విక్రేత 667

కార్ హోటల్ ముందు ఆపి ఇద్దరం దిగి, చిన్నూని ఎత్తుకుని లోపలికి వెళ్లాను.. ఇద్దరం పక్క పక్కన కూర్చుని కొన్ని వాటర్ అందిందిస్తే తాగింది.. వెయిటర్ వచ్చి మా టేబుల్ దెగ్గర నిల్చున్నాడు.

చిన్నా : చిన్నూ.. ఏం తింటావ్.. ఇడ్లీ.. దోశ.. పూరి.. బొండా..

చిన్ను : ఇడ్లీ.. కానీ నాన్న.. నాకు కూడా అమ్మకి తినిపించినట్టే తినిపించు.

చిన్నా : అలాగే.. తమ్ముడు టు ప్లేట్స్ ఇడ్లీ పట్రా..

ఐదు నిమిషాలకి వెయిటర్ వచ్చి ఇడ్లీ సెర్వ్ చేసి పక్కన నిల్చున్నాడు నేను స్పూన్ తొ ఇడ్లీ కట్ చేసి చిన్నూ నోటికి అందించాను..

చిన్నూ : ఇలా కాదు నాన్న నువ్వు అమ్మకి తినిపించావ్ గా అలా

చిన్నా : ఇలాగే తల్లీ.. నువ్వు నోరు తెరు..

చిన్ను : కాదు.. ముందు నువ్వు ఇడ్లీ తిని అది అమ్మ నోటికి అందిస్తావ్ తినమని స్పూన్ లేకుండా… నాకు అలానే కావాలి.

చిన్నా : ష్.. ష్…షు.. అని చిన్నుని ఆపి పక్కకి తిరిగి చూసాను వెయిటర్ నన్నే చూసి నవ్వుతున్నాడు.. తమ్ముడు నువ్వు వెళ్ళు రా బాబు.. పరువు పోతుంది.

వెయిటర్ : హహ.. సారీ అన్న.. అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

చిన్నా : చిన్నూ.. నేనెప్పుడూ అలా అమ్మకి తినిపించలేదే

చిన్ను : లేదు నేను చూసాను.. ఇదే హోటల్లో నేను నిద్రపోయి అప్పుడే లేచాను.. నువ్వు అలానే మమ్మీకి తినిపించావ్.. అంతేకాదు నేను ఇంట్లో కూడా చాలా సార్లు చూసాను.

నేను తల పట్టుకున్నాను.. ఈ సోది మొహంది.. దీనికి అన్నిటిలో రొమాన్స్ కావాలి అని నవ్వుకుని..

చిన్నూ… మనం ఒక గేమ్ ఆడదాం సరేనా..

చిన్ను : ఏం గేమ్.

చిన్నా : నేను నా నోటితో ఇటు ఇడ్లీని పట్టుకుని ఉంటా నువ్వు అటు నుంచి అలానే పట్టుకోవాలి.. నేను చిటిక వెయ్యగానే ఎవరు ఎక్కువగా ఫాస్ట్ గా తింటారో వాళ్లే విన్నర్.. ఓకే.. నా..

చిన్ను : హా.. ఓకే ఓకే.

చిన్నా : సరే.. దా.. నువ్వు రెడీయేనా.. అని చిటికె వేసాను.. ఓ.. చిన్నూ నువ్వే గెలిచావ్.. మళ్ళీ.. అంటూ అలా ఇద్దరం టిఫిన్ కానించేసి అక్కడనుంచి బైట పడ్డాం.. కార్ లో ఉండగానే.. చిన్ను నెక్స్ట్ ఎక్కడికి అని అడిగింది..

చిన్నూ : నాన్నా తరువాత ఎక్కడికి?

చిన్నా : తరువాత… ఎక్కడికెళదాం.. ఆ.. నిన్నోక ప్లేస్ కి తీసుకెళ్తా పదా… నాకు మీ అమ్మకి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలీదు చూస్తావా.

చిన్ను : అవునా.. నాకు తెలీదే.. అమ్మకి నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అన్నీ నీకే తెలుసు నాకేం తెలీదు.. ఛ.

చిన్నా : అందుకేరా నీకు అన్నీ చూపిస్తుంది.. ఇప్పుడు నాకు తెలిసినవి అన్నీ నీకు తెలిసాయనుకో అప్పుడు మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం సరేనా..?

చిన్ను : హ్మ్..

చిన్నా : చూడు తల్లీ ఇవ్వాళ నీకు నేను అన్నీ చెప్తా.. ఎలాగో మీ మమ్మీకి ఏమిష్టమో నాకు తెలీదు కదా అప్పుడు నువ్వే ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అవుతావు..

చిన్ను : అవును కదా.. సరే అయితే అని మళ్ళీ మొహంలోకి నవ్వు తెచ్చుకుంది

1 Comment

  1. Good horror love story

Comments are closed.