చిన్నా : బంగారం మీ అమ్మకి ఏమేమి ఇష్టమో నాకు చెప్పవు ప్లీజ్..
చిన్ను : సరే.. నువ్వు నాకు కొంచెం చెప్పావు కాబట్టి నేను కూడా చెప్తాను.. అడుగు..
చిన్నా :
సరే అమ్మకి ఇష్టమైన కలర్
” లైట్ పింక్.. నీకు బ్లాక్ ”
బట్టలు
“టీ షర్ట్ జీన్స్.. నీకు కూడా”
హ్మ్.. మరి ఫ్లవర్
“అమ్మకి బ్లాక్ రోజ్ అంటే ఇష్టం, నీకు మల్లెపూలు”
నాకు పోరబోయి.. కార్ రోడ్ పక్కకి ఆపేసాను.. (నవ్వుతూ) చిన్నూ ఎవరు చెప్పారే నాకు మల్లెపూలు అంటే ఇష్టమనీ…
చిన్నూ : అమ్మ చెప్పింది, నీకు అవంటే ఇష్టమని ఏమైంది నాన్నా..?
చిన్నా : ఏం లేదు.. (దొంగముండకి పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదు దీనికి) చిన్నూ.. నాకు రెడ్ రోజ్ అంటే ఇష్టం సరేనా
చిన్ను గట్టిగా నవ్వింది… మళ్ళీ కార్ రోడ్ మీదకి తీసుకొచ్చి చెరువు దెగ్గరికి వెళ్లే రోడ్ కాకుండా దాని పక్క రోడ్లోకి పోనించాను.. నేరుగా వెళ్లి చెరువుకి ఇంకో వైపు దెగ్గర కార్ ఆపి చిన్నుని ఎత్తుకుని చిన్నగా ఒక్క అడుగు వెడల్పు ఉండే గట్టు మీద నడుస్తూ చెట్లలోపలికి వెళ్లాను.. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది పచ్చటి వాతావరణం చుట్టు చెరువు వల్ల చల్లటిగాలి వీస్తుంది.. ఎంత ఎండ కొట్టినా ఆ ఎండని కప్పేసే అన్ని చెట్లు వాటి ఆకుల వల్ల అదో రకమైన వాతావరణం.
చిన్నూ : భయంగా ఉంది నాన్న.
చిన్నా : ఏం ఉండదు.. నేను ఉన్నా కదా.. ఇక్కడికి ఎవ్వరు రారు అందుకే అమ్మా నేను ఇక్కడికి వస్తాం.
చిన్ను : ఎవ్వరు రాని చోటుకి మీరిద్దరూ రావడం దేనికి?
చిన్నా : (అన్నీ నీ పోలికలేనే దీనికి) హ్మ్.. ఏం చెప్పాలే నీకు ఏం తట్టట్లేదు.. ఆ.. అది అమ్మా నేను ఇక్కడికి వచ్చి గోళీలాట ఆడేవాళ్ళం.. అందరూ ఉన్నారనుకో గోళీలు తీసుకుంటారు కదా అందుకే మేము ఇద్దరమే ఇటు వచ్చేవాళ్ళం.. అదిగో అక్కడ పెద్ద చెట్టు తొర్ర ఉంది కదా అందులోనే కూర్చునేవాళ్ళం.
చిన్ను : అవునా.. మరీ..
చిన్నా : (ఆమ్మో మళ్ళీ ప్రశ్నలు) అది సరేలే కానీ చిన్ను ఇందాక ఎందుకమ్మా కార్లో నవ్వావ్?
చిన్ను : (మళ్ళీ నవ్వింది) అమ్మ చెప్పింది.. నీకు మల్లెపూలు అని నీతో చెప్తే.. కాదు రెడ్ రోజ్ అంటావని చెప్పింది సరిగ్గా అలానే నువ్వు చెప్పేసరికి నవ్వు వచ్చింది నాన్నా.. అంటూ చిన్నూ నా సంక దిగి చెట్టు తొర్ర దెగ్గరికి పరిగెత్తింది..
చిన్నా : చిన్నగా తల్లీ.. ఒసేయ్ అక్షితా నిన్ను.. ఒక్కసారి కనిపించవే నీ సంగతి చెప్తా అని తిట్టుకున్నా.
ఇంతలో వర్షం మొదలయింది గాలి వీచడం ఆగింది చెట్టు తొర్రలో నుంచి ఏదో పొగ రావడం చూసాను.. చిన్నూ ఆగు అంటూ పరిగెత్తుకుంటూ చిన్నుని పట్టుకుని తొర్రలో చూసాను అక్షిత కూర్చుని ఉంది మొహం భయంకరంగా.. కళ్ళ నిండా నీళ్లతో.. అది అక్షత నా అక్కు.. చిన్ను చెయ్యి వదిలి తొర్ర దెగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లాను.. వెళ్లి చూసేసరికి అక్కడ ఏం లేదు ఇందాక నేను చూసిన పొగ కూడా లేదు.. వర్షం ఆగిపోయింది.. చుట్టూ చూసాను అంతా ప్రశాంతంగా మారిపోయింది కానీ నాలో అలజడి మొదలయింది.. అది భ్రమ కాదు.. నాకు తెలుసు ఇలాంటి భ్రమలు నేను ఎన్నో చూసాను అక్షిత తాలుకు జ్ఞాపకాలు ఎన్నో ప్రతీక్షణం నా కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి.. ఉంటాయి కూడా, కానీ ఇది అలా కాదు.. నా మనసు దీన్ని భ్రమ అంటే ఒప్పుకోవట్లేదు.
నిజామా కలా… అక్షిత.. నేను చూసాను.. అది భ్రమ కాదు.. నా ఒళ్ళంతా చెమటలు చిన్నగా మోకాళ్ల మీద కూర్చున్నాను.. వెనక నుంచి చిన్నూ చెయ్యి నా భుజం మీద పడేసరికి తెరుకుని చిన్నూని ఎత్తుకుని కార్ దెగ్గరికి వెళ్లి చిన్నూని లోపల కూర్చోపెట్టాను.. చిన్నూ ఏదో మాట్లాడుతుంది కానీ వినిపించుకోలేదు కార్ తీసి నేరుగా ఇంటికి పోనించాను.
సరాసరి నేరుగా ఇంటికి వచ్చి చిన్నూని రూంలో పడుకోబెట్టాను.
చిన్ను : ఏమైంది నాన్న
చిన్నా : అర్జెంటు పని ఉందిరా తల్లీ, మనం మళ్ళీ వెళదాం.
చిన్ను : అదేంటి నాన్న…
చిన్నా : అమ్మ కోసంరా తల్లీ
చిన్ను : అమ్మని తీసుకురావడానికా
చిన్నా : వెతకడానికి వెళుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటానని ప్రామిస్ చేస్తే నేను హ్యాపీగా వెళతాను.
చిన్ను : ప్రామిస్ నాన్న, నువ్వు వెళ్ళు.. నేను అమ్మ కోసం ఇక్కడే ఉంటాను కనిపించగానే ఇక్కడికే తీసుకొచ్చేయి.
చిన్నా : అలాగే తల్లీ అంటూ నుదిటి మీద ముద్దు పెట్టుకుని, బైటికి వచ్చి అమ్మ కోసం చూసాను. రూంలో రెస్ట్ తీసుకుంటుంది.
Good horror love story