విక్రేత 667

ఫామ్ హౌస్ కి వెళ్లాను.. సెక్యూరిటీ గేట్స్ తెరిచారు… చాలా పెద్ద పాలస్ అప్పట్లో ఈ ఊరి రాజు గారి నుంచి మా తాతయ్య వాళ్ళ నాన్న దీన్ని కొన్నాడట.. చుట్టూ అన్నీ చెట్లు గార్డెన్ లా గడ్డి.. ఇంటి వెనక ఉన్న పెద్ద బావి.. అక్షితతొ నా మొదటి కలయిక జరిగింది ఇక్కడే.. ఒకసారి ఆ బావి చూడాలనిపించి కార్ ని ఇంటి చుట్టు ఉన్న గడ్డి మీదే నుంచి నేరుగా బావి దెగ్గరికే పోనిచ్చాను.

బావి కనిపించింది.. ఆపి కారు దిగి దాని ముందుకి వెళ్ళాను.. బావిలో ఒకసారి తొంగిచూసాను.. ఇలాంటి ఒక పెద్ద బావిని నేను ఎక్కడా చూడలేదు.. రాజుల కాలం నాటి బావి వంగి లోపాలకి చూసాను నీళ్లు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నా మొహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది..

ఇక్కడ నుంచే అక్షిత జారి పడిపోయింది, అదేంటో నాకు అర్ధంకాలేదు అస్సలు ఇన్ని రోజులు నాకు తట్టనేలేదు.

అక్షిత మంచి స్విమ్మర్.. గజఈతగాళ్ళతొ పోటీ పెట్టినా వాళ్ళతో సమానంగా ఈదగలదు అలాంటిది బావిలో పడి చనిపోయిందా.. ఒక్కొక్కటి ఆలోచించడం మొదలుపెట్టాను.. అన్నీ అనుమానాలు ప్రశ్నలు ఒకదానికొకటి సంబంధంలేదు.. అన్నిటికి లింకులు కలవటంలేదు.. అంతా అయోమయంగా ఉంది.

ఇంతలో గాలి వీచడం ఆగిపోయి వర్షం మొదలయ్యింది.. ఇందాక చెరువు దెగ్గర అక్షిత కనిపించినప్పుడు కూడా ఇలానే జరిగింది.. చుట్టు చూసాను ఈ సారి అది భ్రమ లేక నిజామా తెల్చుకోవాలని రెడీగా ఉన్నాను.. బావిలో నీళ్ల శబ్దం వినిపించి బావిలోకి తొంగి చూసాను.. నీళ్లు సుడిగుండంలా తిరుగుతున్నాయి నీళ్లలో ఏదో కనిపించింది అది నా అక్షితనెమో అని ఇంకొంచెం వొంగి చూసాను.. ఒక చెయ్యి నా మెడ పట్టుకుని బావిలోకి లాగేసింది.. ఆ సుడిలో తిరుగుతూ ఊపిరాడక రెండు నిమిషాలకి చిన్నగా నా కళ్ళు మూతపడటం నాకు తెలుస్తుంది.

అంతా చీకటి సడన్ గా ఏదో ఒక మెరుపులా కనిపించి మాయమైంది, కళ్ళు తెరిచి చూస్తే వెలుగు అంతా తెల్లగా కళ్ళు నలుపుకుని చూస్తే కాలేజీలో ఉన్నాను.

ఒక పక్క నేను అబ్బాయిల వైపు బెంచ్ మీద కూర్చుని అమ్మాయిల బెంచుల మీద నవ్వుతూ తన ఫ్రెండ్స్ ని నవ్విస్తూ మాట్లాడుతున్న అక్షితని చూస్తున్నాను.. నన్ను నేనే చూసుకుంటున్నాను.. వెళ్లి ముట్టుకోడానికి ప్రయత్నించాను కానీ దేన్ని ముట్టుకోలేకపోతున్నాను..

నాకు ఇంకా గుర్తే అది కాలేజీలో నా మొదటి రోజు, అక్షిత కోసం ఫారెన్ చదువులు ఎంజాయిమెంట్లు అన్నీ వదిలేసి తన వెనకపడుతూ తను చదివే కాలేజీలోనే తన క్లాస్ లోనే జాయిన్ అయ్యాను.

అప్పుడే సుధీర్ లోపలికి వచ్చి ఎక్కడా ఖాళీలేక నా పక్కన కూర్చున్నాడు.

1 Comment

  1. Good horror love story

Comments are closed.