ఊహించనిది Part 4 82

రేయ్ నీ అబ్బా అని అరిచాడు రాహుల్.. దాంతో రాఘవ హా అంటూ మామూలుగా అయ్యి కీర్తి నీ చూస్తూ నువ్వు చాలా బాగున్నావు . I love you…. ఇది ఫిక్స్ అయిపో అని అన్నాడు..

కీర్తి … హేయ్ ఎవడరా నువ్వు నాకు I love you చెప్తున్నవ్ అంటూ రాఘవ చెంప పగలగొట్టింది..రాహుల్ అది చూసి హేయ్ నా తమ్ముడిని కొడతావా ఎంత దైర్యం అంటూ కీర్తి మీదకు వచ్చాడు..

రాఘవ రాహుల్ చెయ్యి పట్టుకుని ఆపుతూ రేయ్ ఇది తనకు నాకు మధ్య ప్రేమికుల మద్యలోకి నువ్వు వస్తావ్ ఎంటి అని అన్నాడు..

రాహుల్…రేయ్ అది నిన్ను కొట్టింది రా..

రాఘవ…నా పిల్లే గా నన్ను కొట్టింది ఏం పర్వాలేదు.. ఇది తను నాకు ఇచ్చిన మొదటి బహుమతి అంటూ కీర్తి నీ చూస్తూ బై అని రాహుల్ నీ తీసుకొని వెళ్ళిపోయాడు..

ఇద్దరు ఇంటికి బయలుదేరారు…

దారి మొత్తం రాఘవ కీర్తి జపం చేస్తూ వస్తున్నాడు… ఇంతలో ఒక ఉప్పెన లోని సాంగ్ వస్తుంది అటుగా వెళ్తున్న ట్రాక్టర్ లో నుండి…

రేయ్ రాహుల్ ఆ పాట నాకోసమే అంటూ సాంగ్ వినిపిస్తున్న దగ్గర నుంచి పాడుతూ ఉన్నాడు రాఘవ…

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం
నల్లనైన ముంగురులే…ముంగురులే
అల్లరేదో రేపాయిలే… రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే
గల్లుమంటే నీ గాజులే…నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే…నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే……

రాఘవ అల పాట పాడుకుంటూ వెళ్తున్నాడు .అతని వెనుక రాహుల్ నవ్వుకుంటూ వస్తున్నాడు…

ఇద్దరు అల వెళ్తుంటే పైడితల్లి పిలిచాడు..రేయ్ కొడకళ్లరా ఇలా రండి అని కేకెసాడు.. పైడితల్లి వాటర్ టాంకర్ దగ్గర నిలబడి తన మనుషులతో ఏదో చెప్తున్నాడు..

రాహుల్ వాళ్ళ నాయన గొంతు విని హా నాయన వస్తున్నాం అని వెళ్తున్నాడు.. రాఘవ రాహుల్ చెయ్యి పట్టుకుని ఆపి రేయ్ ఆ అమ్మాయి విషయం నాయన కి గానీ ఇంకా ఎవరికి అయిన గానీ చెప్పావు అనుకో గొంతు కోస్తా అర్ధం అవుతుంది కదా..అని అన్నాడు..రాహుల్ రాఘవ మాటలకు హా అని తల ఆడించాడు..

ఇద్దరు వాళ్ళ నాయన దగ్గరకి వెళ్ళాడు… ఎంది నాయన పిలచావు అని అడిగారు..

పైడితల్లి…రేయ్ ఎల్లుండి కొత్త కలెక్టర్ తనిఖీ కి వస్తుంది అంట మీరు ఏమి చేస్తారో తెలీదు దాన్ని మన దారి నుంచి తప్పించాలని అనుకుంటున్న సైదులు గాడు ఊర్లో లేడు అందుకే మీకు చెప్తున్న అని అన్నాడు..

రాహుల్… ఆడదా అయితే దాన్ని అని ఏదో అనిలోపు రాఘవ అడ్డుపడి నాయన ఎందుకు మనం ఏదో చేయడం తన చేత మన పనులు చేసేలా ప్లాన్ చేద్దం తను అయితే రాని నేను అన్న కలిసి తన దగ్గర ఏదో ఒక రకంగా తోడు ఉంటు మనకి కావలసిన పని పూర్తి చేయిస్తాము అని అన్నాడు..

పైడితల్లి శభాష్ రా చిన్నోడ నా లాగే ఆలోచిస్తున్నావు అంటూ భుజం తట్టి సరే ఆ టీచర్ సంగతి ఏమైంది అని అడిగాడు..

రాఘవ.. ఎమో నాయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది అని తెలిసింది..

రాహుల్ అమ్మ నా తమ్ముడా అని అనుకుంటూ నువ్వు వెళ్లి పలకిరించి రా నాయనా నువ్వు సర్పంచ్ వి కదా సానుభూతి చూపించు నువ్వు చేయించినట్లు తెలియకూడదు కదా అని అన్నాడు….

పైడితల్లి…ఇప్పుడు అది కాదు రా ముఖ్యం రేపు ఊర్లో జరిగే గొడవ దాని గురించి యోచన చేస్తున్న..

రాహుల్ గొడవ ఎండీ నాయన ఏమైంది…చెప్పు అని అడిగాడు..