విక్రేత Part 4 99

లావణ్య తన బట్టలు పిల్ల బట్టలు సర్దుతుంటే చిన్నూ హెల్ప్ చేసింది ఇదంతా గమనించిన తన తల్లి దండ్రులు అడిగారు.

లావణ్య అమ్మ : ఎక్కడికి ప్రయాణం

లావణ్య : నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను

లావణ్య అమ్మ : ఎక్కడికి

లావణ్య : ఆస్ట్రేలియా

లావణ్య నాన్న : మళ్ళీ ఎప్పుడు వచ్చేది

లావణ్య : ఇక రాను (సూటకేస్ జిప్ పెడుతూ చెప్పేసింది)

లావణ్య అమ్మ : ఏం మాట్లాడుతున్నావో.. ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా

లావణ్య : అన్ని సరిగ్గానే చేస్తున్నాను.. చిన్నూ భవిష్యత్తు కోసం వెళ్ళిపోతున్నాను.. మళ్ళీ వస్తానో రానో కూడా నాకు తెలీదు.. కంపెనీ ఎలానొ నాన్న పేరు మీదె ఉంది.. అమ్మేసి రిటైర్ అవ్వమను.. నా దెగ్గర కొంత డబ్బుంది అది నాకు నా బిడ్డకి సరిపోతుంది.

లావణ్య అమ్మ : అది నీ బిడ్డ కాదు

లావణ్య : అవును బిడ్డ కాదు.. నా ప్రాణం.. నేను వెళుతున్నాను.. ఎయిర్పోర్ట్ వరకు వస్తున్నారా

లావణ్య తండ్రి : సరే నువ్వనుకున్నట్టే చేద్దువు కానీ ఇంత తొందరగా ఎందుకు ఇంకొన్ని రోజులు ఆగి వెళ్ళు

లావణ్య : ఫ్లైట్ టైం అవుతుంది.. వెళ్ళాలి అని వాచ్ చూసుకుంటూ తల ఎత్తింది.

లావణ్య తమ మాట వినదని అర్ధమయ్యి తన తల్లి తండ్రులు ఇక తనకి నచ్చజెప్పలేక కార్ ఎక్కి కూర్చున్నారు.. ముందు చిన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.. అంతా హాల్లోనే పిల్లలతో పాటు కూర్చుని ఉన్నారు.. ఇంకా ఎవరో ఉండేసరికి లావణ్య వాళ్ళతో మాట్లాడగా అప్పులోళ్ళు అని అర్ధమయ్యింది.. లావణ్య పట్టించుకోకుండా లోపలికి వెళ్లి చిన్నా రూం తెరిచి అక్షిత ఫోటో ఉన్న చిన్న రూం తెరిచింది అక్కడ ఒక ఫైల్ అందులో కొన్ని డాకుమెంట్స్ ఫిక్సడ్ డిపాజిట్స్ ఇంకొన్ని చెక్స్ సైన్ చేసినవి ఉన్నాయి.. వాటితో పాటు చిన్న లెటర్.. ఒక బాక్స్.. కొన్ని పేపర్స్ తన అమ్మ వాళ్ళకి కొన్ని చిన్నూకి.. వాటితో పాటు చిన్నా అక్షితల ఫోటో ఆల్బమ్ ని అన్నీ తీసుకుని బైటికి వచ్చి. అప్పులోళ్లతో మాట్లాడి చెక్స్ మీద అమౌంట్ రాసి వాళ్ళకి ఇచ్చి పంపించేసింది.. మిగతా కొన్ని డాకుమెంట్స్ చిన్నా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బైటికి వచ్చేసింది. లావణ్య బైటికి వెళ్లిపోతుంటే గొంతు తెచ్చుకుని మాట్లాడింది

కవిత : చిన్నూ ఎక్కడా

లావణ్య : బైట ఉంది.. మీరు తనని చూడటం నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతున్నాం అని చెప్పేసి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైటికి వచ్చేసి కార్ ఎక్కి కూర్చుంది. కారు నేరుగా ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళింది.

చివరిగా లావణ్య లోపలికి వెళుతుంటే అడిగింది..

లావణ్య అమ్మ : ఒకే ఒక్క ప్రశ్న.. నువ్వు చిరంజీవిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావ్

లావణ్య : నా పద్దెనిమిదవ ఏట మొదటి సారి పార్టీకి కలకత్తా వెళ్ళినప్పటి నుంచి.. అని చెపుతూ చిన్నా ఇచ్చిన బాక్స్ లో ఉన్న చైన్ చిన్నూ మెడలో వేసి కుర్చీ మీద నిల్చోబెట్టి అందులో ఉన్న పట్టీలు కాలికి పెట్టింది చిన్నూని చూసి నవ్వుతూ.. ఫ్లైట్ ఎక్కడానికి చిన్నూని ఎత్తుకుని ఒకసారి తన అమ్మా నాన్నల వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది.

చిన్నా చనిపోయిన మరుక్షణం..

అక్షిత జలపాతం పక్కన కొండ గట్టున కూర్చుని ఎదురు చూస్తుంది, చిన్నా ఆత్మ వెళ్లి తన పక్కన కూర్చుంది.

చిన్నా : నువ్వు వెళ్ళిపోయావు నిన్ను ఎక్కడ వెతకాలో ఏమో అని కంగారు పడ్డాను

అక్షిత : నువ్వొస్తావని నాకు తెలుసు అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అని చిన్నా చెయ్యి పట్టుకుని గాల్లోకి ఎగురుతూ రా నీకింకో కొత్త లోకం చూపిస్తాను అంది.

రెండు ఆత్మలు గాల్లో కలిసిపోయాయి

3 Comments

  1. Different story in between sex stories.wonderful story.really liked it.thanks to the writer.

  2. Different story in between sex stories.thanks to the writer.

Comments are closed.