పెద్దమ్మ Part 15

ఇక్కడ నా దేవత మేడం మాత్రమేఅని గుండెలపై చేతినివేసుకుని , బిరియానీ బిరియానీ …….. , అవునూ ……. పనిమనిషి అక్కయ్య కూడా ఫుడ్ తెస్తే ఎలా ఇప్పటికే ఎక్కువగా ఉంది , వెంటనే మురళికి కాల్ చేసి మురళీ ……. సాయంత్రం స్నాక్స్ తోనే కడుపు నిండిపోయింది డిన్నర్ చెయ్యలేను ……..
మురళి : అందుకే ఎవరుపడితే వాళ్ళు ఇచ్చినది నేను తినను అన్నది నీ ఇష్టం పనిమనిషికి చెబుతానులే – డిన్నర్ చేశాక వస్తాను నా సగం హోమ్ వర్క్స్ నువ్వే చెయ్యాలి ……. సరేనా …..
అలాగే మురళి సర్ ……..
మురళి : గుడ్ అంటూ కట్ చేసాడు .

హమ్మయ్యా ……. తృప్తిగా తినవచ్చు మ్మ్మ్ ఆఅహ్హ్ …… అంటూ ఒకసారి బిరియానీ వాసనను పీల్చి , వాఅహ్హ్ …….. బామ్మ చెప్పినట్లు వారి బుజ్జితల్లికి ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే తిని రుచిచూసి ఇంకెన్ని చెబుతానో అని తినబోయి ఆగాను – బామ్మ ……. పెద్దమ్మకోసం కూడా పంపించారు అవునవును రెండు లెగ్ పీసస్ ఉన్నాయి ముందు సగం తీసి ఉంచుదాము అని వేరుచేసి పెద్దమ్మ కాగితం ముందు హాట్ బాక్స్ లో ఉంచి , ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తిని ఆ రుచికి మళ్లీ గబ గబా ……. తిన్నాను . బామ్మా కాదు కాదు బామ్మ బుజ్జితల్లి గారూ సూపరో సూపర్ అంతే ……. – పెద్దమ్మా ……. మీకు కోపం వస్తుంది అయినా నిజం నిర్భయంగా చెప్పాలికదా – మీరు పంపిన బిరియానీ కంటే అద్భుతం అమోఘం అంతే అని పెద్దమ్మ వైపు చూడకుండా ముసిముసినవ్వులతో మొత్తం కుమ్మేసి మసాలా కూడా నాకేసి ……. అమ్మో కడుపు నిండిపోయింది ఇంత రుచిగా ఉంటే ఇదొక ప్రాబ్లమ్ అంటూ లేవడం కూడా వల్లకాక పొట్టపై నిమురుకుంటూ బెడ్ పై వాలిపోయాను .

