ఊహించనిది Part 4 82

ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి కింద పడి ఉన్న రఘు రామయ్య నీ చూస్తూ ఉన్నారు.. సూరజ్ తన డెలివరీ ఆటో తీసుకొని వచ్చాడు. రఘు రామయ్య నీ అందులో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు…

ఇది కేవలం బోనస్ అప్డేట్ మాత్రమే కాదు..ఈ కథ మొదలు కావడానికి ముందు 20 సం”ల క్రితం జరిగిన సంఘటన కూడా….పాఠకులు గమనించగలరు…

ఎలాగైనా ఇప్పటికీ ఒక ఇంటి వాడివి అయ్యావు రా వాసుదేవ్. మరి నీ భార్య నీ నాకు పరిచయం చేయవా అని అన్నాడు వాసుదేవ్ స్నేహితుడు..

అరేయ్ అదేంటి రా అల అంటావ్ నువ్వు నా ప్రాణ స్నేహితుడు వి పరిచయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పు అదిగో అక్కడ పూజ లో కూర్చొని ఉంది అంటూ వేలు చూపిస్తు పూజ అయిపోగానే పరిచయం చేస్తాను సరే నా అంటూ వాసుదేవ్ తన స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి వాసుకి నీ చూస్తూ ఉన్నాడు..

వాసుదేవ్ స్నేహితుడు… ఎక్కడ రా ఆ ముసుగు లో ఉన్న అమ్మాయి యేనా అని అడిగాడు..

వాసుదేవ్…హా మేలిమి ముసుగు లో నిలువెత్తు బంగారం తో బంగారపు పూత పూసినట్టు ఉన్న తానే నా అర్ధాంగి..

వాసుదేవ్ ఇంకా తన స్నేహితుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక పక్కన నిలబడి..కాసేపటికి పూజ అయిపోయింది . వాసుకి పైకి లేచి పెద్దవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంది.

ఒక పెద్దావిడ అమ్మ వాసుకి నీ భర్త కాళ్ళకి కూడా దండం పెట్టుకో ఇకా మీద నిన్ను చూసుకోవలసిన దేవుడు అతనే అని చెప్పింది..

వాసుకి సరే అంటూ తల ఊపి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ కింద పరిచి ఉన్న పూల రెమ్మల మీద నడుస్తూ తన భర్త దగ్గరకు వెళ్ళింది.. తను అలా నడుస్తూ ఉంటే తన కాలి మువ్వలు ఘాల్ ఘల్ అంటూ ఒక క్రమం లో శబ్దం చేస్తున్నాయి..

వాసుకి తన భర్త దగ్గరకు వచ్చి అతని కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంది.. వాసుదేవ్ తన రెండు చేతులని వాసుకి భుజాల మీద వేసి మెల్లిగా పైకి లేపి నువ్వు నా లో సగం నా కంటే తక్కువ చేసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని అన్నాడు..

అబ్బో అప్పుడే పెళ్ళాన్ని వెనుక వేసుకొని వస్తున్నాడు నీ కొడుకు అంటూ ఆక్కడ ఉన్న పెద్దవాళ్ళు వాసుదేవ్ అమ్మ గారి తో చెప్తున్నారు.

వాసుదేవ్ అమ్మ గారు…వాడు ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.తన మీద వాడికి ప్రేమ ఆకాశం అంతా ఉంది అని అంటుంది..

వాసుదేవ్ వాళ్ళ అమ్మ మాటలు విని వాసుదేవ్ స్నేహితుడు ఏరా నిజమా నాకు కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు కదా అని అడిగాడు..

వాసుదేవ్…తను మాట తీసుకుంది రా ఒక వేళ పెళ్లి జరగకపోతే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు అని.నాకు కూడా నిజమే అనిపించింది అందుకే చెప్పలేదు ఏమి అనుకోకు..

వాసుదేవ్ హా వాసుకి ఇతను నా స్నేహితుడు పేరు పైడితల్లి మంచివాడు నాకు ప్రాణం వీడు అంటే అని పరిచయం చేశాడు..

