విక్రేత Part 2 114

కాలేజీ అయిపోయే వరకు తననే చూస్తూ గడిపేసాను, అందరూ ఇంటికి వెళుతుంటే అక్షితని ఫాలో చేస్తూ తన వెనకాలే నడుస్తున్నాను, రోడ్ దాటి చిన్న సందులోకి వెళ్ళింది తన వెనకాలే వెళ్ళాను.. ఒక్కసారిగా వెనక్కి తిరిగి నా కాలర్ పట్టుకుంది.

అక్షిత : రేయ్ ఎవడ్రా నువ్వు, పొద్దున నుంచి చూస్తున్నా తెగ చూస్తున్నావ్ నన్ను.. అంత నచ్చానా?

చిన్నా : అవునండి, లేకపోతే క్లాస్ లో అంతమంది ఉంటే ఈ బక్క ప్రాణి వెనకాల ఎందుకు పడతాను, కొంచెం నా కాలర్ వదిలితే సంతోషం.

చిన్నగా నాకు కనిపించకుండా ఓరగా నవ్వుతూ నా కాలర్ వదిలేసింది

అక్షిత : పో.. మళ్ళీ నా వెంట పడకు, ఈ సారి కాలర్ తొ వదిలేయ్యను, చల్ హట్.. అని నన్ను తోసేసి మళ్ళీ మెయిన్ రోడ్ కి వచ్చి నడవడం మొదలుపెట్టింది.

చిన్నా : (ఆమ్మో చాలా రఫ్ గా ఉంది ఈ పిల్ల) కొంచెం దూరంగా ఫాలో అవుతూ వెళ్లాను, కొంత దూరం నడిచి ఎదురుగా ఉన్న కాన్వెంట్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ నన్ను చూసి కోపంగా వెళ్ళిపో అన్నట్టు చూపుడు వేలితొ బెదిరించింది. వెనక్కి వచ్చేసి రోడ్ మీద ఇప్పటి వరకు నన్ను ఫాలో చేస్తున్న కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను.

ఇంటికి వచ్చాననే కానీ మనసంతా అక్షిత చుట్టూనే తిరుగుతుంది, మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నా ఇంతలో అరుపులు వినిపించి పక్కకి చూసాను, మా ఇంట్లో ఎప్పుడు ఉండేదే ఈ గోల.

మా తాత పోతూ పోతూ ఆస్తితొ పాటు కంపెనీలు కూడా మా నాన్న చేతిలో పెట్టాడు అవి నడపడం మా నాన్న వల్ల కావట్లేదు, చెప్తే ఒప్పుకోడు ఎవ్వరి మాట వినిపించుకోడు అక్కడే మా అమ్మకి నాన్నకి గొడవ జరుగుతుంది, ఇయర్ఫోన్స్ చెవిలో పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాను.

తెల్లారి లేచి పొద్దుపొద్దునే కాన్వెంట్ కి వెళ్లిపోయాను, అరగంటకి చిన్నగా ఆరంజ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్ బ్లూ జీన్స్ లో, ఫ్రెండ్స్ తొ నవ్వుతూ మాట్లాడుతూ బైటికి వచ్చి నన్ను చూసి కోపంగా నా దెగ్గరికి రాబోయింది, నేను మళ్ళీ గొడవ ఎందుకులే కాలేజీలో కలుద్దాం అని వెనక్కి వచ్చేసా.. కాలేజీ గేట్ దెగ్గర నిలబడ్డాను, వస్తూనే నన్ను చూసి కోపంగా నాదెగ్గరికి వచ్చింది.

అక్షిత : రేయ్ నీకొక సారి చెప్తే అర్ధంకాదా

చిన్నా : కాలర్ పట్టుకుంటే ముద్దు పెట్టేస్తా చెప్తున్నా

అక్షిత : (నా మాటకి నవ్వాలో కొప్పాడాలో తెలీక) ఎవడ్రా నువ్వు… నన్ను తగులుకున్నావ్

కాలేజీ బ్యాగ్ లోనుంచి రోజ్ తీసి తన చేతికిచ్చాను ఐ లవ్ యూ అంటూ.. అంతే అక్షితతొ పాటు చుట్టు ఉన్న తన ఫ్రెండ్స్, లోపలికి వెళ్లే స్టూడెంట్స్ అందరూ నా వైపే చూసారు.

అక్షిత ఫ్రెండ్స్ నా వైపు కోపంగా వస్తున్నారు, అక్షిత కూడా కోపంగా చూస్తుంది, ఏంట్రా ఇంత బిల్డప్పు అనుకున్నా.. ఇంతలో ఎవరో గొంతు వినపడింది.. ఓయి అంటూ