అంతే ఇద్దరి కళ్ళల్లో బాస్పాలు …….
అక్కయ్య : నో నో నో ….. కావాలంటే నువ్వు – అక్కయ్య ……
బామ్మ : నో నో నో ……. నా బుజ్జిహీరో – చిట్టితల్లి అంతే ……..
నేనైతే ఫిక్స్ అయిపోయాను , మీరెలా …… మీ ప్రాణమైనవాళ్ళను అనుకుంటున్నారో – నేను …… నా ప్రాణం కంటే ఎక్కువైనవాళ్లను అనుకుంటున్నాను , నేను చెప్పేదే జరిగేది ……..
బామ్మ …… తియ్యనైన కోపంతో ముద్దు – అక్కయ్య అయితే ఏకంగా బుగ్గపై కొరికేసి నవ్వుతున్నారు .
స్స్స్ స్స్స్ ……..
దేవత : బుజ్జిహీరో ……. ఏమైంది ? .
అందమైన తుమ్మెద కుట్టింది మేడం …….
అక్కయ్య – బామ్మ ……. నవ్వుకుంటున్నారు .
దేవత : అవునా ఇంతకీ సరైన సమయానికి ఆ వీడియోలు పంపించిన దేవుడు ఎవరో ……. , ఆ సెక్యూరిటీ అధికారి కు తిక్క కుదిరింది .
బామ్మ : రామాయణం అంతా విని రాముడికి ….. సీత ఏమౌతుంది అన్నట్లుగా ఉంది బుజ్జితల్లీ ……. , మళ్లీ ఇంగ్లీష్ టీచర్ ……..
దేవత : అర్థమైంది అర్థమైంది బామ్మా ……
బామ్మ : లేదు లేదు పిల్లలతో చెప్పిస్తాను చూడు …….. , పిల్లలూ ……. ఆ దేవుడు ఎవరో చెప్పండి .
చెల్లెళ్లు : నిన్న మీరుచెప్పిన మీ బుజ్జిహీరో బామ్మా …….
దేవత : అర్థమైంది అనిచెప్పానుకదా బామ్మా ……. అంటూ SI సర్ గుండెల్లో దాచుకుని సిగ్గుపడ్డారు .
SI సర్ మేడం : అయితే ఇక మా శ్రీవారిని కూడా అడిగే అవసరం లేదన్నమాట , బామ్మా బామ్మా ……. ఆ దేవుడు బుజ్జిదేవుడు ఎక్కడ ఉన్నారు ? – ఆయనగారికంటే ముందు మనం కలుద్దాము ప్లీజ్ ప్లీజ్ ………
బామ్మ : మీ శ్రీవారు …… నిమిషానికోకసారి కాల్ చేస్తుండటంతో స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను అనిచెప్పాడు – ఆ క్షణం నుండీ ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు – మీ శ్రీవారు వచ్చాక ఆర్డర్ వెయ్యి సిటీ మొత్తం గాలించి అయినా నీ ముందు ఉంచుతారు – నో అంటే తెలుసుకదా ……..
దేవత – అక్కయ్య : నో ఫుడ్ – నో బెడ్ ……..
SI సర్ మేడం : సిగ్గుపడుతూ బామ్మ గుండెలపైకి చేరారు .
టీవీలో అయితే సర్ నినాదాలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి – ఏ న్యూస్ ఛానెల్ ఉంచినా సర్ గురించే చూయిస్తున్నారు – టాపర్ in the బ్యాచ్ అంటూ సర్ గురించి ప్రోగ్రామ్స్ కూడా చేసేస్తున్నారు .
సడెన్ గా హెడ్లైన్స్ …… ” కాసేపట్లో SI విశ్వ సర్ ను కలవబోతున్న హోమ్ మినిస్టర్ ……. ” – ప్రమోషన్ గ్యారంటీ అంటున్న విశ్వాసనీయవర్గాలు …… – కమీషనర్ గా చేస్తారా లేక ఏకంగా సెక్యూరిటీ అధికారి బాస్ గా ప్రమోట్ చేస్తారా …… ? – డీజీపీ అనే వినిపిస్తున్నాయి – మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం చూస్తూనే ఉండండి ***** ***** .
పిల్లలకు కూడా అర్థమైనట్లు సంతోషంతో కౌగిలించుకుంటున్నారు .
దేవత – అక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ……. ఏ పోస్ట్ ఇష్టం మీకు , CI నా – DSP నా – SP నా – IG నా – DIG నా – DGP నా ………
SI సర్ మేడం : డీజీపీ – DIG – IG లాంటి పెద్ద పొజిషన్స్ అయితే వద్దే వద్దు .
దేవత – అక్కయ్య : ఎందుకు అక్కయ్యా ……. ? .
SI సర్ మేడం : పెద్ద పొజిషన్స్ అయితే రాజధానికి వెళ్లిపోవాలి .
హాసిని : మమ్మీ …… ? .
SI సర్ మేడం : నాకు తెలుసు బుజ్జిదెయ్యాలూ …… అదేవిషయం చెబుతున్నాను – వాళ్ళ అన్నయ్యను , ఆక్కయ్యలను , ఫ్రెండ్స్ ను వదిలి రారు – నేను కూడా నా ప్రియమైన చెల్లెళ్లను వదిలి వెళ్లనే వెళ్లను – మీ సర్ ను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుండి వచ్చేసాక ఇంత ప్రియమైనవాళ్ళు దొరికారు – ఇక వదులుకోలేను , మీ సర్ గురించి నాకు తెలుసు – నా మాటనే వారి మాట …….
దేవత – అక్కయ్య : లవ్ యు లవ్ యు అక్కయ్యా …… , అయితే మరి సర్ కు కాల్ చేసి చెప్పండి .
SI సర్ మేడం : ఇక్కడే ఉండే పోస్ట్ తీసుకుంటే ok లేకపోతే ఆయానగారు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది .
పిల్లలు : లవ్ యు మమ్మీ …… అంటూ దేవత – అక్కయ్యను హత్తుకున్నారు .
SI సర్ మేడం : లవ్ యు మమ్మీ అని నన్ను కదా హత్తుకోవాల్సింది – నాకు తెలుసు మీకు …… మీ అక్కయ్యలూ – అన్నయ్య అంటేనే ఇష్టం …….
పిల్లలు : Yes మమ్మీ …….
SI సర్ మేడం తియ్యనైన కోపంతో చూస్తున్నారు .
అందరితోపాటు బామ్మ నవ్వుతూనే , భోజనం చేద్దాము రండి రండి ……..
హోమ్ మినిస్టర్ వచ్చి సర్ ను ప్రమోట్ చూసేంతవరకూ నో లంచ్ అని దేవత – అక్కయ్య , నో లంచ్ అని పిల్లలు …… ఒకేసారి బదులిచ్చారు .
బామ్మ : అయితే నేనుకూడా అంటూ అందరితోపాటు సంతోషంతో టీవీ ముందు సోఫాలో కూర్చున్నారు .
అన్నయ్యా …… ఎంతసేపని నిలబడతారు వచ్చి కూర్చోండి అని లాక్కెళ్లి తమతోపాటు కూర్చోబెట్టుకున్నారు .
” వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన హోమ్ మినిస్టర్ – స్వాగతం పలికిన కలెక్టర్ – మరికాసేపట్లో సిటీ స్టేట్ సెంట్రల్ హీరో విశ్వ సర్ ను కమిషనర్ ఆఫీస్ లో కలవబోతున్నారు – డీజీపీ నే పక్కా అని సమాచారం ” అంటూ హెడ్లైన్స్ ……..
నో ……. అని SI సర్ మేడం – నో అంటే నో …… అని పిల్లలిద్దరూ …… , అన్నయ్యా ……. మీకేమి ఇష్టమో చెప్పనేలేదు .
SI సర్ మేడం : పోయి పోయి మీ అన్నయ్యను ఆడిగారా సరిపోయింది – ఏమని బదులిస్తారో మా అందరికీ తెలుసు ……. ” నా చెల్లీ – తమ్ముడికి ఏమిష్టమో నాకూ అదే ఇష్టం ” అంతేకదా బుజ్జిహీరో …….
చిరునవ్వు నవ్వాను .
హాసిని – విక్రమ్ : లవ్ యు అన్నయ్యా …….
చెల్లీ …… డాడీ ……
హోమ్ మినిస్టర్ – కలెక్టర్ గారు …… విశ్వ సర్ ను కౌగిలించుకుని అభినందిస్తున్న విజువల్స్ ప్లే అవుతున్నాయి , 5 నిమిషాలు మాట్లాడి నేరుగా మీడియా ముందుకువచ్చారు .
మీడియా : మినిస్టర్ గారూ …… ఏ పోస్ట్ ఇస్తున్నారు – డీజీపీ or IG …….
హోమ్ మినిస్టర్ : SI విశ్వ గురించి న్యూస్ లో చూడగానే CM గారు రావాల్సినది సెంట్రల్ డెలిగేట్స్ తో మీటింగ్స్ ఉండటం వలన నన్ను పంపించారు . ఇలాంటి హీరోను గౌరవించుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం – హెడ్లైన్స్ నిజమే విశ్వ ను SI నుండి స్టేట్ డీజీపీ గా ప్రమోట్ చేయడానికే వచ్చాను .
నో నో నో అంటూ SI సర్ మేడం – పిల్లలు ప్రార్థిస్తున్నారు .
మీడియా మరియు అక్కడున్నవాళ్ళంతా విశ్వ సర్ విశ్వ సర్ డీజీపీ డీజీపీ ……. అంటూ దద్దరిల్లిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : ఈ ఒక్కటీ చాలు విశ్వ ……. నిన్ను ఎక్కడికో చేర్చింది – కానీ మీ విశ్వ సర్ …… డీజీపీ ని నిమ్మళంగా తిరస్కరించారు , తనకు ఈ సిటీని – మిమ్మల్నీ వదిలి మాదగ్గరకు రావాలని ఏమాత్రం ఇష్టం లేదు , తన కోరిక మేరకు సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ గా ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసాను అంటూ లెటర్ చూయించారు – ఈ క్షణం నుండీ వైజాగ్ సిటీ సెక్యూరిటీ అధికారి కమీషనర్ విశ్వ అని చెప్పడానికి గర్వపడుతున్నాము అంటూ సర్ చేతులుకలిపారు .
డాడీ డాడీ …… ఉమ్మా ఉమ్మా …….
SI సర్ మేడం కాదు కాదు కమిషనర్ మేడం పెదాలపై చిరునవ్వులు …….
దేవత – అక్కయ్య : మిస్సెస్ కమిషనర్ గారూ ……. , మీ మనసు …… సర్ కు బాగా తెలుసు – లేకపోతే ఏమిజరుగుతుందో కూడా తెలుసు తెలుసు ……
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ …… అంటూ సిగ్గుపడుతూ దేవత గుండెల్లో దాచుకున్నారు .
మీడియా – ప్రజలు : సిటీ కోసం ……. ఉన్నతమైన డీజీపీ పోస్ట్ నే వదులుకున్నారు గ్రేట్ సర్ ….. సెక్యూరిటీ అధికారి కమిషనర్ విశ్వ విశ్వ అంటూ టాప్ లేచిపోయేలా నినాదాలు చేస్తున్నారు .
హోమ్ మినిస్టర్ : మీడియా మిత్రులారా ……. , మీరు దేవుడిగా కొలుస్తున్న ఆ అజ్ఞాతవ్యక్తి కోసం రేపో ఎల్లుండో సీఎం గారే స్వయంగా వస్తున్నారు – అంతలోపు ఆ దేవుడిని ఒప్పించాలని మీ అందరి సమక్షంలో వైజాగ్ సిటీ కమిషనర్ విశ్వను కోరుతున్నాను .
Yes yes yes …… అంటూ దద్దరిల్లిపోయింది .
హోమ్ మినిస్టర్ : మీతోపాటు సంబరాలు చేసుకోవాలని ఉంది కానీ ఈ అటాక్స్ గురించి డిస్కస్ చెయ్యడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి అర్జెంట్ గా రమ్మని స్టేట్ హోమ్ మినిస్టర్స్ కు పిలుపు వచ్చింది , మరొకసారి కమిషనర్ విశ్వ ను అభినందించడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితోపాటు వస్తాను అనిచెప్పి సర్ ను మరొకసారి కౌగిలించుకుని చేతులుకలిపి వెళ్లారు .
సిటీ కమీషనర్ ఫస్ట్ డ్యూటీ గా హోమ్ మినిస్టర్ ను ఎయిర్పోర్ట్ వరకూ వదిలారు .
దారి పొడవునా దైర్యంగా బయటకువచ్చినవైజాగ్ సిటీ ప్రజలు సర్ వెహికల్ కు సెల్యూట్ చేశారు .
దేవత – అక్కయ్య : congratulations అక్కయ్యా – పిల్లలూ …….
మిస్సెస్ కమిషనర్ : లవ్ యు చెల్లెళ్ళూ…
కంగ్రాట్స్ మేడం – చెల్లీ …….
లవ్ యు sooooo మచ్ అన్నయ్యా …….
బామ్మ : కంగ్రాట్స్ మిస్సెస్ కమిషనర్ – పిల్లలూ …….. , ఇక ఇప్పటికైనా భోజనం చేస్తారా …… ఆకలి వెయ్యడం లేదా …… 2 గంటలు అవుతోంది .
పిల్లలు : ఈ ఆనందంలో ఆకలివెయ్యడం లేదు బామ్మా ……. అని ఎంజాయ్ చేస్తూనే , ఒక్కసారిగా ప్చ్ ప్చ్ ……. అంటూ నిరాశతోవచ్చి చెరొకవైపు నా చేతులను చుట్టేశారు .
బామ్మ : ఆరే …… ఏమైంది పిల్లలూ …… ? .
హాసిని : ఇలా అంటున్నామని బాధపడకండి బామ్మా ……. , ఆ దేవుడు …… మీ బుజ్జిహీరో కాకుండా మన బుజ్జిహీరో మా అన్నయ్య అయి ఉంటే ఎంత బాగుండేది – sorry బామ్మా ……..
లవ్ యు చెల్లీ …….
బామ్మ : అమ్మో అమ్మో ……. , మీ అన్నయ్య అంటే ఇంత ప్రాణమా …… ? .
మిస్సెస్ కమిషనర్ : చెప్పాను కదా బామ్మా …… , చాలా అంటే చాలా ఇష్టం – ఇంగ్లీష్ క్లాసులో జరిగేవి రోజూ చెప్పి ఆనందించేవాళ్ళు …….
దేవత : అలాంటి మీ అన్నయ్య ఎందుకు చేస్తాడు , క్లాసులో అల్లరి చేయమంటే – టీచర్స్ కు కోపం కలిగించమంటే చెయ్యమను చేస్తాడు .
థాంక్యూ మేడం …….
దేవత : ఇదిగో ఇలా …….
బామ్మ : బుజ్జితల్లీ ……. అంటూ వీపుపై కొట్టారు .
దేవత : అమ్మా ……. వీపు వాచిపోయింది .
పిల్లలతోపాటు బామ్మ నవ్వుకున్నారు .
దేవత : నీ వల్లనే అంటూ కోపంతో చూస్తున్నారు రుద్దుకుంటూనే …….
అక్కయ్య : అవునవును తమ్ముడివల్లనే అంటూ నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి , దేవత వీపుపై రుద్దుతున్నారు .
దేవత : నొప్పి పోవాలంటే రుద్దడం కాదు ముద్దుపెట్టాలికదా చెల్లీ …….
తియ్యనైన నవ్వులతో అక్కయ్య ఆ వెంటనే చెల్లెళ్లు వచ్చి ముద్దులుపెట్టారు .
దేవత : లవ్ యు లవ్ యు హాయిగా ఉంది – ఈ బుజ్జిహీరోకు కూడా అందరూ ఫ్యాన్సే …… నా స్టూడెంట్స్ కూడా కొట్టేవాళ్లేమో ……. కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ రుసరుసలాడుతూ చూస్తున్నారు .
చెల్లెళ్లు : sorry మేడం అంటూ నవ్వుతున్నారు .
దేవత : అంటే నిజమేనన్నమాట అంటూ భయపడుతూ అక్కయ్యను హత్తుకున్నారు .
అంతలో నా మొబైల్ రింగ్ అవ్వడంతో …… , అమ్మా దుర్గమ్మ తల్లీ …… ఈ బుజ్జిహీరోను డ్యూటీకి పిలిచే కాల్ అయ్యుండాలి ప్లీజ్ ప్లీజ్ …… – స్పీకర్ ఆన్ చెయ్యి బుజ్జిహీరో …….
ఆజ్ఞ మేడం అక్కడినుండే అంటూ స్పీకర్ ఆన్ చేసాను – హలో మురళి సర్ ……
మురళి కాదు మహేష్ ……..
మేడం మేడం sorry sorry చెప్పండి .
మురళి mother : ఎక్కడ ఉన్నావు ? ఇంకా ఇంటికి రాలేదు , కాలేజ్ లేదు కదా మురళి మరియు ఫ్రెండ్స్ ఆడుకోవాలని ఆశపడుతున్నారు ఎక్కడ ఉన్నా వచ్చేయ్యాలి – నువ్వు ఉంటే మాకు కాస్త దైర్యంగా ఉంటుంది .
మేడం మేడం వచ్చేస్తున్నాను – బస్సులో వస్తుంటే తనికీ కోసం బాంబ్స్ స్క్వాడ్ ఆపారు – చాలా వెహికల్స్ ఉండటం వలన ఆలస్యం అవుతోంది , వచ్చేస్తాను మేడం …….
దేవత : ఇదిగో ఇలా అపద్దాలు చెప్పమంటే రెడీగా ఉంటాడు పిల్లలూ – అపద్దాల బుజ్జిహీరోను ……. సిటీ మొత్తం దేవుడిగా కొలుస్తున్న బామ్మ బుజ్జిహీరోతో పోలుస్తున్నారు .
బామ్మకు కోపం వచ్చినట్లు మరొక దెబ్బతో వీపు విమానం మోగించారు – ఎవరికోసం ఇక్కడివరకూ వచ్చాడు – నీకు భయమేసి పిలుచుకునివచ్చాను అని నువ్వే చెప్పావుకదా రాగానే ……..
దేవత : అవునవును ……. అమ్మా చుర్రుమంది .
అక్కయ్య : బామ్మా …… కొట్టాలనిపిస్తే నన్ను కొట్టండి దేవస్థలాంటి అక్కయ్యను కాదు ప్లీజ్ ప్లీజ్ …….
నన్ను కొట్టండి బామ్మా ……..
నన్ను కొట్టండి నన్ను కొట్టండి బామ్మా ……. అన్నయ్య దేవతను కాదు అంటూ పిల్లలు ముందుకువచ్చారు .
దేవత అలా అవాక్కై చూస్తూ ఉండిపోయారు .
బామ్మ : చూశావా …… ? అంటూ మరొక దెబ్బ వెయ్యబోతే …… , అక్కయ్య – చెల్లెళ్లు ……. తమ తమ వీపులను చూయించడంతో ఆగి అందరికీ ముద్దులుపెట్టారు .
బామ్మా ……. అక్కడ ఫ్రెండ్స్ ఎదురుచూస్తుంటారు – టైం టు గో …….
అంతే బామ్మ – అక్కయ్య కళ్ళల్లో చెమ్మ , అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ పిల్లలు చుట్టూ హత్తుకున్నారు .
