ఊహించనిది Part 4 82

బామ్మ… అదా పక్కింట్లో డాన్స్ కాలేజ్ ఉంది . పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. నిన్నటి వరకు ఊర్లో లేరు రాత్రి వచ్చారు అనుకుంటా అని చెప్తూ చుట్ట నోట్లో పెట్టుకొని ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ అని పీలుస్తూ ఉంది…

హిమజ…డాన్స్ కాలేజ్ అయితే ఎంటి చుట్టూ పక్కల వాళ్ళు ఇళ్లలో ఉందొద్ద నేను వెళ్లి చూసి వస్తాను అంటూ వెళ్ళింది…

అక్కడ చిన్న పిల్లలు డాన్స్ చేస్తూ ఉన్నారు… హిమజ వచ్చిన సంగతి మర్చిపోయి పిల్లలు చేస్తున్న డాన్స్ చూస్తూ ఉంది…
Now students అందరూ ఇద్దరు ఇద్దరు గా టీమ్ గా అవ్వండి అని మాస్టర్ చెప్తూ అక్కడ నిలబడి చూస్తున్న హిమజ ను చూసి ఓకే మీరు ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి అని చెప్పి హిమజ దగ్గరకి వచ్చి హలో మిస్ అని పిలిచాడు..

హిమజ అతని గొంతు విని హా ఎంటి అని అడిగింది..

మాస్టర్…అదే నేను అడుగుతున్న ఎవరు మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు . ఎవరిని అయిన జాయిన్ చేయడానికి వచ్చారా అని అడిగాడు..

హిమజ…నా పేరు హిమజ. పక్కింట్లో ఉంటాను

మాస్టర్…ఓహ్ నైస్ నా పేరు దేవా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు..

హిమజ..నేను ఇక్కడికి పరిచయం చేసుకోవడానికి రాలేదు . మీ డాన్స్ వల్ల నాకు డిస్టర్బ్ గా ఉంది. నా ఉద్దేశ్యం ఆ సౌండ్ ఎంటి చిన్న పిల్లలు ఉన్న చోట ఇంత సౌండ్ పెట్టీ నేర్పిస్తార అసలు బుద్ది ఉందా అని అరిచింది..

దేవా…sorry హిమజ గారు ఇది వెస్ట్రన్ దీనికి బీటింగ్ సౌండ్ ఎక్కువ ఉండాలి అందుకే ఇలా పెట్టాము . Just warmup కి అయిన ఇలా అరుస్తారు ఏంటండీ బాబు మనిషి చూస్తే పాలకోవా లా ఉన్నారు. మాట ఎమో పటాస్ లాగా పేలుస్తున్నారు…

హిమజ…హేయ్ నా గురించి నీకు ఎందుకు.

దేవా…ఇది ఇంకా బాగుంది . అసలు నేను మీ గురించి ఏమైనా అడిగాన చెప్పండి. వెళ్ళండి తల్లి ఇక్కడి నుండి కొట్టేలా ఉన్నారు చూస్తుంటే అని అన్నాడు..

హిమజ..హా వెళ్తా నేను ఏమి ఇక్కడ కాపురం చేయడానికి రాలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్తుంది…

హిమజ అల వెళ్తున్నపుడు హిమాజ నీ చూస్తూ తనని cross చేసుకుంటూ ఒకడు దేవా దగ్గరకి వచ్చి హేయ్ ఎవరు రా అది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాగా ఉంది అని అన్నాడు .

దేవా… కత్తి కాదురా బాబు atom bomb లాగా పేలుతుంది పేరు హిమజ పక్కన ఉన్న బామ్మ గారి ఇంట్లో ఉంటుంది.వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది దీన్ని చేసుకునే వాడు ఎవడో గానీ వాడిది బాగా పెద్దగా ఉండాలి . అప్పుడే దీని తిక్క కుదురుతుంది..రా శ్రీను

రేయ్ నియవ్వా ఆ బూతులు ఏంట్రా అని అన్నాడు శ్రీను..

దేవా… ఛీ నేను మాట పూర్తి చేయలేదు రా వాడి నోరు పెద్దగా ఉంటేనే దీంతో కాపురం చేయగలడు అని అనబోతున్న..

శ్రీను…నువ్వు గాప్ ఇచ్చి చెప్పే సరికి దాన్ని వినే వాళ్ళు ఫిల్ చేసేస్తారు రా బాబు పద లోపలికి అని వెళ్ళాడు…

….వాసుకి ఇంకా తన కూతురు ఇంట్లోకి వెళ్లారు…

కీర్తి కుంకుమ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత దండం పెట్టుకొని తను బొట్టు పెట్టుకుంది.. తర్వాత బాల్కనీ లోకి వచ్చి బట్టలు తీస్తూ రోడ్ వైపు చూసింది..అక్కడ రాహుల్ ఇంకా రాఘవ ఇద్దరు కూర్చొని ఉన్నారు..వాళ్ళు కూడా కీర్తి నీ చూశారు..

రాఘవ…అరేయ్ రాహుల్ ఎవరు ఆ అమ్మాయి మచ్చ లేని చందమామ లా ఉంది అని కీర్తి నీ చూస్తూ అన్నాడు…

రాహుల్..ఎమో రా బహుశా చుట్టాల అమ్మాయి అయ్యి ఉంటుంది. టీచర్ చెయ్యి విరిగింది కదా తోడుగా వచ్చి ఉంటుంది అన్నాడు…

రాఘవ…ఎవరు అయిన కానీ ఇలాంటి అమ్మాయిని పొందాలి అంటే వాడు ఎవడైనా సరే అతనికి
భీభత్సం గా రాసి పెట్టీ ఉండాలి రా ఒక్క రోజు కానీ ఒక నెల రోజులు కానీ అనుభవించే అందం కాదు రా బాబు అది పెళ్లి చేసుకుని పెళ్ళాం గా ఉంచుకోవాలి.. ఆ అదృష్టం నాకే దక్కాలి అని అంటున్నాడు .

రాహుల్…రేయ్ రాఘవ ఏం మాట్లాడుతున్నావు రా తను ఎవరో ఏ కులమో దాన్ని పెళ్లి చేసుకుంటా అని అంటావు ఎంటి..

రాఘవ… అవును పెళ్లి చేసుకుంటా పెళ్లి అయితే నా కులమే తన కులం అవుతుంది ఇంకా పరిచయం అంటావా. ఆ టీచర్ నీ చూసావు గా ఎంత పద్దతి గా ఉందో అలాంటి వాళ్ళ అమ్మాయి గురించి పెద్దగా పరిచయం ఎందుకు చెప్పు అంటూ చేతిలో ఉన్న సిగరెట్ కింద పడేసి కీర్తి నీ చూస్తూ చెయ్యి ఊపాడు…

రాఘవ చెయ్యి ఊపడం చూసి వీడెంటి నాకు చెయ్యి ఊపుతున్నాడు అనుకుంటూ కీర్తి లోపలికి వెళ్ళింది . వాళ్ళ అమ్మ కోసం చూసింది తను బెడ్రూం లో పడుకొని ఉంది..కీర్తి చప్పుడు కాకుండా బయటకు వచ్చింది…

ఇంతలో రాఘవ అరేయ్ రాహుల్ ఏంట్రా తను అలా వెళ్ళిపోయింది . నేను చెయ్యి ఉపిన కూడా పట్టించుకోలేదు అని అన్నాడు..

రాహుల్…నన్ను అడిగితే నేను ఏమి చెప్తాను . తను ఎందుకు వెళ్ళిపోయింది అంటే వాళ్ళ ఇంట్లో చెప్పడానికి వెళ్ళింది ఎమో ..

రాఘవ…నా కొడకా భయపెట్టక అని ఇంటి వైపు చూస్తున్నాడు.

కీర్తి ఇంటీ మెయిన్ డోరు తెరిచి బయటకు వచ్చింది.. రాహుల్ చూసి అదిగో బయటకు వచ్చింది చూడు అని రాఘవ తో అన్నాడు.

రాఘవ ఎక్కడ అంటూ బాల్కనీ వైపు చూస్తున్నాడు ..రేయ్ బెవార్స్ గా కింద చూడు తను ఇటే వస్తుంది అని రాహుల్ రాఘవ నెత్తి మీద ఒకటి ఇచ్చాడు…

రాఘవ…ఆహ్ అవునా అంటూ గేట్ వైపు చూసాడు ..అక్కడ కీర్తి నిలబడి ఇద్దరినీ కోపంగా చూస్తూ హేయ్ అని కేక వేసింది…

రాఘవ ఇంకా రాహుల్ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ దగ్గరకు వెళ్లారు..

రాఘవ చిన్నగా స్మైల్ ఇస్తు హాయ్ అని పలకరించాడు…

కీర్తి…మీరే కదా మా అమ్మ నీ సైకిల్ తో గుద్దింది..పొలం లో తాటి చెట్టు లాగా ఎదిగారు సిగ్గు లేదా అని అరుస్తుంది…

రాఘవ కీర్తి అరుస్తున్న కూడా తన అందమైన మొఖం చూస్తూ నవ్వుతూ ఉన్నాడు…తనకి ఏమి వినిపించటం లేదు…

రాహుల్ ఏదో అంటున్నాడు.. దానికి కీర్తి జవాబు ఇస్తుంది..

కీర్తి ఏదో అంటుంది…రాహుల్ జవాబు ఇస్తున్నాడు..కానీ రాఘవ పూర్తిగా కీర్తి మాయ లో మునిగిపోయాడు..

రాహుల్ ఇంకా కీర్తి గొడవ పడుతున్నారు…

రాహుల్ …రేయ్ పదరా ఇక్కడ నుండి sorry చెప్పిన కూడా తెగ రెచ్చిపోతుంది ఇది అని రాఘవ తో అన్నాడు..రాఘవ హా అంటూ కీర్తి దగ్గరకు వెళ్తున్నాడు..