పెద్దమ్మ Part 12

లోపలికి వెళితే మంత్రగత్తె నివాసం లా ఉంది . ఎక్కడ చూసినా తాయత్తులు – క్యాండిల్స్ వెలుగులు – గుడిసె మధ్యలో మంత్రాగత్తెలా ఒక బామ్మ చూడగానే భయం వేసేలా కూర్చుని మంత్రాలు పటిస్తున్నారు .
చెల్లెమ్మలు : ఒసేయ్ ఒసేయ్ అన్నయ్య భయపడుతున్నారు – అన్నయ్య ఉన్నందువల్లనేమో ఆక్కయ్యలు భయపడుతున్నట్లు అనిపించడం లేదు అని దేవతలతోపాటు నవ్వుకున్నారు . అన్నయ్యా …….. వెళ్లి అడగండి భవిష్యత్తు ముందే తెలిసినా కూడా మీ చెల్లెమ్మలను వాగు దగ్గరికి ఎందుకు వెళ్లేలా చేశారని …………
వెళ్ళాల్సిందేనా చెల్లెమ్మలూ …………
చెల్లెమ్మలు : వందలమంది రాక్షసుల్లాంటి రౌడీలు గూండాలకు భయపడని మా అన్నయ్య , బామ్మకు భయపడుతున్నారు అని నన్ను ముందుకు తోసారు నవ్వుకుంటూ ……….
శ్రీమతులూ ……… మీరూ రండి నాకు భయమేస్తోంది అని ఇద్దరి చేతులనూ పెనవేసి , వణుకుతూనే వెళ్లి నాలుగైదు అడుగుల ముందే ఆగిపోయాను .

ఆమె సడెన్ గా ఊగడం చూసి దేవతలను గట్టిగా చుట్టేసి , పెద్దమ్మా పెద్దమ్మా ……. అని కళ్ళు మూసుకుని తలుచుకుంటున్నాను .
నాయనా మహేష్ – తల్లులూ కావ్యా , మెహ్రీన్ ………. ఇన్నిరోజులకు మమ్మల్ని అనుగ్రహించడానికి – సంతోషాలను పంచడానికి వచ్చారా , రండి వచ్చి నా ప్రక్కన ఆశీనులు కండి అని మాటలు వినిపించడంతో చూస్తే ……….
ఆ బామ్మ కళ్ళుమూసుకునే మమ్మల్ని గుర్తుపట్టి పిలవడం చూసి మరింతభయమేస్తోంది .
దేవతలు : నవ్వుతున్నారు .
దేవతలూ ……… మీకు భయం వెయ్యడం లేదా ? .
దేవతలు : మా దేవుడి కౌగిలిలో ఉండగా మాకెందుకు భయం అని లాక్కునివెళ్లి బామ్మ ముందు కూర్చోబెట్టారు .
అంత దగ్గర నుండి చూడగానే గుండె ఆగినంత పని అయ్యింది – ( సినిమాల్లో మంత్రగత్తె పాత్రలకు బామ్మగారికి ఇక ఏమాత్రం మేకప్ వెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను ) .
బామ్మ : అయితే సినిమాల్లో అవకాశం ఇప్పిస్తావా నాయనా మహేష్ అని గట్టిగా నవ్వడంతో ………
గుండెపై చేతినివేసుకున్నాను .
దేవతలు : శ్రీవారూ …….. మేమున్న హృదయం ఉన్నది ఎడమవైపున , కుడివైపున కాదు అని నా చేతిని గుండెలపైకి చేర్చి నవ్వుకున్నారు .
అధిచూసి ముందున్న బామ్మ గారు – వెనకున్న చెల్లెమ్మలు నవ్వుతున్నారు.

తియ్యనికోపంతో దేవతల బుగ్గలను కొరికేసాను .
దేవతలు : స్స్స్ స్స్స్ ……… ష్ ష్ , శ్రీవారూ …….. మీ మనసులోని ప్రశ్న అడిగితే మీ కోరిక ప్రాకారం ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చు .
బామ్మ గారు : ప్రశ్న కాదు తల్లులూ ప్రశ్నలు – రెండు ప్రశ్నలు ఉన్నాయి మీ దేవుడి మనసులో ………. , శ్రీవారు అంటే ఎంత ప్రాణమో మీ ఇద్దరికీ – చాలా చాలా సంతోషం .

కూల్ అయ్యి బామ్మ గారూ ………
బామ్మ గారు : తెలుసు తెలుసు నాయనా మహేష్ ……..
అయితే బయట పెద్దయ్యతో మాట్లాడినది విన్నట్లున్నారు , ఇక అడగడం దేనికి మీరే సమాధానమివ్వండి .
బామ్మ గారు : నవ్వుకున్నారు . చూడు నాయనా ఇలా మా బిడ్డలు అపహరణకు గురి అవుతారని నాకు ముందే తెలుసు – మరి ఆపి ఉండచ్చు కదా అంటావు అంతేనా ……… , ఆపి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేవాడివా …….? , నీ అనుగ్రహం మాకు లభించేదా ……… ? – నేను మావాళ్లకు చెప్పి ఉంటే ఎలా ఉన్నారో చూసే ఉంటావు ఒక్కొక్కరూ ఇద్దరిద్దరిని ఈ మట్టిలో పాతేసేవాళ్ళు – నువ్వు ఇక్కడికి రావాలన్నది విధి నాయనా మహేష్ ……… , విధిని ఎవ్వరూ మార్చలేరు – మీ ప్రియాతిప్రియమైన పెద్దమ్మ కూడా ………..
దేవతలు : పెద్దమ్మ కూడా విధిని మార్చలేను అనిచెప్పారు శ్రీవారూ ……. అని నా చేతులను ప్రాణంలా చుట్టేసి భుజాలపై వాలారు .
పెద్దమ్మ …….. , పెద్దమ్మ మీకు తెలుసా బామ్మగారు …….
బామ్మ గారు : 18 ఏళ్ల ముందే తెలుసు . ఇప్పటికైనా నన్ను నమ్ముతావా నాయనా ………..
తలను నిలువు అడ్డుగా ఊపాను ……….. , నిజమే మీరు …….. చెల్లెమ్మలను వాగు దగ్గరకు వెళ్లకుండా ఆపి ఉంటే నేను ఈ క్షణం ఇక్కడ ఉండేవాడినే కాదు – నేను , దేవతలిద్దరూ ఇంత అభిమానాన్ని పొందేవాళ్ళం కాదు – బుజ్జాయిలు ……. కలిసి ఉన్నది కొన్ని గంటలయినా ఇప్పటికీ హృదయంలో గుర్తుచేసుకున్న బుజ్జి ఫ్రెండ్స్ ను కలిసేవాళ్ళూ కాదు . మరి ………. నాకోసం ……..
బామ్మ గారు : నీకోసం ఏళ్లుగా 18 ఏళ్లుగా ఎందుకు ఎదురుచూస్తున్నామనేది నీలో సాగభాగమైన ఇల్లాళ్ళు అడిగే ప్రశ్నతో సమాధానం దొరుకుతుంది . తల్లులూ …….. మోహమాటపడకుండా అడగండి ……..
దేవతలు : థాంక్స్ ……. ధన్యవాదాలు బామ్మగారూ , మీరంతా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న మా దేవుడికి ఇద్దరు భార్యలు ఉండటం ……….
బామ్మగారు : నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి తల్లులూ ………. , దేవుళ్ళకు ఉన్నప్పుడు ” దైవం మనుష్యరూపేణా ” మనిషి రూపంలో ఉన్న దేవుడికి ఉండటంలో తప్పే లేదు . అయినా మీ దేవుడికి మీరిద్దరే కాదు బుజ్జాయిలు మరియు మీ ఇష్టప్రకారమే కొద్దిసేపట్లో ముగ్గురు దేవతల ముద్దుల శ్రీవారు అవ్వబోతున్నారు .
