చిన్నూ : ఒక్కసారి నిన్ను ముట్టుకోనా అమ్మా
అక్షిత : వద్దు తల్లి.. నాకు ఒంట్లో బాలేదు.. ఇక వెళ్ళు నేను కూడా వెళ్ళాలి..
చిన్నూ : నాకు ఏడుపొస్తుంది మా
అక్షిత : ఎందుకు తల్లీ.. చూడు నువ్వు ఏడుస్తే లావణ్య అమ్మ కూడా ఏడుస్తుంది.. వెళ్లి ఓదార్చు పో అని నవ్వుతూ పంపించేసింది.. పసిది పాపం ఏం అర్ధం కాకపోయినా అమ్మ మాట ఎప్పుడు కాదనదు కాబట్టి ఏం అర్ధం కాకపోయినా నవ్వుతూ లావణ్యని ఓదార్చడానికి వెళ్ళిపోయింది.
చిన్నూ లావణ్య దెగ్గరికి వెళ్లి అమ్మా ఏడవకు నేనేం ఏడవట్లేదు చూడు అని నవ్వించే ప్రయత్నం చేస్తుంటే లావణ్య ఏడుస్తూ అక్షితని చూసింది. చిన్నూ కూడా వెనక్కి చూడడంతో అక్షిత టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతుంటే.. త్వరగా రావాలి లేదంటే అని వేలు చూపించి చిన్నూ వార్నింగ్ ఇస్తుంటే అక్షిత వెళ్ళమని లావణ్యకి సైగ చేసింది. లావణ్య బైటికి వెళ్ళిపోయి చిన్నూని ఎత్తుకుని కారులో కూర్చుంది.
అక్షిత : (కోపంగా) ఏ డబ్బు కోసం అయితే ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసారో ఆ డబ్బు మీకు ఎప్పటికి దక్కదు.. మీకు ఏ శిక్షా పడకపోవచ్చు కానీ జీవితాంతం మీరు మానసిక క్షోభ అనుభవించాల్సిందే అని నెమ్మదించింది.. హారిక ఏడుపులని కవిత ఏడుపుని అస్సలు పట్టించుకోలేదు.
చిన్నా : అందరితో మాట్లాడావు.. అందరికి కనిపించావు నన్ను ఒక్కణ్ణి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.. నేను నీకు అంత అన్యాయం చేసానా
అక్షిత : నన్ను ప్రేమించడమే నువ్వు చేసిన పెద్ద తప్పు.. నీ స్థాయి దాటేసి నా లాంటి దాని కోసం అన్ని వదిలేసి మరి వచ్చావ్ అయినా కూడా నేను చచ్చాను.. నా చిట్టి తల్లి.. నా చిన్నూ.. అని ఏడుపు ఆపుకుని చిన్నాతో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి మాయం అయిపోయింది.
కవిత, హారిక ఇద్దరు చిన్నాని చూసి ఏడుస్తుంటే పట్టించుకోకుండా బైటికి వెళ్ళిపోయాడు, చిన్నూ కారులో నుంచే తన నాన్నని చూసి నాన్న ఐస్ క్రీం అని అరిచింది.. కళ్ళు తుడుచుకుని రమ్మన్నాడు చిన్నూ వెంటనే కారు దిగి తండ్రి దెగ్గరికి పరిగెత్తింది. ఎత్తుకుని తీసుకెళ్లి ఐస్ క్రీం కొనిచ్చి కార్ దెగ్గరికి తీసుకెళతూ చిన్నూ అన్నాడు
చిన్నూ : ఆ..
చిన్నా : నేను కూడా మమ్మీతో వెళ్ళనా
చిన్నూ : నన్ను కూడా తీసుకెళ్ళు నేను కూడా వస్తాను
చిన్నా : నువ్వు కూడా వచ్చేస్తే మరి లావణ్య అమ్మకి తోడుగా ఎవరుంటారు.. అక్కడ అమ్మకి పనులున్నాయి కదా ఒక్కటే పని చెయ్యాలి కదా పాపం, అదే నేనుంటే సాయంగా ఉంటాను కదా
Fantastic
Different story in between sex stories.wonderful story.really liked it.thanks to the writer.
Different story in between sex stories.thanks to the writer.