చిన్నూ : ఏం వద్దు.. నువ్వుంటేనే ఇంకా లేట్ అవుతుంది.. ఎప్పుడు అమ్మని విసిగిస్తావ్
చిన్నా : అబ్బా ప్లీజ్ ప్లీజ్
చిన్నూ : పని అయిపోగానే అమ్మని తీసుకుని వచ్చేస్తావా
చిన్నా : అమ్మ వస్తానంటే వచ్చేస్తా లేకపోతే తనతోనే ఉంటా.. నీకు తోడుగా లావణ్య అమ్మ ఉంది కదా ఇంకేం భయం
చిన్నూ : అబ్బా..
చిన్నా : వీళ్లంటే నీకు పడదు కానీ లావణ్యని పుట్టినప్పటి నుంచి చూస్తున్నావ్ చిన్నప్పటి నుంచి ఆడుతున్నావ్ ఇంకేం భయం.. అమ్మా అని కుడా పిలుస్తున్నావ్
చిన్నూ : అవుననుకో కానీ ఎంతైనా నువ్వో ఆమ్మో.. ఇద్దరు లేకపోతే నాకు బాధగా ఉంటుంది కదా
చిన్నా : నీకేం చెప్పాను.. మన ఇన్స్పిరేషన్ ఎవరు
చిన్నూ : లలిత అమ్మమ్మ
చిన్నా : కదా.. మరి అమ్మమ్మ లాగా స్ట్రాంగ్ గా ఉండాలి.. ఉంటావా.. నాకు నీ మీద డౌటే
చిన్నూ : ఏం కాదు.. నేను అమ్మమ్మ కంటే స్ట్రాంగ్
చిన్నా : మరి లావణ్య అమ్మతో ఉంటావా
చిన్నూ : ఉంటాను
చిన్నా : ఎప్పుడు ఏడవనని.. లావణ్య అమ్మని బాగా చూసుకుంటానని నాకు ప్రామిస్ చెయ్యి
చిన్నూ : సరే ప్రామిస్.. ఇంకొక ఐస్ క్రీం హి హి..
చిన్నా : (ముద్దు పెడుతూ) అలాగే పదా.. అని ఇంకొకటి కొనిచ్చి కార్ దెగ్గరికి వెళుతుండగా చిన్నూని దించాను.
చిన్నూ : బై నాన్నా అని గట్టిగా వాటేసుకుంది.. నవ్వుతూ
చిన్నా : చిన్నూ నాతరపున లావణ్య అమ్మకి ఒక గిఫ్ట్ ఇస్తావా
చిన్నూ : ఏంటి నాన్నా
చిన్నూని గట్టిగా వాటేసుకుని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టి వెంటనే నుదిటి మీద కూడా ముద్దు పెట్టి ఆ వెంటనే చిన్నూ పెదాల మీద కూడా ముద్దు పెట్టాడు..
చిన్నా : ఇదే ఇవ్వు..
చిన్నూ : ఆమ్మో.. నీ సంగతి.. నాకు అమ్మ కనిపించని.. ఎందుకు.. కళ్ళు మూసుకుంటే వస్తుందిగా అని కళ్ళు మూసుకుని మమ్మీ నాన్న చూడవే.. నువ్వు వెళ్ళగానే అల్లరి చేస్తున్నాడు.. నీ దెగ్గరికి పంపిస్తున్నా నువ్వే కంట్రోల్లో పెట్టాలి మరి అని కళ్ళు తెరిచి చిన్నాని చూసి హిహి.. అని నవ్వుతూ కార్ దెగ్గరికి పరిగెత్తింది నవ్వుతూ.. చివరిగా కార్ ఎక్కుతూ నవ్వి టాటా చెప్పేసి కార్ ఎక్కి కూర్చుని ఐస్ క్రీం తింటుంది.

Fantastic
Different story in between sex stories.wonderful story.really liked it.thanks to the writer.
Different story in between sex stories.thanks to the writer.