ఆదిత్య కూడా ఎందుకు అనుమానం గా ఉంటది. 231

ఆరోజు సంజకు మనసు బాగోలేదు. డీల్ చేసే కేసు విషయంలో కూడా ఎందుకు కరెక్ట్ గా వెళ్లడం లేదు అని ఎక్కడో ఏదో లింకు మిస్ అవుతున్నాను అనే అనుమానం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అప్పుడే ఆదిత్య కాల్ చేయడంతో ఏంటి ఆదిత్య ఈ టైంలో కాల్ చేసావ్ అంతా ఓకేనా అని అడుగుతాడు. ఆదిత్య బాధ నిండిన గొంతుతో లేదు సంజయ్. ఎక్కడున్నావ్ ఆది అంటాడు సంజు. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్న ఆగు పది నిమిషాల్లో అంటూ కాల్ కట్ చేస్తాడు.

ఆరోజు సంజకు మనసు బాగోలేదు. డీల్ చేసే కేసు విషయంలో కూడా ఎందుకు కరెక్ట్ గా వెళ్లడం లేదు అని ఎక్కడో ఏదో లింకు మిస్ అవుతున్నాను అనే అనుమానం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అప్పుడే ఆదిత్య కాల్ చేయడంతో ఏంటి ఆదిత్య ఈ టైంలో కాల్ చేసావ్ అంతా ఓకేనా అని అడుగుతాడు. ఆదిత్య బాధ నిండిన గొంతుతో లేదు సంజయ్. ఎక్కడున్నావ్ ఆది అంటాడు సంజు. ఇప్పుడే మీ ఇంటికి వస్తున్న ఆగు పది నిమిషాల్లో అంటూ కాల్ కట్ చేస్తాడు

ఆదిత్యను చూసే ఏమైంది రా అది ఏమైనా ప్రాబ్లం అని అడుగుతాడు సంజయ్. అప్పటివరకు ఆపుకున్న దుఃఖానంత సంజయ్ ని హత్తుకుని ఏడుస్తాడు ఆదిత్య.

సంజయ్ ఇచ్చిన నీరు తాగుతూ కర్చీఫ్ తో మొఖం తుడుచుకుంటూ. నేను ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను రా అని అంటాడు ఆదిత్య సంజయ్ తో. ఒక్కసారిగా షాక్ అయి ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు. ఆయన జాబ్ మానేయాల్సిన అవసరం ఏంటి నీకు అని అడుగుతాడు ఆదిత్యను సంజయ్.

ఈరోజు నా వల్లే రా నా ఫ్యామిలీ మొత్తం ఏడుస్తున్నారు అని చెప్తాడు. ఏం అర్థం కాని సంజయ్ అయోమయంగా ముఖం పెట్టి అసలు ఏమైందిరా వివరంగా చెప్పు అని అడుగుతాడు.

ఆదిత్య చెప్పడం మొదలుపెట్టాడు….

సెక్యూరిటీ అధికారి జాబ్ అన్నప్పుడే వద్దని చెప్పింది రా నా చెల్లి శైలు. తనకి సెక్యూరిటీ ఆఫీసర్లు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అయినా ఎంత చెప్పినా నేనే వినకుండా మొండిగా ఈ జాబ్ లో జాయిన్ అయ్యాను. ఈ జాబ్ లో రోజుకి ఎన్ని గొడవలు, ఈ జాబులో మనకు స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువ. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక కంట కనిపెడుతూనే ఇంటికి ఎక్కువగానే సెక్యూరిటీ పెంచాను. ఆయన ఎవరో నా బలహీనత తెలుసుకుని నా చెల్లెలు కిడ్నాప్ చేశారా ఈరోజు సాయంత్రం నుంచి తను కనపడలే అని అంటాడు ఆదిత్య.

అది అంతా విన్న సంజయ్ కి ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. సంజయ్ శైలు ఎప్పుడు చూడలేదు కానీ అప్పుడప్పుడు ఆదిత్య తన గురించి చెప్తుండేవాడు అలా తన మీద మంచి అభిప్రాయం ఉంది సంజయ్ కి. ఎప్పటినుండి కనిపించట్లేదని అడుగుతాడు ఆదిత్యని సంజయ్
ఈరోజు సాయంత్రం కాలేజీ అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇంటికి బయలుదేరింది అంట కానీ ఇంటికి రాలేదు అని చెప్తాడు ఆదిత్య.

శైలు ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు సంజయ్. తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు ఆదిత్య సంజయ్ కి. ఆ ఫోటో చూసిన సంజయ్ కి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కానీ ఆ మాట బయటకు అనడు. కాలేజీ నుంచి రోజు ఇంటికి ఎలా వస్తుంది అని అడుగుతాడు సంజయ్. రోజు తన స్కూటీ మీదనే కాలేజీకి వెళ్ళేది కానీ తన స్కూటీ ఈరోజు రిపేర్ అయింది. నేనే తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాను. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక హలో ఫ్రెండ్స్ తో మాట్లాడి క్యాబ్లో బయలుదేరిందని వాళ్లు చెప్పారు కానీ తాను ఇంటికి రాలేదు అని అంటాడు.