స్స్స్ ……. లవ్ యు పెద్దమ్మా అంటూ సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలు : పెద్దమ్మనా …… ఎక్కడ ఎక్కడ ? .
రాలేదు బుజ్జాయిలూ …… ఎంతసేపయ్యింది చూసి ప్చ్ ప్చ్ ……
బుజ్జాయిలు : మీరే ఇంతగా అయిపోయారంటే మీరంటే ప్రాణమైన పెద్దమ్మ ఇంకెంత ఫీల్ అవుతున్నారో పాపం అంటూ నవ్వుకుంటున్నారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ సిగ్గుపడుతూ , ఒకటినిమించి మరొకటి టేస్టీ గా ఉన్నాయి అంటూ తృప్తిగా తిన్నాము – అమృతం సేవించాము .
అన్నయ్యా అన్నయ్యా …… రండి రండి చూయిస్తాము అంటూ స్వర్గానికి ఏమాత్రం తగ్గని పూలతో – పచ్చదనంతో నిర్మించిన గృహసముదాయాలు , అద్భుతమైన పూలవనాలు , అలంకరణలు ……. మనసును కట్టిపడేస్తున్నాయి .
అన్నయ్యా అన్నయ్యా …… మన గృహాలలోపల అయితే భువిపై ఉన్నట్లు స్టార్ హోటల్స్ లా మారిపోయాయి రండి అంటూ చూయించారు .
Wow wow పూర్తిగా మారిపోయాయి – లవ్ యు పెద్దమ్మా ……
బుజ్జాయిలు : వీటికే ఇలా ఆశ్చర్యపోతే ఇక మీకోసం ప్రత్యేకంగా రెడీ చేయించిన గృహాన్ని చూస్తే ఏమైపోతారో ……
అవునా అవునా , బుజ్జాయిలూ బుజ్జాయిలూ …… అక్కడికి తీసుకెళ్లరూ ……
బుజ్జాయిలు : వీలుకాదు అన్నయ్యా …… అంటే ఇప్పుడు వీలుకాదు అన్నయ్యా ….. , మీరుకాకుండా మరెవ్వరూ ఆ గదిలోకి వెళ్లకూడదని గదికి తాళం వేసి పెద్దమ్మ దగ్గరే భద్రoగా ఉంచుకున్నారు .
లవ్ యు పెద్దమ్మా …….
అలా మధ్యాహ్నం వరకూ స్వర్గానికి ఏమాత్రం తీసిపోనివిధంగా మారిపోయిన ” పెద్దమ్మ – పిల్లల లోకం ” మొత్తం తిప్పి చూయించారు పిల్లలు ఉత్సాహంతో …….
అద్భుతం మహాద్భుతం బుజ్జాయిలూ ……. ఇక ఆడుకోవడానికి వెళదామా ? .
అంతలో లంచ్ టైం అయినట్లు స్వర్గం నుండి నేరుగా వచ్చినట్లు రకరకాల భోజనం ప్రత్యక్షo అయ్యాయి .
బుజ్జాయిలు : ప్చ్ ప్చ్ …… ఇప్పుడేకదా తిన్నది .
అప్పుడు తినగా లభించిన శక్తి మనలోకం చూడటంతోనే వెళ్ళిపోయి ఉంటుంది – ఇప్పుడు ఫ్రెష్ గా ఆడుకోవడానికి ఫ్రెష్ ఎనర్జీ కావాలంటే ఫుల్ గా తినాలి రండి రండి ………
బుజ్జాయిలు : అన్నయ్యా …… మీరుకూడా సేమ్ టు సేమ్ పెద్దమ్మలానే ముందు తినాలి తరువాత మీఇష్టం అంటారు – సరే ఏమిచేస్తాం ఫుల్ గా తింటాం అంటూ నవ్వుకున్నాము .
బుజ్జాయిలూ ……. లంచ్ సమయానికి కూడా పెద్దమ్మ రానేలేదు ప్చ్ …….
బుజ్జాయిలు : అన్నయ్య వచ్చారని తెలిసికూడా టిఫిన్ సమయానికి రాలేదు ఇప్పుడు లంచ్ సమయానికీ రాలేదు అంటే అది ఎంత ముఖ్యమైన పనో ఏమిటో ……..
అయితే పెద్దమ్మను తలుచుకుని డిస్టర్బ్ చెయ్యడం మంచిది కాదు – పని పూర్తయ్యాకనే రానివ్వనివ్వండి .
బుజ్జాయిలు : వచ్చాక కోపం ప్రదర్శిస్తారని అర్థమైపోతుందిలే అన్నయ్యా ……..
మరి ఎన్నిరోజులయ్యింది కలిసి – అలా కౌగిలించుకుని ముద్దుపెట్టి వెళ్లిపోయారు – నేనంటే ఇష్టమే లేనట్లుఉంది పెద్దమ్మకు …….
స్స్స్ ……..
బుజ్జాయిలు : పురుగు కాదు ఏమీకాదు , పెద్దమ్మ …… అన్నయ్యను గిల్లేస్తున్నారు అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు .
తెలిసిపోయిందన్నమాట ……..
బుజ్జాయిలు : మీరు వచ్చిన ప్రతీసారీ జరిగేదేకదా ………
సరే సరే ముందు తినండి అంటూ వడ్డించుకుని కూర్చుని , భోజనం కూడా టేస్టీ టేస్టీ అంటూ కుమ్మేసాము – ఫుల్ గా తినడంతో వెక్కిళ్ళు వచ్చేసాయి .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ……. నెమ్మది ఇదిగో అమృతం త్రాగండి .
అమృతం అంటూ గుర్తుచేయకండి బుజ్జాయిలూ ……. , పెద్దమ్మ ……
పూర్తి చేసేంతలో కొరికేశారు .
స్స్స్ ……..
అన్నయ్యా అన్నయ్యా ………. మళ్లీ మళ్లీ …….
లేదు లేదు అలాంటిదేమీ లేదు బుజ్జాయిలూ ……. , నవ్వుకుని అవును బుజ్జాయిలూ ……. ఇంతకుముందు ఈ అమృతం లేదే …….
బుజ్జాయిలు : చెప్పాము కదా అన్నయ్యా ……. , స్వర్గంతో సమానంగా మన లోకాన్ని మార్చేశారు పెద్దమ్మ అని – అక్కడి సకల సదుపాయాలు అన్నీ మన లోకంలోకి కూడా సెట్ చేసేసారు పెద్దమ్మ ……..
లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ……..
కడుపునిండా తిని గ్రౌండ్ లోకి చేరాము .
మాలోకంలో మా ఫ్రెండ్స్ తో సరదాగా గడిపి చాలా కాలం అవ్వడంతో , క్రికెట్ తో మొదలెట్టి ప్రతీ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాము . మధ్యమధ్యలో బుజ్జాయిలు అందిస్తున్న ఫలాలను – అమృతాన్ని సేవిస్తూ ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నాము – సమయమే తెలియనట్లు గడిచి సూర్యాస్తమయం కావచ్చింది , దాదాపు 4 – 5 గంటలు ఆడుకోవడం వలన వొళ్ళంతా చెమటలు పట్టేయ్యడంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని పరుగునవెళ్లి కొలనులోకి జంప్ చేసాము , చల్లని నీటిలో హాయిగా ఈతకొడుతూ ఆనందిస్తున్నాము .
అన్నయ్యా అన్నయ్యా …… బార్బీ డ్రెస్సెస్ తడిచిపోయాయి చూడండి – ఈసమయంలో గనుక పెద్దమ్మ వస్తే …….
బుజ్జాయిలూ …… మరొక డ్రెస్సెస్ కూడా ఉన్నాయికదా ……
బుజ్జాయిలు : కదా …… , అన్నయ్యా …… మీరు పెద్దమ్మకోసం తెచ్చిన పట్టుచీరను పెద్దమ్మ గదిలో ఉంచాము , అయితే పెద్దమ్మ ఇప్పుడే రావాలి – పాపం మా అన్నయ్య ఉదయం నుండీ వెయ్యికళ్ళతో ప్రాణం కంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు .
బుజ్జాయిలు అలా అనడం ఆలస్యం , మహేష్ …… బుజ్జిహీరో బుజ్జాయిలూ …… ఎక్కడ ఉన్నారు అంటూ దూరం నుండి మధురమైన పెద్దమ్మ పిలుపు …….
పెద్దమ్మ పెద్దమ్మ ……. బుజ్జాయిలూ పెద్దమ్మ వచ్చేసారు – ఉమ్మా ఉమ్మా …… .
బుజ్జాయిలు : మరి మేమంటే ఏమనుకుంటున్నారు – ok ok మీరు పెద్దమ్మ దగ్గరకు వెళ్ళండి – మేము అటువైపునుండి వెళ్లి డ్రెస్సెస్ మార్చుకుని వచ్చేస్తాము .
బుజ్జాయిలూ ……. ఉదయం రెడీ అయినట్లుగానే రెడీ అవ్వాలి .
బుజ్జాయిలు : డబల్ ok అంటూ బుజ్జి చేప పిల్లల్లా ఈదుకుంటూ అటువైపు ఒడ్డుకు చేరుకున్నారు .
ఫ్రెండ్స్ ……. ఎంజాయ్ అనిచెప్పి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకుచేరి పెద్దమ్మా పెద్దమ్మా అంటూ పరుగున పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నాను .
ఎన్నాళ్ల విరహమో అన్నట్లు ఇద్దరమూ ఒకరి కౌగిళ్ళలో మరొకరం ఏకమైపోయాము , పెద్దమ్మా – బుజ్జిహీరో పెద్దమ్మా – బుజ్జిహీరో ……..
ఇద్దరమూ నవ్వుకున్నాము – పెద్దమ్మా ……. అంత ముఖ్యమైన పని ఏమిటి , ఉదయం అనగా వెళ్లి ఇప్పుడు వచ్చారు అంటూ పెదాలపై కొరికేసాను .
పెద్దమ్మ : స్స్స్ …… అంటూ అందమైన నవ్వులతో నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టారు – బుజ్జి …… హీరో ……. అంటూ సాగదీసిన పెద్దమ్మ కళ్ళల్లో చెమ్మ ………
అంటే అంటే ……. ఆ ముఖ్యమైన పని అమ్మో అమ్మో ” did a మిస్టేక్ – i did a మిస్టేక్ – did a మిస్టేక్ …….. , మీరు స్వర్గంనుండి పిలుపు వచ్చింది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి did a మిస్టేక్ – i did a మిస్టేక్ ” సామిరంగా అంటూ ఉదయం అనగా వచ్చాను చీకటిపడేలోపు గెంటేస్తున్నారు …….. , నా ప్రాణమైన పెద్దమ్మను వదిలి వెల్లనంటే వెళ్లను అంటూ తడి బట్టలతోనే వెళ్లి చెట్టు కింద బండపై అటువైపుకు తిరిగి కూర్చున్నాను .
పెద్దమ్మ కన్నీళ్లను తుడుచుకుని వచ్చి ప్రక్కనే కూర్చున్నారు – నా బుజ్జిహీరోకు దూరంగా ఉండటం నాకుమాత్రం ఇష్టమా చెప్పు , నిన్ను వదిలి ఒంటరిగా పడుకోవడం ఎంత కష్టమో ……. అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , తప్పదు బుజ్జిహీరో ……
ఎవరు పెద్దమ్మా …… ఆజ్ఞ వేసినది – ఆ స్వర్గాధిపతేనా …… అవసరమైతే అతనినే ఎదురిస్తాను .
పెద్దమ్మ : నేనెప్పుడో ఎదురించేదానిని కానీ నువ్వు భువిపైకివెళ్లి పూర్తి చేయాల్సిన కార్యం విని నన్ను కట్టిపడేసింది – హృదయాన్ని కదిలించేసింది , ఇక తప్పని పరిస్థితుల్లో గుండెను రాయిచేసుకుని ఒప్పుకున్నాను , నా మాట న బుజ్జిహీరో మన్నిస్తాడాని నాకు తెలుసు …….
నా పెద్దమ్మ మాటే నాకు వేదం – ఇక్కడికిక్కడే ప్రాణాలు వదిలేయమంటే సంతోషంగా …….
పెద్దమ్మ : అలాంటి మాటలు అన్నావో దెబ్బలుపడతాయి – నువ్వు లేకుండా నేనుండగలనా చెప్పు – నీ వల్లనే కదా నా మనసు మళ్లీ పరిమళించినది అంటూ కొట్టి వెంటనే ముద్దులవర్షం కురిపించి కౌగిలించుకున్నారు .
లేదు లేదు ఇంకెప్పుడూ అలా మాట్లాడను అంటూ చిరునవ్వులు చిందిస్తూ గట్టిగా చుట్టేసాను – సరేలే పెద్దమ్మా …… ఒక వారం తరువాత వెళతానులే ……
పెద్దమ్మ : స్వర్గాధిపతి ఆజ్ఞల ప్రకారం రేపు రోజు మారేలోపు ……
మారేలోపు …….
పెద్దమ్మ : అర్ధరాత్రి 12 గంటలలోపు భువిమీదకు చేరుకోవాలి లేకపోతే మళ్లీ 12 పక్షాలు కుదరనే కుదరదు .
అయితే అప్పుడే తీరికగా వెళతాను పెద్దమ్మా …….
పెద్దమ్మ : అధికాదు బుజ్జిహీరో …….
ఏదీకాదు పెద్దమ్మా …… , వెళతాను వారం రోజుల తరువాత …….
పెద్దమ్మ : సరే ఈ మాట అదిగో అక్కడ నా బుజ్జిహీరో పూలవనంలో కూర్చున్న ఒక అమ్మను కలిసొచ్చి చెప్పు – నువ్వొక్కడివే వెళ్ళాలి వెళ్లు బుజ్జిహీరో అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఈ ప్రాణమైన ముద్దుతోనే సగం ఒప్పించేశారు పెద్దమ్మా – మీ హృదయాన్నే కదిలించిన సంఘటన అని అర్థమైపోతోంది చూద్దాము అంటూ పెద్దమ్మ చేతిని వదల్లేక వదల్లేక వెళ్ళాను .
పూలవనంలో నేను పెంచిన మొక్కలకు వారి కన్నీళ్ళతో కలిపి ఒక అమ్మ నీళ్లు పోస్తుండటం చూసి , అమ్మా …… అని పిలిచాను .
మహేష్ అంటూ కన్నీళ్లను తుడుచుకుని సమాధానమిచ్చి ఆనందిస్తున్నారు – బాబూ …… అంటూ ఇంతకుముందు కలవకపోయినా నేనే వారి సర్వస్వం అన్నట్లు నా బుగ్గలను తల్లిప్రేగు ప్రేమతో స్పృశిస్తూ మురిసిపోతున్నారు , నువ్వేనా బాబూ మహేష్ అంటే ఒకసారి కౌగిలించుకోవచ్చా అని అడిగారు .
మీకు సంతోషమైతే నాకు ఇష్టమే అమ్మా ……
” అమ్మ ……. ” నువ్వు పిలుస్తుంటేనే కన్నప్రేగు కదిలిపోతోంది – ” ఆ కన్నప్రేగు ప్రేమ ” ప్రేమను పొందడం కోసమే నీదగ్గరకు ఆర్థిస్తూ వచ్చాను మహేష్ …….
అర్థించడం ఏమిటి అమ్మా …… , ఇంతకూ మీరెవరు ? – మీపేరేమిటి ? – నన్ను కలవడానికి గల కారణం ఏమిటి ? .
” నా పేరు జానకి ” , ” నేను ఒక అమ్మను కానీ నా కడుపున పుట్టిన బిడ్డ ప్రేమను పొందలేకపోయిన దురదృష్టవంతురాలిని ” , నా బిడ్డకు జన్మనిచ్చి బిడ్డను కనీసం చూడలేకపోయిన అభాగ్యురాలిని అంటూ తల్లడిల్లిపోతున్నారు .
అంటే అమ్మా ……..
అవును మహేష్ ……. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ……
అమ్మా అమ్మా …… అంటూ చలించిపోతున్న హృదయంతో అమ్మను కూర్చోబెట్టి , త్రాగడానికి అమృతం ఇచ్చాను .
జానకి అమ్మా …… సమాధానపరచుకోండి – ఈ అమ్మ కోరిక తీర్చాలని ఫిక్స్ అయిపోయి , అమ్మా ……. మీ ముఖంలో సంతోషం పరిమళించడానికి నన్ను ఏమిచెయ్యమంటారో చెప్పండి .
జానకి అమ్మ : నీ మంచితనం గురించి పెద్దమ్మ చెప్పారు – ఎదుటివారి కళ్ళల్లో సంతోషం నింపడానికి ఎంత దూరం అయినా వెళతావని కూడా చెప్పారు .
అది పెద్దమ్మ మంచితనం – పెద్దమ్మ ప్రేమను పొందినవారెవరైనా ఇలానే చేస్తారు , అమ్మా …… ఆజ్ఞ వెయ్యగలరు .
జానకి అమ్మ : దాదాపు 15 సంవత్సరాల నా హృదయంలోని బాధను తొలగించే మహానుభావుడు నువ్వే అని ఉదయమే స్వర్గం నుండి పిలుపువచ్చింది – స్వర్గంలో మహా మహా గొప్ప వ్యక్తులు దేవుళ్ళు ఉన్నప్పటికీ నా కోరిక తీర్చే అర్హత కేవలం కేవలం నీకు మాత్రమే ఉందని విధాత ప్రకటించారు .
విధాతనా …… ? , అమ్మా అమ్మా …… అదేంటో త్వరగా త్వరగా చెప్పండి – నా హృదయవేగం అమాంతం పెరిగిపోతోంది .
జానకి అమ్మ : నా బుజ్జిదేవుడి హృదయ స్పందనను కంట్రోల్ చెయ్యడానికి ఈ అమ్మ లేదూ అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నారు . మహేష్ ……. నువ్వు భువిపైకి వెళ్లి ఏమిచెయ్యాలంటే అంటూ ( …………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………. ) హృదయంపై ప్రాణంలా స్పృశిస్తూ చెప్పారు .
అంతే షాక్ లో ఉండిపోయాను .
ఓహో ఇద్దరూ తల్లీకొడుకుల్లా ఒక్కటైపోయారన్నమాట అంటూ పెద్దమ్మ వచ్చారు .
జానకి అమ్మ : తల్లీకొడుకుల్లా కాదు పెద్దమ్మా ” తండ్రీకూతురిలా ” ……
ఏమిటీ ……. 13 ఏళ్ల ఈ వయసులో వెళ్లి ఏకంగా మరొక 12 ఏళ్ల తరువాత అమ్మ స్వచ్ఛమైన కోరికను తీర్చి పెద్దమ్మ లోకానికి చేరుకోవాలన్నమాట …….
పెద్దమ్మ : అంతేగా అంతేగా అంటూ నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టారు .
ఊహూ ఊహూ ……. నావల్లకాదు పెద్దమ్మా , అదేదో 12ఏళ్ల తరువాతనే వెళ్లి పూర్తిచేస్తాను – తేడా ఏముంది చెప్పండి .
పెద్దమ్మ : అలా కుదరదు నా గ్రేట్ బుజ్జిహీరో ……. , నువ్వు భువిపైకి వెళ్లి నీ వర్తమాన జానకిఅమ్మ …… బిడ్డతో – భవిష్యత్తులో కాబోవు జానకి బేబీ …… అమ్మతో కాలానుగుణంగా ప్రయాణిస్తూ అప్పుడప్పుడూ ( తనకు అవసరమైన సమయాలలో ) కలుస్తూ బాధను పంచుకుని సంతోషాలను పంచుతూ …….
ఇంకా చెప్పండి అలా చెబుతూ వెళ్ళండి – మీకేంటి ఎన్నైనా చెబుతారు , భూలోకంలో 12 ఏళ్ళు అంటే మనలోకంలో 12 నిమిషాలు అలా అలా గడిచిపోతాయి , నేనుమాత్రం భూలోకంలో అప్పుడప్పుడూ తప్ప ఇక మిలిగిన సమయం అంతా ఒంటరిగానా ……. అమ్మో నావల్ల కాదు అంటూ పెద్దమ్మవైపు తియ్యనైనకోపంతో చూస్తున్నాను .
పెద్దమ్మ ముసిముసినవ్వులు నవ్వుతున్నారు – నా బుజ్జిహీరో మనసులో ఎలాంటి చిలిపి …….
పెద్దమ్మా పెద్దమ్మా …… అమ్మ ఎదురుగా ఉన్నారు మరిచిపోయారా ? .
పెద్దమ్మ : నీ జానకి అమ్మకు ……. నీ గురించి మొత్తం చెప్పే తీసుకొచ్చానులే ……
జానకి అమ్మ : అవునవును అంటూ సిగ్గుపడుతున్నారు .
