విక్రేత 667

“నాన్న.. నాన్న.. లే.. నాన్న..”
మెలుకువ వచ్చి చూసాను చిన్నూ లేచేసింది…

చిన్ను : ఏంటి నాన్నా ఇలా పడుకున్నావ్ చూడు లేట్ అయిపోయింది నన్ను లేపొచ్చు కదా పద పద లేట్ అవుతుంది..

లేచి ఇద్దరం రెడీ అయ్యి ఇంటి బైటికి వచ్చాం.. అప్పుడే అక్క కార్ దిగుతూ కనిపించింది..

అక్క : ఏరా ఏంటి ఏటో బైలుదేరినట్టున్నారు

చిన్నా : ఊరికే అలా తిరిగేసి వద్దామని అడిగింది నీ కోడలు.. అలా వెళ్లి వచ్చేస్తాం అక్కా..

అక్క : ఇంద.. అని తన కార్ కీస్ ఇచ్చింది.. నేను తీసుకునే లోపే చిన్నూ పరిగెత్తుకుంటూ వెళ్లి నా కార్ దెగ్గర నిల్చుంది.

చిన్నా : వద్దులే అక్కా.. దానికి ఆ కార్ లోనే వెళ్లాలని ఉంది నువ్వెళ్లు.. అని కిందకి చూసాను, అక్క కార్ టైర్ పంచర్ అయ్యింది.. అక్కా.. నీ కార్ టైర్ పంచర్.. అలానే నడుపుకుంటూ వచ్చేసావా..?

అక్క : లేదే.. ఇప్పుడుదాకా బానే వచ్చానే.. ఇప్పుడు ఇందాక కీస్ కింద పడ్డప్పుడు కూడా గమనించాను టైర్ బానే ఉన్నట్టు అనిపించిందే.. సరేలే.. తరువాత చూసుకుందాం.. అమ్మెక్కడా..?

చిన్నా : ఇంట్లో…

అక్క : (ఇంట్లోకి వెళుతు) ఏంటే.. నన్ను పలకరించవా..?

నేను చిన్నగా నవ్వి నా కార్ దెగ్గరికి వెళ్లి లాక్ ఓపెన్ చెయ్యగానే చిన్నూ డోర్ తీసుకుని కూర్చుంది.. నేను చిన్నూని చూస్తూ నవ్వుతూ వెళ్లి డ్రైవర్ సీట్ లో కూర్చున్నాను..

చిన్నా : చిన్నూ.. అత్తని అలా పలకరించకుండా వచ్చేసావేంటి?

చిన్నూ ఏం మాట్లాడలేదు

చిన్నా : ఏమైంది తల్లీ..

చిన్నూ : నీ ముందు నాతో అందరూ బానే ఉంటారు నాన్న.

చిన్నా : మరి నేను లేనప్పుడు?

చిన్నూ తల దించుకుంది…

చిన్నా : తిడతారా?

చిన్ను : లేదు..

చిన్నా : కొడతారా?

చిన్ను : లేదు..

చిన్నా : మరి కోపంగా చూస్తారా..?

చిన్ను : లేదు..

చిన్నా : మరింకేంట్రా..

చిన్ను : ఏమో నాకు తెలీదు.. కానీ..

చిన్నా : ఆ.. కానీ..

చిన్ను : ఏం లేదు.. నువ్వు పోనీ.. అని నా భుజం కొరికింది..

చిన్నా : అబ్బా.. రాక్షసి..

చిన్ను : హి హి హి…

నేను కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాను.. చిన్నూ ఇంకా నవ్వుతూనే ఉంది దానికి నేను నాకింకా నొప్పి అన్నట్టు నటిస్తున్నాను.. అలా ఇద్దరం నవ్వుకుంటుంటే.. చూసి చూడనట్టు కార్ అద్దంలో చూసాను.. అక్షిత నవ్వుతున్న మొహం కనిపించింది ఎలా అంటే ఎప్పుడు మా ఇద్దరినీ చూసి నవ్వుతున్నట్టే అనిపించింది.. ఒక్కసారి భ్రమలో వెనక్కి తిరిగి చూసాను.. ఎవ్వరు లేరు.. నా మొహంలో నవ్వు పోయింది.. మళ్ళీ అద్దంలోకి చూసాను మామూలుగానే ఉంది.. చిన్నూ మాట్లాడుతుంటే ఊ కొడుతూ కార్ నడుపుతున్నాను

అక్షిత మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినప్పటి నుంచి ఈ మూడు నెలలు అస్సలు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు.. ఒక పక్క నా బాధ ఇంకో పక్క చిన్ను బాధ పడలేక కోపం వచ్చేసేది ఎవరి మీద చూపించాలో కూడా తెలీదు..

రెండు నెలల తరువాత చిన్నూకి.. అమ్మ మనమీద కోప్పడి వెళ్ళిపోయింది.. మళ్ళీ నువ్వు నేను సంతోషంగా ఉంటే తిరిగి వచ్చేస్తుందట అప్పటి వరకు రాదట అని చెప్పాను.. ఇది జరిగి… వారమే అవుతుంది..

అప్పటి నుంచి చిన్నూ మళ్ళీ ఆక్టివ్ గా మారిపోయింది, తన నవ్వు చూసే నేనూ కొంచెం తెరుకున్నది.. మళ్ళీ చిన్నగా ఆలోచించడం మొదలు పెట్టాను.. ఇంతలో అక్షిత చదువుకున్న కాలేజ్ కనిపించింది..

చిన్నా : చిన్ను.. ఐస్ క్రీం తింటావా.. సేమ్యా ఐస్ క్రీం అంటే అమ్మకి చాలా ఇష్టం

చిన్ను : అవునా.. నాకెప్పుడూ చెప్పలేదే

చిన్నా : అయితే మీ అమ్మ గురించి నీకేం తెలీదన్నమాట..

చిన్ను : ఆ తెలుసు.. గుర్తొచ్చింది.. అప్పుడు చెప్పింది కానీ నేనే మర్చిపోయా.. కోనివ్వు తింటాను..

దాని అమాయకత్వానికి నవ్వుకుంటూ కార్ కాలేజ్ ముందు ఆపి అక్కడ కాలేజ్ ముందు ఉన్న బడ్డీ కొట్టులో ఉన్న తాత దెగ్గరికి వెళ్లి సేమ్యా ఐస్ క్రీం తీసుకుని ఆయనని పలకరించి వచ్చాను

1 Comment

  1. Good horror love story

Comments are closed.