మాధవ్ రావు రుక్మిణి లకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె. వారి పేర్లు
పెద్ద కుమారుడు ఆదిత్య
మధ్య కుమారుడు పృథ్వి
చిన్న కుమారుడు చందు
మన హీరోయిన్ గారు శైలజ (శైలు)
మధుసూదన్ రావు రాధిక లకి ఇద్దరుకుమారులు
పెద్ద కుమారుడు అజయ్
చిన్న కుమారుడు విజయ్
మన హీరోయిన్స్ద షెడ్యూలు కంటే వీళ్ళ అంత పెద్దవాళ్లే….
ఇద్దరికీ కలిపి ఒక్కతే ఆడపిల్ల అవ్వడంతో శైలు అంటే అందరికీ ప్రాణం. ఎన్నో పూజలు చేస్తే పుట్టిన ఆడపిల్ల అవ్వడంతో మాధవరావు కి కూతురే ప్రపంచం. అందరి గారాలపట్టి. ఇంట్లో ఆడిందే ఆట పాడిందే పాట అందుకే అమ్మాయి గారికి అంత బద్ధకం. తన పుట్టిన తర్వాత మాధవరావు మధుసూదన్ రావు లు చేసిన ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వడంతో వారు పట్టిందల్లా బంగారం అవ్వడంతో శైలు నెత్తిన పెట్టుకున్నారు అందరూ. కూతురు అంటే ఎంతో ఇష్టం ఉన్నా బయటకి చూపిస్తే ఇంకా అల్లరి చేస్తుంది అని కొంచెం భయపెట్టడానికి ప్రయత్నిస్తారు రుక్మిణి గారు.
ఆదిత్య సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అవ్వడంతో చెల్లి అల్లరి అంటే ఇష్టం ఉన్న అల్లరి వల్ల తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందని తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు (అది మీ వల్ల కాదు లెండి ఆఫీసర్)
ఇంకా వాళ్ళ ఇల్లు పెద్ద డూప్లెక్స్. ఇంటి ముందు అందమైన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ , పౌంటెన్, పార్కింగ్లో 4 కార్లు ఇంట్లో పని వాళ్ళు, లోపల గోడలకు అన్నీ మన హీరోయిన్ గారి ఫోటో లే….
ఇంటి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సెక్యూరిటీ…
హీరోయిన్ గారి రూమ్ ని చాలా అందంగా ఇంటీరియర్ చేపించారు మాధవరావు గారు.. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ డ్రెస్సింగ్ టేబుల్ , బీన్ బ్యాగ్, పెద్ద టెడ్డీబేర్, కంప్యూటర్ టేబుల్, స్టడి టేబుల్ చాలా రకమైన బుక్స్ లైట్స్ ఆఫ్ చేస్తే ఆకాశం కింద బెడ్ వేసుకుని పడుకుని ఉంటుంది…. కానీ మొత్తం చెట్లు వాటి మధ్య అందమైన ఉయ్యాల.
అది అంటే మన అమ్మాయిగారి రాజభోగం. పేరుకు అల్లరిపిల్ల ఆయన మనసు మాత్రం బంగారం ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే చూడలేదు. ఆదిత్య వద్దు అని చెప్పే గొడవలు అవే. రెండు మూడు తరాలుగా ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం… చూడగా చూడగా పుట్టిన అమ్మాయి అవడంతో తనని అపురూపమైన గాజు బొమ్మ లాగా పెంచుకున్నారు….
గాజు బొమ్మ పగిలి పోతుంటే తనని కాపాడుకుంటారా ???ప్రమాదమని తెలిసినా ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలరా…
ఆదిత్య కి తెలిసే చెల్లిని హెచ్చరిస్తాడు????
ఈ అల్లరి పిల్ల ముక్కుకి తాడు వేసే వాడు ఎలా భరిస్తాడు తనని ? ఎలా కాపాడుతాడు?
మనం కూడా చూద్దాం