వాసుకి తల కాస్త పక్కకి తిప్పి నమస్కారం అని మళ్లీ తల దించుకుంది..
అంత దగ్గర నుండి వాసుకి నీ చూసే సరికి పైడితల్లి గుండె కొట్టుకోవడం ఒక్క నిమిషం ఆగి పోయింది.మొదటి చూపులోనే వాసుకి మీద ఎక్కడ లేని కామం పెరిగిపోయింది పైడితల్లి కి….

వాసుదేవ్ వాళ్ళ అమ్మ గారు వచ్చి అమ్మ వాసుకి ఇంకా పద లోపలికి ఎక్కువ సేపు బయట ఉండకూడదు అంటూ తన తో పాటు తీసుకొని వెళ్ళింది..

పైడితల్లి వాసుకి నీ కళ్ళార్పకండా చూస్తూనే ఉన్నాడు..

వాసుదేవ్ ..ఏరా మా జంట ఎలా ఉంది అని అడిగాడు.

పైడితల్లి…హా అచ్చం సీతారాముల వలె ఉన్నారు రా…( నేను రావణుడిని అని మనసులో అనుకుంటూ)..సరే మరి పార్టీ ఏది రా

వాసుదేవ్…నేను మందు మానేశా రా ఫుట్బాల్ టీమ్ కి స్టేట్ అసిస్టెంట్ కోచ్ గా ఉండాలి అని fitness మీద ఫోకస్ పెట్టాను..

పైడితల్లి…ఓహ్ అవునా all the best రా నేను కూడా అనసూయ కి పెళ్లి చేసేసాను నువ్వు రాలేదు కదా ఇంకో నెల రోజుల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోతాను అక్కడే ఇంకా ఉండేది .

వాసుదేవ్..హ్మ్మ్ sorry రా అప్పుడు నేషనల్ ఆడుతూ ఉన్న … వాసుకి కూడా టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసింది.తనకి కూడా జాబ్ వస్తె ఇద్దరి సంపాదన తో లైఫ్ గడుస్తుంది..

పైడితల్లి…రేయ్ నా బావ ఓటి చెరువు లో సర్పంచ్ రా నువ్వు ఒక మాట చెప్పు వాసుకి కి అక్కడ కాలేజ్ లో టీచర్ గా జాబ్ ఇప్పిస్తాను..

వాసుదేవ్…థాంక్స్ రా .. నీ మేలు మర్చిపోలేను .

పైడితల్లి…నువ్వు మర్చిపోయిన నాకు గుర్తు ఉంటుంది లే.సరే నువ్వు ఎలాగో ఇప్పుడు రావు లే కానీ నేను వెళ్ళి నోరు వాసన చేసుకొని వస్తాను .

వాసుదేవ్..సరే రా ముహూర్తం కి టైం అవుతుంది . ఉదయం మాట్లాడుకుందాం .

పైడితల్లి పైకి నవ్వుతూ సరే సరే అంటూ వెళ్లిపోయాడు..వాసుదేవ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పట్టు పంచే ఇంకా తెల్ల చొక్కా వేసుకొని గది లో వాసుకి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

బయట వాసుకి నీ అక్కడి ముత్తైదువులు ఆపి ఇదిగో పిల్ల ఈ తేనె పట్టి తిను అప్పుడే మీ కాపురం లో నీ ప్రవర్తన ఈ తేనె రుచి లాగా తియ్యగా ఉంటుంది. ఎదుటి వారిని నొప్పించకుండా అంటూ తినిపించారు..అలాగే లోపల గది లో ఏమి చేయాలో తెలుసా లేదా నీకు అక్క వరస అయిన వాళ్ళని ఎవరిని అయిన పంపించమంటవా చెప్పు అని ఆట పట్టిస్తూ ఉన్నారు..

వాసుకి…ఎవరో ఎందుకు మీరు రాకూడదు అని జవాబు ఇచ్చింది..

వాసుకి మాటలకు అందరూ నవ్వుతూ అబ్బో గడుసు దానివే దీనికి ఇంకాస్త తేనె తినిపించండే అని అంటున్నారు.. వాసుదేవ్ వాళ్ళ అమ్మ వచ్చి హేయ్ ఎంటే నా కోడలు నీ ఇబ్బంది పెడుతున్నారు అని అంది..