమ్మలూ ………
అమ్మలు : అమ్మో ……… , అల్లరిలో మా కూతుర్లని మించిపోయారు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తల్లులూ …….. మీరేమీ తక్కువకాదు మీ అల్లరితో మూడు చెరువుల నీళ్లు తాగించేవాళ్ళు అని మురిసిపోతున్నారు .
దేవతలు : సిగ్గుపడి , లవ్ యు అమ్మా …….. అంటూ హత్తుకున్నారు .
అమ్మలు : తల్లులూ ……… ఆ అల్లరిని మళ్లీ ఆస్వాదించలేమోనని బాధపడని రోజంటూ లేదు , మా బుజ్జాయిల వలన మళ్లీ చూడగలుగుతున్నాము అని బుజ్జాయిలకు దిష్టి తీశారు .

బుజ్జాయిలిద్దరూ కూడా మావేనుకే రావడం చూసి మోకాళ్లపై కూర్చుని , బుజ్జి హీరోలూ ఎక్కడికి ……… , మీ అమ్మమ్మలకు – అమ్మలకు – అక్కయ్యలకు తోడుగా ఒక్క హీరో లేకపోతే ఎలా ? – హ్యాపీగా వెళ్లి రాగలమా ……..
బుజ్జితల్లులు : అవునన్నయ్యలూ ………
బుజ్జాయిలు : నిజమే ……… , డాడీ …….. మీరు ఇక్కడ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిరండి , మేము చూసుకుంటాము .
లవ్ యు soooooo మచ్ , goddesssess …….. అమ్మలు – చెల్లెమ్మలు జాగ్రత్త లవ్ యు అని సిగ్గుపడేలా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బుజ్జితల్లులను గుండెలపై చెరొకవైపు హత్తుకుని పాటలుపాడుతూ కిందకువచ్చి కారులో బయలుదేరాము .

బుజ్జాయిలిద్దరినీ గుండెలపై హత్తుకుని ముద్దులను ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. కీర్తి తల్లీ …….. మీ ఆక్కయ్యలు అడవిలో ఉండేవాళ్ళల్లా ఉన్నారు అని తెలపగానే …….. , నీ బెస్ట్ ఫ్రెండ్ చెవిలో ఏదో గుసగుసలాడి సైగలు చేసావు . వాళ్ళెవరో నీకు తెలుసా బంగారూ ……….
కీర్తి తల్లి : మీకు కూడా తెలుసుకదా డాడీ …….. , మీరు పెద్దమ్మ అన్నయ్యతోపాటు గుడికి వెళ్ళినప్పుడు అడవిలో నివసించే గూడెం మనుషులు వారి గూడెం దేవత సంబరాలకు వచ్చినప్పుడు పెద్దయ్యను , గూడెం అంటీ వాళ్ళను , మా బుజ్జి ఫ్రెండ్స్ ను కలిసి కోలాటం మొదలుకుని వారి నృత్యాలన్నీ ఎంజాయ్ చేసాము కదా వాళ్లేనేమో అని అనుమానం ………..
గుర్తొచ్చింది గుర్తొచ్చింది బుజ్జితల్లీ ………. , మీ అమ్మలు ఈ హృదయమంతా ఆక్రమించిన తరువాత వారి సంతోషాలు తప్ప ఏవీ గుర్తుకురావడం లేదు .
బుజ్జితల్లులు : కేవలం మీ దేవతలు మాత్రమేనా , మేమేమైనా ఉన్నామా డాడీ ? .
నా బుజ్జితల్లులు – బుజ్జాయిలు లేకుండానా అని స్టీరింగ్ వదిలి ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తున్నాను .
బుజ్జితల్లులు : బుజ్జి బుజ్జి నవ్వులతో పులకించిపోతూనే డాడీ డాడీ …….. స్టీరింగ్ అని కేకలువెయ్యడంతో పట్టుకుని నవ్వుకున్నాము .

20నిమిషాలలో కమీషనర్ ఆఫీస్ కు చేరుకుని , బుజ్జితల్లులను ఎత్తుకుని లోపలికివెళ్ళాను .
ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు . Fax నుండి పేపర్ లను కలెక్ట్ చేస్తున్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి సర్ …….. విశ్వ సర్ ను కలవాలి .
కానిస్టేబుల్ : ఎవరు బాబూ నువ్వు ఏకంగా కమీషనర్ గారినే కలవాలని చెబుతున్నావు అది అంత ఈజీ అనుకున్నావా ? పనేంటో నాకు చెప్పు ముందు ………. అని మావైపు చూసి సర్ సర్ అంటూ సెల్యూట్ చేశారు . హెడ్ గారూ ……. మహేష్ సర్ వచ్చారు అనగానే ………
ఆఫీస్ లో ఉన్న కానిస్టేబుల్స్ మొదలుకుని S* సర్ – C* సర్ – S* సర్ ……… అందరూ వచ్చి సెల్యూట్ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *