ట్విలైట్ – Part 2 67

చిన్నాగాడు మాత్రం ఎప్పుడెక్కాడోగాని సోఫాలోకి ఎక్కి నిలబడి అమ్మవైప్పు చూస్తున్నాడు… అమ్మ వాడ్ని గమనించి… నాబుజం మీద తట్టి… ఏంట్రా వాడు అలా చూస్తున్నాడు అంటూ వాడివైపే చూస్తోంది. ఏంలేదంమ్మా ఎవరైనా గట్టిగా మాట్లాడితే…ఏదో గొడవ జరుగుతుందని వాడి బయం అంతే అనెలోపు… నాకలా అనిపించట్లా… నేను దాన్ని తిడుతున్నానని నామీద గుర్రుగావుంది వాడికి… ఏరా…నువ్వు దానికి చెంచావా?… అంటూ… ముక్కుమీద వేలు పెట్టుకొని… ముక్కు కోస్తా రౌడీ వెదవ అంది అమ్మ. దానికి చిన్నా కూడా కళ్ళుమూసుకొని మొహం చిట్లించి ముక్కు మీద వెలుపెట్టుకొని… యాయ్యియేతృత్ఫ్… అంటూ వాడి బాషలో బండబూతేదో తిట్టి ముక్కు కోస్తా అన్నట్టుగా వేలుచుపించాడు. ఆ దెబ్బకి సౌండ్ పడిపోయింది అమ్మకి. ఇంతలో సంధ్య ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి రెండు చాక్లెట్స్ తీసి బ్యాగ్ సైడ్ జిప్ లో వేస్తూ… సడెన్గా షుగర్ డౌన్ అయితే… ఈ చాక్లెట్స్ తినండి అంటూ నాన్నకి చెప్తోంది.. అబ్బో ఎంత ప్రేమ వలకబొస్తుందో వయ్యారి అంది అమ్మ. సంధ్య అదేం పట్టించుకోకుండ నావైపు వచ్చి ఇంకో టిఫిన్ బాక్స్ చేతిలో పెట్టి… డ్రైవర్ కి ఇవ్వండి అని చెప్పి చిన్నా దగ్గరకి వెళ్ళింది. అయ్యిందిగా ఇంక బయల్దేరండి అంది అమ్మ. ముగ్గురం బయటకొచ్చి వాళ్ళిద్దరినీ కారెక్కించి పంపించి ఇంట్లోకి వచ్చేసరికి చిన్నాగాడికి పాలు తాపిస్తోంది సంధ్య. నేను డైరెక్ట్ గా డైనింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి ప్లేట్ లో టిఫిన్ పెట్టుకొని వచ్చి సంధ్య దగ్గర కూర్చొని సంధ్యకి టిఫిన్ తిపిస్తూ నేను కూడా టిఫిన్ తినేసా. ఈలోపు చిన్నాగాడు పాలుతాగి చిన్నగా నిద్రలోకి జారుకొని సంధ్య వళ్ళో నిద్రపోయాడు. సంధ్య నావైపు చూసి… కుమార్ నాకు కూడా నిద్రొస్తుంది… ఒక గంట తరవాత లేపుతావా వంట పని చేయాలి అంది. సరే బంగారం… అమ్మ మాటలు పట్టించుకోకు… నాకు నువ్వే ముఖ్యం … ప్లీజ్ అంటూ సంధ్య నుదుటిమీద ముద్దు పెట్టా. సంధ్య నా వైపు చూసి… అదేం లేదు కుమార్… కనీసం తిట్టడానికి… నాకంటూ ఒక కుటుంబం ఉంది… అదిచాలు నాకు అంటూ నా పెదాలమీద ముద్దు పెట్టింది. ఏమో సంధ్య అమ్మని ఎలా కన్విన్స్ చేయాలో మాత్రం తెలియటంలేదు అన్నా. అదంతా తరవాత చూద్దాం లే… అంటూ పైకి లేచి ఒక ఒన్ హవర్ లో లేపి నన్ను అని బెడ్రూం లోకి వెల్లింది సంధ్య.

ఏంటో ఈ సబ్జెక్ట్ ఏటుపోతుందో ఏమో… అనుకుంటూ లేచి బెడ్రూంలోకి వెళ్ళా. చిన్నాగాడిని పక్కలో వేసుకొని పడుకొని ఉంది సంధ్య. నేను బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేసి టీషర్ట్, షార్ట్ వేసుకొని హాలోకి వచ్చి సిస్టమ్ ఆన్ చేసి ఈవినింగ్ మీటింగ్ కి సంబంధించి డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ కూర్చున్నా. ఒక ఒన్ హావర్ తరవాత కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తె ఎదురుగా గీత నిలబడి ఉంది.