పెద్దమ్మ Part 15

మేడం షాక్ అవ్వడం చూసి నాకైతే నవ్వు ఆగడం లేదు కంట్రోల్ చేసుకోవడం కావడం లేదు .
మేడం : నన్ను హెడ్ మాస్టర్ గారు పిలిచారు అందుకే ఆలస్యం అయ్యింది బుజ్జి స్టూడెంట్స్ ………
పిల్లలు : మీరు రాలేదని అన్నయ్య పిలుచుకుని రావడానికి వెళ్లారు పాపం ……
మేడం : Is it మహే ……. స్టూడెంట్ ? .
పిల్లలకు నాపై ఇష్టానికి నేను షాక్ అయ్యాను . Yes – no అంటూ తలను అన్నివైపులకూ ఊపుతున్నాను .
మేడం : మీరు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను . మహే …… స్టూడెంట్ you can come in ………
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం ……. – లవ్ యు పిల్లలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెనుకకు వెళ్ళి బుద్ధిమంతుడిలా కూర్చున్నాను .
మేడం : నావైపు చురచురలాడుతూ చూసి , పిల్లలందరికీ ఎందుకింత ఇష్టం మహేష్ అంటే అంత మంచివాడా …… ? , నాకైతే అల్లరి వెధవలానే కనిపిస్తున్నాడు – అదేవిషయం మెసేజ్ వచ్చింది పెద్దమ్మ నుండి ……..
మేడం ……. నా గురించి తరువాత ఆలోచించవచ్చు – నేనైతే పోకిరి వెధవనే ఫిక్స్ అయిపోండి , అటెండెన్స్ వేసి హోమ్ వర్క్ చెక్ చెయ్యండి .
మేడం : yes yes yes , అయినా నా మనసులోని మాటలు నీకెలా ……..
పిల్లలు : అన్నయ్య పోకిరి కాదు గుడ్ అంటూ పిల్లలు ఇద్దరిద్దరుగా వచ్చి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళుతున్నారు .
మేడం : Wow ……. ఇన్ని ముద్దులా అంటూ సంతోషిస్తూనే అసూయ చెందుతున్నారు .
ఆ విషయం మెసేజ్ రూపంలో రాగానే , మేడం అలా అసూయతో చూడకండి మాకు దిష్టి తగులుతుంది – పిల్లలూ ……..
పిల్లలు : అర్థమైంది అన్నయ్యా ……. అంటూ అందరూ వెళ్లి మేడం ను చుట్టేసి కూర్చోండి అని ఆర్డర్ వేశారు .
నా దేవత అర్థం కానట్లు మోకాళ్లపై కూర్చోగానే ……. మా బ్యూటిఫుల్ మేడం అంటే మాకు చాలా ఇష్టం అని బుగ్గలపై – చేతులపై ముద్దులవర్షం కురిపించడంతో , పిల్లల ఆప్యాయతకు తడిచి ముద్దయి పులకించి చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు .
జేబులో ఉన్న మొబైల్ లో మొత్తం రికార్డ్ అవుతోంది .

మేడం : థాంక్స్ థాంక్స్ థాంక్స్ …….. అంటూ ముద్దులుపెట్టి , అటెండెన్స్ – హోమ్ వర్క్ తో సమయం వృధా చెయ్యను . నాకంటే క్యూట్ అయిన పిల్లలకోసం క్లాస్ ఇక్కడ కాదు కాలేజ్ మధ్యలో ఉన్న చెట్లు – పూలమొక్కలు మధ్యన పచ్చని గడ్డిలో are you ready పిల్లలూ …….
పిల్లలతోపాటు సంతోషంతో నేనుకూడా యాహూ ……. అంటూ కేకలువేశాను .
మేడం : నావైపు కోపంతో – పిల్లలవైపు చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిచేతులను అందుకుని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లి , ఆటపాటలతో టీచ్ చేస్తూ మధ్యమధ్యలో పిల్లలవైపు మొక్కల నుండి పూలు పీకి విసురుతున్నారు .
నాకూ చిలిపి ఆలోచన వచ్చి వెనుక నుండి మేడం వైపు పూలవర్షం కురిపించాను .
మొదట ఎంజాయ్ చేసి , ఎవరన్నట్లు కోపంతో వెనక్కు తిరిగిచూశారు మేడం ……
అమాయకుడిలా చేతులుకట్టుకుని శ్రద్ధగా వింటున్నట్లు కూర్చోవడం – నన్ను చూసి పిల్లలు పూలు అందుకుని అదేసమయానికి మేడం వైపుకు విసరడంతో లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
మొదట పూలవర్షం కురిపించింది నేనే కాబట్టి , ఆ లవ్ యు లు – ఫ్లైయింగ్ కిస్సెస్ నాకు కూడా చెందుతాయి అని అమితమైన ఆనందంతో గుండెలపై చేతినివేసుకుని ఫీల్ అయ్యాను – పీరియడ్ సమయం నిమిషాల్లో గడిచిపోయినట్లు బెల్ మ్రోగింది – నాతోపాటు పిల్లలు కూడా బాధపడ్డారు .
మేడం కూడా ఫీల్ అయినట్లు నవ్వుకుని రేపు కూడా ఇక్కడే మన క్లాస్ ……..
అంతే పిల్లలందరూ సంతోషంతో చిందులువేస్తూ తమ తమ క్లాస్ లలోకి వెళ్లిపోయారు .
అలా నెక్స్ట్ నర్సరీ – LKG – UKG ……. పిల్లలకు కూడా ప్రకృతి ఓడిలోనే ఆటాడిస్తూ టీచ్ చెయ్యడంతో రెండు రోజుల్లోనే పిల్లలందరి ఫేవరేట్ మిస్ అయిపోయారు నా దేవత – ఉదయం ఫోర్ క్లాస్సెస్ పూర్తయినట్లు లంచ్ బెల్ మ్రోగింది – బుజ్జి బుజ్జి పిల్లలు బుజ్జిబుజ్జినవ్వులతో మేడం బుగ్గలపై ముద్దులుపెట్టి బుజ్జిబుజ్జి పరుగులతో వెళ్లిపోయారు .

పిల్లల చిరునవ్వులు – ముద్దులు తలుచుకుంటూ లంచ్ చెయ్యడానికి స్టాఫ్ రూమ్ కు వెళ్లారు – హ్యాండ్ వాష్ చేసుకుని వారి లాకర్ ఓపెన్ చేసి చూస్తే క్యారేజీ లేదు – ఉదయం ఇక్కడే ఉంచాను కదా ……..
టీచర్స్ అందరూ తమ తమ లాకర్స్ నుండి లంచ్ తీసుకుని ప్రక్కనే ఉన్న లంచ్ చేసే గదిలోకి వెళుతున్నారు .
మేడం : మేడం మేడం ……. నా క్యారేజీ కనిపించడం లేదు , ఉదయం ఇక్కడే ఉంచాను .
లేడీ స్టాఫ్ : మిస్ అవ్వడానికి లేదే …… , come మేడం మనం షేర్ చేసుకుందాము అని ఆహ్వానించారు .
మేడం : పర్లేదు మేడం ……. , నాకు ఆకలి వెయ్యడం లేదు మీరు కానివ్వండి అని బదులివ్వడంతో వెళ్లిపోయారు .

అంతలో హెడ్ మాస్టర్ వచ్చి మేడం అవాంతికా ఏంటి వెతుకుతున్నారు .
మేడం విషయం చెప్పారు .
హెడ్ మాస్టర్ : మన కాలేజ్లో దొంగతనమా ……. , ఎంతకూ సహించకూడదు నేను enquiry చేయిస్తాను , మీరు లంచ్ చెయ్యకుండా ఉంటే నేను బాధపడతాను రండి నేను ఫైవ్ స్టార్ హోటల్ కు వెళుతున్నాను , lets have lunch together ……..
నా బల్బ్ వెలిగింది – అంటే ఇది ఖచ్చితంగా వీడి పనే అయి ఉంటుంది – దొంగ వీడేనన్నమాట ……. ఏమి నటిస్తున్నావురా , ఇప్పుడేమి చెయ్యాలి .
మేడం : నో నో నో సర్ …….. నెక్స్ట్ క్లాస్ ** క్లాస్ , సిలబస్ చెక్ చేసుకోవాలి , you క్యారి ఆన్ ……..
హెడ్ మాస్టర్ : మేడం ………
మేడం : please బలవంతపెట్టకండి , anyway నాకు ఆకలివెయ్యడం లేదు ఇదే విషయం మన co staff కు కూడా చెప్పాను కనుక్కోండి కావాలంటే , మీరు వెళ్ళండి సర్ ………
హెడ్ మాస్టర్ : shit shit plan మొత్తం వేస్ట్ అయ్యింది అని గుసగుసలాడుతూ వెళ్ళిపోయాడు .
కోపంతో వెనుక నుండి కాలితో తన్నబోయి ఆగిపోయాను . మేడం మేడం ……. పిచ్చెక్కించారు ఉమ్మా ఉమ్మా ……. అమ్మో దేవత అనుమతి ఇవ్వకుండా ముద్దులు తప్పు తప్పు అని ఎంజాయ్ చేస్తున్నాను .

లోపలికి తొంగిచూస్తే మేడం కు బాగా ఆకలివేస్తున్నట్లు , ఏమిచెయ్యాలో తెలియక బాధపడుతూ ఒంటరిగా కూర్చోవడం చూసి చలించిపోయాను – వెంటనే నా క్యారెజీ తీసుకుని may i come in మేడం అంటూ లోపలికివెళ్లి బామ్మ ఇచ్చిన క్యారెజీని మేడం ముందు ఉంచాను .
ఆకలికి మేడం కళ్ళల్లో చెమ్మకూడా చేరినట్లు తలెత్తి క్యారెజీ చూసి పెదాలపై చిరునవ్వు చిగురించింది . చిరునవ్వులు చిందిస్తున్న నన్ను చూసి కోపంతో భద్రకాళీలా మారిపోయారు – అంటే నువ్వేనన్నమాట నా క్యారెజీ దొంగతనం చేసినవాడివి అంటూ ముందూ వెనుకా ఆలోచించకుండా లేచి చెంప చెళ్లుమనిపించారు .
దిమ్మ తిరిగిపోయింది – ఏమి జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు .
మేడం : క్లాస్సెస్ లో అల్లరి చేస్తుంటే , ఈ వయసులో స్టూడెంట్ లైఫ్ లో మామూలు అని సహించాను – అప్పుడప్పుడూ బయటకు కోప్పడినా లోలోపల ఎంజాయ్ చేసాను కూడా ……
బుగ్గపై చేతినివేసుకుని కన్నీళ్ళతో మేడం ……. నేను దొంగ …… ఇది నా క్యారేజీ మేడం – నా ప్రాణమైన బా ……..
మేడం : స్టాప్ స్టాప్ స్టాప్ your childish నాన్సెన్స్ …….. , this is my లంచ్ – my లంచ్ బ్యాగ్ ……….
మేడం ……. బస్సులో మీరే చూశారుకదా , బ్యాగుతోపాటు నాతోనే ఉంది .
మేడం : రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఇంకా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు , this is not good mahesh , ok ఈ లంచ్ నీది అంటున్నావు కాబట్టి ఓన్లీ వన్ క్వశ్చన్ ……. ఈ లంచ్ బాక్స్ లో ఏ ఫుడ్ ఉందో చెప్పు – సరిగ్గా చెబితే నీదే ……. నేను sorry కూడా చెబుతాను .
నో నో నో మేడం ……. మీరు నాకు sorry చెప్పడం ఏమిటి , తప్పు తప్పు …….
మేడం : tell me మహేష్ tell మీ ……..
అదీ ……. ( అవునూ ఇంతకూ బామ్మ ఏమి పంపించారు ) ప్చ్ …… తెలియదు మేడం , కానీ నిజం చెబుతున్నాను నేనంటే ప్రాణమైన నా బా ………
మేడం : చాలు చాలు ఇక నీ నాటకాలు చాలు , ఫుడ్ ఏముందో చెప్పనా వెజిటబుల్ రైస్ – మటర్ పన్నీర్ మసాలా – గోబీ – పెరుగుపచ్చడి ……. కమాన్ కమాన్ చెక్ చేసుకో మహేష్ ……..
క్యారెజీ అందుకుని ఓపెన్ చేస్తే మొదటి బాక్స్ లో వెజిటబుల్ రైస్ – దానికింద బాక్స్ లో పన్నీర్ మసాలా – దానికింద గోబీ – దానికింద పెరుగుపచ్చడి …….. చూసి షాక్ అయిపోయాను .
మేడం : ఇప్పటికైనా అర్థమైందా నువ్వు లంచ్ theif అని , now get out of స్టాఫ్ రూమ్ ………
కన్నీళ్ళతో చెంపపై రుద్దుకుంటూ వెళ్లి ** క్లాస్ రూంలో కూర్చున్నాను . నా దేవత కోపానికి – చెంప దెబ్బకు కొద్దిసేపటి ముందు వేసిన ఆకలి మాయమైపోయింది – నా దేవత కరెక్ట్ గా చెప్పారు అంటే ఖచ్చితంగా వారిదే అయి ఉంటుంది అని కన్నీళ్లను తుడుచుకున్నాను , కొంపదీసి బస్సులో నాది మిస్ చేసుకుని దేవత మాయలో వారి లంచ్ బాక్స్ పట్టుకుని తిరిగే ఉంటాను అని నవ్వుకున్నాను – anyway నా దేవత ఆకలి తీరుతోంది అధిచాలు నాకు ……. అమ్మో దేవతకు తోడుగా ఉండాలని పెద్దమ్మ చెప్పారుకదా అని మళ్ళీ స్టాఫ్ రూమ్ దగ్గరికి ఉరికాను .

నా దేవతకు కనిపించకుండా లోపలికి తొంగిచూసాను . పిల్లలతో – నాతోకూడా హ హ హ …… సరదాగా ఎంజాయ్ చేసి చేసి అలసిపోయి బాగా ఆకలివేస్తున్నట్లు గబ గబా తింటుండటం చూసి నవ్వుకున్నాను . ఫాస్ట్ గా తినడం వలన పొలమారినట్లు వెక్కిళ్ళు రావడంతో నీళ్లు నీళ్లు అంటూ కంగారుపడిపోయాను – లోపలికి వెళ్లబోయి దేవత కోప్పడి తినడం ఎక్కడ మానేస్తారేమోనని పెద్దమ్మను తలుచుకున్నాము – నా లంచ్ బ్యాగులోనుండి ఉదయం నుండీ నేను తాగిన బాటిల్ అందుకుని నోటిలోకి తీసుకునిమరీ తాగడం చూసి ఒక తియ్యని ఫీల్ కలిగింది . దేవత నోటిని తుడుచుకుని ఈసారి నెమ్మదిగా తినడం చూసి నా ఆకలి ఆ ఆనందంతోనే తీరిపోయింది .
నా దేవత పూర్తిగా తినేసి బాక్సస్ శుభ్రం చేసి లంచ్ బ్యాగులో , బ్యాగుని వారి సేఫ్టీ లాకర్లో ఉంచి బుక్ చదువుకుంటున్నారు – లంచ్ రూమ్ నుండి ఒక్కొక్కరుగా స్టాఫ్ వచ్చి వారి వారి కార్యకలాపాలలో నిమగ్నులయ్యారు .

బెల్ మ్రోగడంతో అందరితోపాటు దేవతకూడా హ్యాండ్ బ్యాగ్ – బుక్స్ తీసుకుని బయటకు వచ్చేన్తలో పరుగున నా క్లాస్ చేరి ఫ్రెండ్స్ తోపాటు కూర్చున్నాను .
నా దేవత క్లాస్ లోపలికి అడుగుపెట్టగానే అందరమూ లేచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ విష్ చేసాము .
అందమందిలో నా వాయిస్ మాత్రమే వినపడినట్లు నావైపు భద్రకాళీలా చూసి కోపంతో వెంటనే తల తిప్పుకుని టేబుల్ దగ్గరకు చేరుకున్నారు – గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ సిట్ డౌన్ ………
ఏమీ జరగనట్లు తప్పే చెయ్యనట్లు నేను చిరునవ్వులు చిందిస్తూ వారివైపే చూస్తూ కూర్చోవడం చూసి నా దేవతకు నచ్చనట్లు ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నారేమో …….. ( కోపంలో తప్పో ఒప్పో ఆలోచించము కదా ) స్టూడెంట్స్ ……… బ్రింగ్ your హోమ్ వర్క్స్ ? .
నా పెదాలపై మరింత ఆనందం వెళ్లువిరిసింది , ఇలా జరుగుతుందని ముందే తెలిసేకదా మొత్తం హోమ్ వర్క్ ను అందరికంటే ముందే ఫినిష్ చేసాను అని దర్జాగా వెళ్లి అందరితోపాటు టేబుల్ పై ఉంచాను .

