పెద్దమ్మ Part 19

తమ్ముడూ – అన్నయ్యా ……. అంటూ ముగ్గురూ నాకంటే ఆతృతతో ఏకంగా కిందకువచ్చి హత్తుకున్నారు . ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిదేవుడిని ప్రక్కనే ఉంచుకుని తెలుసుకోలేకపోయాను – నా కళ్లల్లో కన్నీళ్లను చూసి మీ సర్ ను కమిషనర్ ను చేసావు , నీ రుణం తీర్చుకోలేనిది బుజ్జిహీరో అంటూ బాస్పాలతో దండం పెట్టారు .
మేడం …… అంటూ వెళ్లి పాదాలకు నమస్కరించాను . ఇన్ని ఆనందాలకు కారణమైన సర్ దేవత మీరు , మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా చెయ్యకండి .
మమ్మీ మమ్మీ …… మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అంటూ చెల్లి – తమ్ముడు కూడా నాకు చేరికవైపు కూర్చుని మేడం పాదాలను స్పృశించడం చూసి , అందరూ ఉద్వేగపు కన్నీళ్లతోనే నవ్వుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో – బుజ్జిదెయ్యాలూ ……. అంటూ ముగ్గురినీ లేపి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు .
విశ్వ సర్ : శ్రీమతిగారూ …… , మన బుజ్జిదేవుడు సమయానికి హీరోయిజం పండించగలడు – సెంటిమెంట్ కూడా పండించగలడు .

అక్కయ్యా – చెల్లీ ……. మీరు …. ఇక్కడ ? .
విశ్వ సర్ : నేను నేను చెబుతాను , మాటిచ్చాను నేనే చెబుతానని …… , బుజ్జిహీరోనే …… బుజ్జిహీరో అని తెలియగానే ……. , అక్కయ్యా అక్కయ్యా ……. అన్నయ్య దగ్గరికి వెళదాము అన్నారుకదా , పదండి వెళదాము అని హాసిని – విక్రమ్ ……..
నా శ్రీమతి : మీరు మాత్రమేనా …… నేనూ , మీతోపాటు వచ్చేస్తాను .
అక్కయ్య : మరి కమిషనర్ సర్ ……. ? .
నా శ్రీమతి : బుజ్జిదేవుడి దేవత ఇంటిప్రక్కన ఏదైనా ఇల్లు ఉంటే ఆ ఇంటిని రెంట్ కు తీసుకునైనా అక్కడికి లగేజీ మార్పిస్తారు పదండి అంతవరకూ చెల్లి ఇంటిలోనే ఉంటాము .
పిల్లలు : లవ్ యు మమ్మీ …….
అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ అమితమైన ఆనందంతో హత్తుకున్నారు .

విశ్వ సర్ : మన బుజ్జిదేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అని తెలిసి ఉంటే , మీ అందరికంటే ముందుగానే వెళ్లిపోయేవాడిని , అలాంటి నన్నే వదిలివెళతారా …….
హాసిని : లవ్ యు లవ్ యు డాడీ …….
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ …… , ఇంత సంతోషమైన విషయం చెప్పినందుకు అందుకోండి మీ శ్రీమతి చిరుకానుక అంటూ పెదాలపై ముద్దుపెట్టారు.

ఇక నేను చెబుతాను శ్రీవారూ …… , అదేసమయానికి ఒక క్లాస్ కంప్లీటెడ్ అంటూ నీ ప్రియమైన దేవత డోర్ తీసుకుని బయటకువచ్చారు బుజ్జిహీరో …….
మా ముద్దుని చూసి సిగ్గుపడుతూ వచ్చి , మీ అక్కయ్య వెనుక దాక్కుని , కమిషనర్ సర్ కంగ్రాట్స్ అనిచెప్పారు .
విశ్వ సర్ : sorry బుజ్జిహీరో …… , మీ మేడం ముద్దువలన మైకం లోకి వెళ్లడంతో వెంటనే థాంక్స్ చెప్పలేదు .
అక్కయ్య : మీ పరిస్థితి అక్కయ్యతోపాటు మా అందరికీ అర్థమయ్యింది సర్ అని నవ్వుకున్నారు – తేరుకున్న తరువాత వడ్డీతోసహా చెప్పారు కదా ……. , తమ్ముడూ అప్పుడు బామ్మ రంగంలోకి దిగారు .
బామ్మ : బుజ్జితల్లీ …… నాకు ఈ ఇంటిలో ఉండాలని లేదు , నా బుజ్జిహీరో గుర్తుకువస్తున్నాడు – వెంటనే చూడాలని ఉంది వెళ్లిపోదాము .
దేవత : బామ్మా …… నాకుకూడా మీ బుజ్జిహీరోను కలవాలని ఉంది కానీ చెల్లిని – బుజ్జి చెల్లెళ్లను – అక్కయ్యను వదిలి …….
అక్కయ్యా …… అయితే మేమూ వచ్చేస్తాము అని అక్కయ్య – మేమూ వస్తాము అని హాసిని విక్రమ్ …….
మిస్సెస్ కమిషనర్ : అక్కయ్యలకోసం వీళ్ళు వెళ్లినా వెళ్ళిపోతారు శ్రీవారూ …… , కాబట్టి మనకు తప్పదు మనమూ అక్కడ దగ్గరలోని ఇంట్లోకి షిఫ్ట్ అయిపోదాము ఏమంటారు …….
విశ్వ సర్ : పిల్లలు – శ్రీమతిగారు ఫిక్స్ అయ్యాక , నో అనే ధైర్యం ఉందా ….. ? , సిటీకి సెక్యూరిటీ అధికారి కమిషనర్ కానీ ఇంటిలో నాదేవత దాసీని …….
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు శ్రీవారూ …… అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : అలా ఇక్కడికి వచ్చేసాము – లగేజీ వెనుక వచ్చేస్తోంది .
మరి నా కోరిక ఎలా తెలిసిందో ఇంకా చెప్పనేలేదు సర్ ……. ? .
బయట ఉన్న వెహికల్లో వస్తూ ఉంటే , నువ్వు – బామ్మ – కావ్య …… గుసగుసలాడుకుంటుంటే విన్నారట హాసిని – విక్రమ్ చెప్పారు , అలా తెలిసింది . రేపు సీఎం గారు వస్తున్నారు నిన్ను ….. కాదు కాదు సిటీ దేవతలైన నీ దేవతను – అక్కయ్యను కలవడానికి ……. , సీఎం గారికి అపద్దo చెప్పలేను కాబట్టి సీక్రెట్ గా నిన్ను కూడా కలుస్తారు – అతిత్వరలో ప్రెసిడెంట్ గారి నుండి కూడా పిలుపు రావచ్చు .
సర్ …… మీడియాకు తెలియకూడదు , ఎందుకంటే సోమవారం నుండి అక్కయ్య …… కాలేజ్ కు వెళతారు – సేఫ్టీ ముఖ్యం .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ప్రాణంలా చూస్తున్నారు .
విశ్వ సర్ : నీ ఇష్టం బుజ్జిహీరో ……..
థాంక్యూ సర్ ……. , అక్కయ్యా ……. దేవత ఎక్కడ ఉన్నారు ? , పైన ఉన్నారా ……. ? అంటూ తొంగి చూడటానికి పరుగుతీసాను .
తమ్ముడూ – అన్నయ్యా అన్నయ్యా …… పేపర్స్ కరెక్షన్ చేస్తూ అక్కయ్య ఇంటిలోనే ఉన్నారు – చూడకుండా ఉండలేరని తెలుసు రండి వెళదాము అంటూ పిలుచుకునివెళ్లారు . నన్ను హాల్లోకివదిలి అక్కయ్యా – మేడం అంటూ వెళ్లి చుట్టూ చేరి ముద్దులుపెట్టారు .
తొంగిచూస్తూ ఆనందించాను ………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *