పూజారి పూజ మొదలు పెట్టాడు..
పైడితల్లి…రేయ్ ఏంట్రా వాసుకి మేడం ఇంకా రాలేదు అంటూ తన మనుషులని అడుగుతున్నాడు..
తెలీదు అయ్య ఒకసారి వెళ్ళి చూసి రమ్మంటరా అని అన్నారు . పైడితల్లి మనుషులు..
పైడితల్లి…వద్దు లే కలెక్టర్ వచ్చే టైం అయ్యింది మీరు ఇక్కడే ఉండండి. ఆ లంజ కొడుకు ఏమైనా ఎక్కువ చేస్తే శంకుస్థాపన కి తీసిన గోతిలో వాడిని పూడ్చి పెట్టేద్దాం అని అందరినీ చూస్తూ నవ్వుతూ రేయ్ ప్రతిదీ మనం అనుకున్నటే జరగాలి అని అన్నాడు..
ఈలోపు ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి ఇద్దరు 22 లేదా 23 వయస్సు ఉన్న కుర్రాళ్ళు దిగి పైడితల్లి దగ్గరకి వచ్చారు.
ఇద్దరి పేర్లు… రాహుల్ ఇంకా రాఘవ ..
ఇద్దరు నాయన ఎట్లున్నవు అని పైడితల్లి నీ పలకరించారు..
పైడితల్లి…ఏంట్రా నా కోడ్కల్లార వారం పడుతుంది అన్నారు ఈరోజే వచ్చేశారు ఎంటి కథ..
రాహుల్…ఏమి లేదు నాయన అత్త మా కోసం ఒక మంచి ఊరి కోడిని పట్టింది అంట అందుకే ఇంత బేగి వచ్చాము..
రాఘవ… ఎండీ నాయన ఈ పూజలు ఇక్కడ..
పైడితల్లి…వీటి గురించి తర్వాత చెప్తా గానీ నాతో పాటు ఉండండి పూజ అయ్యేవరకు కలెక్టర్ కూడా వస్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూసి ఇంటికి పోదాం…
సరే నాయన అంటూ ఇద్దరు పైడితల్లి పక్కన నిలబడ్డారు…ఇంకా భూమి పూజ మొదలు పెట్టారు..పూజ జరుగుతుంది అనసూయ తో కొబ్బరికాయ కొట్టించాడు పైడితల్లి ..
పూజారి మంత్రాలు చదివి పూజ కార్యక్రమం పూర్తి చేశాడు. పైడితల్లి తన డ్రైవర్ నీ పిలిచి వాసుకి గురించి అడిగాడు…
సైదులు…హాస్పిటల్ కి వెళ్ళింది..ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు అని పైడితల్లి తో అన్నాడు..
పైడితల్లి హాస్పిటల్ కి వెళ్లిందా సరే అంటూ ఈరోజు నుండి వాటర్ టాంక్ పనులు మొదలు పెట్టడానికి చూడమని చెప్పు అంటూ కార్ దగ్గరకి వెళ్ళాడు..సైదులు కూడా వెనకే వచ్చి అయ్యా ఊర్లో ప్రజలు జబ్బు పడుతున్నారు అంత మీరు అనుకున్నటే జరుగుతుంది.ఇంకా ఆ కలెక్టర్ మన దారికి రావడమే మిగిలింది అని అన్నాడు..
ఈలోపు ఒక govt car వచ్చి ఆగింది..అందులో నుండి ఒక మనీషి దిగి వచ్చి పైడితల్లి కి ఒక ఫైల్ ఇస్తు..చూడండి మీరు చెప్పింది నేను చేయను ఈ జిల్లా కలెక్టర్ గా నేను నా వృత్తి కి ద్రోహం చేయలేను అని అన్నాడు..
కలెక్టర్ మాటలు విని సైదులు కోపంగా కలెక్టర్ మీద చెయ్యి చేసుకోబోతే పైడితల్లి సైదులు నీ ఆపి ఎంటి కలెక్టర్ ప్రాణాల మీద ఆశ లేదా నీకు అని అన్నాడు..
కలెక్టర్…ప్రాణాల మీద ఆశ ఉంది కాబట్టే ఈ జిల్లా వదిలి వెళ్ళిపోతున్న .. అవినీతి పనులకు దూరంగా ఇంకో రెండు రోజుల్లో కొత్త కలెక్టర్ రాబోతుంది . నేను మీ మాట లెక్క చేయను ఇంకా ఏదైనా ఉంటే కొత్తగా వచ్చే కలెక్టర్ తో చూసుకోండి.. ఇంకా నమస్తే అంటూ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు..
పైడితల్లి…ఏంట్రా సైదులు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడు.పాపం ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఎలా బ్రతుకుతాడో ఆ పని చూడు అంటూ కార్ ఎక్కి వెళ్ళిపోయాడు…
సైదులు నవ్వుతూ వాటర్ టాంకర్ వేసుకొని కలెక్టర్ వెనుక వెళ్ళాడు… కలెక్టర్ ఉన్న కార్ నీ టాంకర్ తో గుద్దేసాడు..
…వాసుకి తన స్టూడెంట్ రాజు తో కలిసి హాస్పిటల్ కి వెళ్ళింది…
అక్కడ ఒబులమ్మ బెడ్ మీద పడుకొని ఉంది.. చేతికి సెలైన్ పెట్టారు .
వాసుకి డాక్టర్ నీ అడిగి ఏమి జరిగిందో తెలుసుకుంది .
డాక్టర్…ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషంట్ పరి స్థితి ఇదే మేడం ఏదో తాగకుదనది తాగి ఉంటారు కానీ అందరూ ఒకేసారి ఎలా అనేది అర్ధం కావడం లేదు..
వాసుకి…ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యి ఉండొచ్చు కదా.కానీ అందరూ అదే రకంగా ఎలా.
డాక్టర్…తాగే నీళ్లలో ఏమైనా కలిసి ఉంటుంది..ఎందుకంటే వీళ్ళ రక్తం లో ##@@** ఆసిడ్ ఉంది అది కేవలం లిక్విడ్స్ లో మాత్రమే పని చేస్తుంది..