విక్రేత Part 3 93

ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి అందరూ రెడీ అయ్యి ఉన్నారు. అందరం బైలుదేరి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. అమ్మా నాన్నా ముందు కూర్చుంటే నేను అక్కా వెనకాల కూర్చున్నాం.

హారిక : ఏంట్రా తెగ ఆలోచిస్తున్నావ్

చిన్నా : డబ్బు గొప్పదా ప్రేమ గొప్పదా అని ఆలోచిస్తున్నాను

హారిక : డబ్బే గొప్పది ఇంకో ఆలోచన లేకుండా చెపుతాను

చిన్నా : హ్మ్మ్…

హారిక : అయ్యగారేమైనా ప్రేమలో పడ్డారా ఏంటి

చిన్నా : లేదు ఒక ఫ్రెండ్ నేను కొంచెం వాదులాడుకున్నాం అందులో వచ్చిందీ టాపిక్

హారిక : ముందు వాడిని కట్ చేసి పడేయి.. డబ్బు లేకుండా ప్రేమ కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా.. చిన్నా అన్నిటికి డబ్బే మూలం

చిన్నా : మరి నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావ్ గా

హారిక : అవును .. కానీ అందులో బోలెడు కాలుక్యులేషన్స్ ఉన్నాయ్ మై బ్రదర్.. మీ బావ దెగ్గర డబ్బుంది మనతో కలిస్తే మనకి కొంచెం ఉపయోగపడింది.. నాన్న వాళ్లకున్న ఆస్తులని చూసి కట్నం ఇచ్చారు రెండు చిన్న కొండలని కలిపి అది పెద్ద కొండ అయ్యింది.

చిన్నా : ఇందులో ప్రేమ ఎక్కడుంది.. మొత్తం డబ్బులే ఉన్నాయి

హారిక : అలా అనుకుని ప్రేమిస్తేనే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను

చిన్నా : ఎలా చెపుతున్నావే అంత కాన్ఫిడెంట్ గా

హారిక : ఏముంది పెళ్లి అయినా మీ బావే నా మాటే వింటాడు.. ప్రేమ పెళ్లి అవ్వడం వల్ల ఇంట్లో పెత్తనం మనదే.. ఎంత ఖర్చుపెట్టినా అడిగేవాడు లేడు జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలిరా

చిన్నా : (ఇంకొంచెం సేపు దీనితో మాట్లాడితే నేను చెడిపోయేలా ఉన్నాను) సరే అక్కా.. పడుకుంటా నిద్రొస్తుంది అని కళ్ళు మూసుకున్నాను

హోటల్లో చెకిన్ చేసి ఆరోజుకి అక్కడే పడుకుని తెల్లారే అందరం సమ్మిట్ కి అటెండ్ అయ్యాము.. స్పీచులు, బ్రేక్ ఫాస్టులు అబ్బో చాలా యవ్వరాలు నడిచాయి.. డాన్సులు ఏసుకున్నారు.. చేరిష్ ద మూమెంట్ అన్నారు నాకు బోర్ కొట్టి పక్కకోచ్చి నిలబడ్డాను ఎవ్వరో వెనక నుంచి ఒక్కటి చరిచేసరికి వెనక్కి తిరిగి చూసాను.

చిన్నా : లావణ్య.. నువ్వు.. ఇక్కడా !

లావణ్య : మేము కూడా బలిసినోళ్ళమే బాబు

చిన్నా : బోర్ కొడుతుంది.. ఎలా మానేజ్ చేద్దామా అని చూస్తున్నా.. ఇప్పుడు ఏ బాధ లేదు

లావణ్య : సరే చెప్పు నీ బుర్ర ఊరికే ఉండదు కదా.. ఎప్పుడు ఫాంటసీగా ఆలోచిస్తుంది అది.. ఈ సారి ఏం ఆలోచిస్తుంది.