దేవత కుర్చీలో కూర్చుని ఒక్కొక్క బుక్ అందుకుని చకచకా సెకండ్స్ లో చూసి స్టూడెంట్స్ ను పిలిచి గుడ్ వెరీ గుడ్ ……. అని ఇచ్చేస్తున్నారు . మురళి అని పిలవగానే వణుకుతూనే వెళ్ళాడు – మేడం ……. వెరీ గుడ్ మురళి నైస్ హ్యాండ్ రైటింగ్ అంటూ అభినందించి ఇవ్వగానే , మురళి మురిసిపోతూ వచ్చి కూర్చున్నాడు .
ఆ నెక్స్ట్ నా బుక్ అందుకుని కోపంతో నావైపు చూసారు .
( ఆఅహ్హ్ …….. థాంక్స్ మేడం కోపంగానైనా చూసినందుకు అని గుండెలపైకి చెయ్యి దానంతట అదే చేరిపోయింది )
నా హోమ్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండటం నా దేవత చూసినట్లు ముందు ఆశ్చర్యం ఆ వెంటనే ఇప్పుడెలా మొత్తం పూర్తిచేశాడు అని నావైపు ఒక లుక్ ఇచ్చారు ( sorry మేడం …….. టీచ్ చేసినది ఎవరు స్వయానా నా దేవత , నాపై కోప్పడే అవకాశం ఇవ్వలేకపోయినందుకు sorry sorry ……… అని ముసిముసినవ్వులు నవ్వుతున్నాము )
నా దేవత కోపంతోనే మహేష్ అని పిలిచారు .
Yes మేడం అంటూ టేబుల్ జంప్ చేసి క్షణంలో నా దేవత ముందు నిలబడ్డాను .
మేడం : నావైపు కన్నెత్తైనా చూడకుండానే గుడ్ అంటూ బుక్ అందించారు .
గుడ్ …….. wow థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ బుక్ ను గుండెలపై హత్తుకుని , దేవతను చూస్తూనే వెనక్కు ఒక అడుగు వేశానో లేదో ……
మేడం : wait wait అంటూ లేచిమరీ నా గుండెలపై హత్తుకున్న బుక్ లాక్కున్నారు.
నా గుండెలపై ……. దేవత చిరు స్పర్శకే , క్షణకాలం పాటు హృదయ స్పందన ఆగి కరెంట్ షాక్ కొట్టినట్లు జలదరించి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న నా క్లాస్ గర్ల్స్ మీదకు పడిపోయాను .
అమ్మాయిలు మహేష్ మహేష్ …….. అంటూ నవ్వుకుని నన్ను పైకిలేపారు – క్లాస్ మొత్తం నవ్వులు విరిసాయి .
మేడం : బా బుక్ చెక్ చేస్తూనే సైలెన్స్ ……… , మురళీ …….. బ్రింగ్ your హోమ్ వర్క్ ? .
మురళికి విషయం అర్థమైపోయినట్లు నుదుటిపై చెమటలు పట్టేసాయి , భయపడుతూనే బ్యాగులో ఉంచేసిన బుక్ తీసుకుని వచ్చాడు .

నాకైతే దేవత తప్ప ఎవరూ కనిపించడం లేదు – దేవత మాటలు తప్ప ఏ నవ్వులూ వినిపించడం లేదు . వొళ్ళంతా బటర్ ఫ్లైస్ ……. దేవత స్పృశించిన నా ఛాతీపై చేతినివేసుకుని గాలిలో తేలిపోతున్నాను – పెదాలపై తియ్యదనం అంతకంతకూ పెరుగుతూనే ఉంది .
మేడం : మురళి గట్టిగాపట్టుకున్న బుక్ అందుకుని చెక్ చేసి , I know i know about you మహేష్ ……… , నీ హోమ్ వర్క్ ను కూడా మురళి చేత చేయించుకున్నావు – సేమ్ హ్యాండ్ రైటింగ్ ………
మురళి రిలీఫ్ అయ్యి , రేయ్ …….. ఒప్పుకో అన్నట్లు నావైపు చూస్తున్నాడు .
అప్పటికి అర్థమయ్యింది మా ఫ్రెండ్స్ కు రోజూ ……. మా హోమ్ వర్క్ పూర్తికాకముందే ఎలా ఫినిష్ చేస్తున్నాడు అని , ఇంతకుముందు మేము పూర్తిచేశాక గంటకు కానీ పూర్తయ్యేది కాదు నీ హోమ్ వర్క్ అని మురళి వైపు గుర్రున చూస్తున్నారు .
నాకైతే ఎవ్వరూ కనిపించడం లేదు నా దేవత కోపం తప్ప ………

మేడం : కేవలం స్టాఫ్ రూంలో …….. ఆపేసి , కాకుండా ఇలా హోమ్ వర్క్ కూడా ఫ్రెండ్స్ తో చేయించావు , this is not not good ……. పనిష్మెంట్ ఇవ్వాల్సిందే , మహేష్ …….. బయటకువెళ్లి క్లాస్ అయిపోయేంతవరకూ గోడ కుర్చీ వెయ్యి – డబల్ హోమ్ వర్క్ for you – go outside అని వేలిని చూయించి yes yes అంటూ లోలోపలే తృప్తి చెందుతున్నట్లు నవ్వు ఆపుకుంటున్నారు .
Yes మేడం అంటూ బయటకు వెళ్లబోయి ఆగి , మేడం ……. నేను చాలాపెద్దతప్పునే చేసాను సో సో ………
మేడం : సో ……..
సో …….. రెండు దెబ్బలు కూడా కొడితే , మరొకసారి ఇలాంటి తప్పు చెయ్యకుండా గుర్తుచేస్తాయి అని కుడిచేతితో బెత్తం అందించి ఎడమచేతిని చాపాను .
క్లాస్మేట్స్ అందరూ ఆశ్చర్యపోయి గుసగుసలాడుకుంటున్నారు .
మేడం : yes yes yes అంటూ మరింత సంతృప్తితో అందుకుని కొట్టబోయి నా ఆనందాన్ని చూసి , నా మాటలు గుర్తుకువచ్చినట్లు నో నో నో ……. గోడ కుర్చీ పనిష్మెంట్ చాలు వెళ్లు వెళ్లు అని మురళికి మళ్లీ ఇలా చెయ్యకు అని చెప్పి పంపి మిగతా హోమ్ వర్క్ బుక్స్ క్షణాలలో చెక్ చేశారు .

కాలేజ్ జీవితంలో ఫస్ట్ టైం గోడ కుర్చీ …….. అదికూడా నా దేవత ఇచ్చిన స్వీట్ పనిష్మెంట్ అని లోలోపలే ఎంజాయ్ చేస్తూ బయటకు మాత్రం దేవత తృప్తికోసం చిరుబాధను నటిస్తున్నాను – బామ్మా …….. ఒక దెబ్బ మాత్రమే కాదు నా దేవత నుండి ఒక పనిష్మెంట్ కూడా ……. సాయంత్రం వచ్చి అన్నీ వివరంగా చెబుతాను కదా ……..
దేవత టీచ్ చేస్తూనే బయటకు చూస్తూ నవ్వుకోవడం తెలుస్తూనే ఉంది – రెండు నిమిషాలకే బయటకువచ్చి , its enough లేచి నిలబడు ఇంకెప్పుడూ ఇలా చెయ్యకూడదు అన్నారు .
నో నో నో మేడం …….. క్లాస్ అయ్యేంతవరకూ పనిష్మెంట్ స్వీకరించాల్సిందే , దెబ్బలు కూడా కొట్టి ఉంటే నా తిక్క కుదిరేదేమో …….. ఒకసారి బాగా ఆలోచించుకోండి – ఇప్పటికీ నేను రెడీ ………
మేడం : అదిమాత్రం జరగనే జరుగదు , మహేష్ ……… లేచి నిలబడు .
దెబ్బలూ లేక – గోడ కుర్చీనూ లేకపోతే రేపుకూడా అలానే చేస్తానేమో మేడం ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *