ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది. 231

ఆమని అత్తవారింట్లో అందరితో మంచిగా కలిసిపోతుంది. రుక్మిణి గారు తనని కూడా కూతురు లాగా చూసుకునేవారు . శైలు అయితే వదిన వదిన అనే తనతోనే ఉండేది .ఒక రోజు ఆమని తన రూమ్ లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది .అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ మేడం గారు అలా ఉన్నారు అని అంటాడు .ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు . అదేం లేదండి అంటుంది .ఇంట్లో వాఅత్తయ్య గారికి ఇచ్చే గౌరవం నాకు ఇస్తున్నారు ళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా ,చెప్పండి మేడం చెప్పకుండా నాకెలా తెలుస్తుంది చెప్పండి మీ మదిలో మాట ,ఆదిత్య అలా అనగానే , అయ్యో అలాంటిదే ఏం లేదండి నన్ను ఎవరు ఏమి అనలేదు అని ఆమని అంటుంది .
అందరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు .అమ్మ ప్రేమ తెలియని నన్ను అత్తయ్య అమ్మ లాగా చూసుకుంటున్నారు. చందు, పృద్వి , శైలు, వరుసకు వదిన వదిన అని పిలుస్తున్నా. అత్తయ్య గారికి గౌరవిస్తున్నారు.శైలు అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అండి. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. నాకు చాలా మంచి ఆడపడుచు దొరికింది. ఇవి అన్నీ వింటున్నా ఆదిత్య. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆమని తో చెప్తాడు. అందరి గురించి బాగానే ఆలోచిస్తున్నారు మేడం మరి నా గురించి కూడా కొంచెం ఆలోచించండి.

అయ్యో మీకేమైంది అండి.మీరు కుడి నాకు చాలా బాగా చూసుకుంటున్నారు కదా. నేను సరే మరి తమరు నన్ను పట్టించుకోవడమే లేదు కదా. అయ్యో నేను ఎప్పుడు పట్టించుకోలేదు చెప్పండి. చూడు ఇప్పుడు కూడా నన్ను పట్టించుకోవడమే లేదు. పాపం పక్కనే ఉన్న అని కూడా అమ్మాయి గారికి ఈ అబ్బాయి ఎం కావాలో తెలియడం లేదు. పైగా ఏకాంతంగా చోటు. ఐన కూడా ఏమి అర్ధం చేసుకోవడంలేదు సోడాబుడ్డి లాగా. అలాగే ఇప్పుడేం తక్కువైంది చెప్పండి అయ్యగారికి? నన్ను ఎలాగో సోడాబుడ్డి అనేసారు కదా. మీరే చెప్పండి ఏమి తక్కువయ్యాయి అనేది? ఆహా! నిజమా చెప్పమంటారా అమ్మాయిగారు. అదేకదా అబ్బాయిగారిని అప్పటి నుండి అడిగేది. మీ గులాబీ పెదాలతో ఆ పెదాల కోసం ఆకలిగా ఎదురు చూస్తున్న ఈ అబ్బాయిగారి పెదాలకు ఓ ముద్దు. ఆ తర్వాత నయగారాలొలికే నాజూకు నడుమును ఈ అబ్బాయిగారి చేతికి అందిస్తే?

హా అందిస్తే?

అలా అందిస్తే దాని సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అమ్మాయిగారు.

అబ్బా… నాకు సిగ్గు బాబు.

ఆహా! ఇలా సిగ్గు పడితే ఎలా చెప్పండి. అబ్బాయిగారిని అస్సలు పట్టించుకోవడమే లేదు తమరు.

అదేంటి అండీ రాత్రే కదా చాలు చాలు అంటున్న పట్టించుకోకుండా, మీరు నిద్రపోవడమే కాకుండా నన్ను నిద్రపోకుండా చేశారు.

నేనేం చేశాను దేవి గారు.

అబ్బో… మీకేం తెలియదు అన్నట్టు బాగానే నటిస్తున్నారు కదా, చిన్న పిల్లాడిలాగా.

నటించడమా! నేనా?