దేవతలు : ( పెద్దమ్మ చెప్పినది నిజమే శ్రీవారు – బుజ్జాయిలు తట్టుకోలేరు ) కన్నీళ్లను తుడుచుకుని లేదు లేదు బుజ్జాయిలూ అంటూ ఎత్తి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు . మా కన్నీళ్లను తుడిచి పెద్దమ్మ వెళ్ళిపోయింది నిజమే , మామూలుగా అయితే పిలవగానే వచ్చేవారు ఈసారి ఆలస్యం అవుతుంది , ఎంత ఆలస్యమో చెప్పలేను ఎందుకనేది ఈ రాత్రికి తెలుస్తుంది – మన దేవుడి హృదయంలో నా స్థానాన్ని మరొకరికి ఇచ్చే సమయం ఆసన్నమయ్యింది అని చెప్పారు .
నో …….. నో అంటే నో …….. , అలా ఎప్పటికీ జరగనే జరగదు . పెద్దమ్మ స్థానాన్ని ఆక్రమించేది దేవలోకపు అతిలోక సుందరి అయినా కన్నెత్తి కూడా చూడను – గూడెం కు వెళుతున్నాము , గూడెం ప్రజల అభిమానాన్ని పొందుతున్నాము ఆ వెంటనే వైజాగ్ వెళ్లిపోతున్నాము అని దేవతల ఒడిలో ఉన్న బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి డ్రైవింగ్ సీట్లోకి చేరి పెద్దమ్మా పెద్దమ్మా …….. అని తలుచుకుంటూ పోనిచ్చాను .
దేవతలు : మై గాడ్ ……… వెళ్ళొస్తాను అని మీకు మాటిచ్చారు కాబట్టి తప్పకుండా వస్తారు – అలాగే పెద్దమ్మ చెప్పినట్లు మీ హృదయంలోని పెద్దమ్మ స్థానాన్ని కూడా ………..
లేదు లేదు ……… పెద్దమ్మా ఈ ఒక్కటీ మాత్రం జరగనే జరుగకూడదు please please మీరు లేకుండా నేను , మీ తల్లులూ , బుజ్జాయిలు ఉండనేలేము – మీరు లేకుండా మా పెదాలపై చిరునవ్వు కూడా చిగురించదు అంతే ……… what do you say బుజ్జాయిలూ ? .
బుజ్జాయిలు : yes yes డాడీ డాడీ , we are with you అని ఏడుస్తూనే ఉన్నారు .
దేవతలు : విషయం తెలియగానే మీరు ఇలా ప్రవర్తిస్తారని కూడా చెప్పింది పెద్దమ్మ , ఒక్కసారి గూడెం లోకి అడుగుపెట్టాక నా దేవుడి హృదయంలో నా స్థానం ఖాళీ అవుతుంది – ఆ స్థానంలో ……….
Goddessess నో ……. , ఈ ప్లాన్ లో మీరూ భాగమేనా ………
బుజ్జాయిలు : కోపంతో దేవతలను కొడుతున్నారు .
దేవతలు : లేదు లేదు శ్రీవారూ …….. మన జీవితంలోకి చెల్లి రాబోతోందు అంటే ఎంత ఆనందించామో , పెద్దమ్మ స్థానం ఆక్రమిస్తుంది అని తెలియగానే ఇంతకంటే ఎక్కువ కన్నీళ్లను కార్చాము అని బుజ్జాయిలను హత్తుకున్నారు – వెళుతూ మాత్రం ఒక్కసారి మీ చెల్లిని చూశాక నేను ఏమాత్రం గుర్తుండనులే మన శ్రీవారికి అంత సౌందర్యారాసి నా కావ్యా తల్లి – మెహ్రీన్ తల్లి సౌందర్యం తరువాత తనే …….. , మన శ్రీవారి హృదయంలో నా తల్లులతో స్థానం ఆక్రమించాల్సిన అన్ని అర్హతలూ ఉన్నది ఆ తల్లికే …….. శ్రీవారూ మీకే తెలుస్తుందిలే – తనను చూసిన తరువాత మీ హృదయంలో కొద్దిగానైనా స్థానం ఇవ్వమని ప్రాధేయపడినా మీరే ఇవ్వరు అని తియ్యనైన నవ్వులతో తెలిపారు .
అలా జరగనే జరగదు దేవతలూ ………. గూడెంలో 10 నిమిషాలకంటే ఎక్కువ ఉండము అలా వెళ్లడం వెనక్కు వచ్చెయ్యడం – అక్కడ కూడా ఒక్క అమ్మాయిని కూడా చూసేదేలేదు తలదించుకునే ఉంటాను .
దేవతలు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : డాడీ బాధపడుతుంటే మీకు నవ్వు వస్తోందా అని దెబ్బలు కొడుతున్నారు .
దేవతలు : నవ్వుతూనే , మీ గురించి కూడా చెప్పారు పెద్దమ్మ – కొద్దిసేపట్లో కనిపించే కొత్త అమ్మను చూసి ఈ పెద్దమ్మను పూర్తిగా మరిచిపోతారట …….
బుజ్జాయిలు : మేమా ……. పెద్దమ్మను ఎలా ఎలా అమ్మలూ పెద్దమ్మ ఇక్కడ ఇక్కడ ఉంటారు .
దేవతలు : ఈ మాట అంటారు అనికూడా చెప్పారులే అని నవ్వుకున్నారు – మా అందాల చెల్లికి మీరంటే అంత ప్రాణమట ………
బుజ్జాయిలు : పెద్దమ్మ చెప్పారంటే జరిగి తీరుతుంది కదా , కొత్త అమ్మకు మేమంటే అంత ప్రాణమా ……… అని ఆలోచనలో పడ్డారు .
దేవతలు : నవ్వుకుని ప్రాణమైన ముద్దులుపెట్టారు – శ్రీవారి కోపం చల్లారేలా లేదు – బుజ్జాయిలూ …….. ఈ విషయం కూడా చెప్పారు , మీ కొత్త అమ్మను చూడగానే కోపం మాయమై తియ్యని మాధుర్యం పరిమలిస్తుందట ……
అలా జరగనే జరగదు దేవతలూ …….. అని సింహద్వారం కనిపించడంతో కారు ఆపాను . సింహ ద్వారానికి ఇరువైపులా కాగడాల వెలుగులు లోపలికి దారిని చూస్తున్నాయి .
బుజ్జాయిలూ ……… సింహ ద్వారం ద్వారా కారు వెళ్లేలా లేదు , అక్కడ కొంతమంది ఉన్నారు వేరే మార్గమేదైనా ఉందేమో కనుక్కుంటాను . చుట్టూ చీకటిగా ఉంది మీరు కిందకు దిగకండి .
బుజ్జితల్లులు : మాకు భయం భయం డాడీ డాడీ అంటూ నా గుండెలపైకి చేరారు .
బుజ్జితల్లులను ఎత్తుకునే కిందకుదిగాను .
నన్ను చూడగానే మహేష్ దొర ……. దొరా దొరా అంటూ అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు .
ఇన్నిరోజులకు మమ్మల్ని కారుణించారా దొరా …….. మీకోసమే రోజుల తరబడి కాదు కాదు ఏళ్లుగా ఎదురుచూస్తున్నాము దొరా ఇక మాకు సంబరాలే సంబరాలు , రేయ్ మల్లన్నా …….. శంఖం మ్రోగించరా అని కేకలు వేశారు .
కొంతమంది సింహద్వారం ప్రక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లి శంఖం తోపాటు పెద్ద ఎత్తున గంటలు మ్రోగించారు – ఆ వెంటనే సింహద్వారం లోపల చాలాదూరం నుండి శంఖం – గంటలు మ్రోగుతున్నాయి .
బుజ్జితల్లులిద్దరూ చిన్న దేవాలయంలోని దేవతకు రెండుచేతులూ జోడించి మొక్కుతున్నారు . దేవతలు …….. బుజ్జాయిలను ఎత్తుకుని కారులోనుండి మా దగ్గరికివచ్చి శ్రీవారూ – శ్రీవారూ ………
దేవతలను చూసి దండాలు తల్లీ దండాలు అని గౌరవిస్తున్నారు .
అన్నలూ ……… మేమేవరో మీకు తెలుసా ? .
వాళ్ళు : మా ఆడబిడ్డలను కాపాడిన దేవుడు సామీ మీరు – మీ సాగభాగమైన ఇల్లాళ్ళు పిల్లలు . మీకోసం …….. మా బిడ్డలను కాపాడిన రోజు నుండే కాదు సామీ కొన్నేళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్నాము .
దేవతలు : పెద్దమ్మ చెప్పారు శ్రీవారూ ………
ప్రేమతో ఇద్దరి నుదుటిపై నా నుదుటితో కొట్టాను .
దేవతలు : స్స్స్ స్స్స్ …….. పెద్దమ్మ చెబితే మమ్మల్ని కొడుతున్నారా ……..
సంవత్సరాలుగానా ……. నాకోసమా ……. ఎందుకు అన్నయ్యలూ ? .
వాళ్ళు : మా గూడానికి వస్తే తమరికే ఎరకౌతుంది దొరా …….. , మీరు ఈపూట వస్తారని తెలిసే మా గూడెం బాగోగులు చూసుకునే అవ్వ తెలిపారు . అందుకే మేము మీకోసం ఇక్కడ ఎదురుచూస్తున్నాము దొరా ………
అవ్వనా ……. ? .
వాళ్ళు : అవును దొరా ……… , ఆ అవ్వకు భవిష్యత్తు ఎరుక – మీరు అడవిలోపలికి వస్తున్నారని మమ్మల్ని పంపారు , గూడెం కు వెళదాము రండి దొరా ……. , పెద్దయ్య – మా ఇల్లాళ్ళు , బుజ్జి బిడ్డలూ …….. మీ బుజ్జి స్నేహితురాళ్లు ఎదురుచూస్తుండారు ……..
బుజ్జాయిలు : యాహూ ……… డాడీ డాడీ తొందరగా వెళదాము .
అలాగే బుజ్జాయిలూ …… అని ముద్దులుపెట్టాను . అన్నయ్యలూ …….. లోపలికి వెళ్ళడానికి పెద్ద మార్గమేమైనా ఉందా ? .
వాళ్ళు : లేదు దొరా ……… , ఇక్కడ నుండి ఒక్క వాహనం కూడా వెళ్లరాదనే అవ్వ ఆ కాలంలోనే ఈ సింహద్వారాన్ని కట్టించారు ఇలా – మీకోసం పగలగొట్టేస్తాము దొరా ……….
డాడీ డాడీ ………
మీ ఇష్టమే మా ఇష్టం బుజ్జాయిలూ ……… , అన్నలూ ……. మీ సాంప్రదాయాలంటే మాకు గౌరవం – మేమూ నడుచుకుంటూనే వస్తాము .
లవ్ యు soooooo మచ్ డాడీ ………
వాళ్ళు : దండాలు దండాలు దొరా ……… అని మాకు ఇరువైపులా కాగడాలతో దారిని చూయిస్తూ లోపలికి నడిచారు .
దేవతలతోపాటు దేవతను మొక్కుకుని వారితోపాటు నడకదారి సాగించాము .
డాడీ డాడీ …….. చుట్టూ చీకటి – ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి అని గట్టిగా చుట్టేశారు .
దట్టమైన అడవిలోపలికి వచ్చేసాము కదా బుజ్జాయిలూ ……. జంతువుల శబ్దాలు – మీరు వైజాగ్ జూ లో చూసారే ఆ జంతువులన్నీ ఇక్కడ బోలెడన్ని స్వేచ్ఛగా తిరుగుతుంటాయి .
వాళ్ళు : బిడ్డలూ …….. ఇంతకుముందు వినిపించింది పులి , చిరుతలవి – ఇప్పుడు వినిపిస్తున్నవి సింహాల గాండ్రిమ్పులు ………. గూడెం లో అయితే జింకలు కుందేళ్లు కోతులు బుజ్జి ఏనుగులు ………. చాలా ఉంటాయి మీ బుజ్జి స్నేహితులతోపాటు ఆడుకోవచ్చు .
పులి సింహం అనగానే భయపడినా జింకలు – కుందేళ్లు అనగానే చిరునవ్వులు చిందిస్తున్నారు . డాడీ డాడీ …….. ఇంకెంత దూరం ? .
వాళ్ళు : అదిగో అల్లంతదూరంలో కాగడాల వెలుగులు కనిపిస్తున్నాయే అదే మన గూడెం బిడ్డలూ ……… , అలాంటి గూడెం లు అడవినిండా ఉంటాయి .
మరికొన్ని అడుగులువెయ్యగానే మరికొంతమంది చిరునవ్వులు చిందిస్తూ వచ్చి దండాలు దొరా దండాలు మా జన్మ ధన్యం అయ్యింది అంటూ సాదరంగా గూడెం కు తీసుకెళ్లారు .
అందరూ : బిడ్డలూ ……. ఇదే మన గూడెం .
లోపలికి అడుగుపెట్టగానే డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు . గూడెం లో ఉన్న ప్రతీఒక్కరూ సంతోషంతో మా చుట్టూ చేరారు .
బుజ్జితల్లి : డాడీ …….. అదిగో పెద్దయ్య .
పెద్దయ్య వచ్చి నా మెడలో పూలహారం వేసి సాధారంగా ఆహ్వానించారు . రేయ్ …….. దేవుడే స్వయంగా మన గూడానికి విచ్చేసిండ్రు సంబరాలు అంబరాన్ని అంటాలి అని ఆజ్ఞాపించడం ఆలస్యం గూడెం మొత్తం కాగడాల వెలుగులతో వెలిగిపోయింది .
దేవతలు – బుజ్జాయిలు …….. సంభ్రమాశ్చర్యాలకు లోనై చుట్టూ చూస్తున్నారు .
పెద్దయ్య : బిడ్డలూ ……… ఇక మిమ్మల్ని ఆపము .
అన్నయ్యా అన్నయ్యా …….. అంటూ నేను రక్షించిన చెల్లెమ్మలు అనుకుంటాను , వచ్చి నా గుండెలపైకి చేరారు – చెల్లెమ్మల తల్లిదండ్రులు చేతులెత్తి దండాలు పెడుతున్నారు .
బుజ్జితల్లులు : డాడీ – మమ్మీ …….. మమ్మల్ని కిందకు దించితే మా ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాము మావైపు ఆశతో చూస్తున్నారు .
లవ్ టు అంటూ ముద్దులుపెట్టి కిందకుదించాము .
చెల్లెమ్మల కన్నీళ్లను తుడిచి , పెద్దయ్యా ……… మీరు ఇంతమంది ఉన్నా ఎలా తీసుకెళ్లారు ? .
సమయం చూసి మంచినీళ్లు కోసం దగ్గరలోని వాగుదగ్గరకు వెళ్లిన మా బిడ్డలను కాపు కాశీ మత్తుమందు ఇచ్చి తీసుకెళ్లారు . మీరు రక్షించకపోయి ఉంటే మా బిడ్డలను మళ్లీ చూసేవాళ్ళము కాదు అని కన్నీళ్ళతో దండాలు పెట్టారు . మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది .
అంతా దైవేచ్చ ………. చెల్లెమ్మలు సేఫ్ గా మిమ్మల్ని చేరారు , నా వలన రక్షిoపబడటం పైనున్న దేవుళ్ళు నాకు అందించిన అదృష్టం – లేకపోతే మీ అందరి ఆప్యాయతలను పొందేవాడిని కాదు – దీనికి నేనే మీకు రుణపడిపోయాను అని దండాలు పెట్టాను .
దొరా దొరా ……… అంతపెద్ద శిక్ష వెయ్యకండి మా దేవుడు మీరు ……….
దేవుడు అంటే గుర్తుకువచ్చింది ……… , భవిష్యత్తును చూసే బామ్మ గారు ఉన్నారని అన్నయ్యలు చెప్పారు . చెల్లెమ్మల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించలేదా …………
పెద్దయ్య – అన్నయ్యలు ……… సంతోషంతో నవ్వుకున్నారు . దొరా …….. ఈ ప్రశ్నను ఆ తల్లిని మీరే స్వయంగా అడిగి తెలుసుకోండి అని పవిత్రంగా చూసుకుంటున్నట్లు తాయత్తులు మంత్రాలు కట్టిన గుడిసె వైపుకు దారిని వదిలారు.
చెల్లెమ్మలు : కన్నీళ్లను తుడుహుకుని అన్నయ్యా – అక్కయ్యలూ ……… రండి అని చివరన ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లారు .
బుజ్జాయిలూ – బుజ్జితల్లులూ ……….
డాడీ ……… మాకే సమాధానాలు తెలుసుకోవాలని లేదు – చాలారోజుల తరువాత కలిసాము మా ఫ్రెండ్స్ తో ఆడుకోనిస్తారా లేదా …….. ? .
దేవతలతోపాటు నవ్వుకుని లవ్ యు లవ్ యు ఎంజాయ్ ………
లవ్ యు soooooo మచ్ డాడీ ………..