మొబైల్ మ్రోగడంతో ఉలిక్కిపడిలేచాను . చూస్తే మురళి నుండి 9 గంటలు దాటింది. ఎత్తి హలో ……..
మురళి : నిద్రపోతున్నావా ఏమిటి ? చెప్పానుకదా హోమ్ వర్క్ పూర్తిచేయాలని ……..
ఇదిగో ఇప్పుడే ……. , క్యారెజీ చూసి 5 మినిట్స్ లో వచ్చేస్తాను మురళీ సర్ – లేచి చక చకా క్యారీజీ శుభ్రం చేసి బామ్మ పంపించిన బ్యాగులో ఉంచి బయటకువెళ్లను . అప్పటికే ఫ్రెండ్స్ అందరూ ఒకదగ్గర చేరి సీరియస్ గా హోమ్ వర్క్ చేసుకుంటున్నారు .
మహేష్ ……. ఇటువైపు వచ్చి కూర్చో అని కళ్ళతోనే సైగచేశాడు మురళి ……. – ఫ్రెండ్స్ ఎవరి హోమ్ వర్క్ లో వాళ్ళు బిజీగా ఉండటం చూసి సగం హోమ్ వర్క్ బుక్స్ నా ఒడిలో ఉంచాడు .
నా ఇంగ్లీష్ హోమ్ వర్క్ ముందుగానే పూర్తిచేయ్యడం మంచిది అయ్యింది అనుకుని 30 నిమిషాలలో పూర్తిచేసి మురళికి అందించాను .
మురళి : అంతలోనే …… గుడ్ అయితే ఈ చివరిది కూడా ఫినిష్ చేసెయ్యి అంటూ తను పూర్తిచేయ్యాల్సినది కూడా నాకే ఇచ్చాడు .
మరొక 15 నిమిషాలలో అదికూడా పూర్తిచేసి ఇచ్చేసాను .
మురళి : ఫ్రెండ్స్ ……. నా హోమ్ వర్క్ పూర్తయిపోయింది , గుడ్నైట్ చెప్పేసి బ్యాగుతోపాటు లోపలికివెళ్లిపోయాడు .
ఫ్రెండ్స్ : రోజూ …….. మనకంటే చివరగా పూర్తిచేసేవాడు రెండు రోజులుగా మనకంటే ముందుగా చేసేస్తున్నాడు అని షాక్ చెందారు అందరూ …….. , బిరియానీ టేస్ట్ గురించి బామ్మకు మరియు ఢిల్లీలో ఎంజాయ్ చేస్తున్న అవ్వా వాళ్లకు కాల్స్ చెయ్యాలని నేను కూడా వెళ్లబోతే ……. , మహేష్ …… నీ హోమ్ వర్క్ కూడా అయిపోయిందా ? – నువ్వు కూడా వెళితే మాకు నిద్రవచ్చేస్తుంది please పూర్తయ్యేంతవరకూ ఉండొచ్చు కదా ……- కావాలంటే మా మొబైల్స్ లో గేమ్స్ ఆడుకో ……
అలాగే ఫ్రెండ్స్ – పర్వాలేదు అంటూ కూర్చున్నాను . మొబైల్ తీసి ” బామ్మా ……. కాల్ చేసే పరిస్థితిలో లేను the best బిరియానీ సూపర్ అద్భుతం ……. ” అంటూ మెసేజ్ చేసాను .
బామ్మ : ” లవ్ యు బుజ్జిహీరో ……. , అదేదో నీకోసం ప్రేమతో బిరియానీ వండిన నీ ……. నా బుజ్జితల్లికే చెప్పొచ్చుకదా – నా బుజ్జితల్లి నెంబర్ ********** ” .
” లేదు లేదు బామ్మా ……. మీరే చెప్పండి గుడ్ నైట్ గుడ్ నైట్ ” .
బామ్మ : ” గుడ్ నైట్ బుజ్జిహీరో …… ”

ఫ్రెండ్స్ : థాంక్యూ మహేష్ ……. ఉదయం ఎప్పుడులేస్తామో తెలియదు , నీవలన మొత్తం హోమ్ వర్క్ పూర్తిచేసాము ఇక హాయిగా నిద్రపోతాము గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ వెళ్లిపోయారు .
గుడ్ నైట్ ఫ్రెండ్స్ ……. , అవ్వకు వీడియో కాల్ చేసి వారి సంతోషాలను చూసి ఆనందిస్తూ ఔట్ హౌస్ కు వచ్చాను . ఆశ్చర్యం పెద్దమ్మ పేపర్ ముందు ఉంచిన బిరియానీ హాట్ బాక్స్ అక్కడ లేదు – అక్కడే పెట్టానా లేక అంటూ చుట్టూ చూస్తే బెడ్ పై ఉంది మరింత ఆశ్చర్యం తెరిచి ఉంది తెరిచి ఉండటమే కాదు బిరియానీ మొత్తo ఖాళీ …….. – గదిలోకి ఫ్రెండ్స్ ఎవరైనా …….. నాకు తెలిసి ఎవ్వరూ ఇటువైపుకు వెల్లనేలేదు – అంతలో మెసేజ్ ………
” నిజమే ప్రియమైన భక్తుడా …… నేను వండిన బిరియానీ కంటే అద్భుతం – నాకోసం కూడా పంపించిన బామ్మకు , నీ దైవానికి సగం బిరియానీ విత్ లెగ్ పీస్ తీసిపెట్టినందుకు నా బుజ్జి భక్తుడికి బోలెడన్ని లవ్ యు లు – wait wait అసలు వ్యక్తికి చెప్పాలి ముందు మనకోసం ఇంత రుచికరమైన బిరియానీ వండిన నీ బుజ్జిదేవతకు మీకంటే ఎక్కువ లవ్ యు లు – వీలైతే నా తరుపున నీ బుజ్జిదేవకన్యకు నువ్వే వెళ్లి లవ్ యు చెప్పు ” అని పెద్దమ్మ నుండి మెసేజ్ వచ్చింది.
పెద్దమ్మా ……. మీరు తిన్నారా ? , తిన్నాక కూడా తిన్నారా అని అడుగుతున్నాను ఏంటి అంటూ మొట్టికాయ వేసుకుని నవ్వుకున్నాను – ఇక్కడిదాకా రోజూ వస్తున్నారు నాకూ ఒకసారి కనిపించొచ్చు కదా పెద్దమ్మా ……. మిమ్మల్ని దైవంలా పూజించుకుంటాను , నేను అడగడం మీరు ఇగ్నోర్ చెయ్యడం మామూలైపోయింది – అయినా మీరు వచ్చారు తిన్నారు ……. అదే సంతోషం – మరొక విషయం పెద్దమ్మా ……. తను నా బుజ్జిదేవకన్య కాదు నా మనసులో ఉన్నది కేవలం దేవత అవంతిక మేడం గారు మాత్రమే అని గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను . Wait wait ……. ” ఇంత రుచికరమైన బిరియానీ వండిన నీ ” దేవత ” మీకంటే ఎక్కువ లవ్ యు లు – వీలైతే నా తరుపున నీ ” బుజ్జిదేవకన్యకు ” నువ్వే వెళ్లి లవ్ యు చెప్పు ” ఒకదగ్గర ” దేవత ” మరొకదగ్గర ” బుజ్జిదేవకన్య ” అని వ్యక్తపరిచారు – పొరపాటుగా పెట్టారా … ? , దైవమైన పెద్దమ్మ పొరపాటు చేస్తారా ….. ? , ఏంటో తికమకగా ఉంది .
” హ హ హ ……. ” మెసేజ్ ……..
అయితే పొరపాటు కాదన్నమాట అంటూ ఏమీ అర్థం కాక తల గోక్కుంటున్నాను . గుడ్ నైట్ పెద్దమ్మా …….. అంటూ బెడ్ రెడీ చేసుకుని వాలిపోయి దేవతనే గుర్తుచేసుకుంటూ నాలో నేను ముసిముసినవ్వులు నవ్వుకుంటూ బామ్మ భయపడుతూ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి సడెన్ గా లేచి కూర్చున్నాను – సమయం చూస్తే 11:30 …… నాకూ భయం వేస్తున్నా పెద్దమ్మను తలుచుకుంటూ బయటకువచ్చాను – సెక్యూరిటీ అన్న కుర్చీలోనే గురకపెడుతూ నిద్రపోతున్నాడు – చిన్న గేట్ సౌండ్ చెయ్యకుండా తీసి బామ్మ ఇంటిదగ్గరికి చేరుకున్నాను – ప్రక్కనే కటిక చీకటిగా ఉన్న భూత్ బంగ్లా చూసి గుండె ధడ ధడ లాడిపోతోంది – అటువైపుకు కన్నెత్తికూడా చూడకుండా పెద్దమ్మ జపం చేస్తూ అయినా నేను భయపడితే ఎలా ……. బామ్మ వాళ్లకు నా ధైర్యమే ధైర్యం అవ్వాలి కదా అంటూ ఇంటి ఎదురుగా కూర్చున్నాను , నిన్న అర్ధరాత్రి భూత్ బంగ్లా నుండి వినిపించిన మాటలు ఏమిటో తెలుసుకోవడానికి ……. – బామ్మ సేఫ్టీ కోసం నాలో అంత ధైర్యం రావడం నాకే ఆశ్చర్యం వేసింది – థాంక్యూ థాంక్యూ sooooo మచ్ పెద్దమ్మా మీరుండగా నేను భయపడటం మీకు అవమానం ………..

అర్ధరాత్రి సమయంలో చలికి వణుకుతున్నాను – ప్చ్ …… కనీసం దుప్పటి అయినా తెచ్చుకోవాల్సింది అని చేతులు కట్టుకుని అటూ ఇటూ కదులుతున్నాను .
అంతలో బామ్మ ఇంటిలో లైట్ వెలగడం – బామ్మ కిటికీలోనుండి చూసి ఎవరు ? ఎవరు అక్కడ ఉన్నది సెక్యురిటి సెక్యూరిటీ ………
బామ్మా బామ్మా ……. ష్ ష్ నేను నేను …….
బామ్మ : బుజ్జిహీరో ……. అంటూ డోర్ తీసుకుని నాదగ్గరికివచ్చి నాకంటే ఎక్కువ వణకడం చూసి నవ్వుకున్నాను . బు….జ్జి హీ…..రో ఈ సమయంలో ఇక్కడ ఉన్నావేంటి – చలి ఎక్కువగా ఉంది కోల్డ్ వచ్చేస్తుంది లోపలికి రా అంటూ చేతిని అందుకున్నారు – నేను పదే పదే భూత్ బంగ్లా వైపు చూస్తుండటం చూసి , బుజ్జిహీరో …….. మాకోసం మేము భయపడుతున్నామని అదేదో దాని అంతు చూడటానికి వచ్చావుకాదూ అంటూ సంతోషంతో అమాంతం కౌగిలించుకుని లవ్ యు లవ్ యు అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
ఆఅహ్హ్ ……. బామ్మా మీ కౌగిలిలో ముద్దులకు వెచ్చగా ఉంది అని మరింత కౌగిలించుకున్నాను . దెయ్యం అంతు చూడటమా అమ్మో నాకు మహా భయం ఏదో నా ప్రాణమైనవాళ్ళు హాయిగా నిద్రపోవాలని భూత్ బంగ్లా సంగతేమిటో చూద్దామని పెద్దమ్మను తలుచుకుంటూ గమనిస్తున్నాను – మీరు ఈ సమయంలో లేచారంటే బంగ్లా నుండి ఏమైనా ……….
బామ్మ : లేదు లేదు ఈరాత్రి అలాంటివేమీ వినిపించలేదు – బయట మేమంటే ప్రాణమైన బుజ్జిమనవడు ఉండగా ఆ దెయ్యాలు కూడా భయపడిపోయినట్లున్నాయి – దాహం వేస్తే లేచివచ్చాను – నీ బుజ్జి …….. నా బుజ్జితల్లి హాయిగా నిద్రపోతోంది , ఈ విషయం తెలిస్తే పరుగున వచ్చి నాకంటే ఎక్కువ ముద్దులు ……..
నో నో నో బామ్మా …….. ఎందుకు డిస్టర్బ్ చెయ్యడం …….
బామ్మ : ప్చ్ …… బుజ్జిహీరో నిన్నూ …… , మాకోసం నిద్రకూడా మానుకుని ఎవ్వరూ చెయ్యనిది చేస్తున్నావు లవ్ యు sooooo మచ్ బుజ్జిహీరో ……..
ఎవరికోసం చేస్తున్నాను మా మంచి బామ్మ కోసం – పెద్దమ్మ చెప్పిన నేనంటే ప్రాణమైన మీకోసం ఏమైనా చేస్తాను బోడి నిద్ర ……. కావాలంటే కాలేజ్లో పడుకుంటాను .
బామ్మ : కళ్ళల్లో ఆనందబాస్పాలతో అవును నువ్వే మా ప్రాణం – నాకు నా బుజ్జితల్లి కంటే నువ్వే ఎక్కువ ప్రాణం . అయినా క్లాస్ లో నీ దేవత టీచ్ చేస్తుండగా నువ్వు పడుకుంటావంటే నమ్మమంటావా ……. బుజ్జిహీరో ……
అవునుకదా ……. అని సిగ్గుపడ్డాను .

బామ్మ : నీ దేవతను కళ్ళు మూతలు పడకుండా చూస్తూనే ఉండాలన్నా – క్లాస్సెస్ లో ఆటపట్టించాలన్నా – కవ్వించాలన్నా – నీ హృదయమంతా నింపుకున్న అదే అదే వయసుతో సంబంధం లేని స్వచ్ఛమైన ప్రేమను పంచాలన్నా …….. ఇప్పుడు నిద్రపోవడం అత్యవసరం ………
టీజ్ చెయ్యడమా …… ? అంటూ పెదాలపై చిరునవ్వులతో అడిగాను .
బామ్మ : ఆ వయసు నుండి వచ్చిన బామ్మగా చెబుతున్నాను అమ్మాయిలకు అదే అదే దేవతను ఎంత కవ్వించి అంత కోపాగ్నిని కలిగిస్తే చిరునవ్వులతో సంతోషంగా ఆస్వాదిస్తూ చివరగా తన బుజ్జిదేవుడివి నువ్వే అని తెలిసాక ఉంటుందీ ……. వద్దులే నేను చెప్పకూడదు నా బుజ్జిమనవడే స్వయంగా ఆస్వాదించాలి అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
Wow ……. బామ్మా బామ్మా వింటుంటేనే వొళ్ళంతా ఏదో తెలియని happiness ఇక దేవత కోపం – దెబ్బలు తింటుంటే ……. హబ్బా హబ్బా ఆ మాజానే వేరు – బామ్మా …….. మీరు చెప్పినట్లు నాది స్వచ్ఛమైన స్వచ్ఛమైన ………
బామ్మ : అవును బుజ్జిహీరో ……. , పిల్లలు దేవుడితో సమానం అంటారు అంటే ఈ బుజ్జిదేవుడి కల్మషం లేని మనసు నుండి ఉద్భవించిన ప్రేమ స్వఛ్చమైనది కాక ఇంకేమిటి …….. – చలి ఎక్కువగా ఉంది లోపలికి రా ……..
పర్లేదు బామ్మా ……. నావలన మీ మనవరాలు ఇబ్బందిపడకూడదు మీరు వెళ్లి హాయిగా పడుకోండి , మరికొద్దిసేపు ఉండి వెళతాను .
నా మాటలకు బామ్మ కళ్ళలో చెమ్మతో , బుజ్జిహీరో ……. ఇంతటి స్వచ్ఛమైన బుజ్జిమనసు నుండి ఒక ముఖ్యమైన విషయాన్ని దాచాను – అసలు ఎందుకు దాస్తున్నానో కూడా నాకు తెలియడం లేదు ముందుగా sorry బుజ్జిహీరో …… ఈ బామ్మను క్షమించు …….
బామ్మా ……. అక్కడితో ఆడిపోండి – అయినా మీరే చెప్పారుకదా మనమధ్యన thanks లు sorry లు ఉండకూడదు అని వెనక్కు తీసుకోండి వెనక్కు తీసుకోండి – పెద్దవారు కూడా దేవుళ్ళతో సమానం వాళ్ళు ఏమిచేసినా మామంచికోసమే అని అవ్వ చెప్పారు .
బామ్మ : ఈ వయసులోనే ఎంత గొప్ప మనసు నా బుజ్జి మనవడిది అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ……. ఒక్కసారి ఓకేఒక్కసారి నీ ……. నా బుజ్జితల్లిని చూడు pleaae please please అంటూ చేతిని అందుకున్నారు .
నో నో నో బామ్మా …… తప్పు తప్పు మీరు వెళ్లి హాయిగా పడుకోండి – నేను నిద్రపోవడం కావాలికదా ఇప్పుడే వెళ్లి పడుకుంటాను .
బామ్మ : లోపలికి ఎలాగోలా తీసుకెళితే ఒకరినొకరు చూసుకోవచ్చు ……. సరే సరే , చలిలో ఇంటివరకూ వెళ్ళేలోపు కోల్డ్ ఆపై జ్వరం వచ్చినా వస్తుంది – అలా జరిగితే రేపు నీ దేవతను మనసారా చూసుకోలేవు కాబట్టి కనీసం హాల్లోకి వచ్చి అయినా సోఫాలో పడుకో ……..
బామ్మా ………
బామ్మ : అయినా మేమేవరిమి , నీకు జ్వరం వస్తే ఈ బామ్మ బాధ నీకెలా అర్థమవుతుంది అని అలకతో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి బాధపడుతున్నారు లేక బాధపడుతున్నట్లు నటిస్తున్నారో ……..
బామ్మా బామ్మా ……. మీరు బాధపడితే నేను తట్టుకోలేను – సరే మీ ఇష్టం కానీ ఒక్క కండిషన్ ……. నేను లోపలికి వచ్చినట్లు మీ బుజ్జితల్లికి తెలియనే తెలియకూడదు మాటివ్వండి వస్తాను .
బామ్మ : ప్చ్ …… నిన్నూ …… సరే అంటూ చేతిలో చేయివేసి లోపలికి పిలుచుకునివెళ్లి డోర్ లాక్ చేశారు .
ష్ ష్ ……. బామ్మా , హాయిగా నిద్రపోతున్నవాళ్లను డిస్టర్బ్ చెయ్యడం మహాపాపం ……

2 Comments

Add a Comment
  1. Super bro.. waiting for next parts

  2. Super bro next part kosam waiting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *