పెద్దమ్మ Part 19

చెల్లెళ్ళూ ……. మళ్లీ రేపు వచ్చేస్తాను కదా ……
పిల్లలు : రేపా …… ? .
అయితే ఆడుకోవడం పూర్తవగానే ఒకసారి వచ్చి వెళతానులే …….
తప్పకుండా వెళ్లాలని తెలిసి , బామ్మ భోజనం వడ్డించుకునివచ్చి కళ్ళల్లో చెమ్మతో తినిపించారు .
మేడం నుండి సంతృప్తికరంగా కోపాగ్నికి లోనయ్యాను . హ్యాపీగా వెళతాను అంటూ దేవతనే చూస్తూ తిన్నాను .
నేనుకూడా తినిపిస్తాను అంటూ అక్కయ్య తినిపించారు .
లవ్ యు అక్కయ్యా ……..
నేను నేను అంటూ చెల్లెళ్లు పోటీపడుతూ తినిపించారు .
ఇక నేనొక్కదాన్నే తినిపించకపోతే బాగోదు అంటూ దేవత కూడా తినిపించారు .
దేవత నా దేవత యాహూ …….. అమృతం అంటూ అక్కడికక్కడే డాన్స్ చెయ్యడం చూసి అందరూ నవ్వుకున్నారు .
దేవత : స్టాప్ స్టాప్ స్టాప్ బుజ్జిహీరో ……. , నీకోసం కాదులే ……. వీళ్ళందరికోసం తినిపించాను , బాగా తిన్నావుకదా ఇక వెళ్లు ……..
నా దేవత తినిపించారు …… హ్యాపీగా వెళతాను , రేపు ఉదయం వరకూ గుర్తుంచుకునే మాధుర్యాన్ని కలిగించారు , అక్కయ్యా – పిల్లలూ – బామ్మా ……. వెళ్ళొస్తాను .
మిస్సెస్ కమిషనర్ : అందరికీ చెప్పావు నాకు చెప్పవా బుజ్జిహీరో …….
Sorry sorry మేడం అంటూ దగ్గరికివెళ్లి లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను – మీరు సర్ ఆర్డర్ వేస్తే ఏమైనా చేస్తాను మేడం …….
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో అంటూ ఆపి , జాగ్రత్తగా వెళ్లు అన్నారు .
థాంక్స్ మేడం ……..
తమ్ముడూ అంటూ చెల్లెళ్లతోపాటు కిందవరకూ వచ్చారు అక్కయ్య …….
దేవత – అక్కయ్యతోనే ఉండాలని ఉంది కానీ తప్పదు అక్కయ్యా ……..
అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముడూ …… అంటూ గట్టిగా కౌగిలించుకుని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
ఈ ముద్దులు చాలు మరింత హ్యాపీగా వెళతాను అంటూ అక్కయ్యకు – చెల్లెళ్లకు ముద్దులుపెట్టి అక్కయ్యను చూస్తూనే వెనక్కు నడిచాను .

కాలేజ్ దగ్గర ఉదయం వచ్చిన govt వెహికల్ – సెక్యూరిటీ అధికారి ఉన్నప్పటికీ బస్టాండులో wait చేసాను – 10 నిమిషాలలో బస్సు రావడంతో ఎక్కాను – చూస్తే బస్సు మొత్తానికీ కలిపి పదిమంది లేరు – జనాల భయం పోవడానికి సమయం పడుతుంది అనుకున్నాను – స్టాప్స్ తోపాటు బాంబ్ స్క్వ్వాడ్ కోసం ఒక్కదగ్గర ఆగినా ఎక్కిదిగేవాళ్ళు చాలా తక్కువ కావడంతో 30 నిమిషాలలో నా స్టాప్ చేరుకుని పరుగున లోపలికివెళ్ళాను .
నా కోసమే ఎదురుచూస్తున్నట్లు ఫ్రెండ్స్ అందరూ …… మురళి ఇంటి కాంపౌండ్ లోపల ఉన్నారు .
వినయ్ : మురళీ ……. మహేష్ వచ్చాడు .
ఇంటిలోపలనుండి మురళితోపాటు మేడం వచ్చి , మహేష్ ….. వీళ్ళతోపాటు ఉండకుండా ఇప్పటివరకూ ఎక్కడ ఉన్నావు ? , మూడురోజులుగా అందుబాటులో లేవని కంప్లైంట్స్ …….
Sorry మేడం …… exam అని కాలేజ్లోనే చదువుకుంటున్నాను , exams పోస్ట్ ఫోన్ అయ్యాయి కాబట్టి ఇకనుండీ ఫ్రెండ్స్ తోనే ఉంటాను .
మేడం : exams ఉన్నప్పటికీ నీ మొదటి కర్తవ్యం వీళ్ళతోపాటు ఉండటం , వీళ్ళ సేఫ్టీ తరువాతనే నీ కెరీర్ …… గుర్తుపెట్టుకో , ఇక ఇలా రిపీట్ కాకూడదు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ …….
అలాగే మేడం …… – ఇక ఇలా జరగదు …… , రోడ్డుపై ఉండాల్సిన వాడిని నేనిప్పుడు ఇలా ఉండటానికి కారణం మీరు – మీరుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది మేడం – ఫ్రెండ్స్ తరువాతనే స్టడీస్ క్షమించండి .
మేడం : గుడ్ , వెళ్ళండి వెళ్లి ఆడుకోండి …….
Sorry ఫ్రెండ్స్ అంటూ క్రికెట్ కిట్ అందుకున్నాను .
అయినా మన మధ్యన sorry ఏంటి మహేష్ …… అంటూ గోవర్ధన్ భుజం చుట్టూ చేతినివేసి మున్ముందుకు తీసుకెళ్లాడు . మహేష్ …… టీవీలో ట్రెండింగ్ అవుతున్నది నువ్వు తీసిన వీడియోనే కదా ……. ఎలా ? .
అదీ అదీ ఆ ఆ గుర్తొచ్చింది , నిన్న మీ ఇంటిదగ్గర నుండి ఇక్కడకు వస్తుంటే , సర్చ్ చేస్తున్న సెక్యూరిటీ అధికారి ఆపి డౌట్ వచ్చినట్లు నన్ను – జేబులో ఉన్న మొబైల్ ను చెక్ చేసి కోపంతో వీడియోను ట్రాన్స్ఫర్ చేసుకుని , నా మొబైల్ లోని వీడియోను డిలీట్ చేసేసాడు .
గోవర్ధన్ : ప్చ్ …… ఆ వీడియో ఇప్పుడు నీ దగ్గర లేదన్నమాట , నేనూ …… నా మొబైల్ లో రికార్డ్ అయినా చెయ్యాల్సినది లేకపోతే నువ్వు తీసినది ట్రాన్స్ఫర్ అయినా చేసుకుని ఉండాల్సినది , ఇప్పుడు ఆ విషయాన్ని అదే అదే లైవ్ లో చూశామని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటూ ఫీల్ అయ్యాడు . ఫ్రెండ్స్ ……. మెయిన్ గ్రౌండ్ లో ఆడదామా ….. లేక మినీ గ్రౌండ్ లోనా …….
మురళి : మెయిన్ గ్రౌండ్ ఇంటికి దూరం భయం వేస్తుంది కాబట్టి మినీ గ్రౌండ్ లోనే ఆడుదాము .
అవునవును ….. దూరం వెళ్ళకండి అని మమ్మీ డాడీ చెప్పారు అంటూ ఇద్దరుముగ్గురు చెప్పడంతో దేవత ఇంటిముందు ఉన్న మినీ గ్రౌండ్ లో ఆడుతున్నాము .

ఒక సైడ్ బ్యాటింగ్ మురళి టీం బ్యాటింగ్ బ్యాట్స్ మ్యాన్ కు చివరి బంతిని వినయ్ వేసే సమయానికి దేవత ఇంటిముందు ….. సైరెన్ తో సెక్యూరిటీ అధికారి వెహికల్స్ వచ్చి వరుసగా నిలబడ్డాయి . బంతి వెయ్యడం ఆపి అందరమూ అటువైపు చూస్తున్నాము ఆశ్చర్యంతో …….
ముందూ వెనుకా సెక్యూరిటీ ఆఫీసర్లు దిగిన తరువాత , మధ్యలోని వెహికల్ నుండి కమిషనర్ హోదాలో SI సర్ కాదు కాదు వైజాగ్ సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ విశ్వ సర్ స్టైల్ గా కిందకుదిగి నేరుగా నావైపు చూసారు hi అంటూ …….
అంతే వెంటనే ఔట్ అయ్యి మినీ గ్రౌండ్ బయట కూర్చున్న ఫ్రెండ్స్ వెనుకవెళ్లి దాక్కుని తొంగిచూస్తున్నాను .
విశ్వ సర్ నవ్వుకున్నారు , చేతులుకట్టుకుని వారి వెహికల్ కు ఆనుకుని ఎండలోనే నిలబడ్డారు .
టీవీలో చూయించిన కొత్త సెక్యూరిటీ అధికారి కమీషనర్ రా అంటూ అందరూ మాట్లాడుతున్నారు .
సర్ అంటూ ఒక సెక్యూరిటీ అధికారి వచ్చి గొడుగుపట్టినా వద్దన్నారు – నేను తొంగి తొంగి చూస్తూనే ఉండటం చూసి నవ్వుతూనే ఉన్నారు విశ్వ సర్ ……

గోవర్ధన్ : టీవీలో చూసాము విన్నాము కదరా …… , కొన్నిరోజులు సెక్యూరిటీ ఆఫీసర్లు సర్చ్ చేస్తూనే ఉంటారని , కమాన్ కమాన్ మనం గేమ్ కంటిన్యూ చేద్దాము , ఫైనల్ బాల్ ……. , ఇంతకీ మహేష్ ఎక్కడ ? – మహేష్ మహేష్ ……..
ఫ్రెండ్స్ ఇక్కడ అంటూ తొంగిచూస్తూనే చేతిని పైకెత్తాను .
గోవర్ధన్ : ఇంకా ఫైనల్ బాల్ ఉంది ఫీల్డింగ్ నిలబడు అని పిలవడంతో ……….
సర్ వైపు కాకుండా అటువైపుకు తిరిగి వెనక్కు నడుచుకుంటూ వచ్చి నా ప్లేస్ లో నిలబడ్డాను .
సర్ నవ్వులు నావరకూ వినిపించాయి .
గోవర్ధన్ : ఫైనల్ బాల్ అంటూ వేసాడు . బౌల్డ్ అవ్వడంతో ఫీల్డింగ్ ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో హైఫై లు కొట్టుకుంటుంటే నేను మాత్రం పరుగునవెళ్లి బెంచ్ వెనుక దాక్కున్నాను – ఆ వెంటనే నా బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది .

ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ గడిచినా సర్ ఎండలోనే చిరునవ్వులు చిందిస్తూ నిలబడే ఉండటం తొంగి చూసి , మొబైల్ తీసి ” సర్ …… నీడలో ఉండొచ్చుకదా అని మెసేజ్ సెండ్ చేసాను – కంగ్రాట్స్ సర్ …… సూపర్ ” .
విశ్వ సర్ : ” సిటీని రక్షించిన మా అందరి బుజ్జి దేవుడే ఎండలో ఆడుతున్నాడు , నేను ఎండలో నిలబడటం తప్పే లేదు , బుజ్జి దేవుడిని కలవడం కోసం ఎంతసేపైనా ఇక్కడే సంతోషంతో వేచిచూస్తాము ” .
” నో నో నో ప్లీజ్ ప్లీజ్ సర్ – మ్యాచ్ పూర్తయ్యేంతవరకూ కుదరదు మీరు వెళ్లిపోండి – రెండు మూడురోజులుగా నా బాడీ గార్డ్ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ కొద్దిసేపటి ముందే వార్నింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ పేరెంట్స్ ” .
విశ్వ సర్ : ” అయితే మ్యాచ్ అయిపోయేంతవరకూ wait చేస్తాను , నిన్ను కలవకుండా ఇంటికి కూడా వెల్లనంటే వెళ్లను , నేనూ …… మా బుజ్జిదేవుడు మ్యాచ్ చూస్తాను ” అంటూ వచ్చి నేను దాక్కున్న బెంచ్ లోనే కూర్చున్నారు నవ్వుతూ ……

సర్ సర్ సర్ ……. అంటూ అందరూ లేచి నిలబడ్డారు – మ్యాచ్ ఆపారు .
విశ్వసర్ : నో నో నో , క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం కంటిన్యూ కంటిన్యూ …… మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా జస్ట్ చూస్తాను అంతే …….
థాంక్యూ సర్ అంటూ ఫ్రెండ్ బాల్ వెయ్యబోయి ఆగి , కంగ్రాట్స్ సర్ అని చెప్పాడు .
విశ్వ సర్ : నోటితో మాత్రమే చెబుతారా …… ? లేక మెసేజ్ మాత్రమే చెబుతారా ….. ? , షేక్ హ్యాండ్ ఇవ్వరా ….. ? అంటూ నావైపు చూసి నవ్వుతూ చెప్పారు .
ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి షేక్ హ్యాండ్ ఇచ్చిమరీ కంగ్రాట్స్ చెప్పారు .
పెదాలపై చిరునవ్వులతో ఫ్రెండ్స్ వెనకాలే వెళ్లి మనఃస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పాను .

Heartfully congratulations సెక్యూరిటీ అధికారి కమిషనర్ సర్ ……. అంటూ సంతోషంతో చేతిని అందుకోబోయాను .
విశ్వ సర్ : Heartful కంగ్రాట్స్ ……. wow లవ్లీ లవ్లీ , అయితే హార్ట్ టు హార్ట్ కౌగిలించుకుని విషెస్ రిసీవ్ చేసుకుంటాను అని లేచిమరీ కౌగిలించుకున్నారు . సిటీకే కాదు నా కుటుంబానికి కూడా నువ్వే దేవుడివి – ఈ కమిషనర్ హోదా నువ్వు పెట్టిన భిక్ష – హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి కలిశారు అంటే అది ఈ దేవుడి వల్లనే , heartfully థాంక్యూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బుజ్జిహీరో ……….
సర్ ….. నో నో నో ……
విశ్వ సర్ : నువ్వు నో అన్నా ఇదే నిజం – మా జీవితాంతం నీకు ఋణపడిపోయాము – మేము అంటే నేను , మీ మేడం , నీ చెల్లెలు తమ్ముడు – థాంక్యూ థాంక్యూ బుజ్జిహీరో ……. ఒకటా రెండా ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే ……. , మా బుజ్జి దేవుడికి థాంక్స్ చెప్పుకునే అదృష్టం ఇప్పటికి కలిగింది అంటూ ఉద్వేగానికి లోనైనట్లు కళ్ళల్లో చెమ్మతో వదిలారు . Sorry sorry పిల్లలూ …… మీరు కంటిన్యూ చెయ్యండి మ్యాచ్ మొత్తం చూసే వెళతాను అని నా చేతిని పట్టుకునే బెంచ్ పై కూర్చున్నారు .
ఫ్రెండ్స్ : థాంక్యూ సర్ ……..
థాంక్యూ సర్ ……..
విశ్వ సర్ : మా బుజ్జిదేవుడి ఆటను చూడటం నా అదృష్టం , రా కూర్చో అని ప్రక్కనున్న ప్లేస్ చూయించారు .
నో నో నో …… వైజాగ్ సిటీ కమిషనర్ గారి ప్రక్కన కూర్చోవడమే నోవే ……
విశ్వ సర్ నవ్వుకుని , మా బుజ్జిదేవుడి ప్రక్కన కూర్చునే అదృష్టం నాకు లేదన్నమాట అయితే ఈ బుజ్జిదేవుడితోపాటు నేనూ నిలబడతాను అంటూ లేచారు .
వద్దు వద్దు సర్ ….. , సరే నేనే కూర్చుంటాను అని సర్ ప్రక్కనే కూర్చున్నాను .
విశ్వ సర్ : అదృష్టాన్ని ప్రసాధించినందుకు థాంక్స్ బుజ్జిహీరో అంటూ నా భుజం చుట్టూ చేతినివేశారు .
చాలా చాలా సంతోషం వేసింది .
విశ్వ సర్ : బుజ్జిహీరో …… నువ్వు ఇప్పుడు ఎంత అయితే ఆనందం పొందుతున్నావో అంతకు మూడింతలు నాలుగింతలు ఆనందం పొందుతున్నాను నీవల్ల ……. , చిన్న సహాయం చేశానని నాపై ఇంత అభిమానం చూయించావు – ఆ సహాయానికి కూడా నువ్వే ఇన్స్పిరేషన్ – దైర్యంగా నలుగురు పోకిరి వెధవలను ఎదురించావు , వాళ్లకు బుద్ధిచెప్పే ప్రయత్నంలో వచ్చిన ఐడియా అది అంతే …….
అక్కయ్యకు కంటిచూపు తెప్పించడం చిన్న సహాయం కాదు సర్ – నా జీవితం సర్ …… అక్కయ్య పెదాలపై పరిమళిస్తున్న ఒక్కొక్క చిరునవ్వుకు కారణం మీరే ……
విశ్వ సర్ : కాదంటే కాదు , ఆ నవ్వులకు కారణం మా బుజ్జిదేవుడు .
నో నో నో సర్ …….
విశ్వ సర్ : సరే సరే ఇది ఇప్పట్లో తెలదులే కానీ ఇక్కడితో వదిలెయ్యి అని నవ్వుకున్నాము .

అప్పటికే మా టీం బ్యాట్స్ మ్యాన్ అందరూ ఔట్ అయిపోయినట్లు మా కెప్టెన్ ….. మహేష్ నువ్వే లాస్ట్ అంటూ పిలిచారు .
సర్ …….
విశ్వ సర్ : గో గో గో బుజ్జిహీరో …… , మా బుజ్జిదేవుడి బ్యాటింగ్ చూడటం కోసమేకదా వేచిచూస్తున్నది .
నవ్వుతూ వెళ్ళాను .
కెప్టెన్ : మహేష్ …… నువ్వే లాస్ట్ , 2.1 ఓవర్స్ లో 7 ఫోర్స్ కొట్టాలి , మనమే గెలవాలి – గెలిస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ తెలుసుకదా …….
Yes కెప్టెన్ అంటూ బ్యాటు అందుకుని నిలబడ్డాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *