పెద్దమ్మ Part 19

అన్నయ్యా అన్నయ్యా …… , మేడం …… అన్నయ్య ఇక్కడే ఉన్నారు . అన్నయ్యా …… మమ్మీతోపాటు లోపలికివెళ్ళేటప్పుడు కనిపించనేలేదు .
దేవత : తప్పు చేసాడు కదా ముఖం చాటేసి దాక్కుని ఉంటాడు . అయినా తప్పుచేశాడు అనిచెప్పాను కదా మీ అన్నయ్య దగ్గరికి పరుగుతీస్తున్నారు – మీకు , నాకంటే మీ అన్నయ్యే ఎక్కువ ఇష్టం అన్నమాట అయితే అక్కడికే వెళ్ళండి అని నావైపు కోపంతో చూస్తున్నారు .
చెల్లెళ్ళవైపు నో నో రావద్దు అని సైగచేసాను .
నలుగురూ మధ్యలోనే ఆగిపోయి అటూ ఇటూ రెండువైపులా ఆశతో చూస్తున్నారు.
దేవత : వెళ్ళండి వెళ్ళండి ఇంత చెప్పినా …… , మీకు , మీఅన్నయ్య అంటేనే ఇష్టం …….
నాకు నవ్వు వచ్చేసింది , లోలోపలే కంట్రోల్ చేసుకుని , నో నో …….. ప్లీజ్ ప్లీజ్ చెల్లెళ్ళూ ……..
సరే అన్నయ్యా అని తలలుఊపి , మాకు …… మా మేడం అంటేనే ఇష్టం – అన్నయ్యా ……. మేడం కు కోపం తెప్పించారట కదా ఇంకా ఇక్కడే ఉన్నారే , మమ్మల్ని మాత్రం ఫాలో అవ్వకండి …….
అలానే చెల్లెళ్ళూ అంటూ తలఊపి వెనుకే ఫాలో అయ్యాను . చెల్లెళ్లు వెనక్కుచూసి నవ్వుతూ త్వరగా రండి అంటూ దేవతకు కనిపించకుండా సైగలుచేస్తున్నారు .
ఉమ్మా ఉమ్మా …… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఫాలో అయ్యాను .
చెల్లెళ్లు : మేడం మేడం ……. మనం రావద్దని చెప్పినా వెనుకే ఫాలో అవుతున్నారు .
దేవత ఆగి కోపంతో చూసారు .
అంతే అక్కడే ఆగిపోయి చేతులుకట్టుకుని తలదించుకున్నాను – దేవత ముందుకు నడువగానే నవ్వుకుంటూ వెనుకే ఫాలో అవుతూ కాలేజ్ కు ఆఫీస్ రూమ్ కు చేరుకున్నాము .

దేవత : పిల్లలూ …… ఇక మీ క్లాస్ కు వెళ్ళండి .
చెల్లెళ్లు : ఇంకా చాలా సమయం ఉంది కదా మేడం – ఇక్కడే చదువుకుంటాము .
దేవత : సరే అయితే అంటూ కాస్తదూరంలో ఉన్న నావైపు కోపంతో చూస్తూ ఆఫీస్ రూంలోకి వెళ్లారు .
అంతే అన్నయ్యా అన్నయ్యా …… అంటూ పరుగునవచ్చి చుట్టుముట్టారు .
Sorry sorry చెల్లెళ్ళూ – తమ్ముడూ ……. మేడంకు చాలాకోపం తెప్పించే తప్పుచేసాను .
హాసిని : బామ్మ చెప్పారులే అన్నయ్యా ……. , మీ అన్నయ్య ఏ తప్పూ చెయ్యలేదు చెయ్యబోడు అని , మాకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు – మీ దేవత అంటే మీకెంత ఇష్టమో ప్రాణమో మాకు తెలియదా ……. ? .
దేవత …… ? .
చెల్లెళ్లు : బామ్మ చెప్పారు అన్నయ్యా …… , మేడం …… మీకు దేవతతో సమానం అని …….
సిగ్గుపడ్డాను – థాంక్స్ చెల్లెళ్ళూ ……. , మీరు మాత్రం దేవతతోనే ఉండాలి .
చెల్లెళ్లు : మా అన్నయ్య చెప్పారుకదా ok ……

టీచర్స్ అందరూ ఒక్కొక్కరే లోపలకువెళ్లి exam సమయానికి 15 నిమిషాల ముందు ఒక్కొక్కరే బయటకువచ్చి ఇన్విజిలేషన్ రూమ్స్ వైపుకు వెళుతున్నారు .
దేవతకూడా క్వశ్చన్ మరియు వైట్ పేపర్స్ తో బయటకువచ్చి ఇంకా ఇక్కడే ఉన్నాడా ….. ? .
దేవత వచ్చేసమయానికి దూరం జరిగారు – అవును మేడం …… మేము మాట్లాడకపోయినా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు అని నవ్వుకున్నారు .
దేవత : భయం లేదుకదా ……. , vice హెడ్ మాస్టర్ బయటకు రాగానే ….. , సర్ సర్ ……. నన్ను వేరే రూమ్ లో ఇన్విజిలేషన్ వెయ్యండి .
VIce : 10 మినిట్స్ ఉంది మేడం …… ఎలా కుదురుతుంది చెప్పండి అందరూ వారి వారి రూమ్స్ కు కూడా వెళ్లిపోయారు – sorry అర్థం చేసుకోండి , ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి సాల్వ్ చేసేద్దాము .
చెల్లెళ్లు : అవును సర్ ప్రాబ్లమ్ ఉంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మేడం : లేదు లేదు , అడ్జస్ట్ అవుతాను పిల్లలూ రండి ఆలస్యం అవుతుంది – లవ్ యు లవ్ యు నాకు సపోర్ట్ చేసినందుకు ……..
చెల్లెళ్లు : మా అన్నయ్య చెప్పారుకాబట్టి మేడం అంటూ నావైపు నవ్వుకుంటూ చూసి all the best చెప్పారు .
All the best all the best చెల్లెళ్ళూ – తమ్ముడూ ……..
దేవత : అవసరం లేదు , నువ్వు చెప్పకపోయినా బానే రాస్తారు , తమరు తమరి క్లాసుకు వెళ్లొచ్చు .
మీరు ఎంత ప్రయత్నించినా మనల్ని వేరుచేసి శక్తి ఎవ్వరికీ లేదు మేడం – పదండి కలిసే వెళదాము మీ వెనుకే నేను అని చెల్లెళ్లతోపాటు లోలోపలే నవ్వుకున్నాను .
దేవత : ప్చ్ …… నిజమే అంటూ బుంగమూతిపెట్టుకుని , చెల్లెళ్లను వాళ్ళ క్లాస్ లో వదిలి వెనక్కుచూసి కోప్పడుతూనే – చిరు విసుగు చెందుతూనే మా క్లాస్ చేరుకున్నాము .

దారిపొడుగునా ప్రతీ క్లాస్ లలో ఉన్న మేడమ్స్ బయటకువచ్చిమరీ గుడ్ మార్నింగ్ హీరో …… – నువ్వు చేసిన మంచిపనివలన ఈరోజు కూడా ఆ హెడ్ మాస్టర్ రాలేదు మేమైతే ఫుల్ హ్యాపీ …… – గుడ్ మార్నింగ్ అండ్ All the బెస్ట్ …… అని విష్ చేశారు . దానికే కోపంగా క్లాస్ కు చేరిన మేడం ను మొదట విష్ చెయ్యకుండా గర్ల్స్ అందరూ గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ నా చుట్టూ చేరడం చూసి మరింత కోపం వచ్చేసింది దేవతకు …….
నవ్వుకుని , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ …….. ఫస్ట్ మేడం కు …….
గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎవరి places లోకి వాళ్ళు వెళ్లారు .
దేవత కూల్ అయినట్లు పెదాలపై చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ …….
నాకు కూడా చెప్పినట్లే కదా ……. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచిమరీ సంతోషంతో చెప్పాను .
దేవత : సైలెన్స్ అంటూ నావైపు కోపంతో చూసి , స్టూడెంట్స్ …… బాగా ప్రిపేర్ అయ్యారా ….. ? .
Yes yes మేడం – yes మేడం అంటూ మళ్లీ పైకిలేచి చెప్పాను .
దేవత : Sit down అంటూ కాస్తకటువుగానే చెప్పారు . ఒక్కరికితప్ప అందరికీ All the best …….
క్లాస్మేట్స్ : థాంక్యూ మేడం – నిన్న మీరు విష్ చేశారు బాగా రాసాము – ఇక ఈరోజు కూడా బాగానే రాస్తాము – మేడం …… ఒక్కరికి తప్ప అన్నారు , ఆ ఒక్కరూ ఎవరు మేడం ? .
దేవత : ఆ ఒక్కరికీ తెలుసులే …….

అంతలో exam బెల్ మ్రోగడంతో ……. , క్లాస్మేట్స్ అందరూ బుక్స్ బయట పెట్టివచ్చారు .
దేవత మొదటి స్టూడెంట్ దగ్గర నుండి క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ షీట్స్ పంచుతూ నాదగ్గరికి చేరుకున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ చేతులు చాపాను అందుకోవడానికి ……..
దేవత : జాహ్నవీ …… నీ హీరోకు ఇవ్వు అని బెంచ్ కు అటువైపుకు కూర్చున్న తనకు అందించారు .
జాహ్నవి ఆశ్చర్యపోయినా …… , yes మేడం అంటూ అందుకుని పెదాలపై చిరునవ్వులతో నాకు ఇచ్చి all the best చెప్పింది …….
ఆఅహ్హ్ ……. మేడం కు నేను ఇంత స్పెషల్ అన్నమాట అంటూ గుండెలపై చేతినివేసుకుని జాహ్నవి నుండి అందుకున్నాను .
దేవత కోపంతో కొట్టబోయి , ప్చ్ …… నువ్వు మారవు అని ముందుకు వెళ్లారు క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ …….

క్వశ్చన్ పేపర్ చూసి పెదాలపై చిరునవ్వులతో స్టార్ట్ చేసాను . కొద్దిసేపటి తరువాత క్లాస్మేట్స్ తో పాటు నేనూ అడిషనల్ అడిగాను .
అప్పుడుకూడా జాహ్నవి ద్వారా ఇప్పించారు .
ఆఅహ్హ్ ……
దేవత : నిన్నూ …… అంటూ బుజ్జాయిలా కోప్పడటం చూసి నవ్వుకున్నాను . ఆడిషనల్స్ అన్నీ జాహ్నవి ద్వారానే ఇప్పించారు .
2 గంటల్లో exam ఫినిష్ చేసి , దేవత ఎటువైపు వెళితే అటువైపు చూస్తూ – దేవత చూసినప్పుడల్లా ……. చిరునవ్వు నవ్వాను – దేవత మాత్రం కోపంతోనే వేలితో వార్నింగ్ ఇస్తున్నారు .
దేవత సంతోషం కంటే కోపమే ఎక్కువ ఇష్టమన్నట్లు ఎంజాయ్ చేస్తున్నాను . అర గంట ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది – ఏకంగా లాంగ్ బెల్ కొట్టేశారు .
క్లాస్మేట్స్ అందరూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
దేవత : అంతా ఇతగాడివల్లనే ఈరోజు కూడా హాఫ్ డే లీవ్ ఇచ్చేసారు ఇంటికివెళ్లి చదుకోండి బై అంటూ దేవత పేపర్స్ తీసుకుని వెళ్లిపోతున్నారు .
మహేష్ మహేష్ థాంక్స్ థాంక్స్ అంటూ చుట్టూ చేరారు .
Ok ok ఫ్రెండ్స్ రేపు కలుద్దాము అని పరుగున దేవత దగ్గరికి చేరాను .
దేవత : నిన్ను బుక్ చేసినా ఎలా వచ్చావు – తిట్టాను కొట్టాను అయినా వదలవా ……. ? .
దేవతకు కూడా కన్నింగ్ తెలుసన్నమాట అమ్మో అమ్మో …… ఎంత మోసం ……. – అస్సలు వదలనే వదలను – బాడీ గార్డ్ అంతే ఇలానే ఉంటాడు .
దేవత నవ్వుకుంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు .
హమ్మయ్యా …… నవ్వేశారా …… ? అంటూ గుండెలపైకి చేతినివేసుకున్నాను .
దేవత వెంటనే కోపంతో రుసరుసలాడుతూ ఆఫీస్ రూంలోకి వెళ్లారు .
అన్నయ్యా అన్నయ్యా ……..
ఎలా రాశారు ? .
సూపర్ …….
దేవత వచ్చేన్తవరకూ మాట్లాడుతున్నాము .

కొద్దిసేపటి తరువాత దేవత …… మిగతా లేడీ స్టాఫ్ తో చిరునవ్వులు చిందిస్తూ వచ్చి వాళ్లకు బై చెప్పేసి , నన్ను చూడగానే నవ్వు ఆపేసి కోపంతో చూస్తున్నారు .
దేవత : పిల్లలూ …… రండి కలిసి వెళదాము .
చెల్లెళ్లు : అన్నయ్యా ……. రండి .
దేవత : నో ……. , మనం మాత్రమే …….
చెల్లెళ్లు : అయితే మేము అన్నయ్యతోపాటే వస్తాము మేడం ……..
దేవత కళ్ళు మరింత ఎర్రబడ్డాయి – అందరికీ వాడంటేనే ఇష్టం ……. మీ ఇష్టం అంటూ కోపంతో గుసగుసలాడుతూ నడిచారు .
నవ్వుకుని , చెల్లెళ్ళూ …… ప్లీజ్ ప్లీజ్ మేడం దగ్గరకు వెళ్ళండి – కోపం తగ్గిపోవాలి మీ ముద్దులతో ….. – అన్నయ్య కంటే మా మేడం ఎక్కువ ఇష్టం అనిచెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ……
చెల్లెళ్లు : మా అన్నయ్య చెబితే ok అంటూ పరుగులతో దేవతను చేరి , దేవత చేతులపై ముద్దులుపెట్టారు – నేను చెప్పినట్లే చెప్పి పెదాలపై చిరునవ్వులు పూయించి నడిచారు .
ఆఅహ్హ్హ్ …… దేవత నవ్వితే చాలు ఈ బుజ్జి హృదయం soooo హ్యాపీ …… , మొబైల్ తీసి వచ్చేస్తున్నాము అంటూ అక్కయ్యకు మెసేజ్ చేసాను .
అక్కయ్య మెసేజ్ : ఈగర్లీ వెయిటింగ్ తమ్ముడూ ……. , బామ్మలిద్దరూ కలిసి వేడివేడిగా ఇప్పుడే డైనింగ్ టేబుల్ పైకి వంటలు చేర్చేస్తున్నారు , ఉమ్మా ఉమ్మా …..
లవ్ టు అక్కయ్యా …….. ఉమ్మా .

దేవత – చెల్లెళ్ల వెనుకే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకున్నాను .
అక్కయ్య ఏకంగా మెయిన్ గేట్ దగ్గర ఎదురుచూస్తున్నట్లు అక్కయ్యా – చెల్లెళ్ళూ …….. అంటూ సంతోషంతో హత్తుకున్నారు, ముద్దులుపెట్టారు . దేవతను హత్తుకుని నావైపు చేతిని ఊపి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్యా …… గెట్ ఔట్ అన్నాకూడా మన బుజ్జిహీరో వెనుకే ఫాలో అవుతున్నాడేంటి ……. ? .
దేవత : బాడీ గార్డ్ కదా …… , ఇక్కడిదాకా ఎవ్వరైనా రావచ్చు – మన ఇంట్లోకి రానివ్వు అప్పుడు ఉంటుంది ……..
అక్కయ్య కళ్ళల్లో ఒక్కసారిగా చెమ్మ …….
నో నో నో అక్కయ్యా …… స్మైల్ – నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను బాధపడకండి అంటూ నవ్వుతున్నాను .
వెంటనే అక్కయ్య కన్నీళ్లను తుడుచుకుని , అక్కయ్యా …… రండి లంచ్ రెడీ అంటూ చేతిని చుట్టేసి వెనక్కు తిరిగితిరిగిచూస్తూనే లోపలికి ఫస్ట్ ఫ్లోర్లోని ఇంట్లోకి వెళ్ళారు .
దేవత గుమ్మం దగ్గర ఆగి వెనక్కుతిరిగి ఒకచూపు చూడగానే అక్కడే ఆగిపోయాను.

అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతోనే , అక్కయ్యా – చెల్లెళ్ళూ …… లోపలికివెళ్లి ఫ్రెష్ అవ్వండి అని రూమ్స్లోకి పంపించి పరుగున బయటకువచ్చి తమ్ముడూ
అంటూ కౌగిలించుకున్నారు . Sorry లవ్ యు లవ్ యు sooooo మచ్ తమ్ముడూ ………
అక్కయ్యా ……. తప్పు చేసింది నేను – మిమ్మల్ని బాధపెడుతోంది మీ కళ్ళల్లో కన్నీళ్లకు కారణం నేను – కాబట్టి మా అక్కయ్యకు sorry లు బోలెడన్ని లవ్ యు లు చెప్పాల్సినది నేను – పెద్ద తప్పు చేశాను అక్కయ్యా …… ఏమిచేశానంటే …….
అక్కయ్య : నాకు తెలుసు తమ్ముడూ …….. , నీ దేవత ఇంటినుండి వీడియో కాల్ చేసినప్పుడు బామ్మ ప్రక్కనే ఉన్నాను – బామ్మతోపాటు నేనూ ఎంజాయ్ చేసాను అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నారు .
ఇదిగో ఇలా మా అక్కయ్య ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని కన్నీళ్లను తుడిచాను – అక్కయ్యా …… ఇంత పెద్ద ప్లేస్ ఉందికదా ఇక్కడే ఉంటానులే మీరువెళ్లి మీ అక్కయ్యతోపాటు కలిసి తినండి .
అక్కయ్య : ఇక్కడనా ….. దుమ్ము వస్తుంది , వెహికల్ సౌండ్స్ వస్తాయి – చదువుకోవడానికి ఇబ్బంది తమ్ముడూ ……..

అయితే మా ఇంట్లో చదువుకుంటాడు – ఒక బెడ్రూం ఎలానో ఖాళీగానే ఉంది – బెడ్రూం మాత్రమేకాదు ఇంటిలో ఎక్కడైనా తిరగవచ్చు ఎక్కడైనా చదువుకోవచ్చు – మాతో కలిసి భోజనమూ చెయ్యవచ్చు – అల్లరికూడా చెయ్యవచ్చు తన చెల్లీ చెల్లా
ళ్ళతోపాటు అంటూ లేడీ సెక్యూరిటీ అధికారి మేడం చెప్పారు .
అక్కయ్య : కన్నీళ్లను తుడుచుకుని , పెదాలపై చిరునవ్వులతో థాంక్యూ థాంక్యూ మేడం ………
మా ఇంట్లో అయితే నేను తప్ప ఎవ్వరూ ఉండరు – ఆయానగారేమో డ్యూటీ డ్యూటీ అంటూ తిరుగుతున్నారు ఇక పిల్లలంటారా ……. ఈ ఇంటిలోనే ఫిక్స్ అయిపోయారు ఇదే వాళ్ళ ఇల్లులా మారిపోయింది , అక్కడకు ఏదో చుట్టపు చూపుకు వస్తున్నారు అంతే ……. , బుజ్జిహీరో …… ఇక్కడ బోర్ కొడితే అక్కడకు వచ్చెయ్యి – అయినా ఆ అదృష్టం మాకెక్కడిది అక్కయ్యను వదిలి అంతదూరం రావులే ……. ప్చ్ ……
అందరూ నవ్వుకున్నాము .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దుపెట్టారు . తమ్ముడూ ……. మేడం తోపాటు వెళ్లి ఫ్రెష్ అవ్వు లంచ్ తీసుకొస్తాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : నో నో నో …… లంచ్ మాఇంట్లోనే , కావాలంటే వచ్చి తినిపించు కావ్యా ……..
అక్కయ్య : అలాగే మేడం ……
అక్కయ్యా ……. మీ అక్కయ్య – చెల్లెళ్లతోపాటు తిన్నాక రండి అప్పటివరకూ వేచిచూస్తాను .
అక్కయ్య : అర్థమైంది తమ్ముడూ ……. , అప్పటివరకూ అంటూ ముద్దులవర్షం కురిపించి ప్రాణంలా హత్తుకుని , SI సర్ మేడంతోపాటు వెనక్కు చూస్తూనే లోపలికివెళ్లారు .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం : బుజ్జిహీరో ఫ్రెష్ అయ్యి అల్లరి చేద్దువుకాని రా …….
లేదు మేడం గారూ …… చదువుకోవాలి .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం : ఎప్పుడూ చదువేనా …… , అప్పుడప్పుడూ అల్లరికూడా చెయ్యాలి అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి గదిలోకివదిలారు – బుజ్జిహీరో ……. నాకు డ్యూటీకి టైం అయ్యింది నేను వెళ్ళాలి మా అత్తావాళ్ళు ఉంటారులే మా ఇంట్లోనే భోజనమే చెయ్యాలి సరేనా …… , నేనూ ఉండాలి కానీ వైజాగ్ మొత్తం అటాక్స్ జరుగుతాయని సెక్యూరిటీ ఆఫీసర్లందరినీ అలర్ట్ చేశారు వెళ్లక తప్పదు – ఆ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో ఎక్కడ బాంబులు పేలుస్తారో అని గుసగుసలాడుకుంటూ వెళ్లారు .
ఈరోజు కాస్త ముందుగానే ఇంటికివెళ్లాలి – వాళ్ళను చూసిన ఓకేఒకడిని నేనే కదా …….. ఈరోజు వాళ్ళు రాగానే ఫాలో అవ్వాలి అని మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి అదే గదిలో చదువుకుంటూ కూర్చున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి మేడం అత్తయ్యగారు వచ్చి నాకోడలు అంతా చెప్పింది , మీ అక్కయ్య వచ్చేన్తవరకూ వాటర్ – కూల్ డ్రింక్ – ఐస్ క్రీమ్ అంటూ నా ముందు ఉంచి వెళ్లారు .
థాంక్స్ అండీ ……..

అక్కయ్య ఇంటిలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరి ఒకరికొకరు వడ్డించుకున్నారు . అక్కయ్య – బామ్మలు ఆశతో డోర్ వైపు చూస్తున్నారు .
దేవత తినబోతూ ఆగిపోయారు .
బామ్మ : ఏమైంది బుజ్జితల్లీ …….
దేవత : తినబుద్ధి కావడం లేదు బామ్మా ……. , మనసులో ఎక్కడో చిన్న బాధ , బుజ్జిహీరో ……..
అక్కయ్య : అక్కయ్యా …… మీరెలాంటి ఫీల్ అవ్వకండి – మన బుజ్జిహీరో ఫాన్స్ చాలామందే ఉన్నారు – మనం గెట్ ఔట్ అనగానే ప్రక్కనే ఉన్న మేడం గారు అదృష్టంలా ఇంట్లోకి పిలుచుకునివెళ్లి ఫ్రెష్ అవ్వడానికి గది ఇచ్చి ఇష్టంతో వంటలన్నీ వడ్డించారు – తృప్తిగా తిని చదువుకుంటున్నాడు .
దేవత : అవునా చెల్లీ ……. , ప్చ్ అనవసరంగా వాడి గురించి బాధపడ్డాను , ఊరంతా ఫాన్స్ వాడికి అంటూ గబగబా తినడం చూసి అందరూ నవ్వుకుని తిన్నారు .

గంట తరువాత అక్కయ్య – వైష్ణవి – హాసిని …… ఫుడ్ – బుక్స్ తీసుకునివచ్చారు గదిలోకి ……..
అక్కయ్యా …… అంటూ లేచివెళ్లి హత్తుకున్నాను .
అక్కయ్య : గంట అయ్యింది తమ్ముడూ నిన్ను చూసి , నా వళ్లకూడా కావడం లేదు అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా …… ప్లేట్ ఇచ్చి ఎంతసేపైనా హత్తుకోండి పడేసేలా ఉన్నారు అని నవ్వుతున్నారు .
అక్కయ్య : లవ్ యు చెల్లెళ్ళూ ……. , ఇలా ప్రాణంలా కౌగిలించుకుంటేనే గానీ ….. ఆఅహ్హ్హ్ ……. ఇప్పుడు బాగుంది లవ్ యు లవ్ యు తమ్ముడూ ……..

అక్కయ్యా …… 5 నిమిషాలు అయ్యింది వదిలితే రోజంతా ఇలానే కౌగిలించుకునే ఉండిపోతారేమో – అన్నయ్యకు కూడా ఇలానే ఇష్టం ……. – 2:30 అవుతోంది పాపం అన్నయ్యకు ఆకలివేస్తోందేమో ……..
అవునవును బాగా ఆకలివేస్తోంది అక్కయ్యా ……..
అక్కయ్య : నాకు బుద్ధిలేదు అంటూ మొట్టికాయ వేసుకుని , బెడ్ పై కూర్చోబెట్టి చుట్టూ చేరి తినిపించారు .
వైష్ణవి : అక్కయ్యా …… ఈ ఫుడ్ కూడా తినిపించండి లేకపోతే అమ్మ ….. నాపై కోప్పడుతుంది .

అక్కయ్య : అవునవును మాటిచ్చాను అంటూ తినిపించారు . తమ్ముడూ …… నీపై కోప్పడ్డారని – నువ్వు తినలేదని నీ దేవత కూడా తినడానికి ఇష్టపడలేదు తెలుసా …… ? .
అక్కయ్యా ……. నా దేవత ఇప్పటికైనా తిన్నారా లేదా , చెప్పండి చెప్పండి తొందరగా చెప్పండి అంటూ ఆతృతతో అడిగాను .
అక్కయ్య : బాగా తిన్నారు – సంతోషంతో తిన్నారు – ఈ బుజ్జిహీరోపై కోప్పడుతూ తిన్నారు .
హాసిని – వైష్ణవి : అవునవును అన్నయ్యా …….
అక్కయ్య : నవ్వుకుని , ఏమి జరిగిందంటే అంటూ వివరించారు – నా తమ్ముడికి చాలామందే అభిమానులు ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
లవ్ యు అక్కయ్యా ……. , అక్కయ్యా …… అయితే మొత్తం మొత్తం తినిపించండి.
అక్కయ్య : అలాగే తమ్ముడూ ముద్దులతో తినిపిస్తాను , ముద్దు ముద్ద – ముద్దు ముద్ద ………
సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిని అక్కయ్య ప్రక్కనే కూర్చుని చదువుకుంటున్నాము .

హాసిని : అన్నయ్యా ……. రేపు ఇంగ్లీష్ exam కదా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ….? .
టీచ్ చేసినది ఎవరు నా దేవత …… , ఫుల్ క్లారిటీగా అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటూ బుజ్జి హృదయాన్ని చూయించాను .
వైష్ణవి : పో అన్నయ్యా ……. , డౌట్స్ ఉంటే మేడం దగ్గరికి పిలుచుకుని వెళదాము అనుకున్నాము .
అయ్యో ……. , ఉన్నాయి ఉన్నాయి డౌట్స్ ఉన్నాయి చెల్లెళ్ళూ ……..
హాసిని : అయితే వెళదాము రా అన్నయ్యా అంటూ చేతులను పట్టుకున్నారు .
అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున డోర్ వరకూ ఉత్సాహంతో వెళ్లి అక్కడే ఆగిపోయాను .

దేవత : హాల్లో సోఫాలో కూర్చుని విక్రమ్ – వర్షినికి డౌట్స్ clarify చేస్తున్నారు . డోర్ దగ్గరే ఆగిన నావైపు కోపంతో చూస్తున్నారు . హాసిని – వైష్ణవి రండి …… , అవునూ ……. మీ అన్నయ్య తిన్నాడా ? .
హాసిని : ఫుల్ గా తిన్నారు మేడం , వైష్ణవి మమ్మీ స్పెషల్ గా …….
దేవత : తెలుసు తెలుసు , మీ అన్నయ్య అందరికీ స్పెషల్ …… , తిన్నాడుకదా మళ్లీ ఎందుకు వచ్చాడు .
వైష్ణవి : రేపటి exam కు అన్నయ్యకు డౌట్స్ ఉన్నాయట మేడం …….
దేవత : నాకు డౌటే ……. , తెలుగు మీడియం నుండి వచ్చినా నెలలోనే అన్నింటికీ సమాధానాలు చెబుతాడు , ఇంకేమీ డౌట్స్ ఉన్నాయట , సరే సరే మేడం గా తప్పుతుందా లోపలికి పిలుచుకునిరండి .
హాసిని : మీరు రమ్మంటే కానీ లోపలికి రారు మేడం అన్నయ్య – శివగామీలా …… మీ మాటంటే శాసనం అన్నయ్యకు .
దేవత : నవ్వేశారు – సరే సరే లోపలికి రండి బుజ్జిహీరోగారూ ……. , లోపలికి రావడానికి ఇదేమీ ప్లాన్ కాదు కదా …….
పిల్లలందరమూ ఒకరినొకరు చూసుకుని లోలోపలే నవ్వుకున్నాము .
దేవత : ఇంగ్లీష్ exam కాబట్టి లోపలికి రానిస్తున్నాను , రేపు మళ్లీ బయటకు వెళ్లిపోవాలి .
అలాగే అలాగే మేడం …… , మీ మాటే శాసనం హమ్మయ్యా …… రేపటివరకూ ఇక్కడే చదువుకోవచ్చు అంటూ నవ్వుకుంటూ లోపలికివచ్చాను .
దేవత : ఇదిగో ఈ extraa లే వద్దు .
Ok మేడం అంటూ బుద్ధిగా వెళ్లి దూరంగా సోఫాలో కూర్చున్నాను .

అంతలో ఏమీ ఎరుగనట్లు అక్కయ్య లోపలికివచ్చి , ఏయ్ బుజ్జిహీరో …… అక్కయ్య గెట్ ఔట్ అన్నాకూడా లోపలికి ఎలావచ్చావు గెట్ ఔట్ గెట్ ఔట్ …… అంటూ లోలోపలే నవ్వుకుంటున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *