విక్రేత 667

చిన్నూ నా చేతిలో ఉన్న ఐస్ క్రీం తీసుకుంటూ “నాన్నా నీకు ఆయన తెలుసా?” అని అడిగింది.. నవ్వుతూ చిన్ను చెయ్యి పట్టుకుని కాలేజ్ లోపలికి తీసుకెళ్ళాను

చిన్నా : ఆ తాత బడ్డీ కొట్టు ఇప్పటిది కాదు తల్లీ.. అమ్మ ఇక్కడ చదుకువున్నప్పటి నుంచి ఇక్కడే ఐస్ క్రీం అమ్ముతున్నాడు.. అమ్మ రోజు ఇక్కడే కాలేజ్ అయిపోయాక ఐస్ క్రీం తింటూ ఇంటికి వెళ్ళేదట

చిన్నూ : ఇది అమ్మ స్కూలా.. భలే ఉంది… నాన్నా.. నేను ఇక్కడే చదువుకుంటా నాన్నా

చిన్నా : అలాగేలే.. నీకోకటి చెప్పనా అమ్మ బ్యాగ్ ఎలా వేసుకునేదో

చిన్ను : ఆ.. ఎలాగ..

చిన్నా : అప్పుడు తెల్ల కాటన్ బ్యాగులు ఉండేవి వాటికీ జిప్ ఉండేది కాదు ఐరన్ క్లిప్పులు ఉండేవి చాలా పెద్దగా ఉండేవి.. దానికి అటు చివర నుంచి ఇటు చివరి వరకు పెద్ద హ్యాండిల్ లాగ ఉండేది తాడు అది మీ అమ్మ మాడు మీదకి వేసుకుని ఊపుకుంటూ నడిచేది.. ఇలా అని ముడ్డి ఊపుతూ నడిచాను

చిన్ను : హిహి…. హిహి.. హి.. నాన్నా.. అమ్మ ఇక్కడ ఉండుంటే నిన్ను కొట్టేది.. భలే చేసావ్.. మళ్ళీ.. మళ్ళీ..

చిన్నా : ఆమ్మో.. నువ్వు లేచిన దెగ్గర నుంచి ఏం తినలేదు.. ముందు ఏమైనా తిందాం పదా అంటూ.. నవ్వుతున్న నా కూతురిని భుజానికి ఎత్తుకుని ఒకసారి అక్షిత కాలేజ్ మొత్తం తిప్పి చూపించి.. కార్ ఎక్కించి హోటల్ కి తీసుకెళ్ళాను.

చిన్నా ఇంట్లో

“అమ్మా.. ఇంకా ఎన్ని రోజులు త్వరగా ఆ పిల్ల రాక్షసిని వదిలించు.. రెం డోం దల కోట్లు.. ఇంత చేసి వేస్ట్ అయ్యేలా ఉంది.”

కవిత : నువ్వేం కంగారు పడకు, మీ నాన్న వాళ్ళతో మాట్లాడ్డానికే వెళ్ళాడు.. సంబంధం ఖాయం చేసుకునే వస్తాడు.. మనం ఈ పిల్లని చిన్నా గాడికి దూరం చెయ్యాలి అది ఎలాగో ఆలోచించు.

కవిత : హారిక.. మీ ఆయన ఏమంటున్నాడు.

హారిక : ఏమంటాడు… డబ్బులు మన చేతికి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు.

కవిత : అది అంత తెలికైన విషయం కాదు.. వాళ్ళ ఆస్తికి ఆ అమ్మాయి ఏకైక వారసురాలు కాబట్టి తన పేరు మీద రాస్తారు లేక తదనంతరం వచ్చేలా చూస్తారు.. మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ పోవాలి.. ఇంకో విషయం ఏది మీ తమ్ముడికి డౌట్ రాకుండా చెయ్యాలి.

హారిక : వాడింకా అది పోయిన షాక్ లో నుంచి బైటికి రాలేదు.. నిన్నేం అడగలేదా ఎలా జరిగింది ఎందుకు ఇలా అయ్యింది అని

కవిత : లేదు.. ఇంత వరకు ఆ విషయాల గురించి అలోచించలేదనుకుంటా.

హారిక : అస్సలు వచ్చిన విషయం మర్చిపోయా.. భైరవ చచ్చిపోయాడట.. తెలిసిందా నీకు?

కవిత : ఏ భైరవ..?

హారిక : అదేనే.. అక్షిత డ్రైవర్.. అది చచ్చాక వాడేగా అంతా సెటప్ చేసాడు.

కవిత : హా.. వాడా.. ఎలా పోయాడట (అంటూ లేచి గ్లాస్ లో కూల్డ్రింక్ పోస్తూ అడిగింది)

హారిక : ఏమో.. ఎవరో దారుణంగా చంపేశారట..

కవిత : (గ్లాస్ హారిక చేతికి అందిస్తూ) మనకంటే దారుణంగా నా..? (అని నవ్వింది )

హారిక : అవును మా.. కాళ్ళు ఒక చోట చేతులు ఒక చోట తల ఇంకో చోట దొరికిందట.. బాడీలో అన్నీ పార్టులు దొరకడానికే నాలుగు రోజులు పట్టింది అన్నారు.

కవిత : అంత కక్ష పెట్టుకుని చంపేంత శత్రువులున్నారా వాడికి.. అయినా పోనీలే.. మనకి సాక్ష్యంగా వాడొక్కడే ఉంది.. ఐదు కోట్లు తీసుకున్నాడు వెధవ కనీసం అనుభవించాడో లేదో

ఒక భయం పోయింది.. వాడు మళ్ళీ ఈ విషయమై బ్లాక్మెయిల్ చేస్తే నేనే చంపెద్దామని అనుకున్నాను.. ఆయుష్షులేక ముందే పోయాడు.

హారిక : చిన్నూ సంగతి ఏం ఆలోచించావ్.

కవిత : అదేనే ఏం తోచట్లేదు.. అది నిమిషం కూడా చిన్నా గాడిని వదలదు.. వాడు అంతే.. అక్షిత పోయిన దెగ్గర నుంచి దాన్ని క్షణం కూడా వదలట్లేదు.. మనకి ఇదొక్కటే అడ్డు ఇది ఉంటే వాడు రెండో పెళ్ళికి ఒప్పుకోడు.

హారిక : పోనీ…

కవిత : వద్దు వాడు బాధ పడతాడు.

హారిక : ఇప్పుడు బాధపడట్లేదా.

కవిత : పెళ్ళాం వేరు.. ఒకటి పోతే ఇంకోదానితొ సర్దుకుంటారు కానీ పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేరు.

హారిక : మరి ఏం చేద్దాం..?

కవిత : చూద్దాం.. ముందు మీ నాన్నని రాని.. ఆ తరువాత ఆలోచిద్దాం.

హారిక : సరే అయితే నేను వెళుతున్నా… ఇందాక నా కార్ టైర్ పంచర్ అయ్యింది.. నీ కార్ తీసుకెళ్తున్నా.. అలాగే ట్యూబ్ లెస్ టైర్ పంచర్ అయిన వెంటనే అంత త్వరగా గాలి ఎలా పోయిందో ఒకసారి కనుక్కో.. అని హారిక వెళ్ళిపోయింది.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

1 Comment

  1. Good horror love story

Comments are closed.