“రెండు…”
అతను తన నోటిని నా ఛాతీ కిందికి తెచ్చి, తన నాలుకని నా బట్ట లేని చర్మం మీదకి జరిపాడు.
“మూడు…”
చివరి సంఖ్య జస్వంత్ పెదవుల నుండి వెలువడిన వెంటనే, అతను ముందుకు దూసుకుపోయాడు. అతను ఆ వ్యక్తిని మెడ వెనుక నుండి పట్టుకుని నన్ను అతని నుండి లాగాడు. తరువాత ఒక వేగవంతమైన కదలికతో, అతను ఆ వ్యక్తి ముఖాన్ని లోహపు గోడకి బలంగా కొట్టాడు. అది అతన్ని వెంటనే స్పృహ కోల్పోయేలా చేసింది, అతను నేల మీద ఇసుక బస్తాలా పడిపోయాడు.
“ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోదాం,” అని జస్వంత్ నా నడుము పట్టుకుని అన్నాడు.
గదిలో స్పృహలో ఉన్న మిగిలిన ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని వెళ్ళకుండా ఆపడానికి వెంటనే మాపై దూకారు. అదృష్టవశాత్తూ, జస్వంత్ చాలా వేగంగా ఉన్నాడు.
అతను ఒక చేత్తో తలుపు తెరిచి, మరొక చేత్తో నన్ను ఎత్తుకున్నాడు. తరువాత మేము పొడవైన హాలులో వెళ్ళాము.
“పట్టుకో, అక్షరా,” అని అతను అన్నాడు. “నేను నిన్ను ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్తాను. నేను నిన్ను ఇక్కడికి అసలు తీసుకురాకూడదు.”
మిగిలిన పురుషుల అడుగుల చప్పుడు మా వైపు పరిగెడుతున్నప్పుడు నాకు వినిపించింది. జస్వంత్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు, నా చిన్న నడుముని తన చేత్తో పట్టుకున్నాడు. తరువాత అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అతను పూర్తి వేగంతో, హాలులో మెట్ల దిగువకి పూర్తి వేగంతో పరిగెత్తాడు. భాస్కర్ ఇంకా మిగిలిన ఇద్దరు పురుషులు మా వెనుక హాలులో పరిగెడుతూ ఉండటం నేను చూశాను. వాళ్ళు దగ్గరవుతున్నారు, మేము పట్టుబడతామని నాకు తెలిసిపోయింది.
“జస్వంత్, త్వరగా,” అని నేను అన్నాను. “వాళ్ళు వచ్చేస్తున్నారు.”
మేము మెట్ల దిగువకి చేరుకున్నప్పుడు జస్వంత్ నన్ను మరింత గట్టిగా పట్టుకున్నాడు, తరువాత అతను నన్ను తన భుజం మీదకి వేసుకున్నాడు. అతను ఒకేసారి రెండు మెట్లు దాటుకుంటూ మెట్లు ఎక్కడం ప్రారంభించాడు. కొన్ని సెకన్లలో, మేము పైకి చేరుకున్నాము.
అతను త్వరగా తలుపు తెరిచి కాంక్రీట్ స్థలం మీదుగా, కారు వైపు వెళ్ళడం ప్రారంభించాడు. మేము మొదటిసారి వచ్చినప్పుడు నినాదాలు చేసిన పురుషులు ఇంకా అక్కడే ఉన్నారు, లయబద్ధంగా పరిగెడుతున్నారు. వాళ్ళు మా వైపు వింతగా చూశారు.
“మనం దాదాపు వచ్చేసాము,” అని జస్వంత్ అన్నాడు.
మేము ఇప్పుడే వదిలి వచ్చిన భవనం వైపు నేను వెనక్కి చూశాను.
“ఎవరైనా వాళ్ళని ఆపండి !” అని భాస్కర్ కేకలు వేశాడు. “అతను ఒక నేరస్థుడు !”
ఓహ్ Shit.
పెద్ద సంఖ్యలో ఉన్న సైనిక పురుషులు మా వైపు తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టారు.
“జస్వంత్, మనం త్వరగా వెళ్లాలి…” అని నేను అన్నాను.
జస్వంత్ తన వేగాన్ని మరింత పెంచాడు, నేను అతని భుజం మీద నుండి జారిపోకుండా మరింత గట్టిగా నన్ను పట్టుకున్నాడు. సైనిక పురుషుల గుంపు మాకు దగ్గరవుతోంది.
“త్వరగా, జస్వంత్ !” అని నేను కేకలు వేశాను. “త్వరగా !”
అకస్మాత్తుగా, జస్వంత్ నన్ను తన భుజం నుండి క్రిందికి దించాడు.
“కారులో ఎక్కు,” అని అతను చెప్పాడు.
ఓహ్, థాంక్ గాడ్…
నేను ప్యాసింజర్ సీట్ వైపు పరిగెత్తి తలుపు తెరిచాను. జస్వంత్ డ్రైవర్ సీటులో దూకి ఇంజిన్ స్టార్ట్ చేయడం నేను చూశాను. ఆ గుంపు మమ్మల్ని తరుముకుంటూ దగ్గరికి రావడాన్ని నేను ఆత్రుతగా చూస్తుండటంతో నా కాలు ఫ్లోర్ బెడ్ మీద కొట్టుకోవడం మొదలుపెట్టింది.
కారు స్టార్ట్ అయింది, జస్వంత్ స్టీరింగ్ వీల్ ని పూర్తిగా ఎడమవైపు తిప్పి, యాక్సిలరేటర్ను పూర్తిగా కింద వరకు నొక్కాడు. అతను కారుని 180 డిగ్రీలు తిప్పడంతో టైర్లు పెద్దగా శబ్దం చేశాయి, అప్పుడు ఏర్పడిన దుమ్ము ఆ గుంపుని పూర్తిగా కమ్మేసింది.
“ఒహ్హ్ Shit…” అని నేను అన్నాను. “అదంతా ఏమిటి, జస్వంత్ ?”
నేను నా చేతులని చూశాను. అడ్రినలిన్ యొక్క పెద్ద రష్ వాటిని నియంత్రించలేని విధంగా వణుకుతున్నాయి.
మేము హైవేపైకి చేరుకుంటున్నప్పుడు జస్వంత్ యాక్సిలరేటర్ను మరింత గట్టిగా నొక్కాడు.
“Sorry, అక్షరా,” అని అతను అన్నాడు. “నేను నిన్ను అక్కడికి తీసుకవెళ్లకుండా వుండాల్సింది.”
మా మార్గంలోనే వెళుతున్న ప్రతి వాహనాన్ని దాటుకుంటూ మేము హైవేపై దూసుకుపోయాము. వాళ్ళు మమ్మల్ని అనుసరిస్తున్నారో లేదో చూడటానికి నేను నిమిషానికోసారి వెనక్కి చూస్తూనే వున్నాను.
“వాళ్ళు మనల్ని వెంబడించరు,” అని జస్వంత్ అన్నాడు. “మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాము.”
సురక్షితమా ?
నేను జస్వంత్ ని పిచ్చిదానిలా చూశాను.
“మనం ఎలా సురక్షితం జస్వంత్ ?” అని నేను అడిగాను.
జస్వంత్ తన సెల్ ఫోన్ తీసి, కొన్ని నిమిషాల క్రితం అతను రికార్డ్ చేసిన ఒక వీడియోని ప్లే చేసాడు. నేను అతన్ని తోసివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నీలం రంగు బట్టలు వేసుకున్న వ్యక్తి నన్ను గోడకి అదిమిపెడుతున్న వీడియో అది.
“ఇప్పటివరకు నేను వాళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాను,” అని అతను అన్నాడు. “కానీ ఇప్పుడు వాళ్ళు నా చేతుల్లో ఇరుక్కున్నారు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడితే, నేను వాళ్ళ జీవితాలని నాశనం చేస్తాను.”
సంతృప్తికరమైన చిరునవ్వు నా ముఖంలో మెరిసింది.
“నువ్వు అద్భుతంగా ఉన్నావు,” అని జస్వంత్ ని ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను.
అతను నా వైపు చూసి నవ్వాడు.
“ఇంటికి వెళ్దాం.”
చివరికి మేము మా ఇంటికి తిరిగి చేరుకునేసరికి నేను ఊపిరి పీల్చుకున్నాను. జస్వంత్ కారుని గ్యారేజీలో పెట్టి తలుపు మూశాడు. తరువాత మేము లోపలికి అడుగు పెట్టాము.
“జస్వంత్, నువ్వు నాకు అన్నీ వివరంగా చెప్పాలి,” అని నేను అన్నాను.