దేవతలు : కొద్దిసేపట్లోనేనా బామ్మగారూ …….. అని సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి కౌగిలించుకున్నారు చెరొకవైపు ………
వెనుక అయితే చెల్లెమ్మలు – గూడెం వాసులు ఒకరినొకరు కౌగిలించుకుని సంబరాలు మొదలెట్టేశారు ………

లేదు లేదు బామ్మగారూ ……… అది ఎప్పటికీ జరగనే జరుగదు . ఈ జీవితానికి నా దేవతలిద్దరు మరియు మరియు ……….
బామ్మ గారు : తెలుసులే తెలుసులే ………. , కానీ వెళ్ళిపోయింది కదా ……… , తన కోరిక తీర్చడం నీ ధర్మం …….. అలా అనకూడదు , నువ్వే ఇష్టంతో ప్రేమతో నీదానిని చేసుకుంటావులే నమ్ముతున్నావు కదా నాకు భవిష్యత్తు తెలుసు అని …..
నమ్ముతున్నాను బామ్మగారూ ……… అందుకే కదా మీతో మాట్లాడిన వెంటనే , చెల్లెమ్మలను – పెద్దయ్యా , గూడెం వాసులందరినీ ఆప్యాయతలతో పలకరించి , వైజాగ్ లో మీకోసం ఎదురుచూసే ఆత్మీయుణ్ణి ఉంటాను అనిచెప్పి వెళ్లిపోతున్నాము .
బామ్మగారు : నాయనా ………. 18 ఏళ్లుగా నీకోసమే మా గూడెం దేవుడి కోసమే ఎదురుచూస్తున్న నీ పాద దాసిని – నీ దేవతల ప్రియమైన చెల్లిని – నీ బుజ్జాయిలంటే ప్రాణమైన ఒక తల్లిని నీతోపాటు తీసుకోకుండా వెళ్లడం భావ్యమా …….. ? .
దేవతలు : 18 ఏళ్లుగానా బామ్మ గారూ ………. , శ్రీవారూ ……… నా ముందు మీరు దూరంగా ఉన్న కొన్నిరోజులకే తట్టుకోలేకపోయాను – ఇది అయితే ఒక్కరోజు కాదు కాదు కొన్ని గంటలు కూడా మీ గుండెల్లో చేరకుండా ఉండలేకపోయింది , అలాంటిది మా చెల్లి ……… మా దేవుడి కోసం కాదు కాదు మాకు ఆ అర్హత తన తరువాతనే – తన దేవుడి కోసం ఏకంగా 18 ఏళ్లుగా ……… తలుచుకుంటేనే వొళ్ళు గగుర్పాటుకు లోనౌతోంది స్వామీ అని వణుకుతూ నన్ను అల్లుకుపోయారు .
దేవతలూ ……… నన్ను క్షమించండి , ఈ జీవితానికి నా ఇద్దరు ప్రియమైన దేవతల ప్రేమ తప్ప ఇంక ఎవరి ప్రేమా అవసరం లేదు – నాకంటే మంచివాడు తనను ఏలుకుంటాడు ……..
అంతే నా చెంపలు చెళ్లుమన్నాయి – లవ్ యు లవ్ యు అంటూనే బుగ్గలపై మందు రాస్తూనే కోపం చల్లారక గుండెలపై దెబ్బల వర్షం కురిపిస్తున్నారు .
దేవతలూ ……… మీకు ఇప్పుడు తప్పుగా అనిపించవచ్చు కానీ నా ప్రేమ మీఇద్దరికి – పెద్దమ్మకు మాత్రమే ……… , ఇదే నా నిర్ణయం – పదండి వెళదాము – బామ్మగారూ ……… మిమ్మల్ని కలవడం అదృష్టం వెళ్ళొస్తాము – ఆ విషయం చెప్పకపోయి ఉంటే రాత్రి ఇక్కడే మీ ఆతిధ్యం స్వీకరించి మీ ఆనందాలను పంచుకునేవాడిని …….. అని దేవతలతోపాటు పైకిలేచి డోర్ వైపు తిరిగాను .
చెల్లెమ్మలు – పెద్దయ్య – గూడెం వాసులంతా కళ్ళల్లో కన్నీళ్ళతో చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు .
చెల్లెమ్మలూ – పెద్దయ్యా …….. మీరు అనుకుంటున్నట్లుగా ఆ వ్యక్తిని మీ దేవుడిని నేను కాదు నన్ను మన్నించండి అని అందరి మధ్యలోనుండి బయటకువచ్చాను .
బుజ్జాయిలు : విన్నట్లు కళ్ళల్లో కన్నీళ్ళతో వచ్చి నా పాదాలపై కొడుతున్నారు . డాడీ డాడీ …….. మా మా బుజ్జిఅమ్మ కావాలి మా బుజ్జిఅమ్మ కావాలి ………
బుజ్జితల్లులను గుండెలపైకి ఎత్తుకుని , బుజ్జితల్లులూ ……… మీ బుజ్జిఅమ్మ మన జీవితంలోకి వస్తే పెద్దమ్మ శాశ్వతంగా నా హృదయం లోనుండి వెళ్ళిపోతారు – మీకూ ఇష్టం లేదు కదా ………. అందుకే …….
బుజ్జితల్లులు : డాడీ ……… పెద్దమ్మ – బుజ్జిఅమ్మ ఇద్దరూ కావాలి .
అలా కుదరదు – విధి ఒప్పుకోదు అని మీ పెద్దమ్మ ……… మీ అమ్మలతో చెప్పారు కదా , నన్ను ఏమిచెయ్యమంటారు – మీ బుజ్జిఅమ్మ కంటే నాకు మన పెద్దమ్మ ప్రేమనే ముఖ్యం – అలా జరగాలంటే వెంటనే మనం ఇక్కడ నుండి వెల్లడమే ఉత్తమం .

బామ్మ గారు : ఇలా కాదు , నాయనా మహేష్ …….. నీ కొత్త ప్రియురాలిని చూడకుండానే వెళుతున్నావు అంటే చూస్తే నీ ఇద్దరు దేవతలను దూరం పెడతావు అని భయపడుతున్నావన్నమాట అని దేవతల వైపు కన్నుకొట్టారు .
ఇక్కడ నా హృదయంలో నా దేవతల సౌందర్యాన్ని మించిన అందగత్తె ఈ విశ్వంలోనే లేదు .
బామ్మగారు : అయితే నీ సుందరిని చూశాక ఆ మాట చెబితే విలువ ఉంటుంది కానీ ఇప్పుడు చెబితే ఎలా ………
దేవతలు : లోలోపలే నవ్వుకుని , అవును శ్రీవారూ ……… మీరు మాత్రమే చెబితే ఎలా మీ దేవతలే విశ్వ సుందరీమణులు అని , కాకి పిల్ల కాకికి ముద్దుకదా ……… , అతిలోక సౌందర్యరాసి అని చెబుతున్న చెల్లిని కూడా చూసి మాపెదాలపై ముద్దుపెట్టారంటే ప్రపంచానికే తెలుస్తుంది .
లేదు లేదు దేవతలూ ……… మనం ఇప్పుడే వెళుతున్నాము .
దేవతలు …….. బుజ్జితల్లుల వీపులపై స్పృశించి కన్నుకొట్టడంతో , డాడీ …….. మమ్మీలు విశ్వ సుందరులు కాదన్నమాట మీరు చెప్పడం వలన మేమూ అలానే అనుకుంటున్నామన్నమాట , అమ్మలూ ……… మీరే అందగత్తెలు అని మిడిసిపడకండి మీకంటే ………..
నా దేవతల కంటే సౌందర్యరాశులు లేరు ఉండరు – ఈ నిజాన్ని తెలియజెయ్యడానికైనా ఆ సుందరిని చూసి రిజెక్ట్ చేస్తాను – బామ్మగారూ ఎక్కడ మీ అందాల రాశి పిలుచుకుని రండి లేదా మమ్మల్నే తీసుకెళ్లండి .

బామ్మగారు : అదీ మగాడి మాట కాదు కాదు మా గూడెం దేవుడి మాట కాదు కాదు 18 ఏళ్లుగా ప్రాణంలో ప్రాణంలా ఎదురుచూస్తున్న అందాల రాశి దేవుడి మాట . నాయనా మహేష్ ………. ఆ పవిత్రమైన తల్లిని చూడటానికి అడవిలో మరికొద్దిదూరం లోపలకు నడవాల్సి ఉంటుంది . మా తల్లి …….. మా బిడ్డలను కాపాడిన దేవుడికి నచ్చితే ……….
జరగని పని బామ్మగారూ ……….
బామ్మగారు : సరే సరే , ఒకవేళ నచ్చితే ……. మేము ప్రేమతో మీ మెడలో వేసిన హారాన్ని మీ పాద దాసి – నీ దేవతల ప్రియమైన చెల్లి , నీ బుజ్జాయిల బుజ్జితల్లి మెడలో వెయ్యండి చాలు , ఎందుకంటే తనను చూసిన తరువాత నీ నోటి నుండి మాటలు రావు , ఇక్కడ బెట్టు చేశానని మొహమాటం కూడాపడవచ్చు అని నవ్వుతూ చెప్పారు – మీకు అప్పటికీ నచ్చకపోతే ఆ హారాన్ని విసిరేసి నువ్వు కోరుకున్నట్లుగానే ఇక్కడ నుండి వెళ్లిపోవచ్చు , సింహద్వారం వరకూ వచ్చి సాధారంగా వీడ్కోలు చెబుతాము . ఒక్కసారి నువ్వుకానీ నచ్చినట్లు పూలహారం మా తల్లి మెడలో వేశావంటే , ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ నెలలుగా వాయిదా వేస్తున్న మా గూడెం దేవతజాతరను ఆ క్షణమే మొదలుపెట్టి సంబరాలు చూసుకుంటాము .
పెద్దయ్య : అమ్మా ……… చూసేసి ఉంటారుకదా ఇప్పుడే జాతర సంబరాలు మొదలుపెట్టమంటారా ……….
బామ్మగారు : నెలలుగా ఆగారు , కొన్ని నిమిషాలు ఆగలేరా …….. , మన గూడెం దేవుడి సంతోషంతో మొదలవ్వబోవు జాతర న భూతొ న భవిష్యతి ………
గూడెం వాసులందరూ సంతోషంతో ప్రీ సంబరాలలో మునిగిపోయి కేరింతలతో గెంతులేస్తున్నారు .

దేవతలు : శ్రీవారూ ………. నచ్చినదనే చెప్పి , మా చెల్లెలి మెడలో పూలహారం వేసేయ్యాలి అని మగాడి వీక్ పాయింట్ కొల్లగొడుతున్నారు – ఛాతీపై సున్నాలు చుడుతూ భుజాలపై పెదాలను తాకించి ……..
ఆఅహ్హ్హ్ ……. జలదరించి , అమ్మో ……. మీరు ఒక అడుగు దూరం ఉండండి , ఎక్కడెక్కడో నొక్కేస్తున్నారు – ఇలా అయితే ఇక్కడే ok చెప్పేలా ఉన్నాను .
దేవతలు : ప్చ్ ప్చ్ …….. తియ్యదనంతో నవ్వుకున్నారు .
బామ్మ గారు : నవ్వుకుని , తల్లులూ ……… మీకోరిక నిస్వార్థమైనది – మీ ప్రాణం కంటే ఎక్కువైన శ్రీవారి హృదయంలో అందమైన సవతికి ……..
దేవతలు : బామ్మగారూ ………. , మా ప్రాణమైన చెల్లి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *